మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను మెల్‌బోర్న్ రెనెగేడ్స్ గెలుచుకుంది . ఇవాళ (డిసెంబర్ 1) జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
అనంతరం బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ చేసే సమయానికి వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 12 ఓవర్లలో 98 పరుగులకు కుదించారు. ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన బ్రిస్బేన్ హీట్ లక్ష్యానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది. నికోలా హ్యాంకాక్ చివరి బంతికి సిక్సర్ బాదినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
రాణించిన హేలీ మాథ్యూస్
తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్.. హేలీ మాథ్యూస్ అర్ద సెంచరీతో (61 బంతుల్లో 69) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జార్జియా వేర్హమ్ (21), నయోమీ స్టాలెన్‌బర్గ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో చార్లీ నాట్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ పార్సన్స్ 2, నికోలా హ్యాంకాక్, లూసీ హ్మామిల్టన్, జొనాసెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
జొనాసెన్ పోరాటం వృధా
98 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ తడబడింది. ఆ జట్టులో జెస్ జోనాసెన్ (44 నాటౌట్), నికోలా హ్యాంకాక్ (13 నాటౌట్) ఎవ్వరూ రాణించలేదు. వీరిద్దరు కాక జార్జియా రెడ్‌మేన్ (16) రెండంకెల స్కోర్ చేసింది. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 2, చారిస్ బెక్కర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, సోఫీ మోలినెక్స్, డియాండ్ర డాటిన్ తలో వికెట్ పడగొట్టారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ఇది తొలి టైటిల్.
Comments
Please login to add a commentAdd a comment