Harmanpreet Kaur: అదరగొట్టిన టి20 జట్టు కెప్టెన్‌.. ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు | Indian T20 Team Captain Harmanpreet Kaur Name In WBBL Team Of Tournament | Sakshi
Sakshi News home page

Harmanpreet Kaur- WBBL: అదరగొట్టిన టి20 జట్టు కెప్టెన్‌.. బిగ్‌బాష్‌ ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ’లో స్థానం

Published Tue, Nov 23 2021 8:13 AM | Last Updated on Tue, Nov 23 2021 8:22 AM

Indian T20 Team Captain Harmanpreet Kaur Name In WBBL Team Of Tournament - Sakshi

Harmanpreet Kaur Name In WBBL Team Of Tournament: భారత మహిళల టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు దక్కింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తున్న ఆమెకు లీగ్‌ అధికారిక ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ జాబితాలో చోటు దక్కింది. ఈ సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటిదాకా తన బ్యాట్‌తో 399 పరుగులు చేసింది. మూడు అర్ధసెంచరీలు బాదిన హర్మన్‌ 66.50 సగటు, 135.25 స్ట్రయిక్‌రేట్‌ నమోదు చేసింది. 32 ఏళ్ల ఈ భారత ఆల్‌రౌండర్‌ 18 సిక్సర్లు బాదడం విశేషం.

ఇక బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టింది. ఆమె అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 3/22. ‘రెనెగేడ్స్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతంగా రాణిస్తోంది. బ్యాట్, బంతితో చెలరేగుతోంది. ఆమె ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది’ అని ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. రెనెగేడ్స్‌ లెగ్‌స్పిన్నర్‌ జార్జియా వేర్‌హమ్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఆమె ప్రతిమ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తోంది. కాగా డబ్ల్యూబీబీఎల్‌ అధికారిక టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీలో ఒక్క హర్మన్‌ మినహా మరే భారత ప్లేయర్‌కు అవకాశం దక్కలేదు. 

చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌.. తన కోసం మళ్లీ క్రికెట్‌ చూస్తా: నటి
MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్‌ సిక్సర్‌.. ధోని ఫొటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement