Delhi Assembly Election
-
‘మీకు శాపం తగిలింది.. అందుకే ఓడిపోయారు’.. అతిషీతో సక్సేనా!
ఢిల్లీ: ‘నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా. యమునాతో పెట్టుకోవద్దు. మీ కొంప మునుగుతుంది అని. అయినా మీరు నా మాట విన్నారా. వినలేదు. పెడ చెవిన పెట్టారు. ఇప్పుడు అనుభవించండి’ అంటూ ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనాతో (Atishi Marlena) లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (lieutenant governor V K Saxena) అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషీ మర్లేనా తన రాజీనామాను లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. ఆ సమయంలో ఇరువురు మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (delhi assembly elections) బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ తరుణంలో కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో యమునా నదిని శుభ్రం చేయకుండా కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ప్రధాన కారణమని సమాచారం.యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్‌ను నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించా’ అని గవర్నర్ సక్సేనా అతిషితో చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. కేజ్రీవాల్‌కు యమునా నది శాపం ఏంటి?యమునా నది కాలుష్యం కోరలు చాచడంతో జనవరి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నది పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి యమునా నదిని శుభ్రపరచే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. అందుకు ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణలు తొలగించడం, 11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడం పూర్తయింది. నదిలో నీటి ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అప్పుడే యమునా నదిని శుభ్రం చేసిన ఘనత తమకు దక్కదనే దురుద్దేశ్యంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో యమునా నదిని శుభ్రం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. తత్ఫలితంగా, యమునా నదిని పరిశుభ్రం చేసే పనులు ఐదు నెలల తర్వాత ఆగిపోయాయి. ఆ విషయంలో కేజ్రీవాల్ విజయం సాధించినా నదిని శుభ్రపరిచేందుకు గత 16 నెలలుగా ఒక్క పని కూడా చేయలేదు’అని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గతేడాది నవంబర్‌లో ఓ కార్యక్రమంలో ఆరోపణలు గుప్పించారు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన రాజీనామా సమర్పించేందుకు వచ్చిన అతిషీ మర్లేనాకు ‘యమునా నది పునరుజ్జీవనం’ శాపం అంశం గురించి గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా,ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అటు అతిషీ కానీ, ఎల్జీ రాజ్‌భవన్ వర్గాలు నిరాకరించాయి.👉చదవండి : మాజీ సీఎం కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన ఎవరీ పర్వేష్ వర్మ? -
కేజ్రీవాల్ ఓటమికి అదే ముఖ్య కారణం: ప్రశాంత్ కిషోర్
పాట్నా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కేజ్రీవాల్ ఓటమిపై జన్ సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో బెయిల్ పొందిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన చేసిన పెద్ద తప్పిదం అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ రాజీనామా పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వ్యాఖ్యలు చేశారు.జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతనే మొదటి కారణం. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా రెండో కారణం. మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. అయితే, బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేయడం, ఎన్నికలకు ముందు మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అయ్యింది.అలాగే, ఇటీవలి కాలంలో కేజ్రీవాల్ రాజకీయ వైఖరి కూడా మారింది. ఇండియా కూటమిపై ఆయన నిర్ణయాలు కొంత దెబ్బతిశాయి. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో కూటమితో కాకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఆప్ పనితీరుపై ప్రభావం చూపించింది. కేజ్రీవాల్ పరిపాలనలోని లోపాలను ప్రజలు ఎత్తి చూపించినా ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఆప్ రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే. ఇక, ఎంతో కష్టపడితే కానీ, కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. -
ఇక ట్రిపుల్ ఇంజన్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందంటూ వారు చేసిన ప్రచారం ప్రజలపై బాగానే ప్రభావం చూపింది. దాంతో ఇప్పుడిక ఢిల్లీలో ఏకంగా ట్రిపుల్ ఇంజన్‌పై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక రెండు నెలల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే దేశ రాజధానిలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరినట్లే. కేంద్రంలో, రాష్ట్రంలో, కార్పొరేషన్లో బీజేపీ ఆధిపత్యం సుస్థిరమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇక ఎంసీడీ మేయర్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది.పుంజుకున్న కమలం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీరిని ప్రజలు నేరుగా ఓట్లేసి ఎన్నుకుంటారు. ఢిల్లీలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఎంసీడీ పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేలకు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కుంది. ఎంసీడీలో బీజేపీకి ప్రస్తుతం 120 మంది, ఆప్‌కు 122 మంది కౌన్సిలర్లున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు, ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. బీజేపీ కౌన్సిలర్ కమల్జీత్ షెరావత్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. అలా ఎంసీడీలో 12 కౌన్సిలర్ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంసీడీలో తాజాగా బీజేపీ బలం 112, ఆప్ బలం 119గా ఉన్నాయి. 2024 నవంబర్‌లో మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్ అభ్యర్థి మహేశ్ కిచీ మేయర్‌గా ఎన్నికయ్యారు. పోలైన 263 ఓట్లలో కిచీకి 133, బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్‌కు 130 ఓట్లు లభించాయి. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంసీడీలో బీజేపీ బలం పెరిగింది. మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కున్న 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీకి చెందినవారే. మేయర్ పదవిని సులభంగా దక్కించుకోగలదు. కనుక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. తర్వాత మేయర్ పదవిని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీలో కాంగ్రెస్ కు మిగిలింది గాడిదగుడ్డు: బండి సంజయ్
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం... 70 స్థానాలకు గాను బీజేపీకి 48, ఆమ్ ఆదీ పార్టీకి 22 స్థానాలు.. వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్
