Indian women team
-
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్‌పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్‌కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్‌కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్‌పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్‌పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్‌కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్‌ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్‌కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్‌గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్‌గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్‌గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0. -
భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది. -
భారత సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేయనున్న సాఫ్ట్‌బాల్ క్రీడాంశంలో పాల్గొనే భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. నిజామాబాద్ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్íÙప్లో భారత జట్టు రెగ్యులర్ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి. -
భారత జట్టుకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్‌లో..
India Women tour of Bangladesh, 2023- మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ ఆశలకు ఆతిథ్య జట్టు గండికొట్టింది. ఆఖరి టి20లో బంగ్లా ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో బోల్తా పడింది. దీంతో సిరీస్‌ను 3–0 గెలవాలనుకున్న భారత్ 2–1తో సరిపెట్టుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులే చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (11) సహా అందరు మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (40; 3 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (28; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3, సుల్తానా 2 వికెట్లు తీశారు. తర్వాత బంగ్లా 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 103 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షమీమా సుల్తానా (46 బంతుల్లో 42; 3 ఫోర్లు) గెలిపించే బాధ్యత తీసుకుంది. భారత బౌలర్లలో దేవిక వైద్య, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. ఓవరాల్‌గా మహిళల జట్టుకు బంగ్లా చేతిలో ఇది మూడో ఓటమి. ఈ మూడు మ్యాచ్‌లకూ హర్మన్‌ప్రీత్ కౌరే కెపె్టన్‌గా వ్యవహరించింది. ఈ పర్యటనలో తదుపరి మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ కూడా ఇదే వేదికపై 16న జరిగే తొలి వన్డేతో మొదలవుతుంది. చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో.. -
FIH Hockey Nations Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. సెమీ ఫైనల్ దిశగా భారత్
FIH Hockey Nations Cup: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. స్పెయిన్‌లో సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌పై గెలిచింది. భారత్ తరఫున సలీమా టెటె (5వ ని.లో), బ్యూటీ డుంగ్‌డుంగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు రుయ్ తకషిమా (49వ ని.లో) ఏకైక గోల్ అందించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే భారత్ సెమీఫైనల్ చేరుతుంది. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
దురదృష్టం అంటే వీళ్లదే! థాయ్‌లాండ్‌కు మేలు చేసిన ‘వర్షం’! సెమీస్‌లో
Womens Asia Cup T20 2022 : మహిళల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో బంగ్లాదేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరణుడు ఆటంకం కలిగించిన కారణంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు! ఇక బంగ్లా నిష్క్రమణతో థాయ్‌లాండ్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెల్హెట్ వేదికగా మంగళవారం(అక్టోబరు 11) బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెమీస్‌లో థాయ్‌లాండ్ దీంతో బంగ్లా, యూఏఈ జట్లకు భంగపాటు ఎదురైంది. చెరో పాయింట్ లభించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లా గ్రూప్ దశలో ఐదో స్థానంలో నిలిచిపోయింది. మరోవైపు.. పాకిస్తాన్‌పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన థాయ్‌లాండ్ ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు టాప్-4లో స్థానం దక్కించుకుంది. కాగా అక్టోబరు 13న సెమీ ఫైనల్స్ జరుగనుండగా.. 15న మహిళల ఆసియా కప్-2022 ఫైనల్ జరుగనుంది. ఇక ఈసారి మ్యాచ్‌లన్నీ సెల్హెట్లోని సెల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగడం గమనార్హం. చదవండి: T20 World Cup 2022: నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్ Sreehari Nataraj: 'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం After a hard fought battle, India 🇮🇳, Pakistan 🇵🇰, Sri Lanka 🇱🇰 and Thailand 🇹🇭 qualify for the semi-finals of the #WomensAsiaCup2022 🏆! We have some exciting games lined up ahead! Who are you rooting for? 👇#AsianCricketCouncil #ACC pic.twitter.com/QWUUd4z8l9 — AsianCricketCouncil (@ACCMedia1) October 11, 2022 -
‘జులన్‌కు ఘనంగా వీడ్కోలు ఇస్తాం’
కాంటర్బరి: వరుసగా రెండు మ్యాచ్‌ల విజయాలతో 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్‌లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్‌కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది. ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత... భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్‌లో ఆఖరి వన్డే జరుగుతుంది. -
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లతో కలిసి గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మరి భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం! భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్: ►తేది: జూలై 31, 2022 ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్ ►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్ కీపర్), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగెస్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా. స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు: బిస్మా మరూఫ్(కెప్టెన్), ముబీనా అలీ(వికెట్ కీపర్), ఆనమ్ అమిన్, ఐమన్ అన్వర్, డయానా బేగ్, నిదా దర్, గుల్ ఫిరోజా(వికెట్ కీపర్), తుబా హసన్, కైనట్ ఇంతియాజ్, సాదియా ఇక్బాల్, ఈరమ్ జావేద్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
World Cup 2022: అసలైన మ్యాచ్‌లలో చేతులెత్తేశారు! జపాన్‌తో పోరులో..
టెరసా (స్పెయిన్): అసలైన మ్యాచ్‌ల్లో గెలుపొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు వర్గీకరణ పోటీల్లో వరుస విజయాలు సాధించి ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంతో ముగించింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో జపాన్‌పై విజయం సాధించింది. ఫార్వర్డ్ ప్లేయర్ నవ్‌నీత్ కౌర్ (30వ, 45వ ని.) రెండు ఫీల్డ్ గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. జట్టులో మరో గోల్‌ను దీప్ గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్ ద్వారా (38వ నిమిషం) సాధించింది. జపాన్ జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను యు అసయ్ 20వ నిమిషంలో చేసింది. జపాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను యు అసయ్ పొరపాటు చేయకుండా గోల్‌పోస్ట్ లోకి పంపడంతో 1–0తో మ్యాచ్‌లో పైచేయి సాధించింది. భారత శిబిరంలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ మూడో క్వార్టర్లో దీప్ గ్రేస్, నవ్‌నీత్ గోల్స్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
BBL: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల బిగ్‌బాష్ టి20 క్రికెట్ లీగ్ ఎనిమిదో ఎడిషన్‌లో భాగం కానుంది. ఈ మేరకు ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ జట్టుతో మరోసారి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రెనెగేడ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కాగా ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ గత సీజన్లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 33 ఏళ్ల హర్మన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 406 పరుగులు సాధించడంతో పాటుగా 15 వికెట్లు పడగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి హర్మన్‌ను తమ జట్టులో చేర్చుకోనుంది రెనెగేడ్స్. ఈ విషయం గురించి హర్మన్‌ప్రీత్ కౌర్ రెనెగేడ్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. మరోసారి ఈ జట్టుకు ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. కాగా మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హర్మన్ భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. వీళ్లు సైతం.. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) ఆడారు. ఈ లీగ్‌లో గత సీజన్‌తో జెమీమా తొలిసారి బరిలోకి దిగగా.. గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్ రెనెగేడ్స్‌కు మారింది. వచ్చే సీజన్లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక It's official 😍#GETONRED pic.twitter.com/yPnUOkEH43 — Renegades WBBL (@RenegadesWBBL) July 4, 2022 -
శెభాష్ మిథూ: 23 ఏళ్ల కెరీర్.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్!
Mithali Raj Retirement: భారత క్రికెటర్‌గా దాదాపు 23 ఏళ్ల పాటు కొనసాగించిన ప్రస్థానానికి మిథాలీ రాజ్ ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన ఆమె.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. కాగా 39 ఏళ్ల మిథాలీ క్రికెటర్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి లెజెండ్‌గా ఖ్యాతి గడించారు. మిథాలీ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సాధించిన ఘనతల గురించి సంక్షిప్తంగా.. ♦1999లో మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. చివరిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ♦వన్డేల్లో అత్యధిక పరుగులు(7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు ♦వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా ఘనత ♦వుమెన్ వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ జాబితాలో రెండో స్థానంలో మిథాలీ రాజ్(1321 పరుగులు) ♦వన్డేల్లో అత్యధిక సెంచరీలు(7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి. ♦టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ సాధించిన పరుగులు 2364. 2019లో చివరి మ్యాచ్ ఆడిన ఆమె.. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ►మహిళా క్రికెట్లో ఇప్పటి వరకు 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868. ►మహిళా ప్రపంచకప్ ఈవెంట్లో ఏకంగా ఆరుసార్లు( 2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు. ►మహిళా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. 2002లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 214 పరుగులు సాధించిన మిథాలీ. ►మహిళా వన్డే క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌కు పేరు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. ►మహిళా క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ అరుదైన రికార్డు. ఆమె 22 ఏళ్ల 274 రోజుల పాటు క్రికెటర్‌గా ఉన్నారు. ♦మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా మిథాలీ(న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం). ♦అదే విధంగా కెప్టెన్‌గానూ మెగా ఈవెంట్లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. ♦వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రికార్డు. ♦మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. చదవండి: Nicholas Pooran: ఐపీఎల్లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్! కానీ పాక్‌తో మ్యాచ్‌లో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై
-
Mithali Raj: రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్
Mithali Raj Retirement: భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ సీనియర్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం గడించాను. ప్రతి ప్రయాణం లాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా! ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును గెలిపించాలని భావించేదానిని. ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి’’ అంటూ మిథాలీ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్ ప్రణాళికల గురించి హింట్ ఇచ్చారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. తనకు అండగా నిలిచి ఆదరాభిమానాలు చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా 2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ తాజాగా వన్డే, టెస్టులకు కూడా గుడ్ బై చెప్పారు. 1999లో అరంగ్రేటం చేసిన మిథాలీ రాజ్.. భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగారు. 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. భారత్ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడారు. చదవండి: Ind Vs SA: పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! Thank you for all your love & support over the years! I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u — Mithali Raj (@M_Raj03) June 8, 2022 -
కివీస్ ముందు నిలవలేక...
పాకిస్తాన్‌తో ఘన విజయంతో ప్రపంచకప్‌ను ప్రారంభించిన భారత మహిళలకు రెండో మ్యాచ్‌లో కలిసి రాలేదు. ఆతిథ్య న్యూజిలాండ్‌తో పోరులో ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబర్చలేక మిథాలీ బృందం చతికిలపడింది. ప్రపంచకప్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్ తరహాలోనే కివీస్‌ను నిలువరించలేక భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టు ఆడిన, ఓడిన తీరు పూర్తిగా నిరాశపర్చింది. సింగిల్ కూడా తీయని ‘డాట్ బంతులు’ భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా 156 (26 ఓవర్లు) ఉన్నాయంటే మన బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థమవుతుంది! హామిల్టన్: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత మహిళల విజయలక్ష్యం 261 పరుగులు... ఇలాంటి ఛేదనలో శుభారంభం లభించాలి, టాపార్డర్ దూకుడుగా ఆడి వేగంగా పరుగులు రాబట్టాలి... కానీ పవర్‌ప్లేలో మన స్కోరు 2 వికెట్లకు 26 పరుగులు అయితే, 20 ఓవర్లు ముగిసే సరికి 50/3... ఇక్కడే జట్టు గెలుపు అవకాశాలు ముగిసిపోయాయి! మిగిలిన 30 ఓవర్లలో 211 పరుగులు సాధించడం అసాధ్యంగా మారిపోయి భారత్ కుప్పకూలింది. డే అండ్ నైట్ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఉండ వచ్చని భావించిన భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎం చుకోగా...చివరకు మంచు ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఛేదన కష్టసాధ్యంగా మారిపోయింది. గురువారం జరిగిన మహిళల ప్రపంచ కప్ లీగ్ పోరులో న్యూజిలాండ్ 62 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమీ సాటర్‌వైట్ (84 బంతుల్లో 75; 9 ఫోర్లు), అమెలియా కెర్ (64 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, కేటీ మార్టిన్ (41) రాణించింది. అనంతరం భారత్ 46.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. శనివారం జరిగే తమ తర్వాతి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడుతుంది. పూజకు 4 వికెట్లు... ఇన్నింగ్స్ ఆరంభంలోనే పూజ వస్త్రకర్ అద్భుత ఫీల్డింగ్‌తో సుజీ బేట్స్ (5)ను రనౌట్ చేయడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. అయితే తర్వాతి నాలుగు వికెట్లకు వరుసగా 45, 67, 54, 49 పరుగుల భాగస్వామ్యాలు కివీస్‌ను నిలబెట్టాయి. మేఘన, జులన్ ఓవర్లలో వరుసగా రెండేసి బౌండరీలతో సోఫీ డెవిన్ (30 బంతుల్లో 35; 7 ఫోర్లు) దూకుడు కనబర్చింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. డెవిన్‌ను పూజ అవుట్ చేయగా, కెర్ తన జోరు కొనసాగించింది. 63 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. భారత్‌పై గత ఐదు వన్డేల్లో కెర్ వరుసగా 119 నాటౌట్, 67, 68 నాటౌట్, 66, 50 పరుగులు చేయడం విశేషం. రాజేశ్వరి బౌలింగ్‌లో కెర్ వెనుదిరిగినా...ధాటిగా ఆడుతూ 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న సాటర్‌వైట్ ఆపై దీప్తి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగింది. అయితే చివర్లో 31 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు తీసిన భారత్ కివీస్‌ను కొంత వరకు నిలువరించింది. మిథాలీ పేలవంగా... ఈ మ్యాచ్ కోసం షఫాలీవర్మపై వేటుతో యస్తిక భాటియా (59 బంతుల్లో 28; 2 ఫోర్లు)కు తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం కల్పించడంతో టాప్–3 ఎడమచేతివాటం బ్యాటర్లతోనే భారత్ బరిలోకి దిగినట్లయింది. అయితే ముగ్గురులో ఎవరూ సఫలం కాలేకపోయారు. ఒత్తిడిలో యస్తిక బంతులు వృథా చేయగా, స్మృతి మంధాన (6), దీప్తి శర్మ (5) విఫలమయ్యారు. 10 ఓవర్లలో భారత్ 2 ఫోర్లే కొట్టగలిగింది!అనుభవజ్ఞురాలైన కెప్టెన్ మిథాలీ రాజ్ (56 బంతుల్లో 31; 1 ఫోర్) కూడా బాగా నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడమే గగనంగా మారిపోయింది. హర్మన్ క్రీజ్‌లోకి వచ్చాక కొంత దూకుడు పెరిగినా... మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. మిథాలీ, హర్మన్ క్రీజ్‌లో ఉండటంతో సంచలనంపై ఆశలు ఉన్నా...వరుస బంతుల్లో మిథాలీ, రిచా ఘోష్ (0)లను అమేలియా కెర్ అవుట్ చేయడంతో అదీ పోయింది. 48 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్మన్ ఒక్కసారిగా చెలరేగి జెస్ కెర్ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టింది. అయితే ఇతర బ్యాటర్ల వైఫల్యంతో అది వృథా ప్రయాసగా మిగిలింది. -
World Cup 2022: టాప్‌లో ఆస్ట్రేలియా.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే!
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ఈవెంట్లో న్యూజిలాండ్ మహిళా జట్టు అదరగొట్టింది. వరుసగా బంగ్లాదేశ్, భారత జట్లపై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా సెడాన్ పార్కు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వైట్ ఫెర్న్స్ మిథాలీ రాజ్ సేనపై 62 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అంతకు ముందు బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది న్యూజిలాండ్. ఇక ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆస్ట్రేలియా మహిళా జట్టు 4 పాయింట్లు సాధించడంతో పాటు మెరుగైన రన్‌రేటుతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచినప్పటికీ రన్‌రేటు పరంగా వెనుకబడ్డ వెస్టిండీస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా(ఒక మ్యాచ్- ఒక విజయం), భారత్(ఆడినవి-2 గెలిచింది 1), ఇంగ్లండ్ (ఆడినవి 2, ఓడినవి 2), బంగ్లాదేశ్(ఆడినవి 2, ఓడినవి 2), పాకిస్తాన్(ఆడినవి 2, ఓడినవి 2) మహిళా జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో ఫ్యాన్స్ మిథాలీ రాజ్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడలేక చతికిలపడ్డారంటూ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ఘన విజయం తర్వాత మీ నుంచి ఇలాంటి ఆట తీరు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
NZ W Vs Ind W: అదరగొట్టిన తెలుగమ్మాయి.. భారీ స్కోరు.. అయినా తప్పని ఓటమి.. సిరీస్ వాళ్లదే
NZ W Vs Ind W 3rd ODI: - క్వీన్స్టౌన్: మళ్లీ భారీ స్కోరు చేసినా... భారత మహిళల జట్టు న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడో వన్డేలోనూ ఓటమి చవిచూసి మరో రెండు వన్డేలుండగానే సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట మిథాలీ రాజ్ బృందం 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో దీప్తి శర్మ (69 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించింది. 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మహిళల వన్డే క్రికెట్లో ఇది రెండో అత్యుత్తమ ఛేజింగ్. అమెలియా కెర్ (67; 8 ఫోర్లు), అమి సాటెర్త్‌వైట్ (59; 6 ఫోర్లు), లారెన్ డౌన్ (52 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేటీ మారి్టన్ (37 బంతుల్లో 35) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. జులన్ గోస్వామికి మూడు వికెట్లు దక్కాయి. చదవండి: Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్ -
Ind Vs NZ: తొలి వన్డేలో నిరాశే... ప్చ్... మన మేఘన కూడా...
Ind W Vs NZ W 1st ODI - క్వీన్స్టౌన్: వన్డే సిరీస్‌నూ భారత మహిళల జట్టు పరాజయంతోనే ప్రారంభించింది. తొలి వన్డేలో భారత్ 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. కెపె్టన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించినా పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన ఈ పోరులో మొదట న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 275 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (111 బంతుల్లో 106; 10 ఫోర్లు) శతక్కొట్టింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వ్రస్తాకర్, రాజేశ్వరి, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (4) నిరాశపరిచింది. యస్తిక (41; 4 ఫోర్లు), మిథాలీ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు ఔటయ్యాక మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో భారత్ లక్ష్యానికి దూరమైంది. చదవండి: IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు JENSEN STRIKES! @Jensen_Hayley digs one in and gets the wicket of Yastika Bhatia for 41. Good catch from @MaddyLGreen circling the boundary! Tune in LIVE to see the final quarter of our @kfcnz ODI on @sparknzsport 📲#NZvIND pic.twitter.com/jMzP5iW0LW — WHITE FERNS (@WHITE_FERNS) February 12, 2022 -
Ind W vs NZ W: ప్రపంచ కప్ సన్నాహకాలు.. కివీస్‌తో ఐదు వన్డేలు
Ind W vs NZ W ODI Series: మిథాలీరాజ్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్ మహిళలతో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. క్వీన్స్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ‘అమెజాన్ ప్రైమ్’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బుధవారం జరిగిన ఏకైక టి20లో కివీస్ 18 పరుగులతో భారత్‌ను ఓడించింది. న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత మహిళా జట్టు- షెడ్యూల్: మ్యాచ్‌లన్నీ క్వీన్టౌన్స్లోని జాన్ డెవిస్ ఓవల్ మైదానంలో జరుగనున్నాయి. ►మొదటి వన్డే: ఫిబ్రవరి 12- శనివారం ►రెండో వన్డే: ఫిబ్రవరి 15- మంగళవారం ►మూడో వన్డే: ఫిబ్రవరి 18- శుక్రవారం ►నాలుగో వన్డే: ఫిబ్రవరి 22- మంగళవారం ►ఐదో వన్డే: ఫిబ్రవరి 24- గురువారం చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్! -
భారత జట్టును గెలిపిస్తా.. వరల్డ్‌కప్ గెలవడమే ఏకైక లక్ష్యం
దుబాయ్: భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2021 ఏడాదికి గాను మహిళల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్మృతి గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలోనూ ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి గత ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 38.86 సగటుతో 855 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన భారత తొలి డే అండ్ నైట్ టెస్టులో 127 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం ఈ ఏడాది స్మృతి అత్యుత్తమ ప్రదర్శన. విజేతగా నిలిచిన ఆమె ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పేరిట నెలకొల్పిన ‘రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’ని అందుకోనుంది. స్మృతి ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికవడం ఇది రెండోసారి. 2018లో ఈ అవార్డుతో పాటు ఆమె ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచింది. మహిళల విభాగంలో ట్యామీ బీమాంట్ (టి20), లిజెల్ లీ (వన్డే) అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు. భారత జట్టును గెలిపిస్తా.. వరల్డ్‌కప్ గెలవడమే ఏకైక లక్ష్యం ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక కావడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రతికూల పరిస్థితుల నడుమ గత ఏడాది నేను ప్రదర్శించిన ఆటకు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు మరింత బాగా ఆడి భారత జట్టును గెలిపించడంలో ఇది నాకు ప్రేరణ అందిస్తుంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, సన్నిహితులందరికీ నా కృతజ్ఞతలు. వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌ను గెలుచుకోవాలనేదే మా ఏకైక లక్ష్యం. అందుకోసం మా జట్టంతా కలిసికట్టుగా శ్రమిస్తోంది. –స్మృతి మంధాన చదవండి: Dinesh Karthik: టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్‌పై ప్రశంసలు కురిపించిన డీకే -
శెభాష్ స్మృతి మంధాన... ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ఓపెనర్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్ కేవలం రెండే మ్యాచ్‌లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాల్లోనూ ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు చేసింది. అదే విధంగా.... ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 78 పరుగులు సాధించిన ఆమె... మ్యాచ్ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది. అంతేగాక భారత్ గెలిచిన ఏకైక వన్డే సిరీస్‌లో 49 పరుగులతో రాణించింది. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటింది. అంతేగాక ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో స్మృతి మంధాన 86 పరుగులు చేసింది. ఇక కంగారూలతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ సాధించింది. ఇలా పలు మ్యాచ్‌లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SA - Deepak Chahar: గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. వైరల్ A year to remember 🤩 Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏 More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT — ICC (@ICC) January 24, 2022 -
ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్‌కు సమున్నత గౌరవం దక్కింది. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమెను ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. కాగా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ టీ20లలో గతేడాదికి గానూ అత్యధిక పరుగులు సాధించిన నంబర్ వన్ బ్యాటర్‌గా టమీ బేమౌంట్ ఘనత సాధించింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ప్రపంచంలోని మూడో బ్యాటర్‌గా రికార్డులో తన పేరు లిఖించుకుంది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడిన టమీ... 102 పరుగులతో రాణించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి సత్తా చాటింది. ముఖ్యంగా చేజారుతుందనుకున్న రెండో మ్యాచ్‌లో 53 బంతుల్లో 63 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. అంతేగాక భారత మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మరోసారి టమీ అదరగొట్టింది. 113 పరుగులతో రాణించింది. అత్యధిక స్కోరు 97. ఈ నేపథ్యంలో ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టమీ నిలిచింది. ఆమె ఆట తీరును కొనియాడుతూ ఐసీసీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించింది. టేక్ ఏ బౌ అంటూ ప్రశంసించింది. Match-winning knocks, brisk starts and some memorable moments ✨ Take a bow, Tammy Beaumont 🙇 More 👉 https://t.co/Q32mIXUBoQ pic.twitter.com/uB6dRWKMeU — ICC (@ICC) January 23, 2022 -
Harmanpreet Kaur: అదరగొట్టిన టి20 జట్టు కెప్టెన్.. ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు
Harmanpreet Kaur Name In WBBL Team Of Tournament: భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు దక్కింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్న ఆమెకు లీగ్ అధికారిక ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ జాబితాలో చోటు దక్కింది. ఈ సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటిదాకా తన బ్యాట్‌తో 399 పరుగులు చేసింది. మూడు అర్ధసెంచరీలు బాదిన హర్మన్ 66.50 సగటు, 135.25 స్ట్రయిక్‌రేట్ నమోదు చేసింది. 32 ఏళ్ల ఈ భారత ఆల్‌రౌండర్ 18 సిక్సర్లు బాదడం విశేషం. ఇక బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టింది. ఆమె అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 3/22. ‘రెనెగేడ్స్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా రాణిస్తోంది. బ్యాట్, బంతితో చెలరేగుతోంది. ఆమె ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది’ అని ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. రెనెగేడ్స్ లెగ్‌స్పిన్నర్ జార్జియా వేర్హమ్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఆమె ప్రతిమ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తోంది. కాగా డబ్ల్యూబీబీఎల్ అధికారిక టీమ్ ఆఫ్ ద టోర్నీలో ఒక్క హర్మన్ మినహా మరే భారత ప్లేయర్‌కు అవకాశం దక్కలేదు. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా..
Ind W Vs Aus W Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్ ‘పింక్ బాల్’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడం విశేషం. 1991 జనవరిలో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌ను భారత్ చివరిసారి ‘డ్రా’ చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ ఓడిపోయింది. తాజా టెస్టులో మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో.... 136 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 37 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ (52; 6 ఫోర్లు), స్మృతి మంధాన (31; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గురువారం నుంచి మొదలవుతుంది. Watch highlights from that innings here #AUSvIND https://t.co/7lk4fXLqmJ — cricket.com.au (@cricketcomau) October 3, 2021 The sides will have to settle for two points apiece after four tough days of Test cricket. #AUSvIND #PinkBallTest https://t.co/H6lNJOUhGR — cricket.com.au (@cricketcomau) October 3, 2021 -
Big Bash League: రెనెగేడ్స్ తరఫున టీ20 కెప్టెన్, ఓపెనర్
Harmanpreet Kaur And Jemimah Rodrigues: మహిళల బిగ్‌బాష్ టి20 క్రికెట్ లీగ్‌లో తాజాగా భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) ఆడబోతున్నారు. ఈ లీగ్‌లో జెమీమా తొలిసారి బరిలోకి దిగనుండగా, గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్ ఇప్పుడు రెనెగేడ్స్‌కు మారింది. చదవండి: Ind W Vs Aus W Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్’ ఆట RCB Vs RR : మ్యాక్స్‌వెల్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం -
టాప్ ర్యాంకు కోల్పోయిన మిథాలీ... అదరగొట్టిన ఝులన్ గోస్వామి
ICC ODI Rankings: భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో మిథాలీ విఫలం కావడం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ 738 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా... రెండో స్థానంలో ఉన్న లిజెల్లే లీ (దక్షిణాఫ్రికా) 761 పాయింట్లతో తొలి ర్యాంక్‌ను అందుకుంది. అదే విధంగా... భారత జట్టు మరో బ్యాటర్ స్మృతి మంధాన 710 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక బౌలర్లలో ఝలన్ గోస్వామి 727 పాయింట్లతో రెండు స్థానాలు పురోగమించి.. ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా ఝలన్ గోస్వామి 4 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. బ్యాట్‌తోనూ సత్తా చాటిన ఆమె... ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ విభాగంలో గతంలో టాప్-4లో ఉన్న దీప్తి శర్మ.. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. చదవండి: Unmukt Chand: అమెరికన్ లీగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన మాజీ భారత బ్యాటర్