Women Big Bash League
-
బిగ్‌బాష్ లీగ్ విజేత మెల్బోర్న్ రెనెగేడ్స్
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను మెల్బోర్న్ రెనెగేడ్స్ గెలుచుకుంది . ఇవాళ (డిసెంబర్ 1) జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ చేసే సమయానికి వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 12 ఓవర్లలో 98 పరుగులకు కుదించారు. ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన బ్రిస్బేన్ హీట్ లక్ష్యానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది. నికోలా హ్యాంకాక్ చివరి బంతికి సిక్సర్ బాదినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.రాణించిన హేలీ మాథ్యూస్తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్.. హేలీ మాథ్యూస్ అర్ద సెంచరీతో (61 బంతుల్లో 69) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జార్జియా వేర్హమ్ (21), నయోమీ స్టాలెన్‌బర్గ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో చార్లీ నాట్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ పార్సన్స్ 2, నికోలా హ్యాంకాక్, లూసీ హ్మామిల్టన్, జొనాసెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.జొనాసెన్ పోరాటం వృధా98 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ తడబడింది. ఆ జట్టులో జెస్ జోనాసెన్ (44 నాటౌట్), నికోలా హ్యాంకాక్ (13 నాటౌట్) ఎవ్వరూ రాణించలేదు. వీరిద్దరు కాక జార్జియా రెడ్మేన్ (16) రెండంకెల స్కోర్ చేసింది. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 2, చారిస్ బెక్కర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, సోఫీ మోలినెక్స్, డియాండ్ర డాటిన్ తలో వికెట్ పడగొట్టారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ఇది తొలి టైటిల్. -
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. అయితే కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్‌కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జతకట్టిన మంధన.. బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో 19 మంది భారత ప్లేయర్లు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మహిళల బిగ్‌బాష్ లీగ్ సీజన్-10లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జతకట్టనుంది. స్మృతి డబ్ల్యూబీబీఎల్ ప్రీ డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తొలి ఓవర్సీస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. మంధన గతంలో బ్రిస్బేన్ హీట్ (2016-17), హోబర్ట్ హరికేన్స్ (2018-19), సిడ్నీ థండర్ (2021) ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించింది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా మంధన 2022, 2023 ఎడిషన్లలో పాల్గొనలేదు. అడిలైడ్ స్ట్రయికర్స్లో మంధన ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్‌తో కలిసి పని చేయనుంది. లూక్ అడిలైడ్ స్ట్రయికర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.డ్రాఫ్ట్‌లో 19 మంది భారత ప్లేయర్లు..మహిళల బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో 19 మంది భారత క్రికెటర్లు పాల్గొననున్నారు. ప్లేయర్ల డ్రాఫ్ట్ వచ్చే ఆదివారం జరుగనుంది. డ్రాఫ్ట్‌లో పాల్గొంటున్న భారత స్టార్ ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెజ్, దీప్తి శర్మ ముఖ్యులు. వీరితో పాటు శ్రేయాంక పాటిల్, టైటాస్ సాధు, ఆశా శోభన, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, యస్తికా భాటియా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత దయాలన్, సంజన సంజీవన్, మన్నత్ కశ్యప్, మేఘన సబ్బినేని, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, మేఘన సింగ్ డ్రాఫ్ట్‌లో పాల్గొంటున్నారు. -
స్పిన్ మ్యాజిక్ అంటే ఇదేనేమో.. జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ స్పిన్ బౌలర్ చార్లీ నాట్ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్భేన్ హీట్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్‌కు చార్లీ నాట్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన నాట్ (రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్).. నాలుగో బంతికి సోఫియా డంక్లీను క్లీన్ బౌల్డ్ చేసి, బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులంతా అవాక్కయ్యేలా చేసింది. అక్కడెక్కడో ఆఫ్ వికెట్ అవతల పడ్డ బంతి గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటు వేయడంతో (మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌కు) ఆశ్చర్యపోవడం అందరివంతైంది. బ్యాటర్ అలాగే బంతిని చూస్తూ నిశ్చేష్టురాలిగా మిగిలిపోయింది. బంతి అంతలా మెలికలు తిరుగుతూ మాయ చేయడంతో బౌలర్ ముఖంలోనూ వింతహావభావాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు స్పిన్ మాయ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నాట్ వేసిన బంతిని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ద సెంచరీతో పోలుస్తున్నారు. మొత్తానికి స్పిన్ మ్యాజిక్కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Spin 🤯pic.twitter.com/AD2DRB3mYM — CricTracker (@Cricketracker) October 27, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్భేన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రిస్భేన్ ఇన్నింగ్స్‌లో జార్జియా వాల్ (48 నాటౌట్), చార్లీ నాట్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లు సదర్‌ల్యాండ్, క్యాప్సీ తలో 2 వికెట్లు.. కిమ్ గార్త్, ఇల్లింగ్‌వర్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 48 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది. అలైస్ క్యాప్సీ (44 నాటౌట్) పోరాడుతుంది. బ్రిస్భేన్ బౌలర్లలో చార్లీ నాట్, నికోలా హ్యాంకాక్, జెస్ జోనాస్సెన్, సారా గ్లెన్ తలో వికెట్ పడగొట్టారు. -
BBL: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల బిగ్‌బాష్ టి20 క్రికెట్ లీగ్ ఎనిమిదో ఎడిషన్‌లో భాగం కానుంది. ఈ మేరకు ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ జట్టుతో మరోసారి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రెనెగేడ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కాగా ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ గత సీజన్లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 33 ఏళ్ల హర్మన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 406 పరుగులు సాధించడంతో పాటుగా 15 వికెట్లు పడగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి హర్మన్‌ను తమ జట్టులో చేర్చుకోనుంది రెనెగేడ్స్. ఈ విషయం గురించి హర్మన్‌ప్రీత్ కౌర్ రెనెగేడ్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. మరోసారి ఈ జట్టుకు ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. కాగా మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హర్మన్ భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. వీళ్లు సైతం.. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) ఆడారు. ఈ లీగ్‌లో గత సీజన్‌తో జెమీమా తొలిసారి బరిలోకి దిగగా.. గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్ రెనెగేడ్స్‌కు మారింది. వచ్చే సీజన్లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక It's official 😍#GETONRED pic.twitter.com/yPnUOkEH43 — Renegades WBBL (@RenegadesWBBL) July 4, 2022 -
Harmanpreet Kaur: అదరగొట్టిన టి20 జట్టు కెప్టెన్.. ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు
Harmanpreet Kaur Name In WBBL Team Of Tournament: భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు దక్కింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్న ఆమెకు లీగ్ అధికారిక ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ జాబితాలో చోటు దక్కింది. ఈ సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటిదాకా తన బ్యాట్‌తో 399 పరుగులు చేసింది. మూడు అర్ధసెంచరీలు బాదిన హర్మన్ 66.50 సగటు, 135.25 స్ట్రయిక్‌రేట్ నమోదు చేసింది. 32 ఏళ్ల ఈ భారత ఆల్‌రౌండర్ 18 సిక్సర్లు బాదడం విశేషం. ఇక బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టింది. ఆమె అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 3/22. ‘రెనెగేడ్స్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా రాణిస్తోంది. బ్యాట్, బంతితో చెలరేగుతోంది. ఆమె ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది’ అని ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. రెనెగేడ్స్ లెగ్‌స్పిన్నర్ జార్జియా వేర్హమ్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఆమె ప్రతిమ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తోంది. కాగా డబ్ల్యూబీబీఎల్ అధికారిక టీమ్ ఆఫ్ ద టోర్నీలో ఒక్క హర్మన్ మినహా మరే భారత ప్లేయర్‌కు అవకాశం దక్కలేదు. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
హర్మన్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో..
Harmanpreet Kaurs All round Excellence In WBBL: మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో మెల్బోర్న్ రెనెగెడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (2/17; 29 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 3 సిక్స్‌లు) అదరగొట్టింది. దాంతో సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ జట్టు ఏడు వికెట్ల తో నెగ్గింది. తొలుత సిడ్నీ 4 వికెట్లకు 118 పరుగులు చేసింది. మెల్బోర్న్ 17 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Ind Vs Pak: టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. అతడిని ఆడించకపోయి ఉంటే: ఆసీస్ మాజీ క్రికెటర్ -
స్టన్నింగ్ డైవ్ క్యాచ్, వహ్వా అనాల్సిందే!
అలా దూరంగా వెళ్తున్న బంతిని సైతం గాల్లో పల్టీలు కొడుతూ క్యాచ్ పడితే.. అదిరిపోయే క్యాచ్ అంటూ ఆ ఫీల్డర్‌పై ప్రశంసలు కురిపిస్తాం. అదే సమయంలో ఆ క్యాచ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే అభిమానులు మరింత కేరింతలు కొడతారు. తాజాగా, మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇలాంటి ఓ డైవింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిస్బేన్ హీట్ వుమెన్ వర్సెస్ అడిలైడ్ స్ట్రయికర్స్ వుమెన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ స్టన్నింగ్ క్యాచ్ వెలుగు చూసింది. 17 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో.. అడిలైడ్ స్పిన్నర్ అమంద వెల్లింగ్టన్ విసిరిన ఫుల్‌టాస్ బంతిని అమెలియా కేర్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాలనుకుంది. ఆమె కొట్టిన షాట్ బాల్‌ను షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న మ్యాడీ పెన్నా క్యాచ్ కోసం ప్రయత్నించగా.. ఫలించలేదు. ఆమె చేతులను తాకుతూ బంతి అమాంతం పైకి లేచి బుల్లెట్లా బౌండరీ వైపుగా దూసుకెళ్తోంది. పెన్నాకు సమీపంలోనే ఉన్న తాహిలా మెక్‌గ్రాత్ చాకచక్యంగా ఫుల్‌లెంగ్త్‌లో డైవ్ చేసి ఆ బంతిని ఒడిసిపట్టింది. అప్పటికే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బ్రిస్బేన్ జట్టు తాజా వికెట్‌తో ఒత్తిడికి లోనైంది. ఫలితంగా అడిలైడ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 20 ఓవర్లకు 153 పరుగులు చేయగా.. బ్రిస్బేన్ జట్టు 135 పరుగులే చేయగలిగింది. -
బిగ్ బాష్‌లోకి స్మృతి మందన
న్యూఢిల్లీ: మహిళల బిగ్ బాష్ లీగ్‌లో మరో భారత బ్యాట్స్‌వుమన్‌కు చోటు దక్కింది. బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ స్మృతి మందనతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆసీస్‌తో హోబర్ట్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా తను వరుసగా 55, 55, 46 పరుగులతో రాణించింది. దీంతో హీట్స్ జట్టులోని ఇతర మహిళా క్రికెటర్లు అంతా ఆమె పేరునే సూచించినట్టు ఆ జట్టు కోచ్ ఆండీ రిచర్డ్స్ తెలిపారు.