ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లు డియాండ్రా డాటిన్(31 పరుగులు), హేలే మాథ్యూస్(45 పరుగులు) శుభారంభం అందించినప్పటికీ.. వీరిద్దరు అవుటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ 80 బంతుల్లో 66 సాధించగా.. చెడియన్ నేషన్ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెరసి నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ 6 పరుగుల నష్టానికి 225 పరుగులు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేధనకు దిగిన ఇంగ్లండ్ మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ హిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ టామీ బీమౌంట్ మాత్రం 46 పరుగులతో ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే, చివర్లో సోఫీ, కేట్ క్రాస్ హిట్టింగ్ ఆడటంతో ఇంగ్లండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి.
కానీ, విండీస్ బౌలర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ 218 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం వెస్టిండీస్‌ను వరించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన షిమేన్ కాంప్‌బెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022
వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు:
విండీస్- 225/6 (50 ఓవర్లు)
ఇంగ్లండ్- 218 (47.4 ఓవర్లు)
చదవండి: IPL 2022- CSK: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment