
త్వరలో పాకిస్తాన్ మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 9 నుంచి 19 వరకు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2025 పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (మార్చి 14) విడుదల చేసింది.
ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. డే మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకు.. డే అండ్ నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్‌లో వరల్డ్‌కప్
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.
కాగా, పాకిస్తాన్ ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిచ్చింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరిగిన తొలి ఐసీసీ టోర్నీ ఇది. ఈ టోర్నీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. భద్రతా కారణాల రిత్యా ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది.
షెడ్యూల్
ఏప్రిల్ 9- పాక్ వర్సెస్ ఐర్లాండ్, వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్
ఏప్రిల్ 10- థాయ్‌లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్
ఏప్రిల్ 11- పాక్ వర్సెస్ స్కాట్లాండ్, ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్
ఏప్రిల్ 13- స్కాట్లాండ్ వర్సెస్ థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్
ఏప్రిల్ 14- వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్
ఏప్రిల్ 15- థాయ్‌లాండ్ వర్సెస్ ఐర్లాండ్
ఏప్రిల్ 17- బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్, పాక్ వర్సెస్ థాయ్‌లాండ్
ఏప్రిల్ 18- ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్
ఏప్రిల్ 19- పాక్ వర్సెస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ వర్సెస్ థాయ్‌లాండ్
Comments
Please login to add a commentAdd a comment