ఢిల్లీ: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్‌పై కాంగ్రెస్ ఆరోపణలే కారణమని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. కూటమి నుంచి కాంగ్రెస్‌ను పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆప్ వర్గాల నుంచి ఇలాంటి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భవిష్యత్‌లో కూటమి రాజకీయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే ఇందుకు కారణం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, ఓడిపోవడంతో కూటమి నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇండియా కూటమికి తాను చీఫ్‌గా ఉండాలనుకుంటున్నట్టు మమతా బెనర్జీ చెప్పడంతో మరింత ఉత్కంఠను పెంచింది. ఈ క్రమంలో కూటమిలో పలు పార్టీల నేతలు కూడా మమతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పరిణామాల మధ్య ఆప్ తాజా నిర్ణయం కూటమిలో చిచ్చు పెట్టిందని పొలిటికల్ సర్కిల్ చర్చ నడుస్తోంది.
Congress can criticise Kejriwal & AAP, as there is not alliance in Delhi. but Congress leader @ajaymaken call Kejriwal as anti national. How to accept this arrogance.
AAP is the part of INDIA bloc, INC should keep respect with alliance partners
pic.twitter.com/8ix7V9s4G7— Arshad MT (@ArshadMadathodi) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment