one day world cup
-
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
వన్డే ప్రపంచకప్-2023 ఆరంభంలో ఓటములు చవిచూసిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన గెలుపుతో విజయాల బాట పట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను మట్టికరిపించిన హష్మతుల్లా బృందం.. శ్రీలంక, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో కూడా గెలుపు బావుటా ఎగురవేసింది.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025కి కూడా అర్హత సాధించింది. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గన్ ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు షాకిచ్చి సత్తా చాటింది.అదే హైలైట్ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి ఓడినా అభిమానుల హృదయాలు గెలిచింది. సంతృప్తిగానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, అన్నింటికంటే పాకిస్తాన్‌పై గెలుపు మాత్రం అఫ్గన్‌కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఎందుకంటే.. అంతర్జాతీయ వన్డేల్లో అది కూడా.. వరల్డ్‌కప్ లాంటి ప్రధాన ఈవెంట్లో తొలిసారి పాక్‌పై అఫ్గనిస్తాన్ పైచేయి సాధించింది. స్టార్ బ్యాటర్లు రహ్మనుల్లా గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) ఇన్నింగ్స్ కారణంగా తొలిసారి పాక్‌ను ఓడించింది. దీంతో అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.రాత్రి మొత్తం డాన్స్ చేస్తూతాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ‘‘పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నేను డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాను.గ్రౌండ్ నుంచి హోటల్ దాకా సంబరాలు చేసుకున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోలేదు. అప్పుడు నన్నెవరైనా చూసి ఉంటే.. అసలు నాకు వెన్నునొప్పి ఉందంటే నమ్మేవారే కాదు.గతంలో ఎప్పుడూ లేని విధంగాఅప్పటికీ జాగ్రత్తగా ఉండాలని మా ఫిజియో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా నేను అలా పిచ్చిపట్టినట్లుగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మా జట్టు మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాళ్లు నన్ను అలా చూడనేలేదు’’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా ఆ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌల్ చేసిన రషీద్ వికెట్ తీయకపోయినా పొదుపుగా(ఎకానమీ 4.10) బౌలింగ్ చేశాడు. నాటి మ్యాచ్‌లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఐపీఎల్‌తో బిజీఇదిలా ఉంటే.. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 102 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే! -
వన్డే వరల్డ్‌కప్ వేదికలు ఖరారు
తదుపరి జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. 2027 అక్టోబర్, నవంబర్లలో షెడ్యూలైన ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతానికి సౌతాఫ్రికాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. సౌతాఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం 11 ఉండగా.. వాటిలో ఎనిమిదింట వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూలాండ్స్‌లోని బోలాండ్ పార్క్, బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్ మైదానాలు 2027 క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు. చాలా అంశాలను (హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు) పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి. కాగా, 2027 వరల్డ్‌కప్‌కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా.. నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్‌ను అధిగమిస్తే అర్హత సాధిస్తుంది. ఈ మెగా టోర్నీకి వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా.. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 14 జట్లు గ్రూప్‌కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2003 వరల్డ్‌కప్ తరహాలోనే ఈ ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. -
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే.ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు.మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు.నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది.అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా.అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను.ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు. నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది. అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా. అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను. ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
Illegal betting: చట్ట విరుద్ధంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 జోరుగా సాగుతుండడంతో, మరోవైపు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలు కూడా ఉపందుకుంటున్నాయి. అనధికారిక మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నడుస్తున్నట్టు, ఈ రూపేణా ఏటా రూ.2లక్షల కోట్ల మేర పన్ను ఆదాయాన్ని భారత్ కోల్పోతున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) నివేదిక తెలిపింది. చట్ట వ్యతిరేకంగా నడిచే క్రీడల బెట్టింగ్ మార్కెట్లోకి భారత్ నుంచి ఏటా రూ.8,20,000 కోట్లు వస్తున్నట్టు ఈ ఫోరమ్ అంచనా వేసింది. ప్రస్తుత జీఎస్టీ రేటు 28 శాతం ప్రకారం చూస్తే ఈ మొత్తంపై భారత్ ఏటా రూ.2,29,600 కోట్లు నష్టపోతున్నట్టు తెలిపింది. ఈ తరహా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాల నిరోధానికి నూతన జీఎస్టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ సంస్థల కార్యకలాపాలను గుర్తించేందుకు, అవి భారత్‌లో రిజిస్టర్ చేసుకునేలా చూసేందుకు టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తద్వారా భారత్ నుంచి పెద్ద మొత్తంలో బెట్టింగ్ కోసం నిధులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. లేకుంటే మరింత నష్టం ప్రభుత్వం వైపు నుంచి కఠిన చర్యలు లేకుంటే మరింత ఆదాయ నష్టం ఏర్పడుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. నూతన జీఎస్టీ విధానంతో చట్టపరిధిలో పనిచేసే గేమింగ్ మార్కెట్ బదులుగా చట్ట విరుద్ధంగా పనిచేసే ఆఫ్‌షోర్ బెట్టింగ్ కంపెనీలు ఎక్కువ వృద్ధిని చూడనున్నాయని, ఫలితంగా మరింత పన్ను నష్టం ఏర్పడుతుందని వివరించింది. ఐపీఎల్ సమయంలోనూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగడాన్ని ప్రస్తావించింది. మన దేశంలో బెట్టింగ్, గేమింగ్‌పై 14 కోట్ల మంది సాధారణంగా పాల్గొంటూ ఉంటారని, ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందని వెల్లడించింది. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లావాదేవీలపై నిషేధం విధించడంతో చట్ట విరుద్ధంగా భారత్ లోపల, భారత్ నుంచి వెలుపలకు నిధులు తరలింపు కోసం రహస్య పద్ధతులను అనుసరించేందుకు దారితీస్తున్నట్టు వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీలు, అక్రమ చానళ్లు నిధుల తరలింపునకు వీలు కలి్పస్తూ.. భారత్ దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు విసురుతున్నట్టు పేర్కొంది. ఇలా అక్రమంగా తరలించే నిధులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు, జాతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు వనరులుగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 75 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లు భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత యూజర్లను ఆకర్షించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది. -
వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలు.. స్టార్ట్ చేసింది ఎవరంటే..?
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై పసికూన ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని పరిశీలిస్తే.. సంచలనాలకు నాంది పలికింది భారతే అని తెలుస్తుంది. 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ నేతృత్వంలోని టీమిండియా నాటి మేటి జట్టైన వెస్టిండీస్‌ను మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా ఆవతరించింది. అదే వరల్డ్‌కప్‌లో మరో సంచలనం కూడా నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న జింబాబ్వే.. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం 1992 ఎడిషన్‌లో కూడా జింబాబ్వే జట్టు సంచలన విజయం సాధించింది. ఆ టోర్నీలో వారు ఇంగ్లండ్‌కు షాకిచ్చారు. 1996 వరల్డ్‌కప్‌లో ఏకంగా పెను సంచలనమే నమోదైంది. అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌ను అంతర్జాతీయ క్రికెట్లోకి అప్పుడే అడుగుపెట్టిన కెన్యా మట్టికరిపించింది. 1999 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే రెండు సంచలన విజయాలు సాధించింది. ఆ ఎడిషన్‌లో జింబాబ్వే.. సౌతాఫ్రికా, టీమిండియాలను ఓడించింది. అదే ఏడిషన్‌లో బంగ్లాదేశ్.. హేమాహేమీలతో కూడిన పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. 2003 వరల్డ్‌కప్‌లో పటిష్టమైన శ్రీలంకపై కెన్యా ఘన విజయం సాధించి, సంచలనం సృష్టించింది. అదే టోర్నీలో కెన్యా.. బంగ్లాదేశ్, జింబాబ్వేలను కూడా ఓడించింది. 2007 వరల్డ్‌కప్ విషయానికొస్తే..ఈ ఎడిషన్‌లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకివ్వగా.. ఐర్లాండ్.. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. అనంతరం అదే టోర్నీలో బంగ్లాదేశ్.. సౌతాఫ్రికాను, బంగ్లాదేశ్‌ను ఐర్లాండ్ ఓడించాయి. భారత్ వేదికగా జరిగిన 2011 ఎడిషన్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్‌ను పసికూన ఐర్లాండ్ మట్టికరిపించింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్ కూడా ఓడించింది. 2015 ఎడిషన్‌లో బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించి సంచలనం సృష్టించింది. ఆ ఎడిషన్‌లో ఐర్లాండ్.. వెస్టిండీస్, జింబాబ్వేలపై సంచలన విజయాలు సాధించింది. -
వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు
2023 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఇందులో ఒకటి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వరల్డ్‌కప్ సెంచరీల రికార్డు కాగా.. రెండోది వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ రికార్డు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో సచిన్ 6 శతకాలు బాదగా రోహిత్ కూడా సచిన్‌తో సమానంగా తన ఖాతాలో 6 సెంచరీలు కలిగి ఉన్నాడు. ప్రపంచకప్ టోర్నీల్లో రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే 6 శతకాలు, 3 అర్ధశతకాలు చేశాడు. ఇందులో రోహిత్ ఒక్క 2019 ప్రపంచకప్‌లోనే 5 సెంచరీలు చేయడం విశేషం. త్వరలో ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో టీమిండియా 10కిపైగా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో రోహిత్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక వరల్డ్‌కప్ సెంచరీల రికార్డును సునాయాసంగా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో వైపు రోహిత్ రానున్న వరల్డ్‌కప్‌లో 2 ఇన్నింగ్స్‌ల్లో 22 పరుగులు చేస్తే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కును చేరిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 17 ఇన్నింగ్స్‌ల్లో 978 పరుగులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, 2023 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయవం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
తమీమ్ ఇక్బాల్‌పై వేటు
ఢాకా: వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మంగళవారం ప్రకటించింది. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్‌కు ఇందులో చోటు దక్కలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతను పూర్తి ఫిట్‌గా లేకపోగా, ఫిట్నెస్ సమస్యలు ఉన్న ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయరాదంటూ కెపె్టన్ షకీబ్ అల్ హసన్ డిమాండ్ చేయడం కూడా ప్రధాన కారణం. రిటైర్మెంట్ ప్రకటించి, దేశ ప్రధాని జోక్యంతో దానిని వెనక్కి తీసుకొని, కెపె్టన్సీకి రాజీనామా చేసి ఆపై కివీస్‌తో రెండు వన్డేలు ఆడిన తర్వాతా తమీమ్‌కు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు. జట్టు వివరాలు: షకీబ్ (కెపె్టన్), లిటన్ దాస్, తన్జీద్, నజ్ముల్, ముషి్ఫకర్, తౌహీద్, మిరాజ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, నసుమ్, మహమూద్, తస్కీన్, షరీఫుల్, ముస్తఫిజుర్, తన్జీమ్. హసరంగ, చమీరా దూరం.. కొలంబో: వరల్డ్ కప్‌లో శ్రీలంక తమ ఇద్దరు ప్రధాన బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరా సేవలు కోల్పోనుంది. గాయాలతో బాధపడుతున్న వీరిద్దరు మెగా టోర్నీకి దూరమయ్యారు. జట్టు వివరాలు: షనక (కెప్టెన్), కుశాల్ పెరీరా, నిసాంకా, కరుణరత్నే, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ, హేమంత, వెలలాగె, తీక్షణ, పతిరణ, కుమార, రజిత, మదుషంక. -
ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు శుభసూచకం.. ఈసారి ట్రోఫీ పక్కాగా మనదే..!
2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు వరుస శుభసూచకాలు ఎదురవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్ లాగా ఈసారి కూడా మెగా టోర్నీ భారత్‌లోనే జరుగుతుండటం మొదటి శుభసూచకమైతే.. రెండోది టీమిండియా ఆటగాళ్ల అరివీర భయంకరమైన ఫామ్. ఈ రెంటితో పాటు భారత్‌కు తాజాగా మరో శుభసూచకం కూడా ఎదురైంది. అదేంటంటే.. ఈసారి భారత్ ప్రపంచ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగనుండటం. ప్రపంచ నంబర్ వన్ జట్టైనంత మాత్రాన భారత్ వరల్డ్‌కప్ ఎలా గెలుస్తుందని చాలామందికి సందేహం కలగవచ్చు. అయితే ఇది చూడండి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా ఆవతరించిన విషయం తెలిసిందే. వన్డేలతో పాటు భారత్ మూడు ఫార్మాట్లలోనూ టాప్ జట్టుగా కొనసాగుతుంది. ఆసీస్‌పై తొలి వన్డేలో విజయంతో భారత్ ఈ అరుదైన ఘనతను సాధించింది. వరల్డ్ నంబర్ వన్ జట్టు హోదాలోనే భారత్ ప్రపంచకప్ బరిలోకి కూడా దిగనుంది. చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో నంబర్ వన్ జట్లుగా బరిలోకి దిగిన జట్లే జగజ్జేతలుగా ఆవిర్భవించాయి. 2015 వరల్డ్‌కప్‌లో నంబర్ వన్ టీమ్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించగా.. 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కూడా నంబర్ వన్ వన్డే జట్టుగా బరిలోకి దిగి తమ తొలి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అంతకుముందు 2003, 2007 ఎడిషన్లలో కూడా ఆస్ట్రేలియా నంబర్ వన్ వన్డే జట్టుగా వరల్డ్‌కప్ బరిలోకి దిగి టైటిల్ చేజిక్కించుకుంది.ఈ లెక్కన ఈసారి నంబర్ వన్ వన్డే జట్టుగా రంగంలోకి దిగుతున్న భారత్.. వన్డే ప్రపంచకప్‌కు ముచ్చటగా మూడోసారి ముద్దాడటం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. -
అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్?
MS Dhoni: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. మొహమాటానికి తావు లేకుండా జట్టు ఎంపిక మొదలు.. మైదానంలో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కాగా ఉండటం తనకు అలవాటు. ఈ క్రమంలో కొన్నిసార్లు ధోని విమర్శల పాలయ్యాడు కూడా! ముఖ్యంగా ఒకప్పటి స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ధోని అన్యాయం చేశాడంటూ.. అతడి తండ్రి యోగ్రాజ్ బాహాటంగానే మండిపడిన విషయం తెలిసిందే. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్-2011 జట్టులో రోహిత్ శర్మను కాదని.. పీయూశ్ చావ్లా వైపే మొగ్గు చూపడం ధోనికే చెల్లింది. అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకూ ఒకప్పుడు ధోనితో విభేదాలు ఉన్నాయంటూ వార్తల్లోకెక్కాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తొట్టతొలి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ పట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో శ్రీశాంత్ పోషించిన పాత్రను ఎవరూ మరువలేరు. ఈ నేపథ్యంలో ధోనితో విభేదాలు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అది నిజం.. కానీ ధోని భాయ్ స్టైలే వేరు ‘‘ధోని భాయ్‌తో నాకు విభేదాలున్న మాట వాస్తవమే. అయితే.. క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చూస్తే.. ధోని తమకు మద్దతుగా నిలవలేదని ఒక్క ఆటగాడు కూడా చెప్పలేడు. అయితే.. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేమీ కాదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు. ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు అదే విధంగా.. ‘‘నేను మాట్లాడే మాటలు వివాదానికి దారితీయొచ్చు.. చాలా మంది.. ‘‘అదేంటి ఒకరిద్దరు గురించే ఎక్కువగా మాట్లాడతారు? జట్టుమొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేది’’ అని అంటూ ఉంటారు. కానీ ధోని ఎప్పుడూ తాను లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు. జట్టునే ముందుంచే వాడు. అంతేకాదు జట్టులో కొత్త సభ్యుల చేతికి ట్రోఫీని ఇచ్చే సంప్రదాయాన్ని కూడా తనే మొదలుపెట్టాడు. జట్టు బాగుంటే చాలని భావిస్తాడు ధోని. మేము రెండుసార్లు వరల్డ్‌కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. ఇది కాదనలేని సత్యం. గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? అయితే.. పడవలో ఎంత మంది సెలబ్రిటీలు ఉన్నా.. దానిని గమ్యస్థానానికి చేర్చడంలో కెప్టెన్‌దే ప్రధాన పాత్ర కదా! ఫ్లైట్‌లో ఆటోపైలట్ ఆప్షన్ ఉన్నంత మాత్రాన పైలట్ అవసరం లేకుండా పోదు కదా!’’అని ధోనికి క్రెడిట్ ఇచ్చాడు శ్రీశాంత్. కాగా ఇటీవలి కాలంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్.. తామంతా కష్టపడినా ధోనికి మాత్రమే ఎక్కువ హైప్ వచ్చిందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
CWC 2023: ఒకే ఒక్కడు "విరాట్ కోహ్లి"
వన్డే వరల్డ్‌కప్-2023 కోసం భారత సెలెక్టర్లు ఇవాళ (సెప్టెంబర్ 5) టీమిండియాను ప్రకటించారు. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం టీమిండియాను ప్రకటించిన అనంతరం రన్ మెషీన్ విరాట్ కోహ్లి పేరు ఒక్కసారిగా వైరలైంది. టీమిండియా చివరిగా గెలిచిన వన్డే వరల్డ్‌కప్‌లో (2011), 2023 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో కోహ్లి ఒక్కడే కామన్ సభ్యుడిగా ఉన్నాడన్న విషయాన్ని కోహ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) ఈ పోస్ట్ వైరల్ కావడంతో కోహ్లి అభిమానులు తమ ఆరాథ్య క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఓసారి భారత్‌ను జగజ్జేతగా నిలిపిన కోహ్లి, మచ్చటగా మూడోసారి భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, ఇప్పటికే మూడు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన విరాట్ కోహ్లిను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. 2023 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలిస్తే, రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా విరాట్ చరిత్రపుటల్లోకెక్కుతాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు ఇది సాధ్యపడలేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతన్న ఆసియా కప్‌లో విరాట్ కోహ్లి ఫామ్ అంతంత మాత్రంగా ఉంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పేలవ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మరి మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతను ఫామ్‌ను దొరకబుచ్చుకుంటే ప్రపంచకప్‌లో టీమిండియా విజయావకాశాలు బాగా మెరుగుపడతాయి. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో టీమిండియా ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా ఉంది. అదే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియాను ఆపడం కష్టమే. -
కత్తి మీద సాములా సాగిన కపిల్ దేవ్ జమానా.. వరల్డ్‌కప్ విజయం మినహా..!
భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్‌కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది. ఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్‌తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్‌ను విజయవంతంగా సాగించాడు. అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్‌కు కెప్టెన్‌గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్‌తో విభేదాల కారణంగా వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు. వరల్డ్‌కప్‌కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగాడు. కెప్టెన్‌గా తన టర్మ్‌లో కపిల్ వరల్డ్‌కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్‌కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్‌కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో 1987 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది. ఆ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటున సిక్సర్‌ను ఫోర్‌గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్‌తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్‌కు వరల్డ్‌కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్‌గా కపిల్‌కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. -
ODI World Cup 2023: ఆ పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే పట్టణాల్లో హోటల్ సేవలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో ఆన్లైన్ ట్రావెల్, హోటల్ బుకింగ్ సేవలు అందించే సంస్థలు డిమాండ్‌ను చేరుకునే వ్యూహాలపై దృష్టి సారించాయి. హోటల్ బుకింగ్ సేవల సంస్థ ఓయో ఈ పట్టణాల్లో 500 హోటళ్లను అదనంగా తన నెట్వర్క్ కిందకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల్లో మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే వీక్షకుల నుంచి హోటల్ బుకింగ్‌కు డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో, వచ్చే మూడు నెలల్లో కొత్త హోటళ్లను చేర్చుకోనున్నట్టు తెలిపింది. కొత్త హోటళ్లు స్టేడియంలకు దగ్గర్లో ఉండేలా చూస్తామని, దాంతో క్రికెట్ అభిమానులు స్టేడియంలు చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఓయో అధికార ప్రతినిధి ప్రకటించారు. సుదూర ప్రాంతాల నుంచి తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు వచ్చే వారికి సౌకర్యవంతమైన, అందుబాటు ధరలకు ఆతిథ్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ పోటీలు మొదలు కానున్నాయి. దీనికి మూడు నెలల ముందుగానే ఆతిథ్య పట్టణాల్లో హోటళ్ల టారిఫ్‌లు (రూమ్ చార్జీలు) అధిక డిమాండ్ కారణంగా పెరిగినట్టు ఓయో తెలిపింది. నవంబర్ 19తో వన్డే ప్రపంచకప్ ఛాంపియన్íÙప్ ముగుస్తుంది. హైదరాబాద్, అహ్మ దాబాద్, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, లక్నో, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పుణెలో మ్యాచ్‌లు జరగనున్నా యి ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మేక్ మైట్రిప్ ఆఫర్.. ఆన్లైన్ ట్రావెల్ సేవలు అందించే మేక్ మై ట్రిప్ కూడా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆతిథ్య పట్టణ వాసులు తమ ప్రాపరీ్టలను తన ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవాలని కోరింది. అహ్మదాబాద్, ధర్మశాల, కీలక మెట్రోల్లో గృహ ఆతిథ్యాలకు డిమాండ్ పెరిగినట్టు ఈ సంస్థ ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో గృహ ఆతిథ్యానికి డిమాండ్ గణనీయంగా పెరగడాన్ని గుర్తించా. క్రికెట్ అభిమానులు ఇంతకుముందు లేనంతగా గృహ ఆతిథ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడం మంచి సంకేతం’’అని మేక్‌మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరీక్షిత్ చౌదరి తెలిపారు. క్రికెట్ స్టేడియం నుంచి వసతి ఎంత దూరంలో ఉందో చూపించే సదుపాయాన్ని తన ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసినట్టు చెప్పారు. అభిమానులకు అనుకూలమైన వసతిని బుక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే పట్టణాల్లో అందుబాటు ధరలకే గృహవసతి అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. -
WC: టీమిండియా లక్ వల్ల గెలిచింది! అంతేకానీ ఒక్కరూ: విండీస్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
World Cup, 1983 India vs West Indies, Final: ‘‘మేమప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాం. కానీ ఒక్క మ్యాచ్ వల్ల అంతా నాశనమైంది. నిజానికి 1983లో అదృష్టం ఇండియా వైపు ఉంది. ఆ సమయంలో మా జట్టు గొప్పగానే ఉన్నప్పటికీ ఎందుకో ఓటమి పాలయ్యాం. ఫైనల్ తర్వాత బహుశా ఐదారు నెలల వ్యవధిలో మేము టీమిండియాను 6-0 తేడాతో చిత్తు చేశాం. కాబట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఆ ఒక్క మ్యాచ్ టీమిండియా కేవలం అదృష్టం వల్లే గెలిచిందని చెప్పవచ్చు. ఆనాడు మేము 183 పరుగులకు అవుట్ చేసిన తర్వాత మా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. అందుకే మ్యాచ్ ఓడిపోయాం. ఇదేదో అతి విశ్వాసమో, అతి జాగ్రత్త వల్లో జరిగింది కాదు’’ అంటూ వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కేవలం లక్ వల్లే గెలిచింది లక్ వల్లే టీమిండియా గెలిచిందన్నట్లు వ్యాఖ్యలు చేసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. ఆ మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్, బౌలర్ కూడా తనను ఇంప్రెస్ చేయలేకపోయారన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో రాబర్డ్స్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం ఫిఫ్టీ సాధించలేకపోయారు. ఇక బౌలర్లు.. ఒక్కరు కూడా కనీసం 4 లేదంటే 5 వికెట్లు తీయలేకపోయారు. ఏ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్లు వికెట్లు కూలుస్తూనే ఉండాలి. కానీ టీమిండియా నుంచి ఏ ఒక్కరు అలా చేయలేకపోయారు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వివియన్ రిచర్డ్స్ అవుట్ కావడం(మదన్‌లాల్ బౌలింగ్‌లో) మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తాము ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. 1975, 1979 ఫైనల్స్.. 1983 ఫైనల్‌కి తేడా ఒక్కటే.. ఆ రెండు దఫాలు మేము తొలుత బ్యాటింగ్ చేశాం. 83లో ఛేజింగ్ చేశాం’’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మొహిందర్ అమర్నాథ్ 26, సందీప్ పాటిల్ 27 పరుగులు చేశారు. మిగతా వాళ్లెవరూ 20 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు. రాబర్ట్స్కు అత్యధికంగా ఈ క్రమంలో 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి కపిల్‌దేవ్ సేన ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే చాపచుట్టేయడంతో 43 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. కాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజంగా పేరొందిన ఆండీ రాబర్ట్స్ 1975, 1979లో ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు. ఇప్పుడు ఇదంతా దేనికి? ఇదిలా ఉంటే.. ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అవును మరి.. ఒక్క మ్యాచ్‌తోనే ఫలితాలు తారుమారవుతాయి.ఘే జట్టు విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ బృందం విజేతగా నిలిచి టీమిండియా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి చెత్త మాటలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. విండీస్ కనీసం వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల ఇవాళే
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్ 27) ప్రకటించనుంది. ఉదయం 11:30 గంటలకు ముంబైలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ కార్యవర్గ సభ్యులు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య వరల్డ్‌కప్ వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐతో పలు చర్చల అనంతరం పీసీబీ ఈ విషయంలో అంగీకారం తెలిపినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు పాక్ ఒప్పుకుందని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్లతో బెంగళూరు, చెన్నైలలో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ అంగీకారం తెలిపిందని సమాచారం. ఇదిలా ఉంటే, వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ (అక్టోబర్ 5), ఫైనల్ మ్యాచ్‌లకు (నవంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా ఖరారైందని తెలుస్తోంది. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టవచ్చని సమాచారం. చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న జరగవచ్చు. -
ఘన కీర్తి కలిగిన వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. వరల్డ్‌కప్ అవకాశాలు గల్లంతు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో విండీస్ ఖాళీ ఖాతాతో సూపర్ సిక్స్‌కు అడుగుపెట్టనుంది. తద్వారా ఫైనల్‌కు చేరే ఛాన్స్‌తో పాటు వరల్డ్‌కప్ అవకాశాలను ఆవిరి చేసుకుంది. సూపర్ సిక్స్‌కు పాయింట్లు ఎలా..? సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్టు తమతో పాటు ఆ దశకు చేరుకున్న మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే, మ్యాచ్‌కు రెండు పాయింట్ల చొప్పున 4 పాయింట్లు.. ఒక జట్టుపై గెలిచి మరో జట్టు చేతిలో ఓడితే 2 పాయింట్లు.. రెండు జట్ల చేతిలో ఓడితే పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశలో అడుగుపెడతుంది. జింబాబ్వే 4, నెదర్లాండ్స్ 2, వెస్టిండీస్ 0 గ్రూప్-ఏ నుంచి సూపర్ సిక్స్‌కు చేరుకున్న మూడు జట్లలో ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు,నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు, వెస్టిండీస్ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించడంతో జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. జింబాబ్వే చేతిలో ఓడి, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో వెస్టిండీస్ పాయింట్లు ఏమీ లేకుండానే సూపర్ సిక్స్ దశలో పోటీపడుతుంది. గ్రూప్-బి నుంచి ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది..? గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. అయితే శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య ఇవాళ (జూన్ 27) జరుగబోయే మ్యాచ్‌తో ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుందో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే 4 పాయింట్లు, స్కాట్లాండ్ గెలిస్తే 2 పాయింట్లు.. శ్రీలంక, స్కాట్లాండ్ చేతుల్లో ఓడింది కాబట్టి ఒమన్ 0 పాయింట్లతో తదుపరి దశలో పోటీపడతాయి. సూపర్ సిక్స్ దశలో ఎలా..? గ్రూప్ దశలో సాధించిన అదనపు పాయింట్లతో (4 లేదా 2 లేదా 0) ప్రతి జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఓ గ్రూప్‌లోని ఓ జట్టు మరో గ్రూప్‌లోని 3 జట్లతో ఒక్కో మ్యాచ్ అడుతుంది. అన్ని జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అలాగే ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు కలిగిన వెస్టిండీస్ జట్టు.. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా ఆవిరి చేసుకుంది. పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశకు చేరిన ఆ జట్టు.. ఈ దశలో ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 6 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే 4 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఏదో ఒక జట్లు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుంది. గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ ఇదివరకు 2 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఓ జట్టు 2 పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌లో పోటీపడుతుంది. 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇది కాదని విండీస్ సూపర్ సిక్స్ దశలో క్వాలిఫయర్స్‌లో తమకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన శ్రీలంక, స్కాట్లాండ్లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా సంచలనం నమోదైతే తప్ప విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. -
వరల్డ్‌కప్ కోసం తొందరపడ్డారో అతను మరో నాలుగు నెలలు ఇంటి దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది..!
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వన్డే వరల్డ్‌కప్ సమయానికంతా సిద్ధంగా ఉంచాలన్న విషయంలో బీసీసీఐ ప్రణాళిలను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఐర్లాండ్ సిరీస్ కోసమని తొందరపడి బుమ్రాను టీమిండియాకు ఎంపిక చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. వరల్డ్‌కప్ జరుగనున్న ఏడాదిలో బుమ్రాను హడావుడిగా జాతీయ జట్టులోకి తీసుకురావడం మానుకోవాలని సూచించాడు. ప్రిపరేషన్లో భాగమని బుమ్రాను ఐర్లాండ్ సిరీస్ బరిలోకి దించితే.. అతను మరో నాలుగు నెలల పాటు ఇంటి దగ్గరే కూర్చోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమయంలో బుమ్రా మరోసారి గాయం బారిన పడితే టీమిండియాకు తీవ్రనష్టం జరుగుతుందని, అందుకే బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలని అన్నాడు. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది విషయంలో పీసీబీ సైతం ఇలాగే తొందరపడిందని, దాని కారణంగా అతను చాలాకాలం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండటాన్ని మనం చూశామని చెప్పుకొచ్చాడు. పేసర్ల విషయంలో మేనేజ్మెంట్ ఆచితూచి అడుగులు వేస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో నిర్ణయాలు మిస్ ఫైర్ అయితే అవి జట్టును దారుణంగా దెబ్బకొడతాయని తెలిపాడు. కాగా, వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా ఆగస్టులో ఐర్లాండ్‌తో జరుగనున్న సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి పై పేర్కొన్న కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, జాతీయ సెలెక్టర్లు కొద్దిరోజుల కిందటే వెస్టిండీస్ పర్యటన నిమిత్తమం టీమిండియాను ప్రకటించారు. విండీస్ పర్యటనలో టెస్ట్, వన్డేల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేశారు. జులై 12 నుంచి ప్రారంభంకానున్న విండీస్ టూర్లో తొలుత టెస్ట్‌లు, అనంతరం వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. -
కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు.. యశస్వి, తిలక్ వర్మ..!
ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఎలా ఉండాలనే దానిపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాప్-6లో కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూడాలనుకుంటున్నానని అన్నాడు. టీమిండియాలో సీనియర్లను (రైట్ హ్యాండ్) రీప్లేస్ చేసేంత లెఫ్ట్ హ్యాండ్ టాలెంట్ మన వద్ద ఉందని, ఇప్పటి నుంచే వారిలో కొందరిని సాన పెడితే ప్రపంచకప్ సమయానికంతా మెరికల్లా తయారవుతారని తెలిపాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో జట్టు సమతూకంగా మారుతుందని, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఈ ఈక్వేషన్ ఫాలో అవ్వకపోతే టీమిండియాకు చాలా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లే కానక్కర్లేదు.. వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో కనీసం ఇద్దరు లెఫ్ట్ బ్యాటర్లను చూడాలనుకుంటానన్న రవిశాస్త్రి.. ఆ ఇద్దరూ ఓపెనర్లే కానక్కర్లేదని తెలిపాడు. టాప్-4లో ఒకరు, టాప్-6లో ఇద్దరు అయితే జట్టు సమతూకంగా మారి, ప్రత్యర్ధి బౌలర్లకు ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డాడు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్.. యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లని.. ఐపీఎల్లో వారిదివరకే ప్రూవ్ చేసుకున్నారని, వీరికి సీనియర్ల స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వీరే కాక నేహల్ వధేరా, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు కూడా లైన్లో ఉన్నారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీరిని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తే టీమిండియా బెంచ్ స్ట్రెంగ్త్ పటిష్టంగా ఉంటుందని అన్నాడు. -
వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు..!
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ ప్రకటనను ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల (జూన్) 27న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఐసీసీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఇంత వరకు ఆమోదం తెలుపలేదు. షెడ్యూల్‌కు ఆమోదం తెలపాల్సింది తమ ప్రభుత్వమని పీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా దిగిపోయే ముందు నజమ్ సేథి ప్రకటన చేశాడు. భద్రత కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయంలోనే బీసీసీఐ-పీసీబీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు పీసీబీ కాబోయే ఛైర్మన్ జకా అష్రాఫ్ ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని, దీనికి తాను వ్యతిరేకమంటూ బాంబు పేల్చాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాక అయినా పీసీబీ దానికి అమోదం తెలుపుతుందా లేక ఏవైనా కారణాలు సాకుగా చూపించి అడ్డుపుల్ల వేస్తుందా అన్న విషయం తేలాంటే ఒకటి రెండ్రోజుల వరకు వేచి చూడాల్సిందే. -
వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
2019 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి సెలెక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్దలు ఉండేవని, అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయనని, నన్ను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, నాటి జాతీయ సెలెక్టర్లైన ఎంఎస్కే ప్రసాద్ (చీఫ్ సెలెక్టర్), దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ పరంజపేలు.. అప్పటి ఐపీఎల్ సీజన్లో టాప్ ఫామ్‌లో ఉండిన రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌కప్‌లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన రాయుడు.. ఉన్నపలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియా అవకాశాలు దక్కలేదు. ఇదిలా ఉంటే, అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలికేశాడు. సీఎస్కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలిశాడు. రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసమే ఏపీ సీఎం చుట్టూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. -
అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం కోసం ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఉంటే ఐర్లాండ్ నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించేది. కానీ దురదృష్టవశాత్తూ తొలి వన్డే రద్దుకావడంతో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసివచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీకు నేరుగా క్వాలిఫై అయిన ఎనిమిదవ జట్టుగా ప్రోటీస్ నిలిచింది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడతాయి. ఈ క్వాలిఫియర్ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. చదవండి: #ManishPandey: 'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!' -
ప్రపంచకప్‌కు విలియమ్సన్ దూరం! న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొకాలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2023లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో వెంటనే స్వదేశానికి వెళ్లిన కేన్‌మామ మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకోన్నాడు. ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక వేళ ప్రపంచకప్ సమయానికి విలియమ్సన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే.. కివీస్ జట్టను టిమ్ సౌథీ లేదా టామ్ లాథమ్ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. "కేన్ గాయం తీవ్రత గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తెలుస్తోంది. అతడు దాదాపుగా వరల్డ్‌కప్‌కు దూరమమ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ కేన్ అందుబాటులో లేకపోతే ఎవరని సారధిగా నియమించాలని అన్న ఆలోచనలో ఉన్నాం. సౌధీ ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ టామ్ లాథమ్‌కు వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉంది. టామ్ పాకిస్తాన్ పర్యటనలో కూడా జట్టును అద్బుతంగా నడిపించాడు. అయితే జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో వన్డే సిరీస్‌ను కోల్పోయాం. కానీ పరిమత ఓవర్ల కెప్టెన్‌గా లాథమ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే న్యూజిలాండ్ క్రికెట్ టామ్ వైపే మొగ్గు చూపవచ్చు అని విలేకురల సమావేశంలో గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
వన్డే ప్రపంచకప్‌కు పంత్ దూరం.. వికెట్ కీపర్‌గా వారిద్దరిలో ఒకరేనా..!
గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లమెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ హెల్త్‌పై తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరో 9 నెలల సమయం (2024 జనవరి) పట్టొచ్చని తెలుస్తోంది. ఆ సమయానికైనా పంత్ కోలుకున్నాడంటే అది చాలా వేగవంతమైన రికవరీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్యలో అతను సెప్టెంబర్ నెలలో జరిగే ఆసియా కప్, అక్టోబర్, నవంబర్లలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్రల సాయంతో నడుస్తున్న పంత్.. ఏ సహాయం లేకుండా నడవాలంటేనే మరికొన్ని వారాలు పట్టొచ్చని తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో పంత్‌కు ఆల్టర్నేట్ ఎవరు..? వన్డే ప్రపంచకప్‌కు పంత్ అందుబాటులో ఉండడని దాదాపుగా తేలిపోయింది. మరి అతని ఆల్టర్నేట్ ఎవరన్నదే టీమిండియా అభిమానులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. సెలెక్టర్ల పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నప్పటికీ, ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రాక్ రికార్డు, వరల్డ్‌కప్ సమయానికి ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే ఈ ఎంపిక జరుగుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో (2023) వివిధ జట్ల వికెట్కీపర్ల ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌కు ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నారు. ఆతర్వాత కేఎల్ రాహుల్, శ్రీకర్ భరత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే వినియోగించుకోవాలని సెలెక్టర్లు భావిస్తే, ఈ జాబితా నుంచి అతని పేరు తొలగిపోవచ్చు. కొత్తగా రేసులోకి జితేశ్ శర్మ (పంజాబ్), ప్రభ్‌సిమ్రన్ (పంజాబ్), అభిషేక్ పోరెల్ (ఢిల్లీ), ఎన్ జగదీశన్ (కేకేఆర్) పేర్లు వచ్చాయి. గుజరాత్ ఓపెనర్, వెటరన్ ప్లేయర్ సాహా అవకాశాలను కూడా తీసిపాడేయటానికి వీలు లేదు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వన్డే వరల్డ్‌కప్‌కు సాహా అయితేనే బెటర్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో దినేశ్ కార్తీక్ పూర్తిగా తేలిపోయాడు కాబట్టి, అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. వీరే కాక యువ వికెట్కీపర్లు సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ), ఉపేంద్ర యాదవ్ (సన్‌రైజర్స్), ధృవ్ జురెల్ (రాజస్థాన్), ఆనూజ్ రావత్ (ఆర్సీబీ), విష్షు వినోద్ (ముంబై) ఐపీఎల్లో తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. మరి ఫైనల్‌గా సెలెక్టర్లు ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి. -
న్యూజిలాండ్ క్రికెట్‌కు అతి భారీ షాక్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు దూరంకానున్నాడని సమాచారం. ఇటీవల చెన్నైసూపర్‌కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్-2023 మ్యాచ్ సందర్భంగా గాయపడిన కేన్ మామ, మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తోంది. విలియమ్సన్ కుడి మోకాలి భాగం ఛిద్రం అయినట్లు స్కాన్లలో వెల్లడికావడంతో సర్జరీ తప్పదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స ప్రక్రియ మొత్తం పూర్తై, కోలుకునేందుకు కనీసం 6 నెలల సమయం పట్టనుండటంతో విలియమ్సన్ వరల్డ్‌కప్ ఆడటం దాదాపుగా అసంభవమని తెలుస్తోంది. గత వరల్డ్‌కప్‌లో (2019) ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి, తన జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన విలియమ్సన్ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉండకపోతే, అది న్యూజిలాండ్ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Photo Credit: IPL Twitter కాగా, ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్.. అహ్మదాబాద్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపబోయి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతను ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. విలియమ్సన్ సరిగ్గా నిలబడలేక, ఊత కర్రలు, ఇతరులు సాయంతో నడుస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. -
వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు
ICC Qualifier Play Off USA VS Jersey: వన్డే క్రికెట్లో ఏడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా జెర్సీతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ బౌలర్ అలీ ఖాన్ 9.4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇవి ఏడో అత్యుత్తమ గణాంకాలుగా రికార్డయ్యాయి. Fresh from collecting the seventh best ODI figures of all time, this dynamic fast bowler now looms as the key player for USA as they try and book a place at this year's @cricketworldcup 💪https://t.co/pK9kLjJ5L4 — ICC (@ICC) April 5, 2023 ఈ జాబితాలో శ్రీలంక పేస్ దిగ్గజం చమింద వాస్ (8/19) అగ్రస్థానంలో ఉండగా.. షాహిద్ అఫ్రిది (7/12), గ్లెన్ మెక్‌గ్రాత్ (7/15), రషీద్ ఖాన్ (7/18), ఆండీ బిచెల్ (7/20), ముత్తయ్య మురళీథరన్ (7/30) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత అలీ ఖాన్ (7/32) ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. దిగ్గజ బౌలర్ల సరసన చేరే క్రమంలో అలీ ఖాన్.. టిమ్ సౌథీ (7/33), ట్రెంట్ బౌల్డ్ (7/34), వకార్ యూనిస్ (7/36) లాంటి స్టార్ పేసర్లను అధిగమించాడు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన 32 ఏళ్ల అలీ ఖాన్.. పాక్‌లో పుట్టి, యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక జెర్సీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో అత్యంత కీలమైన ఈ మ్యాచ్‌లో అలీ ఖాన్ విజృంభించడంతో యూఎస్ఏ 25 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేస్‌లో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ టేలర్ (79) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (41) ఓ మోస్తరుగా రాణించాడు. జెర్సీ బౌలర్లలో బెంజమిన్ వార్డ్ 4, ఎలియట్ మైల్స్, జూలియస్ సుమేరౌర్ తలో 2, చార్లెస్ పెర్చార్డ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏ.. అలీ ఖాన్ (7/32) వీరలెవెల్లో విజృంభించడంతో జెర్సీ 47.4 ఓవర్లలో 206 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. అలీ ఖాన్‌తో పాటు జస్దీప్ సింగ్ (1/43), నిసర్గ్ పటేల్ (2/42) బంతితో రాణించగా.. జెర్సీ ఇన్నింగ్స్‌లో అసా ట్రైబ్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఎస్ఏ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసులో అగ్రస్థానంలో నిలువగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న నమీబియా, యూఏఈ జట్లు కూడా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు దాదాపుగా అర్హత సాధించాయి. కెనడా, జెర్సీ, పపువా న్యూ గినియా జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసు నుంచి టెక్నికల్‌గా నిష్క్రమించాయి. ఈ పోటీల్లో ఇవాళ (ఏప్రిల్ 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, క్వాలిఫయర్ బెర్తులు ఖరారు కావడంతో అవి నామమాత్రంగానే జరుగనున్నాయి. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్‌కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్‌తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్‌లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్‌రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. నటరాజన్‌కు అవకాశం ఇవ్వాలి: పాక్ మాజీ క్రికెటర్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా భారత్ అంతగా రాణించలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో ఓటమిపాలైన రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవాలంటే మెరుగైన బౌలింగ్ యూనిట్ అవరమని కనేరియా అభిప్రాయపడ్డాడు. కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం టీమిండియా చెత్త బౌలింగ్ లైనప్ కలిగి ఉంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన బౌలర్లు అవసరం. ప్రస్తుత బౌలర్లతో భారత్ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్,టి నటరాజన్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇక భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్భుతంగా ఆడుతారని అందరూ అంటుంటారు. వారు నెట్స్‌లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌లను ఎదుర్కొంటారు. వారి కొంచెం వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బంతి పెద్దగా టర్న్ కాదు. అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు బంతిని అద్భుతంగా టర్న్ చేశారు. కాబట్టి భారత బ్యాటర్లు స్పిన్‌కు వికెట్లు సమర్పించుకున్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
ఇదేమి సెలబ్రేషన్‌రా నాయనా... ఇప్పటివరకు చూసి ఉండరు! వీడియో వైరల్!
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్ ఆశలను నేపాల్ జట్టు సజీవంగా నిలుపుకుంది. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా యూఏఈతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. నేపాల్ బ్యాటర్లలో భీమ్ షార్కి(70), ఆరిఫ్ షేక్(43) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జూనైడ్ సిద్దూఖి మూడు వికెట్లు, ముస్తఫా, లాక్రా తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 45 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లో ఆసిఫ్ ఖాన్(82), ఆర్యన్ లాక్రా(50) పరుగులతో రాణించనప్పటికీ.. ఓటమి మాత్రం యూఏఈ వెంట నిలిచింది. ఇక నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, కామి తలా మూడు వికెట్లతో యుఏఈ పతనాన్ని శాసించారు. దీపేంద్ర సింగ్ స్పెషల్ సెలబ్రేషన్స్... నేపాల్ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ దీపేంద్ర సింగ్ కీలక పాత్ర పోషించాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన దీపేంద్ర సింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఓ స్పెషల్ సెలబ్రేషన్స్‌తో అందరని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన దీపేంద్ర.. అద్భుతంగా ఆడుతున్న ఆసిఫ్ ఖాన్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో నేపాల్ జట్టు సంబురాల్లో మునిగి తేలిపోయింది. దీపేంద్ర సింగ్ అయితే గ్రౌండ్లో పై ఫ్లిప్స్ (గెంతులు) వేసి వికెట్ సెల్‌బ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
అగ్రస్థానానికి ఎగబాకిన ఇంగ్లండ్
ICC Cricket World Cup Super League Points Table: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అగ్రస్థానానికి ఎగబాకింది. శుక్రవారం (మార్చి 3) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలుండగానే 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఇంగ్లండ్.. 20 పాయింట్లు ఖాతాలో వేసుకుని మొత్తంగా 155 పాయింట్లు (23 మ్యాచ్‌లు) సాధించింది. ఇంగ్లండ్ భారీగా పాయింట్లు సాధించడంతో అగ్రస్థానంలో ఉండిన న్యూజిలాండ్.. 150 పాయింట్లకు (21 మ్యాచ్‌ల్లో) పరిమితమై రెండో స్థానానికి దిగజారింది. 21 మ్యాచ్‌ల్లో 139 పాయింట్లు కలిగిన టీమిండియా మూడో స్థానంలో, 21 మ్యాచ్‌ల్లో 130 పాయింట్లు సాధించిన పాకిస్తాన్ నాలుగులో, 18 మ్యాచ్‌ల్లో 120 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఐదో స్థానంలో, ఆతర్వాత బంగ్లాదేశ్ (20 మ్యాచ్‌ల్లో 120), ఆఫ్ఘనిస్తాన్ (15 మ్యాచ్‌ల్లో 115), వెస్టిండీస్ (24 మ్యాచ్‌ల్లో 88), సౌతాఫ్రికా (19 మ్యాచ్‌ల్లో 78), శ్రీలంక (21 మ్యాచ్‌ల్లో 77), ఐర్లాండ్ (21 మ్యాచ్‌ల్లో 68), జింబాబ్వే (21 మ్యాచ్‌ల్లో 45), నెదర్లాండ్స్ (19 మ్యాచ్‌ల్లో 25) వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా, ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే బెర్తులు ఖరారవుతాయి. 2023 వన్డే ప్రపంచకప్‌కు ఆతిధ్యమిస్తున్న కోటాలో భారత్ నేరుగా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాగా.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్‌లో అదరగొడతాడు'
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తాడని కార్తీక్ కొనియాడు. కాగా గత కొంత కాలంగా సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ హైదారాబాదీ ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచ నెం1 బౌలర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నడు. మొదటి టెస్టులో మహమ్మద్ సిరాజ్ తన స్పెల్‌తో ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. ఇక రెండో టెస్టులో స్పిన్నర్లు చెలరేగడంతో సిరాజ్‌కు బౌలింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో కార్తీక్ క్రిక్‌బజ్ షో రైజ్ ఆఫ్ న్యూ ఇండియాలో మాట్లాడుతూ.. "సిరాజ్ వన్డే ప్రపంచకప్ భారత జట్టులో ఖచ్చితంగా భాగమవుతాడు. అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మెగా ఈవెంట్లో అదరగొడతాడని భావిస్తున్నాను. అయితే గతేడాది ఐపీఎల్ సీజన్ అతడికి చాలా విషయాలు నేర్పించింది. వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నాడు. అదే విధంగా అతడు పూర్తి ఫిట్నెస్తో తన కెరీర్‌ను కొనసాగిస్తే.. కనీసం 300 టెస్టు వికెట్లు అయినా సాధిస్తాడు" అని కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం! -
రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్
Rishabh Pant Likely To Miss ODI WC 2023: కారు ప్రమాదానికి గురైన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ సాధారణ స్థితికి రావడానికే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాతే ఫిట్నెస్, ఆట గురించి ఆలోచించగలిగేది! ఈ నేపథ్యంలో పంత్ స్వదేశంలో అక్టోబర్–నవంబర్లలో జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీతోపాటు 2023 మొత్తం సీజన్‌కు దూరమయ్యే చాన్స్ ఉంది. పంత్ కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు బాగా దెబ్బ తినగా...రెండింటిని శస్త్ర చికిత్సతో చక్కదిద్దారు. మరో ఆరు వారాల్లో పంత్‌కు మరో కీలక సర్జరీ జరుగనున్నట్లు బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. -
'జడేజా, చాహల్‌కు నో ఛాన్స్.. వరల్డ్ కప్‌కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్'
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్.. 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున బరిలోకి దిగే నలుగురు స్పిన్నర్లరను ఎంచుకున్నాడు. కాగా ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గంభీర్ స్టార్ స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌లో మణికట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు కచ్చితంగా చోటు ఇవ్వాలి. అక్షర్ గత కొన్ని సిరీస్‌ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండాలి. ఇక కుల్దీప్ యాదవ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారత్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేయగలడు. కాబట్టి కుల్దీప్ కూడా ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇక ఆఖరిగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రవి ప్రస్తుతం భారత్ సన్నాహాకాల్లో లేనప్పటికీ.. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్‌కు గంభీర్ ఎంపిక చేయకపోవడం గమానార్హం. చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
వన్డే ప్రపంచకప్‌ను గెలవడమే మా లక్ష్యం: హార్ధిక్ పాండ్యా
2023 ఏడాదిలో టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా జనవరి 3న శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడమే ఈ ఏడాది భారత జట్టు లక్ష్యమని హార్దిక్ తెలిపాడు. హార్దిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌ను గెలవడమే ఈ ఏడాది మా జట్టు అతి పెద్ద రిజల్యూషన్. నిజంగా ప్రపంచ కప్‌ను గెలవాలనుకుంటున్నాము. అందుకోసం అన్ని విధాల మేము సన్నద్దం అవుతాము. ప్రస్తుతం మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కాబట్టి ఈ ఏడాది ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూడా మేము మా శక్తికి మించి ప్రయత్నించాం. కానీ మేము మా లక్ష్యాన్ని నేరవేర్చుకోలేకపోయాం. దురదృష్టవశాత్తు సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో కూడా 100% శాతం ఎఫక్ట్ పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. అంతకంటే ముందు శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లపై మేము దృష్టి సారించాల్సి ఉంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పంత్ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం.. -
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం
ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్నెస్ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్‌కప్‌తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్‌లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ► కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు. ► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్‌ల నేపథ్యంలో జట్టు సెలక్షన్ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి. ► ఎమర్జింగ్ ప్లేయర్లు ఐపీఎల్‌తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ► ప్రపంచకప్‌కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్నెస్తో మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్ భారం, ఒత్తిడి, మెంటల్ కండిషనింగ్, ఫిట్నెస్ అంశాల్ని ఇందులో చర్చించారు. ► మంచి ఆల్‌రౌండర్ అవుతాడనుకున్న దీపక్ చహర్, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ► అవసరమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ టోర్నీ సమయంలో తమ స్టార్ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు. ► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు. ► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ కీలక మీటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. 20 మందితో ప్రపంచకప్ సైన్యం... సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఈ ఏడాదైనా భారత్‌కు కలిసోచ్చేనా? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే?
భారత జట్టుకు 2022 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. గతేడాది జరిగిన ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశ పరిచింది. ఇక 2023 కొత్త సంసంవత్సరంలో క్రికెట్ ప్రపంచంలో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్దమైంది. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో ఈ ఏడాదిని టీమిండియా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో భారత జట్టు పూర్తి షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం. శ్రీలంకతో మొదలు.. టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ల జరగనుంది. జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న మొదటి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టీ20 జనవరి 5న పుణేలో, మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. అదే విధంగా వన్డే సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో పోరు శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్ ముగిసిన అనంతరం సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 21, 24 తేదీల్లో రాయ్‌పూర్, ఇండోర్లలో మిగతా రెండు వన్డేలు జరుగుతాయి. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా జనవరి 27, 29, ఫిబ్రవరి 1న రాంచీ, లక్నో, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లక్ష్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు స్వదేశంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపనుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సైకిల్లో టీమిండియాకు ఇదే ఆఖరి సిరీస్. భారత్ ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఖారారు చేసుకుంటుంది. ఇక టెస్టు సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9-13 వరకు నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్ ఢిల్లీలో, మార్చి 1-5 వరకు ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఇక టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఆసీస్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, విశాఖపట్నం, చెన్నై వేదికలగా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్‌లో జరగనుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే ఖచ్చితంగా ఫైనల్లో అడుగు పెడుతోంది. విండీస్ పర్యటనకు.. జూలై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఆసియా కప్ 2023.. 2023 ఆసియా కప్ సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్లే. ఒకవేళ తటస్థ వేదికపై ఆసియా కప్‌ను నిర్వహిస్తేనే భారత జట్టు ఆడుతోంది అని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. స్వదేశంలో మళ్లీ ఆసీస్‌తో.. వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్‌లో భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇంకా షెడ్యూల్ ఖారారు కాలేదు. సొంత గడ్డపై ప్రపంచకప్.. ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. తొలి సారిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు పూర్తి స్థాయిలో భారత్ అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 1987, 1996, 2011లలోనూ భారత్ అతిథ్యం ఇచ్చినప్పటకీ.. పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలతో సంయుక్తంగా నిర్వహించింది. ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు మరోసారి భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా కంగారూలు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ నవంబర్ ఆఖరిలో జరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనతో ముగింపు ఏడాది చివర్లో భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. -
'ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పడు మా దృష్టి అంతా దాని పైనే'
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ గురించి ఇప్పుడు నుంచి ఆలోచించడం తొందరపాటే అవుతుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోహిత్ ఈ వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మా దృష్టి అంతా బంగ్లా సిరీస్‌పైనే ఉంది అని రోహిత్ తెలిపాడు. "మేము ఆడే ప్రతి సిరీస్ వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగానే జరగుతుంది. కానీ ప్రపంచకప్‌కు ఇంకా 8-9 నెలల సమయం ఉంది. ఇప్పటికైతే అంత దూరం ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఒక జట్టుగా సమిష్టింగా ఎలా రాణించాలన్న విషయంపై దృష్టి సారిస్తాం. మేమ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాలి. ఇలాంటి కాంబినేషన్, అలాంటి కాంబినేషన్ అని ఇప్పుడే నిర్ణయించుకోం. మేము ప్రస్తుతం ఏమి చేయాలనుకుంటున్నాము అనే దాని గురించి నేను, కోచ్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నాము. ప్రపంచ కప్‌కు సమయం దగ్గరపడినప్పుడు అందుకు తగ్గట్టు ప్రాణాళికలు రచించేందుకు సిద్దంగా ఉన్నాము. వరల్డ్‌కప్ వరకు మేము అన్ని మ్యాచ్‌ల్లో అత్యుత్తమంగా రాణించాలి అనుకుంటున్నాము. బంగ్లాతో వన్డే సిరీస్ గెలవడమే మా ప్రస్తుత లక్ష్యం" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN 1st ODI: తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్ ఎంట్రీ -
ధవన్ లాగే రోహిత్‌నూ వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తారా..?
గడిచిన 9 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోడం అభిమానులు, ఆటగాళ్లను ఎంత బాధిస్తుందో బీసీసీఐని కూడా అంతే ఆవేదనకు గురి చేస్తుంది. ఈ విషయంలో భారత్ ఓ మోస్తరు జట్ల కంటే హీనంగా ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ చిన్నతనంగా భావిస్తుంది. వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు గెలవడంతో మెగా ఈవెంట్ల సందర్భంగా భారత అభిమానులు తలెత్తుకోలేకపోతున్నారు. భారత్ చివరి సారిగా 2013 ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. నాడు ధోని సారధ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022 వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. అతి త్వరలో టీ20 జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి.. వన్డేలు, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించి వన్డే, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ ధవన్‌ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో, రోహిత్‌ను కూడా మున్ముందు వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రోహిత్.. టీ20ల్లో, టెస్ట్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం, వయసు మీదపడటం, ఫిట్నెస్ కారణంగా చూపి కెప్టెన్‌పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. రోహిత్‌ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఈ ఫార్మాట్‌పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్‌కప్‌ను సాధించి పెట్టగలడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ ప్లాన్లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోత పడటంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమతం కావడం ఖాయమని తెలుస్తోంది. -
టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..!
ODI World Cup 2023: టీమిండియాపై తరుచూ అవాక్కులు చవాక్కులు పేలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022లో తన జట్టు విజేతగా నిలవడంతో కళ్లు నెత్తికి ఎక్కి, భారత జట్టుపై తన నోటి దూలను మరోసారి ప్రదర్శించాడు. సందర్భంతో పని లేకుండా తరుచూ టీమిండియాపై, జట్టులోకి ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో గెలుపు మదంతో కొట్టుకుంటూ టీమిండియాను అవమానకర రితీలో చులకన చేసి మాట్లాడాడు. భారత్ వేదికగా వచ్చే ఏడాది (2023) జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్టు ఏదనే అంశంపై ఇంగ్లీష్ దినపత్రిక టెలిగ్రాఫ్‌కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో టీమిండియాను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఫేవరెట్ జట్టు మాత్రం కాలేదని, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కే ఆ ట్యాగ్ తగిలించుకునే అర్హత ఉందని గొప్పలు పోయాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియాకు ఫేవరెట్ అనిపించుకునే అర్హత లేదని, ఇదంతా నాన్సెన్స్ అని అవమానకర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెట్ అంటే అస్సలు ఒప్పుకోనని, వరల్డ్‌కప్ ఎక్కడ జరిగినా ఫేవరెట్ జట్టుగా ఇంగ్లండే ఉంటుందని గర్వంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా లాంటి పేస్ అనుకూలమైన పిచ్‌లపైనే సత్తా చాటి వరల్డ్‌కప్ నెగ్గిన తమకు భారత పిచ్‌లపై రాణించి వరల్డ్‌కప్ గెలవడం పెద్ద విషయం కాదని అన్నాడు. స్వదేశంలో ఆడుతుంది కాబట్టి టీమిండియానే ఫేవరెట్ అని ఎవరైన అంటే, వారితో ఏకీభవించేది లేదని తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్‌లో ఏకైక ఫేవరెట్ అయిన ఇంగ్లండ్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకుని మెగా ఈవెంట్లలో జైత్రయాత్ర కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా బీసీసీఐపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నేనే ఇండియన్ క్రికెట్‌కు బాస్‌ను అయితే, అహంకారాన్ని తగ్గించుకుని ఇంగ్లండ్ విన్నింగ్ మోడల్‌ను స్పూర్తిగా తీసుకుని ఫాలో అవుతానని అన్నాడు. మేజర్ టోర్నీల్లో టీమిండియా గెలవాలంటే బీసీసీఐ.. ఇంగ్లండ్‌ను ఫాలో అవ్వాలని సూచించాడు. వాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. అతని వ్యాఖ్యలకు కౌంటర్లిస్తూ.. తగు రీతిలో స్పందిస్తున్నారు. వీడి నోటి దూలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది, వరల్డ్‌కప్ గెలుపుతో వీడి నోటికి తాళం వేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి వెదవ చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చదవండి: 'రోహిత్ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి' -
'వన్డే ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వారిద్దరే'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే. గతేడాది జూలైలో భారత్ తరపున ధావన్ తన అఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. కాగా ధావన్ టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. ధావన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టులో ధావన్‌కు ఖచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం థీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శిఖర్ ప్రారంభిస్తాడని కరీం జోస్యం చెప్పాడు. ఇండియా న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో శిఖర్ ధావన్‌కు స్థానం దాదాపు ఖారారైంది. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు విఫలమైన మ్యాచ్‌లు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, ధావన్‌ను ఓపెనర్లుగా ఉండాలని సెలక్టర్లు ఇప్పటికే నిర్ణయించారని నేను భావిస్తున్నాను" పేర్కొన్నాడు. చదవండి: Ravindra Jadeja: తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు -
కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..!
ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన పది దేశాల కెప్టెన్లలో ప్రస్తుతం ఒకే ఒక్కరు సారధిగా కొనసాగుతున్నారు. గత వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ (డిఫెండింగ్ ఛాంపియన్) కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, విరాట్ కోహ్లి (ఇండియా), ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్), శ్రీలంక (దిముత్ కరుణరత్నే), ముషరఫే మోర్తజా (బంగ్లాదేశ్), గుల్బదిన్ నైబ్ (ఆఫ్ఘనిస్తాన్), తాజాగా ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) కెప్టెన్సీ బాధ్యతలను నుంచి వైదొలగగా ఒక్క కేన్ విలియమ్సన్ మాత్రమే మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కెప్టెన్లకు ఏమాత్రం కలిసి రానిదిగా చెప్పుకునే గడిచిన వన్డే వరల్డ్ కప్ ఆడిన కెప్టెన్లలో కేన్ మామ తప్ప అంతా ఔటయ్యారు. వీరిలో కొందరు స్వతహాగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, మరికొందరిని (హోల్డర్, సర్ఫరాజ్, గుల్బదిన్, మోర్తజా, కరుణరత్నే) బలవంతంగా తప్పించారు. తప్పించబడిన కెప్టెన్లలో కొందరు వన్డే జట్టులో స్థానం సైతం కోల్పోయారు. 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన కెప్టెన్లలో మిగిలిన ఒకే ఒక్కడు విలియమ్సన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. కేన్ మామ కెప్టెన్సీ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉంది. గత కొంతకాలంగా అతను మూడు ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో కేన్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ విలియమ్సన్ కూడా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడితే గత వన్డే వరల్డ్‌కప్ ఆడిన కెప్టెన్లంతా ఔటైనట్లే. వరల్డ్‌కప్ ఆడిన పది మంది కెప్టెన్లలో ఒక్క మోర్గాన్ తప్ప మిగతా ఎవ్వరూ అంత హ్యాపీగా జట్టుకు దూరం కాలేదు. ఇంగ్లండ్‌కు తొట్ట తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా మోర్గాన్‌కు మంచి రెస్పెక్ట్ దక్కింది. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌కు నాటి వరల్డ్‌కప్ నుంచే దరిద్రం పట్టుకుంది. 2019 నుంచి మూడేళ్లకు పైగా ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. ఇటీవలే (ఆసియా కప్ 2022) ఓ సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన పోరులో సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ బాదిన కోహ్లి కెరీర్లో 71వ సెంచరీ, అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. చదవండి: Asia Cup 2022: లంకకు ఎదురుందా! -
వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడడమే నా టార్గెట్: ధావన్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే తన కోరికను ధావన్ తాజాగా వ్యక్తం చేశాడు. ఇందుకోసం తన ఫిట్నెస్, ఆటపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ధావన్ తెలిపాడు. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్ఢ్‌కప్ భారత్ వేదికగా జరగనుంది. ధావన్ టైమ్స్ ఇండియాతో మాట్లాడుతూ.. "ఐసీసీ టోర్నీల్లో ఆడటం నాకు చాలా ఇష్టం. మెగా టోర్నీల్లో ఆడితే నాకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను గతంలో చాలా ఐసీసీ టోర్నమెంట్లలో భాగమయ్యాను. టీమిండియా జర్సీ ధరించిన ప్రతీ సారీ నా పై ఒత్తిడి ఉంటుంది. కానీ అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అదేవిధంగా జట్టు మేనేజ్మెంట్ కూడా నాకు చాలా సార్లు మద్దతుగా నిలిచింది. ఏ టోర్నమెంట్‌కైనా నా దృష్టి, సన్నద్దత ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. అందుకోసం టీమిండియా తరపున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలి అనుకుంటున్నాను. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ టోర్నీ కూడా జరగనుంది. అదే విధంగా దేశీవాళీ టోర్నీలో కూడా ఆడి, పూర్తి ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నాను" అతడు పేర్కొన్నాడు. ధావన్ ఇటీవల ముగిసిన విండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదే విధంగా త్వరలో జింబాబ్వేతో జరగునున్న వన్డే సిరీస్‌కు ధావన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధావన్ తొలుత కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. రాహుల్ ఫిట్నెస్ సాధించడంతో తిరిగి అతడిని సారధిగా బీసీసీఐ నియమించింది. చదవండి: Shikhar Dhawan: టీ20లకు పక్కనపెట్టారు కదా! సెలక్టర్లు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు! -
WC 2023: అందుకే కెప్టెన్ అయ్యాడు! కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడు!
ICC ODI World Cup 2023: టీమిండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రోహిత్ శర్మకు జోడీగా బరిలోకి అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. గత రెండేళ్లలో వన్డేల్లో ధావన్ నమోదు చేసిన అర్ధ శతకాల సంఖ్య తొమ్మిది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్మాట్లో గబ్బర్ నిలకడ ఏమిటో! శ్రీలంక పర్యటన తర్వాత జట్టుకు దూరమైన శిఖర్ ధావన్.. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. బట్లర్ బృందంతో మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో వన్డే జట్టుకు సారథిగా గబ్బర్ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023 సన్నాహకాల్లో భాగంగానే ధావన్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అతడు కెప్టెన్ అయ్యాడు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓజా మాట్లాడుతూ.. ‘‘ఒక సీనియర్ ప్లేయర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైన విధానమే! ముఖ్యంగా మెగా టోర్నీకి ముందు బెంచ్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడం ముఖ్యం. నిజానికి ధావన్ జట్టులో సీనియర్. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. అందుకే ద్వితీయ శ్రేణి జట్టుకు అతడు కెప్టెన్‌గా ఎంపికవుతున్నాడు. రోహిత్ కోరుకుంటున్నది అదే! అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బ్యాటర్‌గా కూడా రాణించగల సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో కాస్త నిరాశపరిచినా.. మళ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. శిఖర్ ధావన్ తనకు జోడీగా ఉండాలని రోహిత్ శర్మ బలంగా కోరుకుంటున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలు అందించింది కూడా!’’ అని చెప్పుకొచ్చాడు. శిఖర్ ధావన్ కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడని ప్రజ్ఞాన్ ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు. తన ఆటతో తానేమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడని 36 ఏళ్ల గబ్బర్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా ఇటీవల అజయ్ జడేజా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కోరుకున్నట్లుగా ధావన్ దూకుడైన ఆట కనబరచలేడంటూ పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా.. గబ్బర్‌కు అండగా నిలవడం విశేషం. ఇక విండీస్ పర్యటనలో భాగంగా ధావన్ సారథ్యంలోని టీమిండియ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం(జూలై 27) జరుగనుంది. ఈ సిరీస్‌లో ధావన్ ఇప్పటి వరకు వరుసగా 97, 13 పరుగులు సాధించాడు. చదవండి: Ajay Jadeja-ODI: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? -
'ప్రపంచకప్ తర్వాత వన్డేలకు హార్దిక్ గుడ్ బై చెప్పడం ఖాయం’
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత పాండ్యా వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి తెలిపాడు. భవిష్యత్తులో ఆటగాళ్ళు వన్డే ఫార్మాట్ కంటే టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకుని అందరనీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆడటం తనకు చాలా కష్టంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు బిజీ బీజీ షెడ్యూల్స్ వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదర్కొంటున్నారని, ఐసీసీ తమ షెడ్యూల్‌ను సవరించాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. "‘వన్డేలు, టీ20లు కంటే టెస్టు క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. కానీ టెస్టు క్రికెట్ రోజు రోజుకి ఆదరణ కోల్పోతోంది. ఇక ఇప్పటికే ఆటగాళ్లు వారు ఏ ఫార్మాట్లలో ఆడాలో నిర్ణయించుకున్నారు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. అతడు ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలను క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. అతడు ఇదే విషయాన్ని చాలా సార్లు స్పష్టంగా చెప్పాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆ తర్వాత అతడు వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పవచ్చు. జట్టులో మరి కొంత మంది ఆటగాళ్లు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆటగాళ్లు టీ20 క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆదరణ పెరుగుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఆటగాళ్లు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. వారిని ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడకుండా మనం ఆపలేం. కాబట్టి ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించి, ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేలా ప్రయత్నం చేయాలి" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Scott Styris On Shreyas Iyer: టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే! ఆ ఒక్క బలహీనత అధిగమిస్తే.. -
WC 2023: దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి అవుట్?!
ICC ODI World Cup 2023: దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రొటిస్ ప్రపంచకప్-2023 టోర్నీ అర్హత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తిన తరుణంలో వరల్డ్‌కప్ ఈవెంట్లో నేరుగా అడుగుపెట్టే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ప్రొటిస్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, తమ దేశంలో కొత్తగా టీ20 దేశవాళీ క్రికెట్ లీగ్ నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా దక్షిణాఫ్రికా బోర్డు.. ఆసీస్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. అస్సలు కుదరదు! కానీ, ఇప్పటికే కంగారూల క్యాలెండర్ వివిధ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న కారణంగా రీషెడ్యూల్ చేసేందుకు వీలుపడదని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రొటిస్ బోర్డు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు మెగా ఈవెంట్ ఎంట్రీ సంక్లిష్టతరం కానుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి ప్రొటిస్ జట్టు అవుట్?! సూపర్‌లీగ్‌లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా ఉంటే ఆస్ట్రేలియా ఇప్పటికే 70 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో టూర్ నేపథ్యంలో మరో మూడు వన్డేలు ఆడనుంది కూడా! దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు చేసుకున్న కారణంగా కంగారూలకు పెద్దగా నష్టమేమీ లేదు! ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో జరగాల్సిన వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకోవడం నిరాశ కలిగించింది.అయితే, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మాత్రం యథావిథిగా జరుగుతుంది. మా షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగానే వన్డే సిరీస్‌ను రీషెడ్యూల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తిగా తప్పుకొన్నట్లేనా? కాదు! మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్ లీగ్‌లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్ పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్ రౌండ్‌కు నెదర్గాండ్స్ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్‌లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్ వరల్డ్‌కప్- 2023 క్వాలిఫికేషన్ రేసులో నిలిచింది. మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్ రౌండ్ నిర్వహిస్తున్నారు. ఇక ఆతిథ్య దేశం భారత్ ప్రపంచకప్-2023కి నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టాప్-8 స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. కాబట్టి దక్షిణాఫ్రికా గనుక టాప్-8లో స్థానం దక్కించుకోలేకపోతే నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. ఇందుకోసం అసోసియేట్ దేశాలతో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో విజయం సాధించిన రెండు జట్లు రేసులో నిలుస్తాయి. చదవండి: IND VS ENG 1st ODI: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. బంతి తగిలి చిన్నారికి గాయం Jasprit Bumrah: ఇంగ్లండ్ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. అద్భుతం అంటూ వారిని ట్రోల్ చేసిన భార్య సంజనా! -
Ind Vs Eng: దేశవాళీ వన్డే, టీ20 క్రికెట్ ఆడతా.. నా టార్గెట్ వరల్డ్‌కప్!
ODI World Cup 2023- Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గబ్బర్.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి ధావన్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఓవల్ వేదికగా మంగళవారం(జూలై 12) జరిగే మొదటి వన్డేతో గబ్బర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో శిఖర్ ధావన్ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ది టెలిగ్రాఫ్‌నకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన గబ్బర్.. తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. నా టార్గెట్ అదే! వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో.. ‘‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం వన్డే ప్రపంచకప్ టోర్నీ మీదే ఉంది. ఈ గ్యాప్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నాను. అప్పుడే ప్రపంచకప్ జట్టులో చోటు.. నన్ను నేను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఇక అంతకంటే ముందు ఐపీఎల్లో మరింత గొప్పగా రాణించాలని భావిస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ వన్డే క్రికెట్, టీ20 మ్యాచ్‌లలో ఆడాలని భావిస్తున్నా. ఇంగ్లండ్ పర్యటనకు ముందు నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. నెట్స్‌లో ప్రాక్టీసు చేశాను. ఈ సిరీస్‌తో పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి వస్తాననుకుంటున్నాను. ఓపెనర్‌గా నాకు చాలా అనుభవం ఉంది. నా టెక్నిక్‌ను మరింతగా మెరుగుపరచుకుంటున్నాను. ఏదేమైనా.. సంయమనంతో పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలం’’ అని 36 ఏళ్ల శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గబ్బర్.. 14 ఇన్నింగ్స్‌లో కలిపి 460 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. కానీ వన్డే ఫార్మాట్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్! ఇంకా.. -
ODI WC 1975: జగజ్జేత.. నాడు విండీస్‌ను గెలిపించింది ఎవరో తెలుసా?
ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్‌కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా! మరి తొలిసారిగా సరిగ్గా ఇదే రోజు విండీస్ జట్టు క్రీడా ప్రపంచం చేత చాంపియన్‌గా నీరాజనాలు అందుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి తమ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా చేసింది. ట్రోఫీతో విండీస్ కెప్టెన్ లాయిడ్ (PC: ICC) టోర్నీ సాగింది ఇలా! అది 1975.. పరిమిత ఓవర్ల ప్రపంచకప్ రేసులో ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఈస్ట్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తదితర 8 జట్లు పోటీ పడ్డాయి. జూన్ 7న ఇంగ్లండ్- ఇండియా మ్యాచ్‌తో లార్డ్స్ మైదానంలో ఆరంభమైన ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఏకంగా టీమిండియాపై 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తూర్పు ఆఫ్రికాను 181 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ తదుపరి మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను 73 పరుగుల తేడాతో ఓడించగా.. వెస్టిండీస్ శ్రీలంకపై 9 వికెట్ల తేడా(236 బంతులు మిగిలి ఉండగా)తో గెలుపొందింది. అదే విధంగా.. జూన్ 11 నాటి మ్యాచ్‌లలో ఇంగ్లండ్ న్యూజిలాండ్ మీద 80 పరుగులతో, ఆస్ట్రేలియా శ్రీలంకపై 52 పరుగులతో, వెస్టిండీస్ పాకిస్తాన్ మీద ఒక వికెట్(రెండు బంతులు మిగిలి ఉండగా) తేడాతో, ఇండియా- తూర్పు ఆఫ్రికా మీద 10 వికెట్ల తేడాతో(181 బంతులు మిగిలి ఉండగా) జయభేరి మోగించాయి. ఆ తర్వాత జూన్ 14న జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్ శ్రీలంక మీద 192 పరుగులు, వెస్టిండీస్ ఆస్ట్రేలియా మీద 7 వికెట్లు(84 బంతులు మిగిలి ఉండగా), న్యూజిలాండ్ ఇండియా మీద 4 వికెట్లు, ఇంగ్లండ్ తూర్పు ఆఫ్రికా మీద 196 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటాయి. సెమీస్‌కు చేరిన జట్లు ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా తలపడగా.. 188 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం ఆసీస్‌ను వరించింది. ఇక రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 119 బంతులు మిగిలి ఉండగానే కివీస్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఫైనల్లో టాస్ గెలిచి జూన్ 21న లార్డ్స్ మైదానంలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కంగారూ జట్టు కెప్టెన్ ఇయాన్ చాపెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆసీస్ బౌలర్లు చెలగరేగడంతో విండీస్ ఓపెనర్లు రాయ్ ఫ్రెడెరిక్స్, సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ వరుసగా 7, 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన అల్విన్ కల్లిచర్రాన్ 12 పరుగులు చేసి నిష్క్రమించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహన్ కన్హాయ్ 105 బంతుల్లో 55 పరుగులతో రాణించాడు. ఇతడికి జతకలిసిన కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ 85 బంతుల్లో 102 పరుగులు సాధించి విండీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సర్ వివియన్ రిచర్డ్స్ 5 పరుగులకే అవుట్ కావడంతో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కీత్ బోయ్సే 34 పరుగులు చేయగా.. బెర్నార్డ్ జూలియన్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. డెరిక్ ముర్రే 14, వాన్బర్న్ హోల్డర్ 6(నాటౌట్) పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 60 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. చాపెల్ రనౌట్ కావడంతో ఇక లక్ష్య ఛేదనకు దిగిన చాపెల్ బృందానికి ఓపెనర్ అలన్ టర్నర్ 40 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ రిక్ మెకాస్కర్(7) విఫలం కాగా.. అర్ధ శతకం సాధించి ప్రమాదకరంగా మారుతున్న కెప్టెన్ ఇయాన్ చాపెల్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. రిచర్డ్స్, లాయిడ్ కలిసి రనౌట్ చేశారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. గ్రెగ్ చాపెల్ 15 పరుగులు చేసి రనౌట్ కాగా.. వాలర్డ్స్ , రోడ్ మార్ష్, రాస్ ఎడ్వర్డ్స్, గ్యారీ గిల్మోర్, మాక్స్ వాకర్, జెఫ్ థామ్సన్, డెనిస్ లిలీ వరుసగా 35,11,28,14,7,21,16 పరుగులు చేశారు. విండీస్ బౌలర్ల ధాటికి నిలకవలేక 58.4 ఓవర్లలో 274 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి చాంపియన్‌గా లాయిడ్ బృందం తద్వారా 17 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించి వెస్టిండీస్ తొట్టతొలి చాంపియన్‌గా నిలిచింది. శతక వీరుడు విండీస్ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. ఆ తర్వాత 1979 వరకు వెస్టిండీస్ చాంపియన్‌గా కొనసాగడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు, భారత్, వెస్టిండీస్ చెరో రెండుసార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ ఒక్కోసారి గెలవగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు మాత్రం ఈ ఐసీసీ ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చదవండి: Ranji Trophy 2022: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి -
World Cup 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్ విజయం
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డియాండ్రా డాటిన్(31 పరుగులు), హేలే మాథ్యూస్(45 పరుగులు) శుభారంభం అందించినప్పటికీ.. వీరిద్దరు అవుటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ 80 బంతుల్లో 66 సాధించగా.. చెడియన్ నేషన్ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెరసి నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ 6 పరుగుల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేధనకు దిగిన ఇంగ్లండ్ మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ టామీ బీమౌంట్ మాత్రం 46 పరుగులతో ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే, చివర్లో సోఫీ, కేట్ క్రాస్ హిట్టింగ్ ఆడటంతో ఇంగ్లండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. కానీ, విండీస్ బౌలర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ 218 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం వెస్టిండీస్‌ను వరించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన షిమేన్ కాంప్‌బెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు: విండీస్- 225/6 (50 ఓవర్లు) ఇంగ్లండ్- 218 (47.4 ఓవర్లు) చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
టీమిండియా కెప్టెన్‌గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ
ముంబై: వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది(2022) జనవరి 14 నుంచి ప్రారంభంకానున్న అండర్ 19 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా ఢిల్లీ కుర్రాడు యశ్ దుల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా ఆంధ్రా ప్లేయర్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్‌కి అవకాశం దక్కింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మెగా టోర్నీలో భాగంగా జరిగే ప్రాధమిక మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా(జనవరి 15), ఐర్లాండ్(జనవరి 19), ఉగాండా(జనవరి 22) జట్లతో యంగ్ ఇండియా తలపడనుంది. ఇదిలా ఉంటే, భారత అండర్-19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత యువ జట్టు చివరిసారిగా 2020లో జరిగిన టోర్నీలో ఫైనల్‌కు చేరి.. బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. భారత జట్టు అండర్-19 జట్టు: యశ్ దుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్ స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి(హైదరాబాద్), ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్ చదవండి: BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా యమగుచి -
ODI World Cup 2022: న్యూజిలాండ్ పర్యటనకు భారత మహిళా జట్టు
Indian Women Cricket Team To Tour New Zealand T20 5 ODI Ahead WC 2022: వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. న్యూజిలాండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుండటంతో దానికి నెల రోజుల ముందుగా న్యూజిలాండ్‌తో సన్నాహక సిరీస్‌ను ఆడనుంది. భారత జట్టు సభ్యులు అక్కడి పిచ్‌లకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ సన్నాహక సిరీస్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను న్యూజిలాండ్ క్రికెట్ శుక్రవారం విడుదల చేసింది. భారత్, న్యూజిలాండ్‌లు ఒక టి20తో పాటు ఐదు వన్డేలు ఆడతాయి. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 9న జరిగే ఏకైక టి20 మ్యాచ్‌తో పర్యటన ఆరంభం కానుంది. అనంతరం ఫిబ్రవరి 11, 14, 16, 22, 24వ తేదీల్లో ఐదు వన్డేలు జరుగుతాయి. అనంతరం మార్చి–ఏప్రిల్ మధ్య మహిళల వన్డే ప్రపంచ కప్ ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్‌తో.. కానీ.. Ind Vs Nz Test Series: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన శ్రీకర్ భరత్ గురించి ఈ విషయాలు తెలుసా? -
క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు..
న్యూఢిల్లీ: సరిగ్గా 38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్ 18, 1983) భారత క్రికెట్ రూపురేఖలు మారేందుకు బీజం పడింది. భారత్‌లో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి ఆ ఇన్నింగ్సే నాంది పలికింది. 1983 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేశ్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ చేసిన కపిల్.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రపంచకప్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 17 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గవాస్కర్, శ్రీకాంత్, అమర్నాథ్ లాంటి స్టార్లు సింగల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. దీంతో ప్రపంచ కప్‌లో భారత్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆర్గనైజర్స్ అయితే మరో మ్యాచ్ నిర్వహించవచ్చని టాస్ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అప్పుడే వచ్చాడు టార్చ్ బేరర్ కపిల్ దేవ్. తన సారథ్యంలో భారత్‌ను ఎలాగైనా విశ్వవిజేతగా నిలపాలనుకున్న ధృడ సంకల్పంతో బరిలోకి దిగిన ఆయన.. ఓవైపు వికెట్లు పడుతున్నా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. ఇతర బ్యాట్స్మెన్లు బంతిని బ్యాట్‌కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్‌లో అలవోకగా షాట్లు కొడుతూ చెలరేగిపోయాడు. కపిల్ విధ్వంసంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను.. ఆల్‌రౌండర్ కెవిన్ కర్రన్ (73) ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 235 పరుగలకు ఆలౌట్ కావడంతో, భారత్ ఓడాల్సిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్ బంతితో కూడా రాణించి 11 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్లలో మదన్‌లాల్ 3, రోజర్ బిన్నీ 2, సంధూ, అమర్నాథ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు ఇచ్చిన స్పూర్తితో భారత్ ఆ ప్రపంచ కప్‌లో వెనక్కి తిరగి చూడలేదు. ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌ను 118 పరుగులతో గెలిచిన కపిల్ డెవిల్స్ సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత నాటి ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు -
జడేజాకు ఇంగ్లీష్ రాదు.. తిట్టినా అర్ధం కాదు
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఇంగ్లీష్ రాదని, అందువల్లే తాను బిట్స్ అండ్ పీసెస్ అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నాడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. బిట్స్ అండ్ పీసెస్ వ్యవహారంపై ఓ నెటిజన్‌తో జరిపిన చాట్‌లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశాడు. అయితే, తాజాగా ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వెలుగులోకి రావడంతో జడేజా, మంజ్రేకర్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్లైంది. వివరాల్లోకి వెళితే.. సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్, తాను మంజ్రేకర్‌తో జరిపిన ట్విటర్ సంభాషణను లీక్ చేశాడు. అందులో మంజ్రేకర్.. జడేజాకు ఇంగ్లీష్ రాదని, అసలు తాను ఏం చెబుతున్నానో కూడా అతనికి అర్థం కాదని హేళన చేస్తాడు. బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం జడేజాకు ఇప్పటికీ తెలీదని, కనీసం దాని అర్ధం తెలుసుకునే ప్రయత్నం కూడా అతను చేయడని పేర్కొన్నాడు. అలాగే 'వెర్బల్ డయేరియా(నోటి విరేచనాలు)' అంటూ జడేజా తననుద్ధేశించి సంబోధించిన పదాన్ని కూడా ఎవరైనా అతనికి చెప్పి ఉంటారని ఎగతాలి చేశాడు. అంతటితో ఆగని మంజ్రేకర్.. సదరు అభిమానిపై కూడా ఫైరయ్యాడు. నీలాగా ప్లేయర్స్‌ను పొగడటానికి నేను అభిమానిని కాదు.. ఓ విశ్లేషకుడినంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని సంబోధిస్తూ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై జడ్డూ కూడా ఘాటుగానే స్పందించాడు. మంజ్రేకర్.. నీ కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు మ్యాచ్‌లను ఆడాను, ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇప్పటికే చాలా విన్నాను.. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు’’ అంటూ కౌంటరిచ్చాడు. అయితే ఈ వివాదం అంతటితో సద్దుమణిగిందనుకుంటే, తాజాగా లీకైన ట్విటర్ చాట్ మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై జడేజా ఎలా స్పందిస్తాడో చూడాలి. చదవండి: వాళ్లు నిజంగా జాత్యాహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు -
ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు..
దుబాయి: 2023-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్టూర్స్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. బోర్డు మెంబర్లతో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే టీ20 ప్రపంచ కప్ రెండేళ్లకోసారి నిర్వహించాలని, అయితే అందులో16 జట్లకు బదులు 20 జట్లను ఆడించాలని నిర్ణయించింది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ టోర్నీని 10 జట్లకు బదులు 14 జట్లతో జరిపించాలని, ప్రస్తుతం రెండేళ్లకోసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని, నాలుగేళ్లకోసారి జరపాలని ప్రకటించింది. 2019లో చివరిసారిగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 10 పది జట్లు మాత్రమే పాల్గొనగా, 2027, 2031 ప్రపంచకప్‌లలో ఆ సంఖ్య 14కు పెంచాలని, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యను 54కు మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్లో 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లను సూపర్ సిక్స్‌గా పరిగణించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్నిర్వహిస్తారని ప్రకటించింది. ఐసీసీ.. 2003 ప్రపంచకప్‌లో ఇదే పద్ధతిని అనుసరించింది. అలాగే 2024, 2026, 2028, 2030లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లను 20 జట్లతో నిర్వహించి, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యని 55కి పెంచనున్నట్లు పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లను సూపర్-8గా పరిగణించి, ఆతర్వాత నాకౌట్, సెమీస్, ఫైనల్స్నునిర్వహిస్తారని తెలిపింది. వీటితో పాటు ఎనిమిది జట్లతో నిర్వహించే ఛాంపియన్స్‌ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి (2025, 2029), ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను రెండేళ్లకోసారి (2025, 2027, 2029, 2031) నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఛాంపియన్స్‌ట్రోఫీని గతంలో లాగే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారని పేర్కొంది. చదవండి: శవాలతో రోడ్లపై క్యూ కట్టడం చూశాక నిద్రపట్టేది కాదు.. The ICC events schedule from 2024-2031 has a lot to look forward to 🙌 The Men's events cycle 👇 pic.twitter.com/iNQ0xcV2VY — ICC (@ICC) June 2, 2021 -
నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో బ్యాటింగ్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, 2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ధోని ఇచ్చిన సలహా తన బ్యాటింగ్‌ను ఎంతో మెరుగుపర్చిందని టీమిండియా స్టార్ ఆల్రండర్ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో చాలా తికమక పడేవాడినని, దీంతో షాట్ పిచ్ బంతులను ఆడమని ధోని సూచించాడని పేర్కొన్నాడు. కెరీర్లో ప్రస్తుతం తాను అనుభవిస్తున్న హోదాకు ధోనినే కారణమని ఆకాశానికెత్తాడు. ధోని చెప్పేంత వరకు షాట్ ఆడాలా వద్దా? ఏ షాట్ ఆడాలి? బంతిని వదిలేద్దామా?ఆడదామా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలేవని వెల్లడించాడు. ఈ తికమకలో క్రమంగా వికెట్ పారేసుకునేవాడినని, దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గత రెండేళ్లుగా జడేజా కెరీర్ దూసుకుపోతుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపుతూ, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడ్డూ.. భారత జట్టు కీలక సభ్యుడిగా ఎదిగాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ప్రారంభమైన అతని బ్యాటింగ్ విధ్వంసం.. నిరంతరాయంగా సాగుతూ టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఇటీవల కాలంలో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్న జడ్డూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమాయత్తమవుతున్న అతను.. బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్నాడు. చదవండి: వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ నిర్వహణ ఆగదు.. -
Mithali Raj: వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు!
న్యూఢిల్లీ: తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అందనిద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్‌కప్ టైటిల్ కోసం వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిస్తానని భారత మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ తర్వాత తాను ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని ఈ హైదరాబాదీ క్రికెటర్ సంకేతాలు ఇచ్చింది. ‘అంతర్జాతీయ క్రికెట్లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 2022 నా కెరీర్లో చివరి ఏడాది కావొచ్చు. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ నా ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నాను. వయసు పెరుగుతున్నకొద్దీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు’ అని శనివారం వర్చువల్‌గా జరిగిన ‘1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్‌నెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ‘వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ మాకు ముఖ్యమే. వరల్డ్‌కప్ కోసం పటిష్ట జట్టును రూపొందించే పనిలో ఉన్నాం. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మనం కొంచెం బలహీనంగా ఉన్నాం. సీనియర్ జులన్ గోస్వామి రిటైరైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి’ అని 38 ఏళ్ల మిథాలీ తెలిపింది. 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. ప్రత్యర్థి జట్టుపై ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించాలని... ఈ విషయంలో విరాట్ కోహ్లిని మిథాలీ రాజ్ బృందం ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించారు. -
వైరల్ వీడియో: నాటి ధోనితో నేటి ధోని ఏమన్నాడంటే..
ముంబై: టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో 2005 నాటి ధోని, ప్రస్తుత ధోనిల మధ్య జరిగే ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో జట్టులోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే నాటి ధోనికి.. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేటి ధోని తన అనుభవాన్ని వివరిస్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా షికార్లు కొడుతుంది. గల్ఫ్ ఆయిల్ సంస్థ శుక్రవారం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. @msdhoni from 2021 met his younger self from 2005 and they had quite a conversation about consistency. Here’s a sneak peek into what happened. Dhoni fans, cricket fans, bikers, click https://t.co/fp5XiWzmle to join us on April 2nd at 3 pm to know more! #GulfDhoniXDhoni pic.twitter.com/Yd35WajTwB — Gulf Oil India (@GulfOilIndia) March 31, 2021 కాగా, ఇద్దరు ధోనిల మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం ప్రస్థావనకు వచ్చింది. 2005 నాటి ధోని.. నేటి ధోనిని తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏది అని అడగ్గా.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని నేటి ధోని బదులిస్తాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియాను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టినప్పుడు లభించిన ఆ మజానే వేరు అని నేటి ధోని చెప్తాడు. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో నేటి ధోని తన కెరీర్ అనుభవాలను, బైక్ రైడింగ్ తదితర అంశాలను నాటి ధోనితో పంచుకుంటాడు. ధోని vs ధోనిగా సాగే ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చదవండి: సచిన్ కోవిడ్‌ను కూడా సిక్సర్ కొట్టగలడు: వసీం అక్రం -
ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో మెరుగుపడిన టీమిండియా స్థానం
ముంబై: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో టీమిండియా ఏడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత్.. 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 ఓటములతో 29 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ సిరీస్ చేజార్చుకున్నప్పటికీ.. పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 ఓటములతో 40 పాయింట్లు దక్కించుకొని టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ జాబితాలో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(6 మ్యాచ్‌ల్లో 4గెలుపు, 2ఓటమి) కూడా 40 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్‌రన్‌రేట్‌లో ఇంగ్లాండ్ కన్నా వెనకబడి ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు తలో 30 పాయింట్లు సాధించి 3 నుంచి 6 స్థానాల వరకు వరుసగా ఉన్నాయి. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్న దాయాది పాక్ 20 పాయింట్లతో భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు బోణీ కొట్టాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు, భారత్ ఆతిధ్యమివ్వనున్న 2023 వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీకి ఆతిథ్యమిస్తున్నందుకు టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది. చదవండి: భారత ఉసేన్ బోల్ట్ శ్రీనివాస గౌడ మరో రికార్డు -
2021 ప్రపంచకప్‌తోనే ముగిస్తా
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఎప్పుడంటూ తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ సమాధానమిచ్చింది. తన సుదీర్ఘ కెరీర్‌ను వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌తో ముగిస్తానంటూ ఆమె ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ... 2021లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ‘2021 వన్డే ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది. అప్పడు భారతే టైటిల్‌ను గెలుస్తుందని భావిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్ధికి గొప్ప మలుపు అవుతుంది. ఎందరో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం’ అని మిథాలీ వివరించింది. తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఐసీసీ ఈవెంట్లలో ఇప్పుడు భారత్ కూడా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోందన్న ఆమె... దీనికి ఆటగాళ్ల కృషితోపాటు బీసీసీఐ సహాయక సిబ్బంది తోడ్పాటే కారణమని చెప్పింది. ‘మహిళల క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో విదేశీ పర్యటనల సమయంలో ఆట గురించి చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు షెఫాలీ వర్మ లాంటి యువ క్రీడాకారిణిలకు అరంగేట్రానికి ముందే అంతర్జాతీయ అనుభవం ఉంటుంది. దేశవాళీ టోర్నీలు, చాలెంజర్ ట్రోఫీలు ఆడటం ద్వారా వారు చాలా నేర్చుకుంటున్నారు. మాకు అప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిబిరాల గురించి కూడా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి. ఆదాయం పెరగడంతో కేవలం ఆటపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతోంది’ అని మిథాలీ వివరించింది. -
అమెరికాకు ఆడతా: ప్లంకెట్
లండన్: జాతీయ శిక్షణ శిబిరం కోసం ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడం... ఈ విషయంపై టీమ్ మేనేజ్మెంట్ తనకు కనీస సమాచారం ఇవ్వకపో వడంపట్ల ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ జట్టు సభ్యుడు ప్లంకెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. జాబితాలో తన పేరు లేని విషయాన్ని ప్లంకెట్ ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశముంటే అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధమేనని ప్లంకెట్ పేర్కొన్నాడు. ‘నా భార్య అమెరికన్. అక్కడ అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశముంటే నేను సిద్ధమే. ఇంగ్లండ్‌లో చేయడానికి ఏం లేనప్పుడు అమెరికాకు ఎందుకు ఆడకూడదు?’ అని ప్లంకెట్ పేర్కొన్నాడు. -
వేలంలో షకీబ్ బ్యాట్‌కు రూ. 18 లక్షల 20 వేలు
కరోనా బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు తనకెంతో ఇష్టమైన బ్యాట్‌ను వేలానికి పెట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. ఆన్లైన్ వేలంలో అతని బ్యాట్ 24 వేల డాలర్లు (రూ. 18 లక్షల 20 వేలు) పలికింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ ఓ బంగ్లాదేశీ ఈ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఈ బ్యాట్‌తోనే విశేషంగా రాణించిన షకీబ్ 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో మొత్తం 606 పరుగులు సాధించాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ అక్టోబర్‌తో నిషేధం ముగియనుంది. -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
ప్రపంచ కప్ అర్హత టోర్నీలు వాయిదా
దుబాయ్: కరోనా (కోవిడ్–19) ధాటికి ఇప్పటికే ఒలింపిక్స్, యూరో కప్‌లు వచ్చే ఏడాదికి తరలిపోగా... ఐపీఎల్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కరోనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈవెంట్లపైనా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 2021లో జరిగే టి20 ప్రపంచ కప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ ఈవెంట్లకు సంబంధించి ఈ ఏడాది జూన్ 30లోపు జరగాల్సిన అన్ని అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దాంతో పాటు శ్రీలంక వేదికగా జరగాల్సిన 2021 మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌ను అనుకున్న తేదీల్లో జరపాలా వద్దా అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని క్రిస్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఏప్రిల్‌లో ఆరంభం కావాల్సిన ట్రోఫీ టూర్‌ను కూడా ఐసీసీ వాయిదా వేసింది. -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో 2011 ప్రపంచకప్ ఫైనల్
లండన్: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమాని ఎన్నటికీ మరచిపోలేని తేదీ. 28 ఏళ్ల తర్వాత మన టీమ్ మళ్లీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముఖ్యంగా సీనియర్ సభ్యుడు సచిన్ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం. అంతకుముందు సచిన్ ఆడిన ఐదు ప్రపంచకప్‌లు నిరాశను మిగిల్చగా... ఆరో ప్రయత్నంలో అతను విశ్వ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. నాడు జట్టు సహచరులు అతడిని తమ భుజాలపై మోసి వాంఖడే మైదానంలో ఊరేగించారు. ఇప్పుడు అదే క్షణం ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుల రేసులో నిలిచింది. 2000 నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచిన 20 ఘటనలను నిర్వాహకులు నామినేట్ చేశారు. టీమిండియా గెలిచిన క్షణాన్ని మొత్తం దేశాభిమానుల ఆనందం కోణంలో లారెస్ ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అని టైటిల్ పెట్టింది. విజేతను తేల్చేందుకు పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 17న బెర్లిన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో లారెస్ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటిస్తారు. -
160 కోట్ల మంది చూశారు!
దుబాయ్: సొంతగడ్డపై ఇంగ్లండ్ విజేతగా నిలిచిన ఇటీవలి వన్డే వరల్డ్ కప్ వీక్షకాభిమానంలో గత టోరీ్నల రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో 160 కోట్ల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2015 ప్రపంచ కప్‌తో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ కావడం విశేషం. టీవీలతో పాటు డిజిటల్ వేదికపై ప్రజలు క్రికెట్ చూసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను గరిష్టంగా టీవీల్లోనే 27.3 కోట్ల మంది వీక్షించగా మరో 5 కోట్ల మంది డిజిటల్ వేదికపై చూశారు. -
ఏప్రిల్ 15న...
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 15న ప్రకటించనుంది. సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ కప్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ నిర్దేశించిన తుది గడువు ఏప్రిల్ 23 కాగా... టీమిండియా సభ్యుల సన్నద్ధత కోసం మరికొంత అదనపు సమయం ఉంటే బాగుంటుందని సెలక్టర్లు భావించారు. సోమవారం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండబోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతాడు. మే 30నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్ జరగనుండగా, భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. -
సర్ఫరాజ్‌కే నాయకత్వ పగ్గాలు
కరాచీ: పాకిస్తాన్ జట్టుకు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నమ్మకముంచింది. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే పాక్ జట్టుకు సర్ఫరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి మంగళవారం ప్రకటించారు. 2017లో ఇంగ్లండ్ గడ్డపైనే పాక్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన సర్ఫరాజ్ స్వదేశం తిరిగొచ్చాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్‌కు కూడా మాలిక్‌కే అవకాశం దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజా ప్రకటనతో దానికి ముగింపు లభించింది. సర్ఫరాజ్ కెప్టెన్సీలో 35 వన్డేలు ఆడిన పాకిస్తాన్ జట్టు 21 మ్యాచ్‌లు గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. -
ప్రపంచ కప్‌కు స్మిత్ అనుమానమే!
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన నిషేధం మార్చి 29న ముగుస్తుంది. జట్టులోకి వీరిద్దరి పునరాగమనంపై ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా వారు రావాల్సిన అవసరం గురించి పదే పదే చెబుతున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో కూడా వారిద్దరు ఆడతారని అంచనాలు ఉన్నాయి. అయితే స్మిత్ విషయంలో ఇది నిజమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చాలా కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న స్మిత్ చికిత్స పొందుతున్నాడు. అతను కూడా వరల్డ్ కప్ కోసం తొందరపడకుండా ఎక్కువ సమయం పట్టినా సరే పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆగాలనే ఆలోచనతో ఉన్నాడు. పైగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై కూడా నిషేధం ఉండటంతో చాలా కాలంగా మ్యాచ్ ప్రాక్టీస్‌కు దూరమైన స్మిత్ నేరుగా వరల్డ్ కప్ ఆడటం కష్టమే. అదే సమయంలో అతను ఇంగ్లండ్ కౌంటీల్లో గానీ, ఆసీస్ ‘ఎ’ తరఫున గానీ ఆడాలని భావిస్తున్నాడు. మరో వైపు వార్నర్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మోచేతి గాయంనుంచి కోలుకున్న అతను యూఏఈలో పాక్‌తో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చివరి రెండు మ్యాచ్‌లు నిషేధం ముగిసిన తేదీ తర్వాత జరుగుతాయి కాబట్టి వార్నర్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కవచ్చు. -
నగరంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
గచ్చిబౌలి: ఐసీసీ వరల్డ్ కప్ టూర్లో భాగంగా ‘వన్డే ప్రపంచకప్’ హైదరాబాద్‌కు చేరుకుంది. గచ్చిబౌలిలోని నిస్సాన్ షోరూమ్‌లో అభిమానుల సందర్శనార్థం ఈ ట్రోఫీని ఉంచారు. నటి వర్షిణి సౌందరాజన్ ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. ట్రోఫీతో పాటు న్యూ నిస్సాన్ కిక్స్ కారును ఆమె ప్రీలాంచ్ చేశారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ... 2019 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ నిస్సాన్ షోరూమ్ ఎండీ సిరాజ్ బాబూఖాన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఐసీసీ వరల్డ్ కప్ మెగా టోర్నీకి నిస్సాన్ కంపెనీ అధికారిక భాగస్వామిగా ఉందని చెప్పారు. మన రోడ్లకు అనుగుణంగా న్యూ నిస్సాన్ కిక్స్ కారును రూపొందించారని తెలిపారు. వచ్చే సంక్రాంతి నాటికి భారత మార్కెట్లోకి ఈ కారు అందుబాటులోకి వస్తుందన్నారు. -
జింబాబ్వే కెప్టెన్, కోచింగ్ స్టాఫ్‌పై వేటు
హరారే: వన్డే ప్రపంచకప్–2019కు అర్హత సాధించడంలో జింబాబ్వే జట్టు విఫలమవడంతో కెప్టెన్ గ్రేమ్ క్రేమర్‌తో పాటు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడింది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయిన జింబాబ్వే పై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. క్రేమర్ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో బ్రెండన్ టేలర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. హెడ్ కోచ్ హీత్ స్ట్రీక్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్, బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండో, ఫీల్డింగ్ కోచ్ వాల్టర్ చవగుట, ఫిట్నెస్ కోచ్ సీన్ బెల్, అనలిస్ట్ స్టాన్లె చీజాలతో పాటు శిక్షణ బృందాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. వీరితో పాటు సెలక్షన్ కమిటీ కన్వీనర్ తతేంద తైబు, అండర్–19 కోచ్ స్టీఫెన్ మాన గోంగోలను కూడా వారి పదవుల నుంచి తొలగించింది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచకప్‌నకు అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. -
పాకిస్తాన్‌పై భారత్ విజయం
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అంధుల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 283 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 34.5 ఓవర్లలో ఛేదించింది. దీపక్ మాలిక్ (71 బంతుల్లో 79), వెంకటేశ్ (55 బంతుల్లో 64), కెప్టెన్ అజయ్ రెడ్డి (34 బంతుల్లో 47) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. అంతకుముందు పాకిస్తాన్ నిర్ణీత 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. జమీల్ (94 నాటౌట్), నిసార్ అలీ (63) రాణించారు. -
16 ఏళ్ల టెస్టు కెరీర్లో..
న్యూఢిల్లీ: కపిల్ దేవ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వన్డే వరల్డ్ కప్. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుని యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది. ఇదిలా ఉంచితే, కపిల్ దేవ్‌కు టెస్టు కెరీర్లో కూడా ప్రత్యేక స్థానం ఉంది. మొత్తంగా 131 టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్న కపిల్ దేవ్.. తన 16 ఏళ్ల టెస్టు కెరీర్లో కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ను మిస్సయ్యాడు. 1978 టెస్టు కెరీర్‌ను ఆరంభించిన కపిల్ దేవ్ వరుసగా 66 టెస్టులకు ప్రాతినిథ్యం వహించాడు. ఆపై ఒక టెస్టు మ్యాచ్‌కు దూరమైన తరువాత మళ్లీ వరుసగా 65 టెస్టుల్లో పాల్గొన్నాడు ఈ హరియాణా హరికేన్. అది కూడా సరిగ్గా 33 ఏళ్ల క్రితం. 1984, డిసెంబర్ 31వ తేదీన కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌కు కపిల్ దూరమయ్యాడు. అదే అతను మిస్సయిన ఏకైక టెస్టు మ్యాచ్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. మొత్తంగా తన టెస్టు కెరీర్లో 8 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 5,248 పరుగులు సాధించాడు. ఇక్కడ అతని స్టైక్‌రేట్ 94.76గా ఉండటం మరో విశేషం. ఇక బౌలింగ్‌లో 29.65 యావరేజ్‌తో 434 వికెట్లను కపిల్ సాధించాడు. 1994లో హమిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ కపిల్‌కు చివరి టెస్టు మ్యాచ్. -
18 ఏళ్ల ‘బెంచ్’ మార్క్
► అరుదైన ఘనత సాధించిన హర్భజన్ ► తుది జట్టులో చోటు కోసం ఇంకా పోరాటం ఆటలో, మాటలో పదును... సంప్రదాయ స్పిన్‌తో సవాల్ విసరగలడు, అవసరమైతే దూస్రాతో దెబ్బ తీయగలడు... 18 సంవత్సరాలుగా భారత క్రికెట్లో హర్భజన్ సింగ్ అంతర్భాగం. ఎప్పుడో నూనూగు మీసాల యవ్వనంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను ఈతరంలో సచిన్, కుంబ్లేల తర్వాత ఎక్కువ కాలం కొనసాగిన భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇంత అనుభవం తర్వాతా అతను తుది జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి. మొహాలీనుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఐదేళ్ల క్రితం మొహాలీలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన హర్భజన్ రెండు కీలక వికెట్లు తీశాడు. నాడు కూడా జట్టులో అశ్విన్ ఉన్నా... భజ్జీదే ప్రధాన పాత్ర కాగా, జూనియర్‌గా అశ్విన్ కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. కానీ కాలం మారింది. అశ్విన్ లేకుండా భారత్ ఆడే పరిస్థితి లేకపోవడంతో... పునరాగమనం తర్వాత భజ్జీకి ఒక్కటంటే ఒక్క టి20 మ్యాచ్ దక్కింది. ఒకప్పుడు జట్టు విజయాలను శాసించిన క్రికెటర్ ఇప్పుడు తనదైన అవకాశం కోసం చూస్తున్నాడు. శుక్రవారంతో అంతర్జాతీయ కెరీర్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న హర్భజన్ ఇంకా బెంచీకే పరిమితమవుతున్నాడు. ఆట ముగిసిందా..?: 2000కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించి ఇంకా రిటైర్ కాని ఆరుగురు ఆటగాళ్ళలో హర్భజన్ ఒకడు. అయితే మిగతావారితో పోలిస్తే మూడు ఫార్మాట్లలోనూ రాణించిన ఘనత ఒక్క భజ్జీకే సొంతం. 400కు పైగా టెస్టు వికెట్లు తీయడంతో పాటు టి20, వన్డే ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన జట్టులో అతను భాగస్వామి. అయితే అలాంటి బౌలర్ తన చాన్స్ కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం భారత జట్టు పురోగతి చూస్తుంటే తుది జట్టులో మార్పు కష్టంగానే కనిపిస్తోంది. అశ్విన్ ఉండగా, ఇప్పుడు రైనా కూడా బౌలింగ్ చేస్తుండటంతో ఇక భజ్జీకి స్థానం దక్కడం అసాధ్యంగా మారింది. సొంత మైదానంలో అతను మరోసారి బరిలోకి దిగాలని కోరుకుంటున్న స్థానిక అభిమానులకు నిరాశ తప్పకపోవచ్చు. బిజినెస్‌లో బిజీగా...: క్రికెట్ కెరీర్ చరమాంకంలో హర్భజన్ ఒక్కసారిగా బిజీగా మారిపోయాడు. నిజానికి పునరాగమనంపై అతను కూడా పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు లేదు. అందుకే ఆ విరామ సమయంలోనే తన కొత్త వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. భజ్జీ స్పోర్ట్స్ పేరుతో క్రీడా సామగ్రి, దుస్తుల వ్యాపారంలో అతని బిజినెస్ దూసుకుపోతోంది. పంజాబ్‌తో పాటు యూపీ, బెంగాల్ రంజీ జట్లకు కూడా ఈ సంస్థ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. హర్భజన్‌సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ పేరుతో అతను ప్రారంభించిన అకాడమీలపై ఇటీవల ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడు. తక్కువ వ్యవధిలో ఏడు చోట్ల ఈ అకాడమీలు మొదలు కావడం విశేషం. తన సన్నిహితులతో కలిసి అతను చండీగఢ్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అయితే చాలా కాలంగా బెంచీకే పరిమితమవుతూ వస్తున్న హర్భజన్ మరొక్కసారి క్రికెటర్‌గా తనదైన ముద్ర వేయగలిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. -
రూబెల్కు ‘నజరానా’
రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి ఢాకా: వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ప్రదర్శనను ఆ దేశస్థులు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో ఈ ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా పేసర్ రూబెల్ హొస్సేన్ అత్యద్భుత బౌలింగ్‌తో తమ అభిమానుల హృదయాల్లో హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తనకు జీవితంలోనే అతి పెద్ద ఊరట లభించింది. ఈ మెగా టోర్నీకి రాకముందు తను అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బంగ్లాకు చెందిన 19 ఏళ్ల నటి నజ్నీన్ అక్టర్ హప్పీ అతడిపై ఈ కేసు పెట్టింది. అయితే ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరి తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఫీట్‌కు కారణమైన రూబెల్‌పై ఆమె తన కోపాన్ని చల్లార్చుకుంది. అతడిని క్షమిస్తున్నట్టు ప్రకటించి.. వెంటనే రేప్ కేసును వెనక్కి తీసుకుంది. ‘ఇప్పుడు రూబెల్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆధారాన్ని, సాక్ష్యాన్ని ఇవ్వను. దీంతో అతడిపై ఇక ఏ కేసూ ఉండదు’ అని హప్పీ స్పష్టం చేసింది. రూబెల్‌పై ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు, అందుకే ఈ కేసునుంచి తప్పుకుంటున్నట్టు హప్పీ లాయర్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. దీంతో తను కూడా కేసుపై పునరాలోచించింది. -
పాక్ ప్రాబబుల్స్‌లో అజ్మల్
కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 31 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే ప్రపంచ కప్ కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శనివారం ప్రకటించింది. తుది జట్టును ఖరారు చేసేందుకు మరో నెల రోజుల గడువు ఉన్నందుకే అజ్మల్‌ను ఎంపిక చేశామని పీసీబీ అధికారి వివరణ ఇచ్చారు. తన బౌలింగ్ శైలిని సరిదిద్దుకునే పనిలో ఉన్న అజ్మల్ త్వరలో ఐసీసీ నిర్వహించే పరీక్షకు హాజరుకానున్నాడు. అజ్మల్‌తోపాటు ప్రాబబుల్స్‌లో వెటరన్స్ కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్‌లకు చోటు దక్కింది. -
ధోని సేన విజేతగా నిలుస్తుంది
వన్డే ప్రపంచకప్‌పై సచిన్ టెండూల్కర్ బ్రాడ్‌మన్ ప్రశంస గర్వకారణం ముంబై: భారత వన్డే క్రికెట్ జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పూర్తి విశ్వాసముంచాడు. అన్ని రకాలుగా సమతుల్యంతో ఉన్న ధోని సేన వచ్చే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. మరో ఐదు నెలల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వరల్డ్ కప్ జరిగే విషయం తెలిసిందే. ‘ప్రస్తుత వన్డే జట్టు బహుముఖ ప్రతిభ కలిగి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో కుడి, ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌తో సమతూకంగా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యం కనిపిస్తోంది. ఫీల్డింగ్ విషయంలోనూ లోపాలు కనిపించడం లేదు. కచ్చితంగా డిఫెండింగ్ చాంప్ భారత్ మళ్లీ విజేతగా నిలుస్తుంది. ఆసీస్, కివీస్‌లోనే 1991-92లో జరిగిన ప్రపంచకప్ నాకు కొన్ని మధుర స్మ ృతులను మిగిల్చింది’ అని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నిర్వహించిన ఈ స్పోర్టింగ్ ఈవెంట్లో ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు క్లబ్ జీవిత కాల సభ్యుడి హోదాను ఇచ్చారు. భారత్, ఆసీస్ జట్లకు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టును ఓడించడమే కోరికగా ఉందని అబాట్ సరదాగా అన్నారు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు బ్రెట్ లీ, గిల్‌క్రిస్ట్ యువ క్రికెటర్లను సన్మానించారు. క్రీడలు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతాయని, ఆరోగ్యం, ఏకాగ్రతను ఇవి పెంపొదిస్తాయని చిన్నారులకు సచిన్ వివరించాడు. ‘బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాలు అద్భుతం’ ప్రపంచ క్రికెట్లో అత్యున్నత బ్యాట్స్‌మన్‌గా కీర్తించే డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను కలుసుకున్న సంఘటన తన జీవితంలో అత్యంత సంతోషదాయకమైందని సచిన్ అన్నాడు. ‘బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. మన ఇద్దరి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉందని చెప్పిన బ్రాడ్‌మన్ కితాబు జీవితంలో నాకు దక్కిన అత్యంత గౌరవం. అలాగే ఆయన తయారుచేసిన ఆల్ టైమ్ టెస్టు ఆటగాళ్ల జాబితాలో నాపేరు ఉండడం గర్వకారణం. ఆ 11 మంది ఆటగాళ్లతో కూడిన ఫొటో ఫ్రేమ్ నా దగ్గర ఉంది. దాన్ని విలువైన సంపదగా భావిస్తాను’ అని సచిన్ చెప్పాడు. -
అదే ‘స్ఫూర్తి’ కావాలి!
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఎదురైంది అవమానకర ఓటమే. గతంలో ఎన్నడూ చూడని పరాభవమే కావచ్చు... కానీ అడుగులు అక్కడే ఆగిపోవుగా! పడిన ప్రతీ సారి పైకి లేచేందుకు కూడా ఆటలో మరో అవకాశం ఉంటుంది. అణువణువునా ఆత్మవిశ్వాసం లోపించిన భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో మట్టికరిచింది గాక... కానీ ఉస్సురని కూలిపోకుండా ఉవ్వెత్తున లేచేందుకు, మన బలం, బలగం చాటేందుకు మళ్లీ సన్నద్ధమవ్వాలి. వన్డేలకు జట్టూ మారింది... ఆపై అండగా నిలిచేందుకు కొత్త సహాయక సిబ్బందీ రానున్నారు. అన్నట్లు...ఇంగ్లండ్ గడ్డపై ఆఖరి సారి వన్డేలు ఆడినప్పుడు మనమే చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్లం. జట్టులో కొత్త ఉత్సాహం నింపేందుకు నాటి ప్రదర్శన స్ఫూర్తి సరిపోదా! ఏడాది క్రితం ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఎక్కడా ఉదాసీనత కనబర్చకుండా ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక...ఇలా ప్రతి పటిష్ట జట్టును ఓడించింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ అయితే అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒక దశలో గెలుపు అవకాశాలు లేకున్నా... పట్టుదలతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. అప్పుడు కూడా ఇంగ్లండ్‌లో సీమర్లకు అనుకూలించే వాతావరణంలో భారత జట్టు టైటిల్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మనవాళ్లు సమష్టి ప్రదర్శనతో సంచలనం నమోదు చేశారు. వాళ్లలో తొమ్మిదిమంది... నాటి జట్టులో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వారు, వీరని లేకుండా ఆటగాళ్లంతా కీలక పాత్ర పోషించారు. 2 సెంచరీలు సహా 363 పరుగులు చేసి ధావన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంటే... కోహ్లి, రోహిత్ శర్మ నిలకడైన ఆటతీరుతో అతనికి అండగా నిలిచారు. ఇక ఇంగ్లండ్ వికెట్లపై కూడా స్పిన్‌తో విజయాలు దక్కుతాయని జడేజా నిరూపించాడు. కేవలం 12.83 సగటుతో అతను 12 వికెట్లు తీశాడు. ఇక ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ భువనేశ్వర్ విజయానికి బాటలు వేశాడు. వీరంతా ఇప్పుడు వన్డే సిరీస్‌లో అప్పటి ప్రదర్శనను పునరావృతం చేయాల్సి ఉంది. రైనా రాకతో వన్డే బ్యాటింగ్ పటిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. రహానే, రాయుడు కూడా మిడిలార్డర్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు వన్డే వరల్డ్ కప్‌కు ఎక్కువగా సమయం లేదు. ఇంగ్లండ్‌లోని పరిస్థితుల్లో ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లకే ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శామ్సన్, కరణ్ శర్మలాంటి ఆటగాళ్లు కూడా తమ సామర్థ్యం నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. వన్డే వ్యూహాల్లో దిట్ట టెస్టు కెప్టెన్సీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా... ధోని వన్డే కెప్టెన్సీ మాత్రం అద్భుతం అనేది అందరూ అంగీకరించాల్సిందే. ఏ దశలోనూ గెలుపు అవకాశం లేని స్థితినుంచి జట్టును విజయం వైపు మళ్లించడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. క్లిష్ట పరిస్థితుల్లో అతడి వ్యూహాలే జట్టును నిలబెడతాయి. ఒక్కసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే చాలు అతనేమిటో తెలుస్తుంది. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చిన ఇషాంత్‌తో 18వ ఓవర్ వేయించడం... అదే ఓవర్లో 2 వికెట్లతో మ్యాచ్ భారత్ వైపు మళ్లించడం ధోనికే సాధ్యమైంది. కెప్టెన్సీనే కాకుండా ధోని ధనాధన్ బ్యాటింగ్ కూడా జట్టుకు బలం. 2011 సిరీస్‌లో వన్డేల్లోనూ మనకు ఒక్క విజయం కూడా దక్కలేదు. అయితే ఈ సారి గత రికార్డును సవరించాలని ధోని భావిస్తున్నాడు. కాబట్టి టెస్టు సిరీస్‌తో పోలిస్తే కెప్టెన్‌నుంచి మరింత మెరుగైన ఫలితాన్ని ఆశించవచ్చు. శాస్త్రి బృందం ఏం చేయనుంది..? అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అయిన వెంటనే రవిశాస్త్రి... తాను కామెంటేటర్‌గా మారనున్నట్లు, రెండేళ్లలో అగ్రశ్రేణి వ్యాఖ్యాతగా నిలబడతానని తన సహచరులతో చాలెంజ్ చేశాడు. పట్టుదలతో అతను దానిని చేసి చూపించాడు. క్రికెట్ ఆడే సమయంలోనూ భారత జట్టులో ‘మానసికంగా దృఢమైన’ వ్యక్తిగా శాస్త్రికి పేరుంది. రవిశాస్త్రి భారత డెరైక్టర్ పాత్ర నిర్వహించేందుకు సమర్థుడు అని అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పుడు జట్టులో ఆటగాళ్ల ప్రతిభను బట్టి చూస్తే పెద్దగా సమస్య లేదు. ఆటగాళ్లతో సంభాషిస్తూ వారి బలాలు, బలహీనతలు గుర్తించి వన్డేలకు తగిన విధంగా మలచడం శాస్త్రిలాంటి సీనియర్‌కు సమస్య కాకపోవచ్చు. అయితే భారీ ఓటమినుంచి వారిని విజయాల బాట పట్టించాలంటే మానసికంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాల్సి ఉంది. ఈ సమయంలో సంజయ్ బంగర్ సహకారం కూడా కీలకం కానుంది. ఐపీఎల్లో పంజాబ్ ఒక్కసారిగా దూసుకు రావడానికి... క్రెడిట్ మొత్తం బంగర్‌దే. మార్పుల తర్వాతైనా టెస్టు పరాజయాలు మరచిపోయే విధంగా భారత్ వన్డేల్లో విజయాలతో అభిమానులను అలరించాలని, తిరిగి గాడిలో పడి ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఉపఖండంలో మ్యాచ్‌లను మినహాయిస్తే ఈ సిరీస్ తర్వాత మనం వన్డేలు ఆడేది ఆస్ట్రేలియా గడ్డపైనే! - సాక్షి క్రీడా విభాగం -
అంతా సచిన్ పుణ్యమే...
* మాస్టర్ జోక్యంతోనే సారథినయ్యా * ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఎంఎస్ ధోని వ్యాఖ్య నాటింగ్‌హామ్: ఎంఎస్ ధోని... భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు.. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే వంద కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షలను గత ఏడేళ్లుగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మోస్తున్న మిస్టర్ కూల్. జట్టును టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే కాకుండా టి20, వన్డే ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ అందించి అభిమానులను అలరించిన నాయకుడు. అయితే ఇన్ని విజయాలకు కారణం మైదానంలో అత్యంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడమే కారణమని ధోని చెబుతున్నాడు. ప్రస్తుత స్థానం గురించి తనకే ఆశ్చర్యంగా ఉందని, వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న తాను సచిన్ టెండూల్కర్ జోక్యంతోనే జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టగలిగానని చెప్పుకొచ్చాడు. ఆదివారం 33వ పుట్టిన రోజు జరుపుకున్న ధోని ఓ ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే.... నేనేదీ ప్లాన్ చేసుకోను: వాస్తవానికి నేను ఏ విషయం గురించి ముందుగా ప్రణాళికలు రచించను. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకముంటుంది. చాలామందికి ఈ విషయంలో తమ గురించి తమకు సరైన పరిజ్ఞానం ఉండదు. ఇప్పటిదాకా ఆడిన అన్ని రకాల క్రికెట్ కారణంగానే కాకుండా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాల వల్లే నాకీ స్వభావం వచ్చింది. సీనియర్ల సలహాలు విన్నాను: సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీలాంటి దిగ్గజాలున్న జట్టుకు నేను నాయకత్వం వహించాను. అయితే ఆ సమయంలో నేను వారి అనుభవాన్ని ఉపయోగించుకున్నాను. వారిచ్చే సలహాలను స్వీకరించాను. ఒకవేళ వారు చెప్పిన దాంతో విభేదిస్తే అప్పుడే వారికి ఆ విషయం చెప్పేవాణ్ణి. దీన్ని వారు కూడా అంగీకరించి కొద్ది సేపటికి మరో ఐడియాతో వచ్చి నిర్ణయాన్ని నాకు వదిలేసేవారు. ఇది నిజంగా వారి గొప్పతనం. నా నిజాయతీ, ముక్కుసూటి తనం నచ్చడం వల్లే వారు నాకు సహకరించగలిగారు. అంతా టెండూల్కర్ చలవే: నేను కెప్టెన్‌గా అయిన క్షణం చాలా ఆశ్చర్యపోయా. అసలు నేను ఏనాడూ ఆ లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అంతకుముందు నేను సచిన్‌తో మాట్లాడిన తీరు వల్లే ఈ అవకాశం వచ్చి ఉండొచ్చు. బౌలింగ్‌లో సచిన్ చాలా వైవిధ్యమైన బంతులు వేయగలడు. అతడు బంతి తీసుకున్నప్పుడల్లా నా దగ్గరకు వచ్చి బ్యాట్స్‌మన్‌కు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, సీమ్ అప్‌లో ఎలాంటి బంతులు వేయాలి? అని అడిగేవాడు. నేనిచ్చిన సూచనల మేరకు... ఇతడు ఆటను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడని సచిన్ భావించి ఉంటాడు. రిటైరయ్యాక అదే పని చేస్తా: మ్యాచ్ గెలిచిన ప్రతీసారి స్టంప్‌ను తీసుకోవడం నాకు అలవాటు. ఓడిన మ్యాచ్ విషయంలో ఇది పట్టించుకోను. నేను ఆట నుంచి తప్పుకున్నాక నా మ్యాచ్‌ల వీడియోలన్నింటినీ చూస్తాను. స్టంప్స్ మీదున్న స్పాన్సర్ లోగోలను నిశితంగా పరీక్షిస్తే అది ఏ మ్యాచ్‌కు సంబంధించిన స్టంప్ అనేది తెలిసిపోతుంది. రిటైరయ్యాక ఇదే నా టైమ్ పాస్. -
లక్ష్యం... వరల్డ్ కప్!
ఐపీఎల్లో బాగా ఆడటమే మార్గం సన్‌రైజర్స్ సమతూకంగా ఉంది క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత జట్టులో పునరాగమనం చేసి 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడటమే తన లక్ష్యమని ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అందుకు ఈ ఏడాది జరిగే ఐపీఎల్-7ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటానని అతను అన్నాడు. భారత్ తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్... ఆఖరిసారిగా 2012 టి20 ప్రపంచ కప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఐపీఎల్లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. ‘2015 ప్రపంచ కప్ ఆడటమే నా లక్ష్యం. అయితే అంతకుముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. ముందుగా భారత జట్టులో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తాను. ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ జట్టు మరీ లోయర్ ఆర్డర్లో కాకుండా కాస్త ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తోందని ఆశిస్తున్నా’ అని ఇర్ఫాన్ చెప్పాడు. తన శరీర స్థాయిని మించి చేసిన అదనపు శ్రమతో తరచుగా గాయాల పాలయ్యానని, అయితే ఎన్సీఏలో ప్రత్యేక శిక్షణ అనంతరం ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. బౌలింగ్‌లో వేగంకంటే స్వింగ్కే తన ప్రాధాన్యత అని అతను చెప్పాడు. ‘145 కిమీ.కు పైగా వేగం చేయాలని ప్రయత్నించి లయ తప్పడం నాకిష్టం లేదు. వేగంకంటే బంతిని స్వింగ్ చేయగలగడం నా సహజ నైపుణ్యంగా భావిస్తా. అందుకే దానితోనే మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’ అని ఈ బరోడా ఆటగాడు తెలిపాడు. సమతూకంతో ఉన్న సన్‌రైజర్స్ జట్టుకు ఈసారి ఐపీఎల్లో విజయావకాశాలు ఉన్నాయని ఇర్ఫాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
క్వార్టర్స్‌లో శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ దుబాయ్: వరుసగా రెండో విజయం నమోదు చేసి శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు అండర్-19 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక వికెట్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించగా... దక్షిణాఫ్రికా 45 పరుగుల ఆధిక్యం తో కెనడాపై గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ట్రాటర్ (120 బంతుల్లో 95; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. అనంతరం శ్రీలంక 48.5 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సమర విక్రమ (89 బంతుల్లో 82; 10 ఫోర్లు)తో పాటు సుమన సిరి (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించారు. ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 112 పరుగులతో యూఏఈపై, వెస్టిండీస్ 167 పరుగులతో జింబాబ్వేపై గెలిచాయి. -
ప్రయోగాలు చేయం
ఉదయం గం. 6.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ పర్యటనలో ప్రయోగాలు చేసేందుకు భారత కెప్టెన్ ధోని ఆసక్తి కనబర్చడం లేదు. వీలైనంతగా ఈ టూర్ నుంచి యువకులు మంచి అనుభవాన్ని సంపాదించాలని మాత్రం కోరుకుంటున్నాడు. రాబోయే వరల్డ్‌కప్ ఆసీస్, కివీస్ గడ్డపై జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లు కుదురుకుంటే ఇక ఢోకా ఉండదని భావిస్తున్నాడు. నేటి నుంచి జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై ధోని మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడాడు. నేపియర్: బ్యాటింగ్‌లో నాలుగో నంబర్లో ఎవరు ఆడతారనే అంశంపై ఇంకా ఆలోచించలేదని ధోని చెప్పాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రైనాను ఈ స్థానానికి ప్రమోట్ చేయడంపై కెప్టెన్ ఎలాంటి స్పందన కనబర్చలేదు. ‘ఏది మంచి అనుకుంటే ఆ దిశగా ముందుకెళ్తాం. చాపెల్ శకం తర్వాత మేం పెద్దగా ప్రయోగాలు చేయడం లేదు. అవకాశం ఇచ్చిన కొంత మంది ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకున్నారు. సవాళ్లనూ అధిగమించారు’ అని ధోని వ్యాఖ్యానించాడు. గాలివాటం కీలకం కివీస్‌లో గాలివాటం కీలక పాత్ర పోషిస్తుంది. బంతి దిశపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. జట్టులోకి వచ్చిన కొత్త బౌలర్లకు ఇక్కడ ఆడిన అనుభవం కావాలి. 2015 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికలపై ఆడిన అనుభవం మా జట్టులోకి ఇద్దరు, ముగ్గురికే ఉంది. ఏదేమైనా ఈ టూర్ మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. డ్రాపింగ్ పిచ్ కాదు... తొలి వన్డే జరిగే మెక్లీన్ పార్క్‌లో ఉన్నది డ్రాపింగ్ పిచ్ కాదు. రగ్బీ సీజన్ లేకపోవడంతో షెడ్యూల్ కంటే ముందే వికెట్‌ను సిద్ధం చేశారు. కాబట్టి వన్డేలకు సరిపోయే విధంగా ఉంది. వికెట్ పొడిగా, కఠినంగా ఉంది. పేసర్లకు ఎక్స్ట్రా బౌన్స్ లభిస్తుంది. ‘పేస్’తో కొడతాం: మెకల్లమ్ తొలి వన్డేలో భారత్‌ను పేస్‌తో దెబ్బతీస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ హెచ్చరించాడు. ఐదుగురు పేసర్లతో తమ సత్తా ఏంటో రుచి చూపిస్తామని చెప్పాడు. ‘మా పేసర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి వన్డేలోనే పేస్‌తో అటాక్ చేసి ఫలితాన్ని సాధిస్తాం. మా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్ దెబ్బతీసినా ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. కొత్త బంతితో మిల్స్, సౌతీ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. మొత్తానికి మా పేస్ అటాక్ మంచి దూకుడు మీదుంది’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు. భారత బౌలింగ్‌ను బట్టి తమ బ్యాటింగ్ తీరు ఉంటుందన్నాడు. స్లో, టర్నింగ్ ట్రాక్‌లపై ఎక్కువగా ఆడే ధోనిసేనకు ఇక్కడి వికెట్లపై ఇబ్బందులు తప్పవన్నాడు. -
మొదటి ‘సన్నాహకం’
తొలి వన్డే ఆదివారం ఉదయం 6.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదే సమయం ఉంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆ మెగా టోర్నీని నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డలపై విశేషంగా రాణించాలి. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాలో ధోనిసేన పర్యటిస్తుంది. మరి కఠినమైన పరిస్థితులు, విభిన్నమైన ఆకారంలో ఉండే మైదానాలు, బౌన్సీ వికెట్లు ఉండే న్యూజిలాండ్‌లో ఎలా..? దీనికి సమాధానమే ప్రస్తుత పర్యటన. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌ను భారత జట్టు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు (ఆదివారం) జరిగే తొలి వన్డేలో భారత్ ఎలాంటి ప్రయోగాలు చేస్తుందనేది ఆసక్తికరం. నేపియర్: ప్రస్తుతం భారత వన్డే జట్టులో ఉన్న క్రికెటర్లలో ఒకరిద్దరిని మినహాయిస్తే ఎవరికీ న్యూజిలాండ్‌లో ఆడిన అనుభవం లేదు. కాబట్టి కివీస్‌తో వన్డే సిరీస్ భారత యువ జట్టుకు చాలా కీలకం. సొంతగడ్డపై బెబ్బులిలా చెలరేగే న్యూజిలాండ్... బౌన్సీ వికెట్లతోనే భారత్‌కు స్వాగతం పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత యువ బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్ కఠిన పరీక్ష. ఇందులో నెగ్గితే ప్రపంచకప్ జట్టులో బెర్త్ ఖాయం అనుకోవాలి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో భారత్ ఆడే ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇందులో మొదటి మ్యాచ్ రేపు (ఆదివారం) జరుగుతుంది. ‘యువ’ మంత్రం దక్షిణాఫ్రికాలో భారత బ్యాట్స్‌మెన్ వన్డేల్లో ఘోరంగా విఫలమయ్యారు. వన్డేల్లో న్యూజిలాండ్‌లోనూ అదే తరహా పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుత జట్టులో ధోని, రోహిత్, రైనా తప్ప ఎవరూ గతంలో న్యూజిలాండ్‌లో ఆడలేదు. దీనికి తోడు వన్డే సిరీస్‌కు ముందు ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. ధావన్, కోహ్లి, రాయుడు, రహానేలాంటి వారందరికీ ఇదో పెద్ద పరీక్ష. బౌలింగ్‌లో భారత్ భువనేశ్వర్, షమీ, ఇషాంత్‌లపైనే ఆధారపడొచ్చు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే స్టువర్ట్ బిన్నీకి అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుంది. 46 ఇప్పటి వరకు న్యూజిలాండ్‌తో భారత్ 88 వన్డేలు ఆడితే 46 గెలిచింది. ఐదింటిలో ఫలితం రాలేదు. 10 కివీస్‌లో ఆడిన 29 వన్డేల్లో భారత్ 10 మాత్రమే గెలిచింది. రెండింటిలో ఫలితం రాలేదు. సొంతగడ్డపై అదుర్స్ బయటి దేశాల్లో న్యూజిలాండ్ ఆటతీరు ఎలా ఉన్నా... సొంత గడ్డపై మాత్రం అంచనాలకు మించి ఆడుతోంది. ఒకరిద్దరు ఆటగాళ్లే కాకుండా జట్టంతా సమష్టిగా రాణిస్తుండం అనుకూలాంశం. ఇటీవల విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అండర్సన్ ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో)తో చెలరేగితే... చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రైడర్ కూడా దుమ్మురేపాడు. అయితే నిలకడలేమి వాళ్లకు ఇబ్బంది కలిగించే అంశం. టాప్ ఆర్డర్ కుదురుకొని, పేసర్లు సత్తా మేరకు రాణిస్తే.. భారత్‌కు పరీక్ష తప్పదు. సంచలనాలు నమోదు చేయడంలో న్యూజిలాండ్ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి ధోనిసేన అప్రమత్తంగా వ్యవహరించడం చాలా అవసరం. గెలిస్తే నంబర్‌వన్ పదిలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌ను భారత్ (120 రేటింగ్ పాయింట్లు) గెలిచి తీరాలి. ఒకవేళ భారత్ సిరీస్ ఓడిపోయి, అటు ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గనక సిరీస్‌ను గెలిస్తే కంగారూలకు అగ్రస్థానం దక్కుతుంది. రాయుడుకు చాన్స్ దొరికేనా! సఫారీ పర్యటనలో బెంచ్‌కే పరిమితమైన హైదరాబాద్ ఆటగాడు తిరుపతి రాయుడుకు ఈ టూర్లో అవకాశం వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. యువరాజ్ లేకపోవడంతో అతని స్థానం కోసం రహానే, రాయుడు మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టులతో పాటు ఆడిన ఏకైక వన్డేలో రహానే ఆకట్టుకున్నాడు. కానీ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును బలోపేతం చేయాలంటే రాయుడును న్యూజిలాండ్ పిచ్‌లపై పరీక్షించాలి.