ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ! | Congress calls AAP Alcohol Affected Party | Sakshi
Sakshi News home page

ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ.. కాంగ్రెస్‌ విమర్శలు

Published Thu, Jan 23 2025 3:47 PM | Last Updated on Thu, Jan 23 2025 4:12 PM

Congress calls AAP Alcohol Affected Party

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ (congress party) పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్‌ గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, ఆమ్‌ (aap) ఆద్మీ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ  (Alcohol Affected Party) అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్‌ ఖేరా( pawan khera) గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. మద్యం అలవాటు మనిషిని, అతని కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.

 కానీ, మద్యం ద్వారా డబ్బు సంపాదించాలనే వ్యసనం కారణంగా కేవలం వ్యక్తి, సమాజం మాత్రమే కాకుండా మొత్తం నగరం కూడా నాశనం అవుతుంది. ఆప్‌ (ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ ) మద్యం ద్వారా మొత్తం ఢిల్లిని ఎలా నాశనం చేసిందో మనం చూశాం. ఇప్పుడు మీకు ఓ ఆడియో క్లిప్‌ను వినిపిస్తాను. వినండి. అ ఆడియోలో ఆప్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన విద్యాశాఖ మంత్రి, ఎక్సైజ్‌ మినిస్టర్‌ ఎలా కుంభకోణం చేశారో తెలుస్తోంది.  

ఆప్‌ కన్వినర్‌ కేజ్రీవాల్‌ ఓ మాట అన్నారు. తన వద్ద ప్రతి రోగానికి ఔషధం ఉందని. కానీ ఔషధం కనిపించలేదు.కానీ మద్యం కుంబకోణం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో మొత్తం ప్రభుత్వం మునిగిపోయింది’ అని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పవన్‌ ఖేరా కామెంట్స్‌ ఢిల్లీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement