ICC Qualifier Play Off USA VS Jersey: వన్డే క్రికెట్‌లో ఏడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా జెర్సీతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ బౌలర్ అలీ ఖాన్ 9.4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇవి ఏడో అత్యుత్తమ గణాంకాలుగా రికార్డయ్యాయి.
Fresh from collecting the seventh best ODI figures of all time, this dynamic fast bowler now looms as the key player for USA as they try and book a place at this year's @cricketworldcup 💪https://t.co/pK9kLjJ5L4
— ICC (@ICC) April 5, 2023
ఈ జాబితాలో శ్రీలంక పేస్ దిగ్గజం చమింద వాస్ (8/19) అగ్రస్థానంలో ఉండగా.. షాహిద్ అఫ్రిది (7/12), గ్లెన్ మెక్‌గ్రాత్ (7/15), రషీద్ ఖాన్ (7/18), ఆండీ బిచెల్ (7/20), ముత్తయ్య మురళీథరన్ (7/30) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత అలీ ఖాన్ (7/32) ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. దిగ్గజ బౌలర్ల సరసన చేరే క్రమంలో అలీ ఖాన్.. టిమ్ సౌథీ (7/33), ట్రెంట్ బౌల్డ్ (7/34), వకార్ యూనిస్ (7/36) లాంటి స్టార్ పేసర్లను అధిగమించాడు.
కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన 32 ఏళ్ల అలీ ఖాన్.. పాక్‌లో పుట్టి, యూఎస్‌ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.
ఇక జెర్సీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో అత్యంత కీలమైన ఈ మ్యాచ్‌లో అలీ ఖాన్ విజృంభించడంతో యూఎస్‌ఏ 25 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేస్‌లో ముందంజలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ.. నిర్ణీత ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ టేలర్ (79) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (41) ఓ మోస్తరుగా రాణించాడు. జెర్సీ బౌలర్లలో బెంజమిన్ వార్డ్ 4, ఎలియట్ మైల్స్, జూలియస్ సుమేరౌర్ తలో 2, చార్లెస్ పెర్చార్డ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన యూఎస్‌ఏ.. అలీ ఖాన్ (7/32) వీరలెవెల్లో విజృంభించడంతో జెర్సీ 47.4 ఓవర్లలో 206 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. అలీ ఖాన్‌తో పాటు జస్దీప్ సింగ్ (1/43), నిసర్గ్ పటేల్ (2/42) బంతితో రాణించగా.. జెర్సీ ఇన్నింగ్స్‌లో అసా ట్రైబ్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ గెలుపుతో యూఎస్‌ఏ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసులో అగ్రస్థానంలో నిలువగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న నమీబియా, యూఏఈ జట్లు కూడా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు దాదాపుగా అర్హత సాధించాయి. కెనడా, జెర్సీ, పపువా న్యూ గినియా జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసు నుంచి టెక్నికల్‌గా నిష్క్రమించాయి. ఈ పోటీల్లో ఇవాళ (ఏప్రిల్ 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, క్వాలిఫయర్ బెర్తులు ఖరారు కావడంతో అవి నామమాత్రంగానే జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment