Indian Women lose by 5 wickets Against Australia: భారత మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆనంతరం 275పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఫామ్‌లో ఉన్న అలీసా హీలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ బ్రీత్ మూనీ సెంచరీ తో చెలరేగింది. ఆస్ట్రేలియా విజయంలో మూనీ కీలక పాత్ర పోషించింది. ఒక దశలో 50 పరుగులకే 4కీలకమైన వికెట్లును ఆస్ట్రేలియా కోల్పోయింది.
దీంతో టీమిండియా విజయం లాంఛనమే అనుకున్నారు అందరు. కానీ ఆస్టేలియా బ్యాట్స్ ఉమెన్ బ్రీత్ మూనీ, తహీలా మెగ్రాత్ భారత పతనాన్ని శాసించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 133 బంతుల్లో 12 ఫోర్లుతో 125 పరగులు చేసి ఆజేయంగా నిలిచింది. మెగ్రాత్ 77 బంతుల్లో 9 ఫోర్లుతో 74 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు సృతి మందాన,షెఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు. సృతి మందాన 94 బంతుల్లో 11 ఫోర్లుతో 86 పరుగులు చేసింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 44 , 3 ఫోర్లు, 1 సిక్స్), పూజా వాస్త్రకర్ (29) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తహీలా మెగ్రాత్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మెలానిక్స్ రెండు వికెట్లు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 274/7 (50 ఓవర్లలో) (స్మృతి మంధాన 86, షఫాలీ వర్మ 22, రిచా ఘోష్ 44, దీప్తి శర్మ 23, పూజా వస్త్రాకర్ 29, జులన్ గోస్వామి 28 నాటౌట్, తహిలా మెక్‌గ్రాత్ 3/45)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 275/5 (50 ఓవర్లలో) (బెత్ మూనీ 125 నాటౌట్, తహిలా 74, నికోలా క్యారీ 39 నాటౌట్).
చదవండి: IPL 2021: కోహ్లి సలహాల వల్ల కేకేఆర్ అయ్యర్ మరింత రాటు దేలాడు..
THE STREAK LIVES ON #AUSvIND pic.twitter.com/pj744Pc4Dz
— cricket.com.au (@cricketcomau) September 24, 2021
Comments
Please login to add a commentAdd a comment