World Cup Qualifiers
-
మరో మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన నెల రోజుల్లోనే పాకిస్తాన్ మరో మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. పాక్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ జరిగే తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటింస్తారు. లాహోర్ వేదికగా ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ జరుగుతాయని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా పాక్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే భారత్, పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. భారత్ 2013లో కూడా మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాడు మెజార్టీ మ్యాచ్‌లు ముంబైలో జరగగా.. పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ కటక్‌లో జరిగాయి.కాగా, పాకిస్తాన్ 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి (ఛాంపియన్స్ ట్రోఫీ-2025) ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో చివరిగా 1996 పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరిగింది. ఈ టోర్నీకి పాక్‌తో పాటు భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమిచ్చాయి. అప్పటినుంచి భద్రతా కారణాల రిత్యా పాక్‌లో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా జరగలేదు. మళ్లీ 29 ఏళ్ల తర్వాత పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో కూడా అన్ని మ్యాచ్‌లు పాక్‌లో జరగడం లేదు. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్ ఇదివరకే ఫైనల్‌కు చేరడంతో ఫైనల్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది. ఈ టోర్నీలో పాక్ ఒక్క విజయం కూడా సాధించకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.గాంబియా బౌలింగ్ ఊచకోతనైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.సికందర్ రజా ఒక్కడే 133 రన్స్వన్డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు. చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టుఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 290 పరుగుల భారీ తేడాతో విజయంజింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
WC Qualifiers: కొలంబియా సంచలనం.. అర్జెంటీనాకు షాక్
బొగోటా (కొలంబియా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టుకు 2026 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో షాక్ తగిలింది. 2022లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా... దక్షిణ అమెరికా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో కొలంబియా చేతిలో ఓడింది. బుధవారం జరిగిన పోరులో కొలంబియా 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. కొలంబియా తరఫున యెర్సన్ మస్క్యూరా (25వ నిమిషంలో), జేమ్స్ రోడ్రిగ్జ్ (60వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున నికోలస్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ మెస్సీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ అర్హత టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి అర్జెంటీనా 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోరీ్నలో తొలి 6 స్థానాల్లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ నకు అర్హత సాధించనున్నాయి. -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
భారత్, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్‌కప్ కూడా ప్రస్తుత ఎడిషన్ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్‌లు వివిధ రీజియనల్ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు (భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) నేరుగా తదుపరి ఎడిషన్‌కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ తదుపరి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్‌గా 2026 టీ20 వరల్డ్‌కప్‌కు భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి. -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్‌తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
T20 WC Qualifier: థ్రిల్లింగ్ మ్యాచ్.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఊహించని ఫలితం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌తో క్రికెట్ ప్రపంచం మొత్తం బిజీగా ఉంటే.. నేపాల్‌లోని ఖాట్మండులో ఓ అద్భుతం జరిగింది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్లో ఒమన్.. తమకంటే పటిష్టమైన నేపాల్‌ను సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి సమానమైన స్కోర్లు (184 పరుగులు) చేయడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేయగా.. నేపాల్ కేవలం 10 పరుగులకు (వికెట్ కోల్పోయి) మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో ఒమన్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. కిక్కిరిసిపోయిన స్టేడియం.. ఇసుకేస్తే రాలనంత జనం నేపాల్‌లో క్రికెట్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వేల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. సొంత జట్టు మ్యాచ్ అయితే అభిమానులను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. స్టేడియంలో నిలబడేందుకు కూడా ప్లేస్ దొరక్క జనాలు చెట్లు, టవర్లు ఎక్కుతున్నారు. ఇక్కడ క్రికెట్ క్రేజ్ ప్రమాదకర స్థాయికి చేరింది. నిన్న కిరిటీపూర్లో జరిగిన నేపాల్-ఒమన్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు జనాలు తండోపతండాలుగా స్టేడియంకు వచ్చారు. స్టేడియంలో వాతావరణం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. A cacophony of noise and a full house again here well before the start of play in Kathmandu as Nepal's anthem provides the goosebumps with the 30,000 or so in & around the TU singing in unison It's Nepal🇳🇵 v Oman🇴🇲 for the title with both teams guaranteed to the #T20WorldCup pic.twitter.com/CWDIQYLfMh — Andrew Leonard (@CricketBadge) November 5, 2023 ఇది చాలదనట్లు జనాలు స్టేడియం బయట ఉన్న చెట్లు, ఎత్తైన హోర్డింగ్‌లు ఎక్కి మ్యాచ్ వీక్షించారు. క్రికెట్ మ్యాచ్‌ల కోసం జనాలు స్టేడియానికి రావడం మంచిగానే అనిపిస్తున్నప్పటికీ, జరగరానిది ఏదైన జరిగితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. It's an electrifying atmosphere here at T.U Ground as always.#NEPvOMAN pic.twitter.com/5BJv1RAQud — Samraat Maharjan (@MaharjanSamraat) November 5, 2023 ఇదిలా ఉంటే, నేపాల్ ఫ్యాన్స్ తమ జట్టు టైటిల్ సాధిస్తుందేమోనని కిరీటీపూర్ స్టేడియానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ జట్టు అనూహ్యంగా సూపర్ ఓవర్లో ఓటమిపాలై, వారిని నిరాశపరిచింది. -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్‌కు 7 వికెట్లు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్‌దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
క్వాలిఫయర్స్ టీమ్ ఆఫ్ ది టోర్నీ ప్రకటన.. విండీస్ నుంచి ఒక్కరు కూడా లేరు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్ సిక్స్ దశలో విండీస్ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్ హోప్ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్‌జీత్ సింగ్ (నెదర్లాండ్స్, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్ టాప్ స్కోరర్ సీన్ విలియమ్స్ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్‌లో సికందర్ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్ (నెదర్లాండ్స్, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్ లీడింగ్ వికెట్ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్ (స్కాట్లాండ్, 11 వికెట్లు), రిచర్డ్ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. -
అజేయ లంక.. క్వాలిఫయర్స్ ఫైనల్లో జయకేతనం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్ విజేతగా నిలిచింది. 🇦🇪 ✅ 🇴🇲 ✅ 🍀 ✅ 🏴 ✅ 🇳🇱 ✅ 🇿🇼 ✅ 🌴 ✅ 🏆 ✅ 🙏 Namaste India ✅#LionsRoar #CWC23 pic.twitter.com/nO7U14F9ky — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించారు. 🔥 Another fiery spell of fast bowling by Dilshan Madushanka! 💪🏏#LionsRoar #CWC23 pic.twitter.com/tCwDdA6ojw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. He is unstoppable! 💪 Another match-winning spell by Maheesh Theekshana! 🏏🎉🔥#LionsRoar pic.twitter.com/FY0YwfMAwg — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (33), వాన్ బీక్ (20 నాటౌట్), విక్రమ్‌జీత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకను వణికించిన నెదర్లాండ్స్ బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే కట్టడి
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 ఫైనల్లో నెదర్లాండ్స్ బౌలర్లు లంకేయులను కట్టడి చేశారు. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓ దశలో (35.3 ఓవర్లలో 180/3) పటిష్ట స్థితిలో ఉండింది. అయితే ఆ జట్టు 10 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాదించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఇదివరకే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు.. భారత్ సహా 8 జట్లతో తలపడతాయి. క్వాలిఫయర్స్‌లో రెండో బెర్తు కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ల నుంచి తీవ్రపోటీ ఎదుర్కొన్న నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరి, ఇక్కడ ఓటమి ఎదరుగని శ్రీలంకకు చుక్కలు చూపించింది. లంక నిర్ధేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ఛేదించగలిగితే చరిత్ర సృష్టించినట్లవుతుంది. -
#BasDeLeede: తండ్రికి తగ్గ తనయుడు..
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ఐదోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1996, 2003, 2007, 2011లో నాలుగుసార్లు డచ్ జట్టు వన్డే వరల్డ్‌కప్ ఆడింది. ఈ నాలుగు సందర్భాల్లో మూడుసార్లు తన జట్టును వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనే టిమ్ డీ లీడే.. ఈ పేరు మీకు ఎక్కువగా పరిచయం లేకపోవచ్చు. కానీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒకడి పేరు బాగా మార్మోగిపోయింది. అతనే బాస్ డీ లీడే. బౌలింగ్‌లో ఐదు వికెట్లు.. బ్యాటింగ్‌లో 123 పరుగులు వీరోచిత సెంచరీ.. వెరసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తన జట్టును వన్డే వరల్డ్‌కప్ ఆడే అర్హతను సాధించిపెట్టాడు. 278 పరుగులు లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే చేధించిన డచ్ జట్టు క్వాలిఫయర్-2గా.. పదో జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టింది. మరి ఒంటిచేత్తో నెదర్లాండ్స్‌ను వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేలా చేసిన బాస్ డీ లీడే.. ఎవరో కాదు.. పైన మనం చెప్పుకున్న టిమ్ డీ లీడే కుమారుడే. బాస్ డీ లీడే తన వీరోచిత పోరాటంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హత సాధించిపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక టిమ్ డీ లీడే 1996లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్లో కేవలం వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టిమ్ డీ లీడే 29 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2018లో నేపాల్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బాస్ డీ లీడే అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. మిడిలార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే బాస్ డీ లీడే మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 30 వన్డేల్లో 765 పరుగులతో పాటు 24 వికెట్లు, 31 టి20ల్లో 610 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో విజయం అనంతరం ఐసీసీ నెదర్లాండ్స్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసిది. ఆ ఫోటోలో బాస్ డీ లీడే.. తన తండ్రి టిమ్ డీ లీడేను గుర్తుచేస్తూ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ఐసీసీ వివరిస్తూ తండ్రికి తగ్గ తనయుడు.. బాస్ డీ లీడే సన్నాఫ్ టిమ్ డీ లీడే అంటూ క్యాప్షన్ జత చేసింది. Tim de Leede, Bas de Leede 🏏 Like father, like son 🇳🇱 #CWC23 More: https://t.co/qguNPPA8ai pic.twitter.com/KGECQ1yt5s — ICC (@ICC) July 7, 2023 చదవండి: #NED Vs SCO: ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత Bas De Leede: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజం సరసన.. -
థ్రిల్లర్‌ను తలపించిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో తొమ్మిదో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఆఖరి బంతికి పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో యూఎస్ఏ చివరి బంతికి కనీసం ఒక్క పరుగు చేసినా మ్యాచ్ టై అయ్యేది. అయితే సంచిత్ శర్మ బౌలింగ్‌లో అరవింద్‌కు క్యాచ్ ఇచ్చి అలీ ఖాన్ ఔట్ కావడంతో యూఏఈ పరుగు తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆఖరి ఓవర్లో యూఎస్ఏ గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా, చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. తొలి 3 బంతులకే 7 పరుగులు రావడంతో యూఎస్ఏ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. అయితే యూఏఈ బౌలర్ సంచిత్ శర్మ అనూహ్యంగా పుంజుకుని నాలుగో బంతికి, ఆఖరి బంతికి వికెట్లు సాధించి, తన జట్టును గెలిపించాడు. అప్రధానమైన ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా యూఏఈ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆసిఫ్ ఖాన్ 151 నాటౌట్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్ ఆసిఫ్ ఖాన్ (145 బంతుల్లో 151 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ ఖాన్ చెలరేగగా.. ఆర్యాన్ష్ శర్మ (57), బాసిల్ హమీద్ (44) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్ 2, నోష్తుష్ కెంజిగే, నేత్రావాల్కర్ తలో వికెట్ పడట్టారు. రాణించిన జోన్స్, మోనాంక్ పటేల్, గజానంద్.. 309 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏస్ఏ సైతం అద్భుతంగా పోరాడింది. ఆరోన్ జోన్స్ (75), మోనాంక్ పటేల్ (61), గజానంద్ సింగ్ (69) అర్ధసెంచరీలతో రాణించడంతో యూఏస్ఏ విజయతీరాల వరకు చేరింది. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయలేక ఆ జట్టు ఓటమిపాలై, క్వాలిఫయర్స్‌లో చివరి స్థానంలో నిలిచింది. యూఏఈ బౌలర్లలో సంచిత్ శర్మ 3, సిద్దిఖీ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, జవాదుల్లా, అఫ్జల్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. -
వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. భారత షెడ్యూల్ ఇలా..!
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే పదో జట్టుగా నెదర్లాండ్స్ నిన్ననే (జులై 6) తమ బెర్తును ఖరారు చేసుకుంది. క్వాలిఫయర్స్ పోటీల్లో నిన్న స్కాట్లాండ్పై విజయం సాధించడం ద్వారా డచ్ టీమ్ మెగా టోర్నీలో పాల్గొనే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది. దీనికి ముందు ఇదే క్వాలిఫయర్స్‌లో సత్తా చాటడం ద్వారా శ్రీలంక కూడా వరల్డ్‌కప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మొత్తంగా క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయర్-1గా శ్రీలంక, క్వాలిఫయర్-2గా నెదర్లాండ్స్ నిలిచాయి. క్వాలిఫయర్స్ ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఈ జట్ల చేరిక తర్వాత వరల్డ్‌కప్ షెడ్యూల్‌కు తుది రూపు వచ్చింది. మెగా టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌లపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. 7 మ్యాచ్‌లు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యధాతథంగా జరుగనుండగా.. నవంబర్ 2న ముంబై వేదికగా భారత్‌తో తలపడబోయే ప్రత్యర్ధిగా నెదర్లాండ్స్, నవంబర్ 11న బెంగళూరు వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో భారత ప్రత్యర్ధిగా శ్రీలంక జట్లు నిలువనున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల్లోనూ ఏయే జట్లు తలపడునున్నది కూడా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 జట్లు ఖరారు కావడంతో వరల్డ్‌కప్ షెడ్యూల్ తుది రూపు సంతరించుకుంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ శ్రీలంక (బెంగళూరు) ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ -
ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత
అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్‌బీక్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. 90 (82) 👉 123 (92) Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 A stunning heist! 😱 Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0 — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
విండీస్ విజయం; చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా వెస్టిండీస్ జట్టు సూపర్ సిక్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరల్డ్‌కప్ అర్హత అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్‌కు ఈ విజయం ఊరట మాత్రమే. బుధవారం సూపర్ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్, ఒమన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సూరజ్ కుమార్ 53 పరుగులు నాటౌట్, షోయబ్ ఖాన్ 50 పరుగులతో రాణించగా.. అయాన్ ఖాన్ 30, కశ్యప్ 31 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ మూడు వికెట్లు తీయగా.. కైల్ మేయర్స్ రెండు, కెవిన్ సింక్లెయిర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 100 పరుగులు) శతకంతో మెరవగా.. కెప్టెన్ షెయ్ హోప్ 63 నాటౌట్, పూరన్ 19 పరుగులు నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. -
వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..!
ఐర్లాండ్ వన్డే వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) పాల్ స్టిర్లింగ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. 32 ఏళ్ల బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బల్బిర్నీ 2019లో ఈ బాధ్యతలు చేపట్టాడు. బల్బిర్నీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గెలుపుతో ముగింపు పలకడం విశేషం. కాగా, జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్ కనీసం సూపర్ సిక్స్ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న శ్రీలంక ఇదివరకే వన్డే వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించగా.. మరో బెర్త్ కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొంది. నిన్న జరిగిన కీలక సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓటమితో జింబాబ్వే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. -
వరల్డ్‌కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్.. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ
బులవాయో: తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడటంతో... జింబాబ్వే జట్టు వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించలేకపోయింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన తమ ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు సాధించింది. మైకేల్ లీస్క్ (48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూ క్రాస్ (38; 2 ఫోర్లు), బ్రెండన్ మెక్‌ములెన్ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు, చటారా రెండు వికెట్లు తీశారు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. రియాన్ బర్ల్ (83; 8 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ సోల్ (3/33) జింబాబ్వేను దెబ్బ కొట్టాడు. మెక్‌ములెన్, లీస్క్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీలోనే వెనుదిరిగింది. జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ దాదాపుగా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈనెల 6న నెదర్లాండ్స్‌తో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెగా ఈవెంట్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ ఓడిపోయినా నెదర్లాండ్స్ కంటే రన్‌రేట్ తక్కువ కాకుండా చేసుకుంటే స్కాట్లాండ్‌కే ప్రపంచకప్ బెర్త్ ఖరారవుతుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా, క్వాలిఫయర్స్‌లో అజేయంగా ఉన్న శ్రీలంక, భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్
జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది.వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాలన్న కల చెదిరింది. సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్ దశలో వరుస విజయాలతో చెలరేగింది. సీన్ విలియమ్స్ వరుస సెంచరీలకు తోడుగా సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్ సిక్స్ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్‌కప్ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ రేసులో భాగంగా మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ ఆరో మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్ 40, సికందర్ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్‌లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్‌రేట్‌తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే చాన్స్ ఉంది. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా జాగ్రత్తపడాలి. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 30 కంటే ఎక్కువ పరుగులతో గెలవాలి లేదంటే చేజింగ్‌లో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకోవాలి. అప్పుడే నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. Final World Cup 2023 spot qualification scenario: Scotland - win and grab their tickets for India. Netherlands - win by 30+ runs or chase the target with 6 overs to spare. pic.twitter.com/R0HzIljTSl — Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2023 చదవండి: #AlexCarey: 'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి' -
క్రికెట్ చచ్చిపోతుంది.. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా ఉండాలి..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఘోర పరాజయాలు ఎదుర్కొని, తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో క్రికెట్ సర్కిల్స్‌లో ప్రపంచకప్ అర్హతలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా కనీసం 16 దేశాలతో పోటీలు నిర్వహించాలని, అలా కాకుండా 4 ఏళ్లకు ఓ సారి జరిగే మెగా టోర్నీని 10 జట్లకే పరిమితం చేసి, విండీస్‌లా మేలైన జట్లకు అన్యాయం చేయడం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ మైబుర్గ్ సైతం చెప్పుకొచ్చాడు. వాస్తవ విషయం ఏంటంటే.. పరిమిత జట్లతో ప్రపంచకప్ నిర్వహించడం వల్ల క్రికెట్ చచ్చిపోతుంది. ప్రపంచకప్ పేరుకు తగ్గట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి జట్లకు ప్రాతినిధ్యం లభించాలి. మెగా టోర్నీలో కనీసం 16 జట్లైనా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. అన్ని క్రీడల మెగా టోర్నీల్లో జట్ల సంఖ్య పెరుగుతుంటే క్రికెట్లో మాత్రం జట్లను తగ్గించుకుంటూ వస్తున్నారు. వెస్టిండీస్ లాంటి జట్టు వరల్డ్‌కప్ ఆడటం లేదన్న విషయం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ స్టీఫెన్ మైబుర్గ్ అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. Spare your thoughts on 10 teams at the ODI World Cup main event✍️ 📸: ICC#ICCWorldCupQualifier #WestIndies pic.twitter.com/WRAaBfXQJI — CricTracker (@Cricketracker) July 3, 2023 కాగా, ప్రస్తుతానికి (జులై 3) వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. రేపు ఈ ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో రెండో బెర్త్‌పై కూడా దాదాపుగా క్లారిటీ రానుంది. సూపర్ సిక్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు క్వాలిఫయర్స్ ఫైనల్‌కు చేరడంతో పాటు ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ సహా 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇటీవలే వరల్డ్‌కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. -
కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్‌మెషీన్‌ను మించిపోయేలా ఉన్నాడు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు (102*, 174, 142), ఓ భారీ హాఫ్ సెంచరీ (91) సాయంతో 532 పరుగులు చేసిన విలియమ్స్.. ఇవాళ (జులై 2) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీ (56) సాధించి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని మరిపించాడు. విరాట్ 5 వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాల సాయంతో 596 పరుగులు చేస్తే.. విలియమ్స్ ఇంచుమించు విరాట్ రికార్డును సమం చేసినంత పని చేశాడు. సీన్ విలియమ్స్ ఫామ్ వన్డేల వరకే పరిమితమైందనుకుంటే పొరపాటే. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ టెస్ట్‌ల్లోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్స్ చివరిగా ఆడిన 5 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, విలియమ్స్ పరుగుల ప్రవాహం కొనసాగుతుండటంతో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే విజయ యాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు సూపర్ సిక్స్‌లో శ్రీలంకతో సమానంగా 6 పాయింట్లు సాధించి , వన్డే వరల్డ్‌కప్-2023 బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్‌లో మాత్రం జింబాబ్వే చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (31) కాస్త పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ (4/25), మధుశంక (3/15), పతిరణ (2/18), షనక (1/30) చెలరేగిపోయారు. -
42 మ్యాచ్‌ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత'
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఇటీవలికాలంలో బంతితో పేట్రేగిపోతున్నాడు. వికెట్లకు మినిమం గ్యారెంటీగా మారిపోయాడు. మ్యాచ్‌లో కనీసం 2 వికెట్లయినా పడగొడుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న హసరంగ.. ఇటీవల వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించి, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ రికార్డు సమం చేశాడు. ఈ క్రమంలో హసరంగ వన్డే కెరీర్‌కు సంబంధించిన బౌలింగ్ గణంకాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కెరీర్లో ఇప్పటివరకు 46 వన్డేలు ఆడిన హసరంగ.. తొలి 39 మ్యాచ్‌ల్లో కేవలం 39 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అప్పటివరకు సాధారణ బౌలర్లా ఉన్న హసరంగ ఒక్కసారిగా ప్రపంచ స్థాయి బౌలర్‌గా మారిపోయాడు. తదుపరి ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 ఐదు వికెట్లు ఘనతలు, ఆతర్వాత వరుసగా 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు, అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. హసరంగ చెలరేగుతుండటంతో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక వరుసగా విజయాలు సాధిస్తూ.. వరల్డ్‌కప్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో హసరంగ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. గత 7 మ్యాచ్‌ల్లో హసరంగ గణాంకాలు.. నెదర్లాండ్స్‌పై 9-2-42-3 స్కాట్లాండ్పై 4.2-1-7-3 ఐర్లాండ్‌పై 8-1-24-6 ఒమన్‌పై 7.2-2-13-5 యూఏఈపై 10-0-79-5 ఆఫ్ఘనిస్తాన్పై 6-0-42-2 ఆఫ్ఘనిస్తాన్పై 10-0-53-2 -
అజేయ శ్రీలంక.. పూర్వ వైభవం దిశగా అడుగులు
1990 దశకం మధ్యలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు జెంటిల్మెన్ గేమ్‌పై ఏకఛత్రాధిపత్యం చలాయించి, ఈ మధ్యలో రెండుసార్లు (1996 వన్డే వరల్డ్‌కప్, 2014 టీ20 వరల్డ్‌కప్) జగజ్జేతగా నిలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు.. స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో గత కొద్దికాలంగా అతి సాధారణ జట్టుగా మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ జట్టు తిరిగి గాడిలో పడుతున్నట్లు కనిపిస్తుంది. టెస్ట్‌లను, టీ20లను పక్కన పెడితే ఆ జట్టు ఇటీవలికాలంలో వన్డేల్లో వరుస విజయాలు సాధిస్తూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. నిన్నటి వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపుతో కలిపుకుని ఇటీవలికాలంలో ఆ జట్టు వరుసగా 7 విజయాలు సాధించింది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్పై రెండో వన్డే మొదలైన ఆ జట్టు గెలుపు ప్రస్థానం.. నిన్నటి నెదర్లాండ్స్ మ్యాచ్ వరకు నిరాటంకంగా సాగింది. ఫలితంగా 2023 వన్డే ప్రపంచకప్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంక సాధిస్తున్న వరస విజయాల్లో స్పిన్నర్ వనిందు హసరంగ, వెరటన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హపరంగ ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ ప్రత్యర్దులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు ఆతను 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ ఫైఫర్లు (5 వికెట్ల ఘనత) ఉన్నాయి. క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ విషయానికొస్తే.. ఈ దశలో శ్రీలంక (6 పాయింట్లు) అని జట్ల కంటే టాప్‌లో ఉంది. జింబాబ్వే కూడా సమానమైన పాయింట్లే కలిగి ఉన్నప్పటికీ.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ శ్రీలంకతో పోలిస్తే తక్కువగా ఉంది. ఈ దశలో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ 3,4 స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్ 0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి, 2023 వరల్డ్‌కప్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. -
ఓడినా వణికించింది.. వరల్డ్‌కప్ అర్హతకు చేరువలో లంక
వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అంశంలో శ్రీలంక మరింత దగ్గరైంది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్, శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ అయింద. ఒక దశలో నెదర్లాండ్స్ విజయం దిశగా నడిచి శ్రీలంకను వణికించింది. అయితే లంక బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో నెదర్లాండ్స్‌ను నిలువరించారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 బంతుల్లో 67 పరుగులు చేయగా.. వెస్లీ బార్సీ 52 పరుగులు, బాస్ డీ లీడే 41 పరుగుల చేశారు. లంక బౌలర్లలో మహీషా తీక్షణ మూడు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమారా, మధుషనక, షనకలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డిసిల్వా 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక వరల్డ్‌కప్ అర్హతకు మరింత చేరువైంది. ప్రస్తుతం లంక ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్ ఓటమితో ఇబ్బందుల్లో పడింది. డచ్ తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇతర జట్ల ఓటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Back on 🔝 Sri Lanka reclaim the No.1 spot in the Super Six Standings and are on the verge of booking their #CWC23 berth 🤩 pic.twitter.com/peX1Jfxmq4 — ICC Cricket World Cup (@cricketworldcup) June 30, 2023 చదవండి: #Ashes2023: స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు! దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు -
దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్‌లో శుక్రవారం రెండో మ్యాచ్‌లో లంక తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ 'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య -
ఒమన్‌పై విజయం.. వరల్డ్‌కప్ అర్హత దిశగా జింబాబ్వే
సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. గురువారం మొదలైన సూపర్ సిక్స్ పోటీల్లో జింబాబ్వే, ఒమన్‌లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్సన్(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్ రజా 49 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 333 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అకీబ్ ఇల్యాస్ 45, జీషన్ మక్సూద్ 37, ఆయానా ఖాన్ 47 పరుగులు చేశాడు. ఒక దశలో 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులతో గెలిపించేలా అనిపించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొహమ్మద్ నదీమ్ 18 బంతుల్లోనే 30 పరుగులు నాటౌట్ ఆశలు రేపినా మిగతావారు సహకరించడంలో విఫలమయ్యారు. దీంతో ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, తెందయి చతారాలు చెరో మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా రెండు,సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌లో రెండో టాపర్‌గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్‌పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. A hard-fought win! 🇿🇼 beat Oman by 1⃣4⃣ runs in the first match of the Super Six 🙌 📝: https://t.co/wBKKKFmDjo #ZIMvOMA | #CWC23 pic.twitter.com/aTn5aruPjo — Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2023 చదవండి: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!
జింబాబ్వే సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ తన జట్టును వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. తన కెరీర్లోనే పీక్ ఫామ్ కనబరుస్తున్న సీన్ విలియమ్స్ మరో సెంచరీతో మెరిశాడు. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం సూపర్ సిక్స్‌లో ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సీన్ విలియమ్స్‌కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 175 పరుగుల ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ తన జోరును సూపర్ సిక్స్‌లోనూ చూపిస్తున్నాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విలియమ్సన్ ఖాతాలో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విలిమయమ్సన్ ధాటికి జింబాబ్వే మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విలియమ్సన్ 119 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. రియాన్ బర్ల్ 2 పరుగులతో సహకరిస్తున్నాడు. కాగా వలర్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ రెండు అర్థసెంచరీలు, మూడు సెంచరీల సాయంతో 506 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో నికోలస్ పూరన్ 296 పరుగులతో ఉన్నాడు. టాప్-2 స్కోరర్స్‌కు చాలా తేడా ఉంది. దీంతో అతని దూకుడు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. The third hundred in the tournament 💯 A batting average of over 100 in ODIs in 2023 ✅ Sean Williams is UNSTOPPABLE! 💥#ZIMvOMA | #CWC23 pic.twitter.com/R89inyV9KT — ICC (@ICC) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం!
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్-2023లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. విండీస్ సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికి.. ప్రపంచకప్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఇక సూపర్ సిక్స్ రౌండ్ ప్రారంభానికి ముందు వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మధ్యలో తప్పుకున్న స్పిన్నర్ యాన్నిక్ కారియా స్థానంలో మరో స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో యాన్నిక్ కారియాకు గాయమైంది. బంతి అతడి ముక్కుకు బలంగా తాకడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సూపర్ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్‌లో జులై 1న స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కెవిన్ సింక్లైర్ విండీస్ జట్టుతో కలవనున్నాడు. ఇక కెవిన్ సింక్లైర్ రీప్లేస్‌మెంట్‌ను ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. చదవండి: #ICCWorldCup2023: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! -
విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్‌కు ఘోర అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ మెగా సమరానికి అర్హత సాధించని విండీస్ జట్టు క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లోనూ దారుణ ఆటతీరు కనబరిచి వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికి.. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిన విండీస్‌కు సూపర్ సిక్స్‌లో సున్నా పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో లీగ్ దశలో నెదర్లాండ్స్, వెస్టిండీస్(సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్లు)లపై విజయాలు సాధించిన జింబాబ్వే నాలుగు పాయింట్లతో టాపర్‌గా ఉంది. ఇక నెదర్లాండ్స్ విండీస్‌పై సూపర్ ఓవర్లో విజయం సాధించి రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ దశలో వెస్టిండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం అసాధ్యమని తెలుసు. కానీ వెస్టిండీస్‌కు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు ఇప్పటికి ఒక అవకాశం మిగిలి ఉంది. కష్టసాధ్యమైనప్పటికి అదృష్టం కూడా కలిసివస్తే మాత్రం విండీస్ మెగా సమరానికి వెళ్లే అవకాశముంటుంది.అదెలా అంటే.. ఒకే గ్రూప్‌లో ఉన్న జింబాబ్వే వద్ద ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. మరో గ్రూప్‌లో ఉన్న శ్రీలంక ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో ముందు వరుసలో ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే.. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్‌లో వెస్టిండీస్ శ్రీలంక, ఒమన్, స్కాట్లాండ్లతో ఆడుతుంది. తొలుత ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా విండీస్ ఇంటిబాట పట్టాల్సిందే. ఒకవేళ విండీస్ మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆరు పాయింట్లు తన ఖాతాలో ఉంటాయి. ఇక జింబాబ్వే, శ్రీలంకలు తాము ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమి పాలవ్వాలి. అలా జరిగితేనే వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలు ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఒకవేళ శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు విజయాలు సాధిస్తే అప్పుడు రెండు జట్లు 8 పాయింట్లతో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే.. విండీస్ ఇంటిబాట పడుతుంది. నెట్ రన్‌రేట్ పెంచుకోవాల్సిందే.. ఒకవేళ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు మ్యాచ్‌లు ఓడినా విండీస్‌కు అవకాశాలు అంతంతే. ఎందుకంటే ఆ సమయంలో నెట్‌రన్‌రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం విండీస్ రన్‌రేట్ (-0.350)గా ఉంది. మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో పాటు భారీ విజయాలతో విండీస్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. ఇప్పటికైతే విండీస్‌కు, శ్రీలంక(+2.698)కు నెట్‌రన్‌రేట్ విషయంలో చాలా తేడా ఉంది. ఒమన్‌పై 99 పరుగుల టార్గెట్‌ను 35 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించడం లంక రన్‌రేట్‌ను బాగా మెరుగుపరిచింది. ఇక జింబాబ్వే నెట్ రన్‌రేట్ కూడా +0.982గా ఉంది. ఇది కూడా విండీస్‌కు ఒక దెబ్బ అని చెప్పొచ్చు జింబాబ్వే అన్ని మ్యాచ్‌లు ఓడిపోతే.. అయితే విండీస్‌కు నెట్ రన్‌రేట్ పెంచుకోవడంలో విఫలమైనా ఆఖరిగా ఒక చాన్స్ ఉంది. అదేంటంటే.. జింబాబ్వే సూపర్ సిక్స్‌లో తాను ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూడాలి.. అదే సమయంలో విండీస్ అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలి. అప్పుడు జింబాబ్వే ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటే.. విండీస్ ఆరు పాయింట్లు సాధించి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో శ్రీలంక విండీస్ చేతిలో ఓడి.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఇక ఒమన్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్లు తలా ఒక విజయం సాధించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్‌కు ఇది అంత సులువు కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫామ్ దృశ్యా శ్రీలంక, జింబాబ్వేలను ఓడగొట్టడం మిగతా జట్లకు పెద్ద సవాల్. అందునా మరీ రెండు మ్యాచ్‌లు ఓడిపోయే దుస్థితిలో ఈ రెండు జట్లు ఎంతమాత్రం లేవు. ఇన్ని ఇబ్బందుల మధ్య విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని ఆశించడం వ్యర్థం.. కానీ ఏ మూలనో ఆ జట్టుకు అదృష్టం రాసి ఉంటే తప్ప. చదవండి: వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ 2011 టోర్నీ మొత్తం ధోని అదే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి.. -
గెలిచినా లాభం లేదు; క్వాలిఫయింగ్ రేసులో లంక, జింబాబ్వే
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోరులో భాగంగా ఐర్లాండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్-బిలో మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 138 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ గెలిచినా ఐర్లాండ్‌కు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐర్లాండ్, ఒమన్‌లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక స్కాట్లాండ్పై గెలిచిన శ్రీలంక నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌లో అడుగుపెట్టగా.. ఆరు పాయింట్లతో స్కాట్లాండ్ రెండో స్థానంలో, ఒమన్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో సూపర్‌సిక్స్‌కు అర్హత సాధించాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 134 బంతుల్లో 162 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ ఆండ్రూ బాల్బర్ని 66 పరుగులు, హ్యారీ టెక్టర్ 57 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 39 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంచిత్ శర్మ 44 పరుగులు, బాసిల్ హమీద్ 39 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, జార్జ్ డొక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్ జోషువా లిటిల్‌లు తలా రెండు వికెట్లు తీశారు. ఇక క్వాలిఫయింగ్ టోర్నీలో ఇవాళ్టితో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. సూపర్ సిక్స్‌కు వెళ్లిన ఆరుజట్లలో లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా సాధించిన పాయింట్లను ఐసీసీ పేర్కొంది. సూపర్‌సిక్స్ స్టాండింగ్స్ ప్రకారం శ్రీలంక నాలుగు, జింబాబ్వే నాలుగు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చెరో రెండు పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్, ఒమన్ జట్లు సున్నా పాయింట్లతో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచాయి. సూపర్ సిక్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే శ్రీలంక, జింబాబ్వేలు నాలుగేసి పాయింట్లతో ఉండడంతో.. ఈ రెండు జట్లకు అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 హోదాలో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప! The race for the final two #CWC23 spots is heating up 🔥 How the Super Six standings look at the end of the Qualifier group stages 👀 pic.twitter.com/B2xTVFb72V — ICC (@ICC) June 27, 2023 చదవండి: క్లియరెన్స్ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ' -
ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోరులో శ్రీలంక జట్టుకు ఎదురులేకుండా పోయింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. నాలుగింటికి నాలుగ విజయాలు సాధించిన లంక 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను దాదాపు ఖరారు చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 85 బంతుల్లో 75 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. వీరిద్దరు మినహా మిగతావారిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వాట్ మూడు, క్రిస్ సోల్ రెండు, ఎవన్స్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి స్కాట్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రిస్ గ్రీవ్స్ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో స్కాట్లాండ్ 29 ఓవర్లలోనే 163 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో రాణించగా.. హసరంగా రెండు, కాసున్ రజిత, లాహిరు కుమారా, దాసున్ షనకలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే గ్రూప్-బి నుంచి లంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే లీగ్స్టేజీ సహా సూపర్ సిక్స్‌లో సాధించే పాయింట్ల ఆధారంగా ఒక జట్టు మాత్రమే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ విషయంలో లంక గ్రూప్-బి నుంచి ముందు వరుసలో ఉంది. Sri Lanka bag two crucial points against Scotland going into the Super Six stage of the #CWC23 Qualifier 👏#SLvSCO: https://t.co/FCKWkeNT75 pic.twitter.com/RUq8S7nR7l — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 Spinning a web 🕸️ For his figures of 3/41, Maheesh Theekshana is the @aramco #POTM from #SLvSCO 🙌 #CWC23 pic.twitter.com/tjbIXmvjsS — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 చదవండి: ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
Trending Pic: విండీస్ యోధుడి ముఖం చినబోయిన వేళ..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది. కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కార్ల్ హూపర్తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్‌వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. -
వెస్టిండీస్ కొంపముంచాడు.. చెత్త బౌలింగ్‌తో! ఐపీఎల్లో కూడా అంతే
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసినప్పటికి విజయం సాధించలేకపోయింది. విండీస్ బౌలర్లు విఫలం కావడంతో నెదర్లాండ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 374 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్లో తేల్చాల్సి వచ్చింది. హోల్డర్ చెత్త బౌలింగ్.. వాన్ బీక్ సూపర్ బ్యాటింగ్ ఇక సూపర్ ఓవర్లో విండీస్ తరపున బౌలింగ్ వేసేందుకు బంతిని హోల్డర్‌కు కెప్టెన్ హోప్ అందించాడు. హోప్ నమ్మకాన్ని హోల్డర్ వమ్ము చేశాడు. హోల్డర్ వేసిన సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ బ్యాటర్ వాన్ బీక్ బౌండరీల మోత మోగించాడు. 4,6,4,6,6,4 బాదాడు. దీంతో సూపర్ ఓవర్లో డచ్ జట్టు ఏకంగా 30 పరుగులు చేసింది. సూపర్ ఓవర్లో ఒక్క మంచి డెలివరీని కూడా హోల్డర్ సంధించలేకపోయాడు. ఫుల్ టాస్ లేదా సరైన స్లాట్‌లో బౌలింగ్‌లో చేయడంతో వాన్‌బీక్ బౌండరీల వర్షం కురిపించాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ ఘోర పరాభావాన్ని విండీస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హోల్డర్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. హోల్డర్‌కు బదులుగా జోషఫ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే కచ్చితంగా విండీస్ విజయం సాధించేదాని పోస్టులు చేస్తున్నారు. హోల్డర్ తన చెత్త బౌలింగ్‌తో విండీస్ కొంపముంచాడు అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో కూడా అంతే.. ఇక హోల్డర్ గత కొంతకాలంగా తన స్ధాయికి తగ్గట్టు రాణించడంలో విఫలమవతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హోల్డర్.. 8 మ్యాచ్‌ల్లో 9.96 ఏకనామీతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో విజయానికి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. హోల్డర్ తొలి మూడు బంతులకే 3 సిక్స్‌లు ఇచ్చి రాజస్తాన్‌కు ఓటమి మిగిల్చాడు. చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా! Jason Holder, the man, the myth, the legend! pic.twitter.com/5I8QrCoTfO — Shivani Shukla (@iShivani_Shukla) June 26, 2023 -
ఘన కీర్తి కలిగిన వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. వరల్డ్‌కప్ అవకాశాలు గల్లంతు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో విండీస్ ఖాళీ ఖాతాతో సూపర్ సిక్స్‌కు అడుగుపెట్టనుంది. తద్వారా ఫైనల్‌కు చేరే ఛాన్స్‌తో పాటు వరల్డ్‌కప్ అవకాశాలను ఆవిరి చేసుకుంది. సూపర్ సిక్స్‌కు పాయింట్లు ఎలా..? సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్టు తమతో పాటు ఆ దశకు చేరుకున్న మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే, మ్యాచ్‌కు రెండు పాయింట్ల చొప్పున 4 పాయింట్లు.. ఒక జట్టుపై గెలిచి మరో జట్టు చేతిలో ఓడితే 2 పాయింట్లు.. రెండు జట్ల చేతిలో ఓడితే పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశలో అడుగుపెడతుంది. జింబాబ్వే 4, నెదర్లాండ్స్ 2, వెస్టిండీస్ 0 గ్రూప్-ఏ నుంచి సూపర్ సిక్స్‌కు చేరుకున్న మూడు జట్లలో ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు,నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు, వెస్టిండీస్ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించడంతో జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. జింబాబ్వే చేతిలో ఓడి, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో వెస్టిండీస్ పాయింట్లు ఏమీ లేకుండానే సూపర్ సిక్స్ దశలో పోటీపడుతుంది. గ్రూప్-బి నుంచి ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది..? గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. అయితే శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య ఇవాళ (జూన్ 27) జరుగబోయే మ్యాచ్‌తో ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుందో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే 4 పాయింట్లు, స్కాట్లాండ్ గెలిస్తే 2 పాయింట్లు.. శ్రీలంక, స్కాట్లాండ్ చేతుల్లో ఓడింది కాబట్టి ఒమన్ 0 పాయింట్లతో తదుపరి దశలో పోటీపడతాయి. సూపర్ సిక్స్ దశలో ఎలా..? గ్రూప్ దశలో సాధించిన అదనపు పాయింట్లతో (4 లేదా 2 లేదా 0) ప్రతి జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఓ గ్రూప్‌లోని ఓ జట్టు మరో గ్రూప్‌లోని 3 జట్లతో ఒక్కో మ్యాచ్ అడుతుంది. అన్ని జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అలాగే ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు కలిగిన వెస్టిండీస్ జట్టు.. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా ఆవిరి చేసుకుంది. పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశకు చేరిన ఆ జట్టు.. ఈ దశలో ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 6 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే 4 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఏదో ఒక జట్లు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుంది. గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ ఇదివరకు 2 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఓ జట్టు 2 పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌లో పోటీపడుతుంది. 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇది కాదని విండీస్ సూపర్ సిక్స్ దశలో క్వాలిఫయర్స్‌లో తమకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన శ్రీలంక, స్కాట్లాండ్లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా సంచలనం నమోదైతే తప్ప విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. -
ప్రపంచకప్‌లో సంచలనం, ఆంధ్ర ఆటగాడి విధ్వంసకర శతకం.. విండీస్‌కు ఘోర పరాభవం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న విండీస్.. నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న డచ్ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. విండీస్ నిర్ధేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెదర్లాండ్స్‌ను ఆంధ్ర (విజయవాడ) ఆటగాడు తేజ నిడమనూరు తన విధ్వంసకర శతకంతో (76 బంతుల్లో 111; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టెక్కించగా (స్కోర్లు సమం చేసేంత వరకు తీసుకెళ్లాడు), అనంతరం సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ (4,6,4,6,6,4) ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శతక్కొట్టిన పూరన్.. రాణించిన బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), జాన్సన్ ఛార్లెస్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. తేజ నిడమనూరు వీరోచిత శతకం.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. తేజ నిడమనూరు వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్‌ను సమం (374/9) చేయగలిగింది. తేజకు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ ఊచకోత.. బంతితోనూ మ్యాజిక్ సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ ఊచకోత కోశాడు. జేసన్ హోల్డర్ వేసిన ఆ ఓవర్లో వాన్ బీక్ వరుసగా 4,6,4,6,6,4 బాదాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ చేతులెత్తేసింది. బ్యాట్‌తో మెరిసిన వాన్ బీక్ బంతితోనూ మాయ చేశాడు. తొలి బంతిని ఛార్లెస్ సిక్సర్ బాదగా.. రెండో బంతికి హోప్ ఓ పరుగు తీశాడు. అయితే ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్ బీక్.. ఛార్లెస్, హోల్డర్లను ఔట్ చేయడంతో విండీస్ కథ ముగిసింది. నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. -
జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు!
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వన్డే చరిత్రలో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు 2006లో కెన్యాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ స్కోర్‌ను జింబాబ్వే అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అమెరికా తొలుత జింబాబ్వేకు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సీన్ విలియమ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 101 బంతుల్లోనే 174 పరుగులు చేసిన విలియమ్స్.. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జింబాబ్వే కెప్టెన్‌గా విలియమ్స్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు గుంబే(78), బర్ల్(16 బంతుల్లో 47) పరుగులతో రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో అభిషేక్ మూడు వికెట్లు, జష్దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించారు. చదవండి: Yashasvi Jaiswal: ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేయలేను.. ఆ విషయం గురించి చెప్పడానికి సిగ్గుపడను! -
జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్‌నే తప్పించిన విండీస్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్ దశ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (జూన్ 26) జరిగే కీలక మ్యాచ్‌కు ఏకంగా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్నే దూరం పెట్టింది. అతనితో పాటు గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌ను కూడా పక్కన పెట్టింది. రోవ్‌మన్ పావెల్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు పావెల్ స్థానంలో రొమారియో షెపర్డ్, కైల్మేయర్స్ స్థానంలో షమారా బ్రూక్స్‌ను తుది జట్టుకు ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (16), జాన్సన్ ఛార్లెస్ (27) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, విండీస్ ఇదివరకే సూపర్ సిక్స్‌కు చేరినా నెదర్లాండ్స్‌పై గెలుపు తదుపరి దశలో ఆ జట్టుకు కీలకం కానున్న నేపథ్యంలో విండీస్ మేనేజ్మెంట్ కీలక ఆటగాడిని తప్పించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే రెండు పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌కు చేరుతుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో ఈ పాయింట్లు ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాయి. మరోవైపు గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా ఉన్న జింబాబ్వే.. తమతో పాటు సూపర్ సిక్స్‌కు చేరుకున్న విండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించినందున 4 పాయింట్లు ఖాతా పెట్టుకుని సూపర్ సిక్స్‌కు చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు (జూన్ 27) జరుగబోయే మ్యాచ్ అనంతరం ఏ జట్టు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుందో తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లు, ఓడిన జట్టు 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ దశలో ఈ పాయింట్లు కలుపుకుని ఒక్కో జట్టు 3 మ్యాచ్‌లు ఆడిన అనంతరం ఏ జట్లు టాప్-2లో ఉంటాయో అవి ఫైనల్లో తలపడటంతో పాటు ఈ ఏడాది చివరల్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
CWC Qualifier 2023: సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు, తదుపరి షెడ్యూల్ వివరాలు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. నేపాల్, యూఎస్ఏ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. ఐర్లాండ్, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లు జూన్ 29 నుంచి ప్రారంభమవుతాయి. సూపర్ సిక్స్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఓ గ్రూప్‌లోని మూడు జట్లు మరో గ్రూప్‌లోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఏ పొజిషన్లో ఉంటుందో డిసైడ్ కాలేదు. గ్రూప్-ఏలో జింబాబ్వే తొలి స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకోగా.. వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 26) విజేత రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 27) విజేత గ్రూప్ టాపర్ నిలుస్తుంది. మరో జట్టు ఒమన్ తమ కోటా మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది. సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే 2 పాయింట్లతో తదుపరి దశకు చేరతాయి. గ్రూప్-ఏలో జింబాబ్వే.. తమ గ్రూప్‌లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించడంతో సూపర్ సిక్స్ దశకు రెండు పాయింట్లతో అడుగుపెడుతుంది. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది. సూపర్ సిక్స్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి).. జూన్ 29: ఏ2 వర్సెస్ బి2 జూన్ 30: ఏ3 వర్సెస్ బి1 జులై 1: ఏ1 వర్సెస్ బి3 జులై 2: ఏ2 వర్సెస్ బి1 జులై 3: ఏ3 వర్సెస్ బి2 జులై 4: ఏ2 వర్సెస్ బి3 జులై 5: ఏ1 వర్సెస్ బి2 జులై 6: ఏ3 వర్సెస్ బి3 జులై 7: ఏ1 వర్సెస్ బి1 సూపర్ సిక్స్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జులై 9న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్లో తలపడటంతో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
శ్రీలంకకు ధీటుగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన స్కాట్లాండ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్ చేతిలో ఓడినా ఒమన్ ఈ గ్రూప్ నుంచి మూడో జట్టుగా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరగా.. నేపాల్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్ కీపర్ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
చరిత్ర సృష్టించిన హసరంగ.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 25) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతను.. వరుసగా మూడు వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు (16 వికెట్లు) పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ మాత్రమే వన్డేల్లో హ్యాట్రిక్ ఫైఫర్స్ (15 వికెట్లు) సాధించాడు. ఈ టోర్నీలో యూఏఈతో (8-1-24-6) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో (7.2-2-13-5) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, తాజాగా ఐర్లాండ్‌పై (10-0-79-5) మరోసారి 5 వికెట్ల ఘనత సాధించాడు. హసరంగ చెలరేగడంతో ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, గ్రూప్-బి నుంచి సూపర్ సిక్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా గ్రూప్-బి నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (103) సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. హసరంగ (5/79) మహీష్ తీక్షణ (2/28), కసున్ రజిత (1/22), లహీరు కుమార (1/33), దసున్ షనక (1/21) ధాటికి 31 ఓవర్లలో 192 పరుగులకు కుప్పకూలింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంపర్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
సెంచరీతో కదంతొక్కిన కరుణరత్నే.. దిగ్గజాల సరసన చోటు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 25) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నే (103 బంతుల్లో 103; 8 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. ఈ శతకం కరుణరత్నేకు వన్డేల్లో తొట్టతొలిది కావడం విశేషం. టెస్ట్‌ల్లో 16 శతకాలు బాదిన కరుణరత్నే.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇటీవలే వన్డే జట్టులోకి వచ్చి తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కరుణరత్నే వన్డేల్లో 1000 పరుగులు (40 మ్యాచ్‌ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1095 పరుగులు) పూర్తి చేసుకోవడంతో పాటు ఓ అరుదైన ఫీట్ సాధించి, దిగ్గజాల సరసన చేరాడు. కరుణరత్నే.. ఈ మ్యాచ్‌తో కలుపుకుని తన చివరి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 103, దీనికి ముందు ఒమన్‌పై 61 నాటౌట్, యూఏఈపై 42, ఆఫ్ఘనిస్తాన్పై 56 నాటౌట్, ఆఫ్ఘనిస్తాన్పై 52 పరుగులు స్కోర్ చేశాడు. గతంలో శ్రీలంక తరఫున ఇలా 5 వరుస ఇన్నింగ్స్‌ల్లో 5 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. సనత్ జయసూర్య, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షన్, దినేశ్ చండీమాల్.. కరుణరత్నే కంటే ముందు ఈ రేర్ ఫీట్‌ను సాధించారు. తాజాగా కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించడంతో దిగ్గజ క్రికెటర్లు జయసూర్య,సంగక్కర సరసన చేరాడు. వన్డేల్లో వరుసగా ఫిప్టి ప్లస్ చేసిన రికార్డు పాకిస్తాన్ జావిద్ మియాందాద్ (9 వరుస 50 ప్లస్ స్కోర్లు) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, గ్రూప్-బిలో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. -
ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్కల్లమ్ తరహాలో మెక్‌ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్‌ను మెక్కల్లమ్తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న వెస్టిండీస్‌కు మరో బిగ్ షాక్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 24) పెను సంచలనం నమోదైంది. రెండు సార్లు ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. ఈ ఓటమితో విండీస్ వన్డే వరల్డ్‌కప్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ భారీ పరాభవం నుంచి తేరుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో విండీస్ బౌలర్లు 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్.. జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోల్పోవడంలో లాసైన 2 పాయింట్లు విండీస్‌కు తదుపరి దశలో అత్యంత కీలకంగా మారతాయి. అవి విండీస్ వరల్డ్‌కప్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ కలవరపడుతుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ దేశాలు సూపర్ సిక్స్ దశకు చేరే అవకాశం ఉంది. -
డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా?
రెండుసార్లు ప్రపంచకప్ విజేత.. అరవీర భయంకరమైన బౌలర్లు.. అదే స్థాయిలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడిన బ్యాటర్లు.. నాలుగు దశాబ్దాల పాటు క్రికెట్‌ను శాసించిన వైనం. ఇప్పుడు అదంతా గతం. తాజాగా వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం కోసం వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోరులో ఆడాల్సిన దుస్థితి వెస్టిండీస్‌కు ఎదురైంది. అయితే శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే ఓటమి ఆ జట్టును డేంజర్ జోన్లో పడేసింది. క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా వచ్చే పాయింట్లు సూపర్ సిక్స్‌లో లెక్కిస్తారు. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్ 2లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. ఇక మ్యాచ్‌లో విండీస్ ఓడినప్పటికి సూపర్ సిక్స్ దశకు చేరుకున్నా రెండు పాయింట్లు మాత్రం కోల్పోయింది. ఇది సూపర్‌సిక్స్ దశలో ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. లీగ్‌లో వెస్టిండీస్ తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. ఒకవేళ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్-ఏ నుంచి టాప్-2గా అడుగుపెడుతుంది. ఇక జింబాబ్వే తన ఆఖరి పోరులో అమెరికాను ఎదుర్కొంటుంది. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప జింబాబ్వే గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఎందుకంటే జింబాబ్వే గ్రూప్ టాపర్‌గా ఉంటుంది కాబట్టి విండీస్ సూపర్ సిక్స్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది. చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా! -
పెను సంచలనం.. విండీస్‌ను మట్టికరిపించిన పసికూన
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 24) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజాతో పాటు ర్యాన్ బర్ల్ (50), క్రెయిగ్ ఎర్విన్ (47) రాణించగా.. గుంబీ (26), సీన్ విలియమ్స్ (23) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3, అల్జరీ జోసఫ్, అకీల్ హొసేన్ చెరో 2, కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. ఆదిలోనే తడబడింది. ఆ జట్టు 46 పరుగులకే 2 వికెట్లు (బ్రాండన్ కింగ్ (20), జాన్సన్ ఛార్లెస్ (1)) కోల్పోయింది. కైల్ మేయర్స్ (56), షాయ్ హోప్ (30), పూరన్ (34), రోస్టన్ ఛేజ్ (44) విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లు క్రమంగా వికెట్లు పడగొట్టడంతో విండీస్ ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఆ జట్టు 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
చెలరేగిన మ్యాక్స్ ఓడౌడ్, విన్నింగ్ రన్ కొట్టిన ఆంధ్ర క్రికెటర్.. నెదర్లాండ్స్‌కు మరో విజయం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. రెండ్రోజుల కిందట (జూన్ 22) యూఎస్ఏపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జూన్ 24) నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరపించింది. ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (75 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్స్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతనికి విక్రమ్‌జిత్ సింగ్ (30), బాస్ డి లీడ్ (41 నాటౌట్) సహకరించగా.. ఆంధ్ర క్రికెటర్ (విజయవాడలో పుట్టాడు) తేజ నిడమనూరు (2 నాటౌట్) నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. విజృంభించిన వాన్ బీక్.. కుప్పకూలిన నేపాల్ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. వాన్ బీక్ (9.3-1-24-4), బాస్ డి లీడ్ (2/31), విక్రమ్‌జిత్ సింగ్ (2/20), క్లేటన్ ఫ్లాయిడ్ (1/31), ఆర్యన్ దత్ (8-2-23-1) ధాటికి 44.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెలరేగిన మ్యాక్స్ ఓడౌడ్.. 168 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (90) చెలరేగి ఆడాడు. ఓడౌడ్ దాదాపుగా ప్రతి నేపాల్ బౌలర్‌ను టార్గెట్ చేసి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఆఖర్లో బాస్ డి లీడ్ (39 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నెదర్లాండ్స్ కేవలం 27.1 ఓవర్లలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచ్చెన్ 2, గుల్సన్ ఝా ఓ వికెట్ పడగొట్టారు. -
కెప్టెన్ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్(CWC 2023)లో స్కాట్లాండ్ జట్టు దూకుడు కనబరుస్తోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (136 బంతుల్లో 127 పరుగులు, 9 ఫోర్లు, 3సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మెరిశాడు. అతనికి తోడుగా మైకెల్ లీస్క్ 41, మార్క్ వాట్ 31 బంతుల్లో 44 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ స్కాట్లాండ్ బౌలర్ల దాటికి 35.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్ సోల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు మరింత చేరువ కాగా.. మరోవైపు హ్యాట్రిక్ ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. చదవండి: #LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా.. -
పసికూనపై శ్రీలంక ప్రతాపం.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫియర్స్-2023లో శ్రీలంక మరో విజయం నమోదు చేసింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 96 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కేవలం 15 ఓవర్లలలోనే ఛేదించింది. శ్రీలంక ఓపెనర్లు దిముత్ కరుణ రత్నే(61), నిస్సాంక(37) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఒమెన్ శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో హాసరంగా ఐదు వికెట్లతో ఒమన్‌ను దెబ్బ తీయగా.. లహిరు కుమార మూడు, రజితా ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో అయాన్ ఖాన్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ ఈవెంట్లో హాసరంగా ఐదు వికెట్ల ఘనత సాధించడం రెండో సారి. ఈ టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న లంక వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో తలపడనుంది. చదవండి: అసలు పోరులో తుస్సు! జట్టు నుంచి అవుట్.. నీ సహచర ఆటగాడిని చూడు! -
సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో ఆడుతూ బిజీగా ఉన్న అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్యానెల్ పేర్కొంది. కైల్ పిలిప్‌పై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ''ఆర్టికల్ 6.7 రెగ్యులేషన్స్ ప్రకారం.. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానముంది. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించాం. తన బౌలింగ్‌కు సంబంధించిన రీఅసెస్మెంట్ జరిగేవరకు కైల్ పిలిప్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది'' అని ఐసీసీ ప్యానెల్ తెలిపింది. 2021 నుంచి అమెరికా తరపున ఐదు వన్డేలు ఆడిన కైల్ పిలిప్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో అమెరికా తొలి మ్యాచ్ ఆడింది. మ్యాచ్‌లో యూఎస్ఏ ఓడినప్పటికి కైల్ పిలిప్ మూడు వికెట్లు తీశాడు. కాగా టోర్నీలో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసిన అమెరికా దాదాపు నిష్క్రమించింది. ఇక తనపై నిషేధం పడడంతో కైల్ పిలిప్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC) టోర్నీలో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు కైల్ పిలిప్ను 10వేల యూస్ డాలర్లకు సొంతం చేసుకుంది. చదవండి: 50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు -
సెంచరీలతో కదం తొక్కిన హోప్, పూరన్.. విండీస్ ఖాతాలో భారీ విజయం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో విండీస్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జత కలిసిన హోప్, పూరన్ జోడీ నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని జోడించి తమ జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (29), జేసన్ హోల్డర్ (16 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్ (10-0-34-3), అల్జరీ జోసఫ్ (10-0-45-2), కీమో పాల్ (10-1-63-2), అకీల్ హొస్సేన్ (10-1-49-2), కైల్ మేయర్స్ (6.4-0-37-1) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్ ఝా (42), రోహిత్ పౌడెల్ (30), ఆసిఫ్ షేక్ (28), కరణ్ (28), దీపేంద్ర సింగ్ (23) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో విండీస్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైన నేపాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.గ్రూప్-ఏలో ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏను మట్టికరిపించిన నెదర్లాండ్స్ మూడో ప్లేస్‌కు చేరుకోగా.. ఆడిన 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన జాంబాబ్వే.. విండీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన యూఎస్ఏ ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
నెదర్లాండ్స్‌ను గెలిపించిన ఆంధ్ర క్రికెటర్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. యూఎస్ఏతో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర (విజయవాడ) క్రికెటర్ తేజ నిడమనురు బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (68 బంతుల్లో 58; 5 ఫోర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (60 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. షాయాన్ జహంగీర్ (71) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (33), జెస్సీ సింగ్ (38) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ర్యాన్ క్లీన్, బాస్ డి లీడ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. వాన్ బీక్, ఆర్యన్ దత్, క్లేటన్ ఫ్లాయిడ్, విక్రమ్‌జిత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. A fine half-century for Teja Nidamanuru ✨#CWC23 | 📝 #NEDvUSA: https://t.co/WIBObotfuN pic.twitter.com/WXYn5NaRwt — ICC (@ICC) June 22, 2023 అనంతరం బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్.. 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. తేజ, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఆ జట్టును గెలిపించారు. మ్యాక్స్ ఓడౌడ్ (26), వెస్లీ బర్రెసీ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో జస్దీప్ సింగ్ 2, సౌరభ్ నేత్రావాల్కర్, అలీ ఖాన్, నోష్తుష్ కెంజిగే తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ మూడో ప్లేస్‌కు (2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో ఓటమి) చేరగా.. 3 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమిపాలైన యూఎస్ఏ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లైంది. ఈ గ్రూప్ నుంచి ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన వెస్టిండీస్, జింబాబ్వే తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇవాళ విండీస్ చేతిలో ఓడిన నేపాల్ నాలుగో స్థానంలో నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
నయా రన్ మెషీన్ షాయ్ హోప్.. దిగ్గజాల సరసన చోటు
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అత్యంత అరుదైన జాబితాలో చేరాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్‌లో శతక్కొట్టం (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్వారా విరాట్ కోహ్లి, మైఖేల్ బెవాన్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, జో రూట్ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా హోప్ మరోసారి వన్డేల్లో 50కిపైగా యావరేజ్ సాధించాడు. కనీసం 100 వన్డేలు ఆడి 50 అంతకంటే ఎక్కువ సగటు కలిగిన క్రికెటర్ల జాబితాలో పైన పేర్కొన్న దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. హోప్ 110 మ్యాచ్‌ల్లో 105 ఇన్నింగ్స్‌లు ఆడి 50.26 సగటున 4674 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ అందరికంటే ఎక్కువగా 274 వన్డేల్లో 57.3 సగటున 12898 పరుగులు చేశాడు. విరాట్ తర్వాత ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ బెవాన్ (232 వన్డేల్లో 53.6 సగటున 6912 పరుగులు) అత్యధిక సగటు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (228 వన్డేల్లో 53.5 సగటున 9577 పరుగులు), ఎంఎస్ ధోని (350 మ్యాచ్‌ల్లో 50.6 సగటున 10773 పరుగులు), జో రూట్ (158 వన్డేల్లో 50 సగటున 6207 పరుగులు) ఉన్నారు. తాజాగా హోప్ వీరి సరసన చేరాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టడం ద్వారా హోప్ వన్డేల్లో తన 15వ శతకాన్ని నమోదు చేశాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు), హోప్ అత్యధిక సెంచరీలు (9), అత్యధిక హాఫ్ సెంచరీలు (18) చేసిన రెండో బ్యాటర్‌గా హోప్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవలికాలంలో హోప్ ప్రదర్శన చూసాక ఇతన్ని అందరూ నయా రన్ మెషీన్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే, నేపాల్‌తో మ్యాచ్‌లో హోప్‌తో పాటు నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో నేపాల్ తడబడుతుంది. 44 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
విండీస్ బ్యాటర్ల శతకాల మోత.. పూరన్ ఊచకోత
CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్.. పాయింట్ల పట్టికలో (గ్రూప్-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-బిలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఒమన్ టాపర్‌గా, శ్రీలంక, స్కాట్లాండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2019 వరల్డ్‌కప్ తర్వాత హోప్‌ను మించినోడే లేడు.. విండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్‌కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్ ఆజమ్ అని చెప్పాలి. బాబర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 1876 పరుగులు చేసి హోప్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
బౌలర్ పెట్టిన బిక్షతో మ్యాచ్‌ను గెలిపించాడు
జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్కు ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా! -
సికందర్ రజా మాయాజాలం.. అయినా భారీ స్కోర్ చేసిన నెదర్లాండ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్-ఏలో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ (88), మ్యాక్స్ ఒడౌడ్ (59), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (83), ఆఖర్లో సకీబ్ జుల్ఫికర్ (34 నాటౌట్) చెలరేగడంతో డచ్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా (4/55), రిచర్డ్ నగరవ (2/40) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బౌలర్లను డచ్ బ్యాటర్లు ఆడుకున్నారు. జింబాబ్వే మొత్తం 8 మంది బౌలర్లను ప్రయోగించినా పరుగులను నియంత్రించలేకపోయింది. నెదర్లాండ్స్ కోల్పోయిన 6 వికెట్లలో 4 క్లీన్ బౌల్డ్ అయినవే కావడం విశేషం. సికందర్ రజా ముగ్గురిని, నగరవ ఒకరిని క్లీన్ బౌల్డ్ చేశారు. షయాన్ జహంగీర్ సూపర్ సెంచరీ.. ఇవాలే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో యూఎస్ఏ-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. 49 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్ షయాన్ జహంగీర్ (79 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో యూఎస్ఏను ఆదుకున్నాడు. జహంగీర్‌కు సుశాంత్ మొదానీ (42), గజానంద్ సింగ్ (26) ఓ మోస్తరుగా సహకరించడంతో యూఎస్ఏ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కరణ్ 4, గుల్షన్ షా 3, దీపేంద్ర సింగ్ 2, లలిత్ రాజబంశీ ఓ వికెట్ పడగొట్టారు. -
చెలరేగిన హసరంగా..ICC CWC Qualifiersలో లంక శుభారంభం
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోరును శ్రీలంక ఘనంగా ఆరంభించింది. సోమవారం యూఏఈతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో లంక 175 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. లంక స్పిన్నర్ వనిందు హసరంగా ఆరు వికెట్లతో(6/24) యూఏఈ పతనాన్ని శాసించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(63 బంతుల్లో 78, 10 ఫోర్లు), సదీరా సమరవిక్మ(64 బంతుల్లో 73), పాతుమ్ నిసాంకా(76 బంతుల్లో 57), దిముత్ కరుణరత్నే(54 బంతుల్లో 52) అర్థసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో అసలంక 23 బంతుల్లో 48 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ హసరంగా దాటికి 39 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. వసీమ్(39), అరవింద్(39), నసీర్(34) పర్వాలేదనిపించారు. చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్ -
పసికూనపై లంక బ్యాటర్ల ప్రతాపం.. భారీ స్కోర్, టాప్-4 బ్యాటర్లు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఇవాళ గ్రూప్-బి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బులవాయో వేదికగా జరిగిన ఇవాల్టి తొలి మ్యాచ్‌లో యూఏఈ జట్టు శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి యూఏఈ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్లంతా (నిస్సంక (57), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (73)) హాఫ్ సెంచరీలు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు చరిత్ అసలంక (23 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆఖర్లో హసరంగ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) కూడా ఓ చేయి వేయడంతో శ్రీలంక ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షనక (1), ధనంజయ డిసిల్వ (5) మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో అలీ నసీర్ 2 వికెట్లు పడగొట్టగా.. రోహన్ ముస్తఫా, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో 2 బెర్తుల కోసం విండీస్, శ్రీలంక, జింబాబ్వే సహా మొత్తం 10 జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విన్నర్, రన్నరప్‌లు భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్లతో వన్డే వరల్డ్‌కప్-2023లో పోటీపడతాయి. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్, వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
లేటు వయసులో శతక్కొట్టారు.. ఒకరిది ఫాస్టెస్ట్ హండ్రెడ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకం బాదాడు. రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ముగ్గురు సెంచరీలు చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ.. సెంచరీలు చేసిన వారు 35 ఏళ్ల వయసు పైబడ్డ వారు కావడం విశేషం. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచారు. వీరిలో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్‌ది ఆ దేశం తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (70) కావడం మరో విశేషం. శతక్కొట్టిన బ్యాటర్లలో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్ విలియమ్స్‌కు 36, క్రెయిగ్ ఎర్విన్‌కు 37 ఏళ్లు. లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ జట్లను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించడంతో నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ సెంచరీలు చేసి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చగా.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్ వీరోచిత సెంచరీ చేసి తన జట్టును (యూఎస్ఏ) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) ఉన్నారు. కాగా, నేపాల్‌తో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇవాలే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
రాణించిన పూరన్, హోల్డర్.. పసికూనపై విండీస్ విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా ఇవాళ (జూన్ 18) జరిగిన రెండో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ ఓ మోస్తరు విజయం సాధించింది. హరారేలోని తకషింగ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించినప్పటికీ, వారికి విజయం అంత ఈజీగా దక్కలేదు. విండీస్‌తో పోల్చుకుంటే యూఎస్ఏ టీమ్ చాలా చిన్నదే అయినా అద్భుత పోరాటపటిమ కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను వారు మరో 3 బంతులు మిగిలుండగానే అలౌట్ చేశారు. విండీస్ జట్టులో గుర్తింపు పొందిన ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ.. యూఎస్ఏ బౌలర్లు వారిని కట్టడి చేశారు. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) ఆటలు యూఎస్ఏ బౌలర్ల ముందు సాగలేదు. స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఆటగాళ్లు 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-బిలో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడనున్నాయి. -
శతక్కొట్టిన సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్.. జింబాబ్వే ఘన విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే ఘన విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నగరవా 4 వికెట్లు తీసి నేపాల్‌ను దారుణంగా దెబ్బకొట్టిగా.. మసకద్జ 2, చటారా, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఆటగాడు జాయ్‌లార్డ్ గుంబీ (25) వికెట్ సొంపాల్ కామీకి, వెస్లీ మధెవెరె (32) వికెట్ గుల్సన్ ఝాకు దక్కాయి. ఈ విజయంతో జింబాబ్వే.. గ్రూప్-ఏలో మెరుగైన రన్‌రేట్‌తో (0.789) అగ్రస్థానానికి చేరుకుంది. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్‌తో పాటు వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భాగంగానే ఇవాళ వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా.. బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) విఫలమయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లు, నోషటష్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో యూఎస్ఏ తడబడుతుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి, ఓటమి దిశగా పయనిస్తుంది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ తలపడనున్నాయి. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించిన అనామక బ్యాటర్
ఇవాళ (జూన్ 18) మొదలైన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అనామక జట్టు నేపాల్.. వారి కంటే ఎన్నో రెట్లు మెరుగైన జింబాబ్వేను గడగడలాడిస్తుంది. నేపాల్ టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్ కుశాల్ భూర్టెల్ (95 బంతుల్లో 99; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించి, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మసకద్జ.. కుశాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మాల్ల (41), రోహిత్ పౌడెల్ (31) రాణించారు. 47 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 271/5గా ఉంది. గుల్సన్ ఝా (6), దీపేంద్ర సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవా తలో 2 వికెట్లు, టెండాయ్ చటారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. గ్రూప్-ఏలో భాగంగా నేపాల్-జింబాబ్వే జట్లు.. వెస్టిండీస్-యూఎస్ఏ జట్లు ఇవాళ తలపడుతున్నాయి. విండీస్-యూఎస్ఏ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న విండీస్.. 43 ఓవర్ల తర్వాత 243/6 స్కోర్ చేసింది. రోప్టన్ ఛేజ్ (45), జేసన్ హోల్డర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0) విఫలం కాగా.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), నికోలస్ పూరన్ (43) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ 3, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్, నోషటష్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే!
ICC Cricket World Cup Qualifiers 2023: వెస్టిండీస్‌కు ఇలాంటి గడ్డుకాలం వస్తుందని అస్సలు ఊహించలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించలేని దుస్థితికి చేరుకుంటామని అనుకోలేదని వాపోయాడు. కాగా ఒకప్పుడు క్రికెట్లో దేదీప్యమానంగా వెలుగొందిన వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2022, వన్డే ప్రపంచకప్-2023కి నేరుగా క్వాలిఫై కాలేకపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే వేదికగా ఆదివారం (జూన్ 18) నుంచి మొదలైన క్వాలిఫయర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ అసిస్టెంట్ కోచ్ కార్ల్ హూపర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘గతేడాదికి ఇప్పటికి మా స్థాయిలో ఎలాంటి మార్పులేదు. ఇంతకంటే దిగజారడం అంటే ఇంతకంటే దిగజారడం అంటూ ఇంకేమీ ఉండదు అనుకుంటే పొరపాటే! ఒకవేళ మేము వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయినట్లయితే పాతాళానికి పడిపోయినట్లే! ఐసీసీ టోర్నమెంట్లలో ఆడే క్రమంలో అర్హత సాధించేందుకు వెస్టిండీస్ ఇలా పాట్లు పడటం నేను బతికుండగా జరుగుతుందని అనుకోలేదు. అప్పుడు ఆస్ట్రేలియాలో టీ20, ఇప్పుడు జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెట్టేందుకు ఇలా చెమటోడ్చాల్సి వస్తోంది. ఇతర జట్లను అవమానించడమో లేదంటే తక్కువ చేసి మాట్లాడటమనే ఉద్దేశం నాకు లేదు. నిజానికి జింబాబ్వేలో మేము అమెరికా, నేపాల్, స్కాట్లాండ్ వంటి జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఆఖరికి అఫ్గనిస్తాన్ కూడా! ఆఖరికి అఫ్గనిస్తాన్ కూడా మాకంటే ముందే ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికే వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెట్టింది. కానీ మేము.. మా స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో మేము యూఎస్ఏను సులభంగా ఓడిస్తామని అనుకుంటున్నాను’’ అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు. కాగా హరారే వేదికగా ఆదివారం మొదలైన క్వాలిఫయర్స్‌లో విండీస్ యూఎస్ఏతో తలపడుతోంది. టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి షాయీ హోప్ బృందం 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కాగా ప్రపంచకప్ ఈవెంట్‌కు అర్హత సాధించే క్రమంలో రెండు బెర్త్‌ల కోసం వెస్టిండీస్‌తో పాటు శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా, ఒమన్, యూఏఈ బరిలో ఉన్నాయి. చదవండి: రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై.. -
వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే.. యువ వికెట్ కీపర్ ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫైయర్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టుకు జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారధ్యం వహించనున్నాడు. ఈ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ జాయ్‌లార్డ్ గుంబీకి చోటు దక్కింది. ఇది మినహా సెలక్టర్లు తమ జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. జట్టులో రజా, సీన్ విలియమ్స్, ముజాబ్రానీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు జింబాబ్వేనే అతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు భారత వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఇక జింబాబ్వే తమ మొదటి మ్యాచ్‌లో జూన్ 18న హారారే వేదికగా నెపాల్తో తలపడనుంది. కాగా ఈ క్వాలిఫియర్స్ రౌండ్లో శ్రీలంక, వెస్టిండీస్ వంటి మేటి జట్లు కూడా పాల్గొంటున్నాయి. జింబాబ్వే జట్టు: ర్యాన్ బర్ల్, టెండై చటారా, క్రెయిగ్ ఎర్విన్, బ్రాడ్లీ ఎవాన్స్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే? -
వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల
మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023 (వన్డే ఫార్మాట్) క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. జింబాబ్వే, వెస్టిండీస్, ద నెదార్లండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. కాగా, భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. The @ICC Men’s Cricket World Cup Qualifier 2023 Match Schedule is now available 🎉🤩 👇 Check it out 👇#RoadToCWC23 | #CWC23 | #VisitZimbabwe pic.twitter.com/Mu31QRdRdR — Zimbabwe Cricket (@ZimCricketv) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే -
వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు
ICC Qualifier Play Off USA VS Jersey: వన్డే క్రికెట్లో ఏడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా జెర్సీతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ బౌలర్ అలీ ఖాన్ 9.4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇవి ఏడో అత్యుత్తమ గణాంకాలుగా రికార్డయ్యాయి. Fresh from collecting the seventh best ODI figures of all time, this dynamic fast bowler now looms as the key player for USA as they try and book a place at this year's @cricketworldcup 💪https://t.co/pK9kLjJ5L4 — ICC (@ICC) April 5, 2023 ఈ జాబితాలో శ్రీలంక పేస్ దిగ్గజం చమింద వాస్ (8/19) అగ్రస్థానంలో ఉండగా.. షాహిద్ అఫ్రిది (7/12), గ్లెన్ మెక్‌గ్రాత్ (7/15), రషీద్ ఖాన్ (7/18), ఆండీ బిచెల్ (7/20), ముత్తయ్య మురళీథరన్ (7/30) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత అలీ ఖాన్ (7/32) ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. దిగ్గజ బౌలర్ల సరసన చేరే క్రమంలో అలీ ఖాన్.. టిమ్ సౌథీ (7/33), ట్రెంట్ బౌల్డ్ (7/34), వకార్ యూనిస్ (7/36) లాంటి స్టార్ పేసర్లను అధిగమించాడు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన 32 ఏళ్ల అలీ ఖాన్.. పాక్‌లో పుట్టి, యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక జెర్సీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో అత్యంత కీలమైన ఈ మ్యాచ్‌లో అలీ ఖాన్ విజృంభించడంతో యూఎస్ఏ 25 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేస్‌లో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ టేలర్ (79) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (41) ఓ మోస్తరుగా రాణించాడు. జెర్సీ బౌలర్లలో బెంజమిన్ వార్డ్ 4, ఎలియట్ మైల్స్, జూలియస్ సుమేరౌర్ తలో 2, చార్లెస్ పెర్చార్డ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏ.. అలీ ఖాన్ (7/32) వీరలెవెల్లో విజృంభించడంతో జెర్సీ 47.4 ఓవర్లలో 206 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. అలీ ఖాన్‌తో పాటు జస్దీప్ సింగ్ (1/43), నిసర్గ్ పటేల్ (2/42) బంతితో రాణించగా.. జెర్సీ ఇన్నింగ్స్‌లో అసా ట్రైబ్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఎస్ఏ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసులో అగ్రస్థానంలో నిలువగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న నమీబియా, యూఏఈ జట్లు కూడా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు దాదాపుగా అర్హత సాధించాయి. కెనడా, జెర్సీ, పపువా న్యూ గినియా జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసు నుంచి టెక్నికల్‌గా నిష్క్రమించాయి. ఈ పోటీల్లో ఇవాళ (ఏప్రిల్ 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, క్వాలిఫయర్ బెర్తులు ఖరారు కావడంతో అవి నామమాత్రంగానే జరుగనున్నాయి. -
వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు
Michael Leask: ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. వన్డే ప్రపంచకప్ 2023 అర్హత పోటీల్లో భాగంగా స్కాట్లాండ్, పపువా న్యూ గినియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు మైఖేల్ లీస్క్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐసీసీ అసోసియేట్ దేశాలకు వన్డే క్రికెట్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదిన లీస్క్.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 2 పరుగులు సాధించి ఈ ఘనతను సాధించాడు. Final ball of the innings, and two needed for the fastest Associate ODI fifty 💥Scotland's Michael Leask gets it done in 18 balls 👏Catch all the @cricketworldcup League 2 action live and FREE on https://t.co/CPDKNxoJ9v 📺 pic.twitter.com/qLmRaJTnNg— ICC (@ICC) April 14, 2022 లీస్క్ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. లీస్క్ సాధించిన రికార్డును ఐసీసీ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. కాగా, అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్‌పై కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఏడేళ్లు పూర్తైనా నేటికీ ఆ రికార్డు ఏబీడి పేరిటే పదిలంగా ఉంది. ఇదిలా ఉంటే, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 123 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, ఛేదనలో స్కాటిష్ బౌలర్ గావిన్ మెయిన్ (5/52), హమ్జా తాహిర్ (3/27)ల ధాటికి పపువా న్యూ గినియా 36.2 ఓవర్లలో 164 పరుగులకే చాపచుట్టేసింది. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్‌లో టోనీ ఉరా (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కొయెట్జర్ (74), బెర్రింగ్టన్ (56), లీస్క్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చదవండి: Odean Smith: ఓ మ్యాచ్‌లో విలన్‌గా, రెండు మ్యాచ్‌ల్లో హీరోగా..! -
T20 World Cup 2021: ఆసీస్ చేతిలో విండీస్ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..!
Update: ఊహించిన విధంగానే విండీస్ ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఏడాది నవంబర్ 15 లోపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉన్న జట్లు మాత్రమే నేరుగా టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 దశకు నేరుగా అర్హత సాధించనున్నాయి. ప్రస్తుతం విండీస్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో విండీస్ ర్యాంక్ మరింత దిగజారనుంది. స్కోర్లు: వెస్టిండీస్: 157/7(20 ఓవర్లు) ఆస్ట్రేలియా: 162/2(16.2 ఓవర్లు) West Indies Will Directly Qualify For 2022 T20 WC If They Win Against Australia: టీ20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడిపోయి సెమీస్ రేసు నుంచి తప్పుకున్న వెస్టిండీస్‌కు మరో కష్టమొచ్చి పడింది. ఇవాళ(నవంబర్ 6) ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరీబియన్ వీరులు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. It's a must-win match for West Indies today. If they lose, they will drop to Number 9 (according to the ICC T20 Rankings predictor). If they are outside Top 8 by November 15, 2021, they will not "directly qualify for Super 12" of T20 World Cup 2022 in Australia. #AusvWI — Mazher Arshad (@MazherArshad) November 6, 2021 2022 టీ20 ప్రపంచకప్ సూపర్-12కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్.. ఆసీస్‌పై కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే ఈ ఏడాది శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లలా ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్లలో జరిగే మెగా టోర్నీలో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది టాప్-8లో ఉండే జట్లు వచ్చే ఏడాది సూపర్-12కు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న విండీస్.. ఆసీస్ చేతిలో ఓడితే మరింత కిందకు పడిపోతుంది. చదవండి: ఎన్సీఏ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..! -
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో..
Cristiano Ronaldo Creates History By Scoring 10th International Hat Trick: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా మంగళవారం లక్సెంబర్గ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్(10 సార్లు) సాధించిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా రొనాల్డో తన కెరీర్లో 58 హ్యాట్రిక్‌లు సాధించి, సమకాలీన ఫుట్‌బాలర్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్‌లు(182), అత్యధిక గోల్స్(115), అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస
లండన్: ఇంగ్లండ్ జాతీయ జట్టుకు 2011-2014 మధ్యలో 24 వన్డేలు, 34 టీ20లు ఆడిన జేడ్ డెర్న్‌బాచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడంతో ఇంగ్లండ్‌ను వీడి మరో దేశానికి ప్రాతినధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 ఐరోపా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటలీ జట్టు తరఫున ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తన తల్లి ద్వారా ఇదివరకే ఇటలీ పాస్ పోర్ట్ కలిగిన డెర్న్‌బాచ్.. మాజీ సహచర ఆటగాడు ప్రస్తుత ఇటలీ కోచ్ కమ్ కెప్టెన్ గారెత్ బెర్గ్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. డెర్న్బాచ్తో పాటు కెంట్ కౌంటీ జట్టు ఆటగాడు గ్రాండ్ స్టువార్ట్ కూడా ఈ ప్రపంచకప్ క్వాలిపయర్స్లో ఇటలీకి ఆడనున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఓవైస్ షా ఇటలీ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్, ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతనిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల వెటరన్ బౌలర్ జేడ్ డెర్న్‌బాచ్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 31, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. అతను ప్రస్తుతం సర్రే కౌంటీ జట్టు కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. చదవండి: పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్ -
Cristiano Ronaldo: ప్రత్యర్ధి ఆటగాడి చెంప చెల్లుమనిపించాడు, ఆ తర్వాత..?
పోర్చుగల్: దిగ్గజ ఫుట్‌బాలర్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ చివరి నిమిషంలో రెండు గోల్స్ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 111కు చేరింది. దీంతో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇరాన్ దిగ్గజ ఆటగాడు అలీ దాయ్ (109)ను దాటి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. How is this not a red card for Mr Influencer Ronaldo?pic.twitter.com/jZcvvUME2g — Edmund 💉 (@EdmundOris) September 1, 2021 ఇదిలా ఉంటే, ఇదే మ్యాచ్‌లో రొనాల్డో చేసిన ఓ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీ కిక్‌ను రొనాల్డో తీసుకున్నాడు. అయితే, బంతిని కిక్ చేయడానికి పొజిషన్లో పెట్టుకున్న సమయంలో ఐర్లాండ్ డిఫెండర్ ఓషియా దాన్ని కాలితో తన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన రొనాల్డో అతడి భుజంపై బలంగా కొట్టాడు. రొనాల్డో కొట్టిన దెబ్బకు ఓషియా కాసేపు ఓవరాక్షన్ చేశాడు. రొనాల్డోకు అంపైర్ రెడ్ కార్డ్ వస్తుందని నానా డ్రామా చేశాడు. అయితే ఈ తతంగాన్ని రిఫరి గమనించకపోవడంతో రొనాల్డో రెడ్ కార్డ్ బారి నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ రొనాల్డోకి రెడ్ కార్డు చూపించి ఉంటే.. అతను మైదానం వీడాల్సి వచ్చేది. అప్పుడు చివర్లో రెండు గోల్స్ కొట్టే అవకాశాం ఉండేది కాదు. కాగా, మైదానంలో ప్రత్యర్ధులపై ఇలా దురుసుగా ప్రవర్తించడం సీఆర్7కు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా అతను దాడులకు పాల్పడి మైదానం వీడాడు. రొనాల్డో దాడులు ఆటగాళ్ల వరకే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఈ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ రిఫరీలను కూడా వదిలిపెట్టలేదు. వారిపై కూడా దాడులకు దిగి అప్రతిష్టపాలయ్యాడు. చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం..పాక్ కెప్టెన్ ధీమా -
అఫ్గాన్ సంచలనం.. అరుదైన రికార్డు!
హరారే : వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. 44 మ్యాచుల్లోనే రషీద్ ఖాన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 52 మ్యాచుల్లో ఈ ఘనత సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా తాజా మ్యాచ్‌తో రషీద్ ఖాన్ అధిగమించాడు. 23 ఓవర్ చివరి బంతికి విండీస్ ఆటగాడు షై హోప్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి 100 వికెట్ల క్లబ్లో చేరాడు. ముస్తాక్ (పాకిస్తాన్) 53, షేన్ బాండ్ (న్యూజిలాండ్) 54, బ్రెట్‌లీ(ఆస్ట్రేలియా) 55 మ్యాచుల్లో ఈ ఘనతను అందుకోని తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక భారత్ నుంచి 59 మ్యాచుల్లో ఇర్ఫాన్ పఠాన్ ఈ ఫీట్‌ను సాధించి వకార్ యూనిస్(పాకిస్తాన్), మోర్కెల్(దక్షిణాఫ్రికా)లతో సమంగా 8వ స్తానంలో నిలిచాడు. ఇక రషీద్ ఖాన్ ఈ సీజన్లో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
1979 తర్వాత జింబాబ్వే తొలిసారి..
-
1979 తర్వాత జింబాబ్వే తొలిసారి..
హరారే: ప్రపంచకప్‌లో ఆడాలన్న జింబాబ్వే ఆశలు ఆవిరయ్యాయి. క్వాలిఫయర్స్‌లో భాగంగా యూఏఈతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమిపాలైంది. చివరి బంతికి సిక్సర్ కొడితే జింబాబ్వే గెలిచేదే, కానీ క్రీజులో ఉన్న ఇర్విన్ రెండు పరుగులే చేయడంతో యూఏఈ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రమీజ్ (59) టాప్ స్కోరర్. వర్షం కారణంగా జింబాబ్వే లక్ష్యాన్ని 40 ఓవర్లలో 230కి కుదించగా.. సీన్ విలియమ్స్ (80) పోరాడినా, జింబాబ్వే 226/7కే పరిమితమై ఓటమిపాలైంది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచ కప్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. వరల్డ్ కప్‌కు జింబాబ్వే అర్హత సాధించలేకపోవడంతో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు రేసులోకి వచ్చాయి. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే రన్‌రేట్ ప్రకారం ఐర్లాండ్ ముందుకు వెళుతుంది. -
ఎట్టకేలకు భారత్ గెలిచింది
ఫిఫా క్వాలిఫయర్స్‌లో గ్వామాపై విజయం బెంగళూరు: ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. గురువారం గ్వామా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో భారత్ నెగ్గింది. ప్రథమార్ధం 10వ నిమిషంలోనే రాబిన్ సింగ్ గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు. 41వ నిమిషంలో షెహనాజ్ సింగ్ రెడ్ కార్డుకు గురవ్వడంతో భారత్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే ఫైనల్ రౌండ్ బెర్త్‌కు దూరమైన భారత్ ఓవరాల్‌గా ఆడిన ఆరు క్వాలిఫై మ్యాచ్‌ల్లో ఇదే తొలి గెలుపు కావడం విశేషం.