IND VS AUS 4th Test Day 2 Live Updates And Highlights:
రెండో రోజు ముగిసిన ఆట.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
కష్టాల్లో టీమిండియా.. పరుగు వ్యవధిలో జైస్వాల్, కోహ్లి ఔట్
పరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. లేని పరుగుకు ప్రయత్నించి జైస్వాల్ (82) ఔట్ కాగా.. విరాట్ (36) తన వీక్‌నెస్ అయిన ఔట్ ఆఫ్ ఆఫ్ స్టంప్ బంతికి బలయ్యాడు. మరి కొద్ది సేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్, రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు. 43 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 155/4గా ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో రోజు ఆట కొద్ది సేపటిలో ముగుస్తుందనగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లేని పరుగు కోసం రిస్క్ చేసి యశస్వి జైస్వాల్ (82) రనౌటయ్యాడు. అంతకుముందు బంతికే బౌండరీ బాది జోష్ మీదుండిన జైస్వాల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్.. వంద దాటిన టీమిండియా స్కోర్
స్టార్క్ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఫిఫ్టి అనంతరం టీమిండియా స్కోర్ వంద పరుగులు దాటింది. 30 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/2గా ఉంది. జైస్వాల్‌కు జతగా విరాట్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 363 పరుగులు వెనుకపడి ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీ విరామం ముందు ఆఖరి బంతికి టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 51/2గా ఉంది. రోహిత్ (3), రాహుల్ ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (23) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ కోల్పోయిన రెండు వికెట్లు కమిన్స్‌కే దక్కాయి.
ఆసీస్ 474 ఆలౌట్.. ఓపెనర్‌గా వచ్చినా నిరాశపర్చిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. నాథన్ లయోన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా లయోన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 8 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌లుగా మిడిలార్డర్ వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చినా నిరాశపరిచాడు. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 4 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 14/1గా ఉంది. యశస్వి జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు.
స్టీవ్ స్మిత్ ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
స్టీవ్ స్మిత్ (140) ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 114.1 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 455/9గా ఉంది. స్కాట్ బోలాండ్, నాథన్ లయోన్ క్రీజ్‌లో ఉన్నారు. లంచ్ విరామం తర్వాత మూడో బంతికే మిచెల్ స్టార్క్ (15) ఔటయ్యాడు. స్టార్క్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ ఎంతంటే..?
రెండో రోజు లంచ్ విరామం సమయానికి స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్‌లో ఉన్నాడు. 113 ఓవర్లలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 454/7గా ఉంది. రెండో రోజు తొలి సెషన్‌లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ మాత్రమే కోల్పోయింది.
సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా
మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట తొలి సెషన్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్ కమిన్స్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 108 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 432/7గా ఉంది. కమిన్స్ వికెట్ రవీంద్ర జడేజాకు దక్కింది.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(68 బ్యాటింగ్), కమిన్స్(8) ఉన్నారు. తొలి రెండు సెషన్స్‌లో ఆస్ట్రేలియా అధిపత్యం చలాయించగా.. ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.
భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో కాన్‌స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.
మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
Comments
Please login to add a commentAdd a comment