వెలుతురు లేమి కారణంగా నిలిచిపోయిన ఆట
వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట అర్దంతరంగా నిలిచిపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది.
44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
44 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (9) ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 401 పరుగులు వెనుకపడి ఉంది.
వర్షం అంతరాయం
విరాట్ కోహ్లి వికెట్ పడగానే వర్షం మొదలైంది. క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ కేఎల్ రాహుల్‌తో కలిసి తిరిగి పెవిలియన్ బాట పట్టాడు. 7.2 ఓవర్లలో భారత్ స్కోర్ 22/3గా ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 423 పరుగులు వెనుకపడి ఉంది. అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
22 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (3) ఔటయ్యాడు.
ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
ఆరు పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (1) ఔటయ్యాడు.
బౌండరీ బాది రెండో బంతికే ఔటైన జైస్వాల్
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన యశస్వి జైస్వాల్ (4) రెండో బంతికే ఔటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి పెవిలియన్ బాట పట్టాడు.
STARC GETS JAISWAL 2ND BALL. 🤯pic.twitter.com/yuyCK133Z3
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2024
445 పరుగులకు ఆలౌటైన ఆసీస్
భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట మొదలైంది. ఆస్ట్రేలియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద ఆలౌటైంది. అలెక్స్ క్యారీ 70 పరుగులు చేసి ఔటయ్యాడు.
రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
తుదిజట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్.
Comments
Please login to add a commentAdd a comment