-
27 ఏళ్ల తర్వాత బీజేపీ బ్లాక్ బస్టర్
-
ఆప్‌కు బిగ్ షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతల ఓటమి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆప్ అగ్ర నేతలకు ఢిల్లీ ఓటర్లు షాకిచ్చారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆయనతో పాటు పార్టీ అగ్ర నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓడిపోయారు. దీంతో, ఆప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్ పార్టీకి ఓటర్లు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఆప్ అగ్ర నేతలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో, ఎన్నికల్లో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్రజైన్ ఓటమిని చవిచూశారు. వీరు ముగ్గురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. దీంతో, వీరిని ప్రజలు ఓడించారు. మరోవైపు.. కల్కాజీ నియోజకవర్గంలో మాత్రం సీఎం అతిశి విజయం సాధించారు.ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్ చేతిలో మనీష్ సిసోడియా పరాజయం పాలయ్యారు. షాకుర్ బస్తీలో సత్యేందర్ జైన్ సైతం ఓటమిని చవిచూశారు. #WATCH | AAP candidate from Jangpura constituency, Manish Sisodia concedes defeat, says, "Party workers fought well; we all did hard work. People have supported us as well. But, I lose by 600 votes. I congratulate the candidate who won. I hope he will work for the constituency." https://t.co/szW8leInSp pic.twitter.com/B1VVvsbfNI— ANI (@ANI) February 8, 2025 -
బీజేపీ దెబ్బ.. కాంగ్రెస్ ‘ఖేల్’ ఖతం
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురబోతోంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(36) దాటి దాదాపు 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు ఢిల్లీలో మరోసారి భంగపాటే ఎదురైంది. ఈసారి కూడా ఎన్నికల ఫలితాలు పూర్తి నిరాశను నింపాయి. దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్‌కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్, బీజేపీ మధ్యే గట్టి పోటీ నడిచింది. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌కు దేశ రాజధానిలో మరోసారి నిరాశే ఎదురవుతోంది. మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఇక, 2015, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కూడా విజయం సాధించలేదు. సున్నా స్థానాలకే పరిమితమైంది. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమైంది. ఎన్నికల ఫలితాల్లో సందీప్ దీక్షిత్, అల్కా లాంబా, ఆరియా ఖాన్ వంటి నేతలు వెనకబడిపోయారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ సత్తా చాటలేకపోయాడు. న్యూఢిల్లీలో సందీప్ దీక్షిత్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో కాంగ్రెస్ కీలక నేత అల్కా లంబా కూడా వెనబడిపోయారు. ఢిల్లీ సీఎం అతిశీకి పోటీగా కల్కాజీ నుంచి బరిలోకి అల్కా లాంబా ఎదురీదుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్‌కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కీలక నేతలు ప్రచారం హోరెత్తించిన కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుంచి 2020 మధ్య ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. అలాంటి పార్టీ ఇప్పుడు కేవలం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోతోంది. -
త్రిముఖ పోరులో నెగ్గేదెవరు..? తగ్గేదెవరు..?
-
కేజ్రీవాల్‌కు బీజేపీ హెచ్చరిక!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కాషాయ పార్టీ కౌంటరిచ్చింది. కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(శనివారం) ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్‌ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటరిచ్చింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందనే కారణంగా ఆ పార్టీ నేతలంతా నిరాశతో ఉన్నారు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. బీజేపీ ఫోన్ కాల్స్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు చేసిన ఆరోపణలను నిరూపించాలి. లేదంటూ అది ఫేక్ అని క్షమాపణలు చెప్పాలి. అలా చేయకపోతే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము’ అని హెచ్చరించారు. -
ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Delhi Assembly Elections Live Updates..ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరుగంటల లోపు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశంఢిల్లీలో 78 అసెంబ్లీ స్థానాల బరిలో 699 మంది అభ్యర్థులు సాయంత్రం 6:30 తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదుమధ్యాహ్నం 3 గంటల వరకు 46.55శాతం ఓటింగ్ నమోదుకొనసాగుతున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారత ఎన్నికల సంఘం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఢిల్లీలో 46.55శాతం ఓటింగ్ నమోదుఓటేసిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ఓటేసిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీలోని కుషాక్ లేన్‌లోని పోలింగ్ బూత్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఓటు వేశారు.'ఓటు వేయడం అనేది ఒకరి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం మాత్రమే కాదు, దేశ పౌరుల నైతిక బాధ్యత కూడా. పౌరులు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు ఇప్పటి వరకు 32.5 శాతం నమోదుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదు.పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 33.31% voter turnout recorded till 1 pm in #DelhiElection2025 pic.twitter.com/e4LOz4Yalf— ANI (@ANI) February 5, 2025 ఓటేసిన కేజ్రీవాల్ కుటుంబం..AAP national convener Arvind Kejriwal, along with his wife Sunita Kejriwal and parents Gobind Ram Kejriwal & Gita Devi cast their votes for #DelhiElection2025.(Pics: AAP) pic.twitter.com/VrWbk4nGCq— ANI (@ANI) February 5, 2025 ఓటు వేసిన ప్రముఖులు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #DelhiElection2025 | Former President Ram Nath Kovind and his family cast their vote at a polling booth in NDMC School of Science & Humanities at Palika Kendra, Sansad Marg. pic.twitter.com/nhBdrW90Ua— ANI (@ANI) February 5, 2025 బీజేపీ ఎంపీ సంజయ్ తివారీ ఓటు వేశారు. #WATCH | After casting his vote for #DelhiAssemblyElection2025, BJP MP Manoj Tiwari says, "...They (AAP) made Delhi sick. They looted Delhi. Now we will do work. Now Delhi is going to give us the opportunity. We are not distributing money. We are not distributing liquor...People… https://t.co/LCb2QDWBdr pic.twitter.com/U2pHfVRMwR— ANI (@ANI) February 5, 2025కపిల్ సిబాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #DelhiElection2025 | After casting his vote, senior advocate and Rajya Sabha MP Kapil Sibal says, "...The message is quite simple, that every citizen of this country should come and vote. Because if you live in a community, you must participate to ensure that the person… pic.twitter.com/IJGOHbHgmf— ANI (@ANI) February 5, 2025 ఎన్నికల్లో ఓటు వేసిన కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు..అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #DelhiElection2025 | AAP national convener Arvind Kejriwal, along with his wife Sunita Kejriwal and parents Gobind Ram Kejriwal & Gita Devi, arrives at Lady Irwin Senior Secondary School to cast a vote. The sitting MLA from New Delhi constituency faces a contest from… pic.twitter.com/0OdYmp5rdt— ANI (@ANI) February 5, 2025 ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 11 గంటల వరకు 20 పోలింగ్ నమోదుఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 19.95% voter turnout recorded till 11 am in #DelhiElection2025 pic.twitter.com/4fNGZvHoBO— ANI (@ANI) February 5, 2025 ఢిల్లీలో ఓటు వేసిన ప్రముఖులు..రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీసీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలుచుని ఓటు వేశారు. #WATCH | Vice president Jagdeep Dhankhar along with his wife Sudesh Dhankhar, arrives at a polling booth in CPWD Service Centre in North Avenue to cast vote for #DelhiAssemblyElection2025 pic.twitter.com/PYumJvOWMd— ANI (@ANI) February 5, 2025 ఓటు వేసిన ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోథి ఎస్టేట్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. #WATCH | Congress MP Priyanka Gandhi Vadra along with her husband Robert Vadra and son Raihan Vadra arrives at a polling station in Lodhi Estate to cast her vote for #DelhiAssemblyElection2025 pic.twitter.com/EmwsmFIuFE— ANI (@ANI) February 5, 2025 ప్రజలు ఎలా ఓటు వేస్తారు?: ఆప్ఎన్నికల సరళిపై ఆప్ ఆరోపణలుపలు చోట్ల ప్రజలను ఓటువేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపణతమ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.ఇలా అయితే ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించిన మంత్రి ఎన్నికల్లో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మురాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. #WATCH | Delhi: President Droupadi Murmu casts her vote for #DelhiElection2025 at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate. pic.twitter.com/FQHq4Yqq0C— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నాఢిల్లీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Chief Justice of India, Sanjiv Khanna arrives at a polling booth in Nirman Bhawan to cast his vote for #DelhiAssemblyElections2025 pic.twitter.com/hhpjcRqmJb— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన సీఎం అతిశి..ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ఓటు వేశారు. ఈ సందర్బంగా అతిశి మాట్లాడుతూ..‘ఢిల్లీలో ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. ఇది ధర్మయుద్ధం. ఇది మంచికి, చెడుకి మధ్య పోరాటం. ఒక వైపు అభివృద్ధి కోసం పనిచేస్తున్న విద్యావంతులు, మరోవైపు గూండాయిజం చేసే వ్యక్తులు ఉన్నారు. గూండాలకు కాకుండా పనిచేసే వారికే ప్రజలు ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఢిల్లీ పోలీసులు బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Delhi CM Atishi says "This election in Delhi is not just an election, this is a Dharmyuddh'. This is a fight between the good and bad...On one side, there are educated people who are working for development and on the other side, there are people who are doing… pic.twitter.com/LqBs0hZMdl— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటింగ్‌లో ఢిల్లీ సరికొత్త చరిత్ర తిరగరాయాలని కోరకుంటున్నా. #WATCH | Lieutenant Governor of Delhi, Vinai Kumar Saxena, his wife Sangita Saxena show their inked fingers after casting their vote for #DelhiElection2025 pic.twitter.com/PQKmYadQFK— ANI (@ANI) February 5, 2025 ఢిల్లీ ఎన్నికలు.. 9 గంటల వరకు 8 శాతం పోలింగ్ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదుపలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. 8.10% voter turnout recorded till 9 am in #DelhiElection2025 pic.twitter.com/zsILmvCmnO— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన ఆప్ నేత మనీస్ సిసోడియాఆప్ నాయకుడు మనీష్ సిసోడియా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.#WATCH | #DelhiElection2025 | AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia casts his vote at a polling booth at Lady Irwin Senior Secondary School in New Delhi Assembly constituency. His wife Seema Sisodia is also voting here. pic.twitter.com/5OsPMZJb8c— ANI (@ANI) February 5, 2025ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా11 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోనున్న అరవింద కేజ్రీవాల్కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్70 సీట్లకు గాను పోటీలో దిగిన 699 మంది అభ్యర్థులున్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేష్ వర్మకల్కాజీ నుంచి సీఎం అతిశీ పోటీ13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుఓటు హక్కు వినియోగించుకోనున్న 1.56 కోట్ల మంది ఓటర్లు83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళా ఓటర్లుఎన్నికల విధులలో లక్షమందికి పైగా సిబ్బందిఈనెల 8న కౌంటింగ్ఈసారి ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరుఢిల్లీలో ఈసారి బీజేపీకి సానుకూల పవనాలుఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎదురీదుతున్న ఆప్కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కాంగ్రెస్ యాక్టివ్ కావడంతో చేజారనున్న ఆప్ ఓట్లు12 లక్షల ఆదాయ పన్ను పరిమితి పెంపుతో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించిన బీజేపీ సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ వివరాలు 👉ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.. #WATCH | EAM Dr S Jaishankar says, "I have been an early voter...I think the public is in a mood for change." https://t.co/mkPc911IXS pic.twitter.com/k6eAYaJjsN— ANI (@ANI) February 5, 2025 #WATCH | Union Minister Hardeep Singh Puri along with his wife Lakshmi Puri, joins party workers at the party's help desk outside the polling station in Anand Niketan#DelhiAssemblyElection2025 pic.twitter.com/aLKM25N05R— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElection2025 | Delhi Police Commissioner Sanjay Arora and his wife cast their vote at a polling booth in Moti Bagh. pic.twitter.com/TSidowMnC3— ANI (@ANI) February 5, 2025 #WATCH | BJP MP Bansuri Swaraj arrives at the polling station at Janpath to cast her vote for #DelhiElections2025 pic.twitter.com/a7llzwSlpH— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElections2025 | Former Union Health Secretary Apurva Chandra cast his vote at a polling booth in Moti Bagh. pic.twitter.com/0ef0LnGazq— ANI (@ANI) February 5, 2025 #WATCH | Delhi: BJP candidate from Rohini assembly seat Vijender Gupta and his wife cast their votes for the #DelhiElection2025 pic.twitter.com/zHP4AS9gKc— ANI (@ANI) February 5, 2025 ఓటు వేసిన రాహుల్ గాంధీలోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Nirman Bhawan after casting his vote for #DelhiElections2025 https://t.co/NySApvSKSf pic.twitter.com/F6xRDJiPRF— ANI (@ANI) February 5, 2025 టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయిన పోలింగ్ఢిల్లీ మాదీపూర్ ప్రాంతంలో ఆగిపోయిన ఓటింగ్ వీవీ ప్యాట్‌లో సాంకేతిక లోపంతో నిలిచిన పోలింగ్ ఆప్ నేతపై కేసు నమోదు..ఆప్ నేత అమానుల్లాహ్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదుఎమ్మెల్యే ఖాన్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది.భారత న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద కేసు నమోదు ఎన్నికలకు ప్రచార సమయం ముగిసిన తర్వాత ఆయన దాదాపు 100 మంది మద్దతుదారులతో ర్యాలీఆప్ కార్యాకర్తతో ప్రచారం.. దీనికి ఈసీ సీరియస్ Even after the election campaign has ended, AAP supporters are roaming in Okhla, violating Section 144 and the Model Code of Conduct! AAP candidate Amanatullah Khan's team is openly breaking election rules. @ECISVEEP @CeodelhiOffice @DelhiPolicePlease take a action must 😡 pic.twitter.com/xrMUGRJunq— Arfat Khan (@Arfatkhan011) February 5, 2025 👉ఓటు వేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడుకొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవామయూర్ విహార్‌లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేసిన సచ్‌దేవా#WATCH | #DelhiElection2025 | After casting his vote, Delhi BJP President Virendraa Sachdeva says "Double engine govt will be formed in Delhi. The people of Delhi are going to vote for a developed Delhi. Accepting his defeat in Delhi, Arvind Kejriwal is doing hooliganism.… pic.twitter.com/wjvXX0N3gF— ANI (@ANI) February 5, 2025 👉ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.. #WATCH | Congress candidate from New Delhi constituency, Sandeep Dikshit casts his vote for #DelhiAssemblyElection2025 AAP national convenor Arvind Kejriwal is once again contesting from the New Delhi seat, BJP has fielded Parvesh Verma from this seat pic.twitter.com/Fou3h8PTSv— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElections2025 | Indian Army Chief General Upendra Dwivedi casts his vote at a polling booth in K. Kamraj Lane in the New Delhi Assembly constituency. pic.twitter.com/2svSq1AFbF— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElections2025 | Delhi Chief Electoral Officer R Alice Vaz casts her vote at a polling booth in Tilak Marg pic.twitter.com/8RdSRCZo0P— ANI (@ANI) February 5, 2025 #WATCH | BJP candidate from the New Delhi Assembly constituency, Parvesh Verma says, "...Our priority will be to clean the Yamuna. I appeal to the people of Delhi to form a good government. He (Arvind Kejriwal) got a chance for 11 years, but today people have understood that they… pic.twitter.com/3vozEbLTfq— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElection2025 | Delhi BJP President Virendraa Sachdeva and his wife show their inked fingers after casting their votes at a polling station in Mayur Vihar Phase 1 under Patparganj Assembly constituency. pic.twitter.com/NdIkdNeX8T— ANI (@ANI) February 5, 2025 👉 ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా..కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అల్కా లంబా. ఎన్నికల్లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. Congress candidate from Kalkaji assembly seat, Alka Lamba, shows her inked finger after casting her vote for #DelhiAssemblyElection2025 Delhi CM Atishi is AAP's candidate from Kalkaji seat, BJP has fielded its former MP Ramesh Bidhuri from this seat. pic.twitter.com/PQR862rlca— ANI (@ANI) February 5, 2025👉ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.. #WATCH | Delhi: Voters queue up at a polling booth in Lodhi Road to cast their votes for #DelhiAssemblyElections2025Polling on all 70 Assembly constituencies of Delhi is underway. pic.twitter.com/kur7trBFwG— ANI (@ANI) February 5, 2025👉విజయం మాదే: సిసోడియా ఎన్నికల వేళ ఆప్ నేత మనీష్ సిసోడియా ప్రత్యేక పూజలు.. ఈ సందర్బంగా సిసోడియా మాట్లాడుతూ..‘లక్షల మంది ప్రజలు ఢిల్లీ సంక్షేమం కోసం, వారి సంక్షేమం, పురోగతి కోసం ఓటు వేస్తారు. కాబట్టి, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆప్ మరోసారి అధికారంలోకి వస్తుందని, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతున్నారని, ప్రజలకు సేవ చేయడానికి నేను జంగ్‌పురా నుంచి గెలవబోతున్నాను. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఆరోపణలతో నిన్న రాత్రి స్వాధీనం చేసుకున్న నగదుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, యంత్రాలను దుర్వినియోగం చేయడం తప్ప మరేమీ చేయరు. ఢిల్లీలో గత 4-5 రోజులుగా వారు ఉగ్రవాదం, గూండాయిజాన్ని వ్యాప్తి చేశారు. వారు డబ్బు, చీరలు, బూట్లు పంపిణీ చేశారు. ప్రతిచోటా వీడియోలు వెల్లువెత్తుతున్నాయి అని అన్నారు. #WATCH | #DelhiElection2025 | AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia says, "Lakhs of people will vote for their welfare and progress as well as the welfare of Delhi. So, I prayed to Kalka Maai that AAP form the government once again under the… pic.twitter.com/nCXf5iH8A2— ANI (@ANI) February 5, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.Voting for #DelhiAssemblyElections begins. Eligible voters in all 70 Assembly constituencies are voting in a single-phase today; 699 candidates are in the fray.AAP chief Arvind Kejriwal will be contesting against BJP's Parvesh Verma and Congress's Sandeep Dikshit from New Delhi… pic.twitter.com/AmC96UUhTk— ANI (@ANI) February 5, 2025👉అందరూ ఓటు వేయండి: మోదీ పిలుపుఢిల్లీ ఎన్నికల వేళ మోదీ ట్వీట్..‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడి ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓట్లను వేయాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా.. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు అని కామెంట్స్ చేశారు. Prime Minister Narendra Modi tweets "Voting for all the seats in the Delhi Assembly elections will be held today. I urge the voters here to participate in this festival of democracy with full enthusiasm and cast their valuable votes. On this occasion, my special wishes to all… pic.twitter.com/r03wQ3rtd9— ANI (@ANI) February 5, 2025 👉ఢిల్లీలో కొనసాగుతున్న మాక్ పోలింగ్..#WATCH | Delhi: Mock polling underway at MCD Pratibha Vidyalaya, Tagore Garden polling booth under the Rajouri Garden Assembly constituency. Polling on all 70 Assembly constituencies of Delhi will begin at 7 am.#DelhiAssemblyElections2025 pic.twitter.com/2XmRkbv1u0— ANI (@ANI) February 5, 2025 👉కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం.. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. #WATCH | #DelhiElection2025 | Election Commissioner Gyanesh Kumar visits Moti Bagh Polling Station. Voting for the Assembly elections will begin at 7 am. pic.twitter.com/GMvxNBDjHS— ANI (@ANI) February 5, 2025👉అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,000 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.#WATCH | #DelhiElection2025 | Polling agents of AAP protest at polling station number 73, at College of Art at Tilak Marg, alleging that the mock poll took place in their absence. pic.twitter.com/OqmRW60z9V— ANI (@ANI) February 5, 2025👉220 కంపెనీల పారామిలటరీ బలగాలను, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోంగార్డులను మోహరించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం చేస్తోంది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్(క్యూఎంఎస్) యాప్‌ను తీసుకొచ్చింది. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లు బారులు తీరి ఉన్నారో దీనిద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనం తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి ఓటు వేయొచ్చు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6,980 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 👉ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరాట పడుతుండగా, పూర్వవైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరీ హామీలు గుప్పించాయి. ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఓటింగ్ శాతం సైతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం భారీగా నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువరు కేంద్ర మంత్రులు.👉ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ తరపున పార్టీ జాతీయ కన్వినర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ, యమునా నది కాలుష్యం, ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసుగెత్తిపోయారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ పెద్దలు తేల్చిచెబుతున్నారు. -
ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష
దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలనుంది. ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్‌కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్‌పై ఉన్న కేజ్రీ వాల్ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ‘ఆప్’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా ‘శీష్ మహల్’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ. అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్‌లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్‌పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్‌కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్ కానున్న సీఈసీపై ఆప్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. -
‘కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’
ఢిల్లీ : ‘నా మాటలు రాసిపెట్టుకోండి హస్తిన పీఠంపై కమలం జెండా ఎగురవేయబోతోంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్రిముఖ పోరులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కమలం అధిష్టానం ఉవ్విళ్లూరుతుంది. ఆ దిశగా తన ఎన్నికల ప్రచారాన్ని వేగం చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ‘ఏక్ తక్ బీజేపీ’ (బీజేపీకి అవకాశమివ్వండి) నినాదంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు.ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికలపై జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు భ్రమపడ్డారని, ఇప్పుడు భ్రమలు వీడి వాస్తవంలోకి వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. ఈసారి ఆప్ (AAP-da)కు గుణపాఠం చెప్పాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో విసిగిపోయారు.. ఇప్పుడు దేశ రాజధానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం’ అని అన్నారు. కేజ్రీవాల్ అబద్ధాల ఎన్ సైక్లోపీడియా. ఢిల్లీ ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు. ఆప్ అవినీతి చేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషించడంలో మించి పోయింది. అందులో మద్యం పాలసీ ఒకటి. ఆప్ కన్వీనర్ అవినీతి చేసేందుకు వినూత్న పద్దతుల్ని ఎంచుకున్నారు. జైలుపాలయ్యారని ఆరోపించారు.ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై నడ్డా స్పందించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో వ్యూహం ఉంటుంది. మాకు వ్యూహం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఢిల్లీలో కూడా అంతేనని’ వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఆప్ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ!
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ (congress party) పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, ఆమ్ (aap) ఆద్మీ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ (Alcohol Affected Party) అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా( pawan khera) గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. మద్యం అలవాటు మనిషిని, అతని కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.शराब स्वास्थ्य के लिए हानिकारक है और शराब की लत इंसान, उसके परिवार और समाज को बर्बाद कर देती है- ये हम सब जानते हैं।लेकिन शराब से पैसा बनाने की लत से न सिर्फ इंसान, समाज बल्कि पूरा शहर खराब हो जाता है। हम सबने देखा है कि कैसे AAP (Alcohol Affected Party) ने शराब के जरिए पूरी… pic.twitter.com/MZld4aS4DP— Congress (@INCIndia) January 23, 2025 కానీ, మద్యం ద్వారా డబ్బు సంపాదించాలనే వ్యసనం కారణంగా కేవలం వ్యక్తి, సమాజం మాత్రమే కాకుండా మొత్తం నగరం కూడా నాశనం అవుతుంది. ఆప్ (ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ ) మద్యం ద్వారా మొత్తం ఢిల్లిని ఎలా నాశనం చేసిందో మనం చూశాం. ఇప్పుడు మీకు ఓ ఆడియో క్లిప్‌ను వినిపిస్తాను. వినండి. అ ఆడియోలో ఆప్ ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన విద్యాశాఖ మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్ ఎలా కుంభకోణం చేశారో తెలుస్తోంది. ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ ఓ మాట అన్నారు. తన వద్ద ప్రతి రోగానికి ఔషధం ఉందని. కానీ ఔషధం కనిపించలేదు.కానీ మద్యం కుంబకోణం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో మొత్తం ప్రభుత్వం మునిగిపోయింది’ అని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పవన్ ఖేరా కామెంట్స్ ఢిల్లీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. -
Delhi Assembly Election: కేంద్రం ముందు 7 డిమాండ్లు పెట్టిన కేజ్రివాల్
-
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో ఓటర్లకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. ఇక, తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. అలాగే, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటనలో తెలిపారు. దీంతో, విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.#WATCH | Delhi | Launching BJP's 'Sankalp Patra' for Delhi Assembly polls, BJP MP Anurag Thakur says," We will provide to the youth of Delhi one-time financial assistance of Rs 15,000 for preparation of competitive examinations and reimburse two-time travel and application fees.… pic.twitter.com/muyCpF8SJ7— ANI (@ANI) January 21, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొదటి మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప పత్రం’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లను రూ.500కే ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టో ఇలా.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం. ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6వేలకు ఇవి అదనం‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీపేద కుటుంబీలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, ప్రతి హోలీ, దీపావళి (ఒకటి చొప్పున) పండగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. రూ.5కే భోజనంసంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు -
ఢిల్లీలో కాంగ్రెస్‌కు దిక్కులేదు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishanreddy) అన్నారు. శుక్రవారం(జనవరి17) కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అంశంపై మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్(CongressParty)కు ఢిల్లీలో దిక్కు లేదు..ఢిల్లీ(Delhi) ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతివ్వడం లేదు. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటి చర్చే ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీ గా ఉంటుంది’అని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి.అదే నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొందరు నేతల మాటలు హద్దులు మీరుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) భావిస్తుండగా ఆప్‌ను ఈసారైన ఓడించి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పనిచేస్తోంది.ఢిల్లీలో పేరుకు ముక్కోణపు పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యనే ఉండనుందని తెలుస్తోంది. కేసుల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో కీలక హామీలు -
ఢిల్లీ గల్లీలో కొత్త నాటకం.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్(Congress) సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గానీ.. అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహారం అంటూ విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి.. ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి?.. గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి?. నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు?. తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు?.రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ?. ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ?. రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ?. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ?. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?. ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజల కోసం కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించింది. ఈ సందర్బంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత రేషన్ కిట్ గ్యారెంటీలను కాంగ్రెస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు గ్యారంటీల పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల అప్పులు మాఫీ చేశాం. 21వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశాం. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. ఇది మా నిబద్దతను తెలియచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలు ఇస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక ఈ స్థాయిలో ఎవరూ రుణమాఫీ చేయలేదు. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది. ఉచిత బస్సు ప్రయాణం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. #WATCH | Delhi: If voted to power in #DelhiElections2025, Congress announces to provide LPG cylinders at Rs 500, free ration kits and 300 units of free electricity (Source: Congress) pic.twitter.com/SK4HsNnCAk— ANI (@ANI) January 16, 2025 దేశంలో నిరుద్యోగం సమస్యగా మారింది. మోదీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది. అమలు చేసిందా?. 11 ఏళ్లుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూడండి. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. ఇచ్చారా?. 11 ఏళ్లలో మోదీ ఇచ్చింది కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ఢిల్లీలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు నాది బాధ్యత. కాలుష్యంతో ఢిల్లీ నివాసయోగ్యం కాకుండా చేశారు. ఢిల్లీ రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఢిల్లీకి వస్తే జ్వరాలు వస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేజ్రీవాల్, మోదీ ఇద్దరు ఢిల్లీలో విఫలమయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు. మళ్లీ కాంగ్రెస్ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించాం. లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న ఆప్‌ను కూడా ఢిల్లీలో ఓడిస్తాం. దావోస్‌కు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం. పర్యటన ముగిసిన తర్వాత పెట్టుబడులు ఎంత వచ్చాయో చెబుతాం. అవినీతిని కట్టడి చేస్తే గ్యారంటీలు అమలు చేయవచ్చు. 16లక్షల కోట్ల రూపాయలు అప్పులను కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోదీ మాఫీ చేశారు. మోదీ, కేజ్రీవాల్ కుర్చీ కొట్లాట వల్ల ఢిల్లీ ప్రజల వల్ల నష్టపోతున్నారు. తెలంగాణలో ఒకటిన్నర శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు తెచ్చాం. అధికారంలోకి వచ్చాం. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
Delhi Elections: బీజేపీ రెండవ జాబితా విడుదల
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీచేయబోయే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కపిల్ మిశ్రా(Kapil Mishra)ను కరవాల్ నగర్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. లక్ష్మీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి అభయ్ వర్మను బరిలోకి దింపింది. వర్మ ఈ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 58 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ 29 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. కరవాల్ నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కపిల్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించింది. మోతీనగర్ నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానాను పార్టీ బరిలోకి దింపింది.ఐదుగురు మహిళా అభ్యర్థులుబీజేపీ ప్రకటించిన రెండవ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మొదటి జాబితాలో పార్టీ ఇద్దరు మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పటివరకు పార్టీ ఏడుగురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. పార్టీ నీలం కృష్ణ పెహల్వాన్‌ను నజాఫ్‌గఢ్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి చెందిన కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ ఆలయ సెల్ అధ్యక్షునిగా కర్నైల్ సింగ్‌కు పార్టీ షకుర్ బస్తీ టికెట్ ఇచ్చింది. వివిధ స్థానాల నుంచి..ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్‌ను ఆ పార్టీ కొండ్లి నుంచి పోటీకి దింపింది. దీనితో పాటు తిమార్పూర్ నుండి సూర్య ప్రకాష్ ఖత్రి, నరేలా నుండి రాజ్ కరణ్ ఖత్రి, కిరాడి నుండి బజరంగ్ శుక్లా, చాందినీ చౌక్ నుండి సతీష్ జైన్, సుల్తాన్పూర్ మజ్రా (ఎస్సీ) నుండి కరం సింగ్ కర్మ, ముండ్కా నుండి గజేంద్ర దరాల్, సదర్ బజార్ నుండి మనోజ్ కుమార్ జిందాల్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఉత్తమ్ నగర్ నుండి పవన్ శర్మ, వికాస్పూర్ నుండి పంకజ్ కుమార్ సింగ్, కస్తూర్బా నగర్ నుండి నీరజ్ బసోయా, మటియాలా నుండి సందీప్ సెహ్రావత్, ద్వారక నుండి ప్రద్యుమాన్ రాజ్‌పుత్, పాలం నుండి కుల్దీప్ సోలంకి, రాజిందర్ నగర్ నుండి ఉమాంగ్ బజాజ్, తుగ్లకాబాద్ నుండి రోహ్తాస్ బిధురి, సీలంపూర్ నుండి మనీష్ చౌదరిలను ఎన్నికల్లో పోటీకి నిలిపింది. మొదటి జాబితాలో కూడా 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలుఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. మొదటిసారి ఓటు వేయబోయే మొత్తం ఓటర్ల సంఖ్య 2.08 లక్షలు. ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు 13 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 830గా ఉంది. ఇది కూడా చదవండి: ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం -
Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు
దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరగనుండగా, ఎనిమిదో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాల నుంచి పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వెనుకబడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు పార్టీలకున్న బలాలు, బలహీనతలేమిటో ఇప్పుడు చూద్దాం.ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) అవినీతి నిర్మూలన పేరుతో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఇప్పుడు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 29.49 శాతం ఓట్లను సాధించి, మొత్తం 70 సీట్లలో 28 సీట్లను గెలుచుకుంది. రెండేళ్ల తర్వాత అంటే 2015లో అఖండ విజయం సాధించింది. 54.34శాతం ఓట్లతో 67 సీట్లు గెలుచుకుంది. నాడు బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. 2020లో ఆప్ మళ్లీ అద్భుతం చేసింది. సీట్ల సంఖ్య స్వల్పంగా 62కి పడిపోయినా, 53.57శాతం ఓట్ల వాటాను కొనసాగించింది.ఒకప్పుడు తమ పార్టీ మార్పునకు నాందిగా అభివర్ణించిన ఆ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు జైల్లోనే ఉన్నారు. మరోనేత మనీష్ సిసోడియా 17 నెలల పాటు జైలు జీవితం గడిపారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు. వీరంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇవన్నీ పార్టీకి మైనస్ పాయింట్లుగా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ)బీజేపీ దేశ రాజధానిలో గెలుపు రుచి చూడాలని ఉవ్విళ్లూరుతోంది. పంజాబ్ మినహా ఉత్తర భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారం ఎరుగని ఏకైక ప్రాంతం ఢిల్లీ. అయితే బీజేపీ(BJP) తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విజయం సాధించింది. 1998 నుంచి ఢిల్లీలో ఓటమిపాలవుతున్నప్పటికీ, గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎప్పుడూ 32శాతం కంటే తగ్గలేదు. 2015లో మూడు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ, ఓట్లు 32.19శాతం వచ్చాయి. ఐదేళ్ల తర్వాత ఎనిమిది సీట్లు గెలుచుకున్నప్పుడు ఓట్ల శాతం 38.51 శాతానికి పెరిగింది.1998, 2003, 2008లో వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత 2013, 2015, 2020లో ఆప్ కాంగ్రెస్‌ను ఓడించింది. కాంగ్రెస్‌కు షీలా దీక్షిత్, ఆప్‌కు అరవింద్ కేజ్రీవాల్‌ల మాదిరిగానే బీజేపీకి ఢిల్లీలో ప్రజాభిమానం పొందిన నేత లేకపోవడం బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. బీజేపీ 2015లో కిరణ్ బేడీని పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ, ఎటువంటి అద్భుతం జరగలేదు.కాంగ్రెస్ కాంగ్రెస్‌పార్టీ ఇటీవలి కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో కేవలం 4.26శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటిలో ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. 1998 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 47.76శాతం ఓట్లతో 52 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ దిరిమిలా షీలా దీక్షిత్(Sheila Dikshit) 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా కొనసాగారు.2013లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయ్యింది. షీలా దీక్షిత్.. కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 66 మంది అభ్యర్థుల్లో 63 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాభిమానం కలిగిన నేత కరువయ్యారు. ఓటు బ్యాంకును కూడా కోల్పోయింది. ఈ నేపధ్యంలో ముస్లింలు తమ పార్టీకి మద్దతునిస్తారని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఢిల్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. బీజేపీతో పొత్తును తిరస్కరించింది. అయితే కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ హైకమాండ్ లేదని సమాచారం.ఇది కూడా చదవండి: Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ -
పోరాడేది ముగ్గురైనా.. పోటీ ఇద్దరి మధ్యే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఢిల్లీ ఎన్నికలకు శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చకునేందుకు సిధ్దమవుతున్నాయి. ఎన్నికల పోరులో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్, కాషాయ పార్టీల మధ్యే ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కదనరంగంలోకి కాలుదువ్విన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకుపోతుండగా, పరివర్తన్ యాత్రల పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రభావం చూపేందుకు సమాయత్తమయ్యారు. ఇక ప్రచార పర్వంలో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది. తన గత వైభావాన్ని పొందే పరిస్థతి లేకున్నా, అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.జాతీయ పార్టీలను ఊడ్చేసిన ఆప్..సామాన్యడినంటూ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ అసమాన్య రీతిలో జాతీయ పార్టీలను తన చీపురుతో ఊడ్చేశారు. 2013లో కాంగ్రెస్ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేజ్రీవాల్ జన్ లోక్‌పాల్ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రభుత్వంలోంచి దిగిపోయారు. అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో అసమాన్య రీతితో 70 స్థానాలకు గానూ ఏకంగా తన ఛరిష్మాతో 67 స్థానాలు సాధించిన బీజేపీ, కాంగ్రెస్‌లను మట్టి కరిపించారు. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని పొందిన ఆప్, ఆ తర్వాత 2020లోనూ రెండు పార్టీలకు చుక్కలు చూపించింది.2020 ఎన్నికల్లో ఆప్ ఏకంగా 53.57% ఓట్లతో 62 స్థానాలు సాధించింది. 38.51% ఓట్లు సాధించిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా... షీలాదీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్ళపాటు అధికార హవాను కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 4.26% ఓట్లకు పడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించే వ్యూహంతో... ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ మరోమారు జాతీయపార్టీలకు సవాల్ విసురుతున్నారు. మళ్లీ కొత్త పంథాలో ఆమ్ ఆద్మీప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పంథాలో దూసుకెళ్తోంది. లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో అప్రతిష్టపాలైన కేజ్రీవాల్ ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ అధినేతగా ప్రచార బాధ్యతలను భుజస్కందాలపై ఎత్తుకున్న కేజ్రీవాల్... పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ పథకాలతో ప్రజలకు చేరువైన ఆయన కొత్త తరహా హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షలకు బీమా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.1 లక్ష సహాయం, మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,100 ప్రత్యేక సహాయం, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులందరికీ ఉచిత వైద్యం, హిందు, సిక్కు పూజారులకు నెలకు రూ.18 వేలు సహాయం, విదేశీ విద్యను అభ్యసించే దళిత విద్యార్థుల పూర్తి ఖర్చులను భరించేటువంటి హామీలను ఇచ్చారు. వీటితో పాటు అక్రమంగా పెంచిన నీటి బిల్లులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించారు.ఆప్ హామీల ప్రకటన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కైలాష్ గెహ్లోత్ రాజీనామా, సీఎం అధికార నివాసం శీష్ మహల్‌పై రగులుతున్న వివాదం ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కట్లకు గురిచేస్తోంది. అంతేగాక ఆప్ అధినేతకు పోటీగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో దిగారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌తో పాటు బీజేపీ నేత పర్వేష్ వర్మను ఎదుర్కోవడం కేజ్రీవాల్‌కు సవాలుగా మారింది.పీఠం దక్కించుకోవాలన్న కాంక్షతో కమలంఆమ్ ఆద్మీ పార్టీని అప్రతిష్టాపాలు చేసి అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ ప్రణాళికలను అమలు చేస్తోంది. లిక్కర్ స్కాం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బజారుకీడ్చడంలో సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ... లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఆప్, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 54.35% ఓట్లను రాబట్టుకుంది. ఇదే పంథాను కొనసాగించాలన్న బలమైన లక్ష్యంతో ఉన్న బీజేపీ... యమునా కాలుష్యం, శీష్ మహల్లో విలాస జీవితం, లిక్కర్ స్కాం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆప్‌ను ఇరుకునపెడుతోంది. సామాన్యుడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్... అవినీతి సొమ్ముతో అద్దాల మేడలో విలాసంగా జీవించారంటూ బీజేపీ ప్రముఖంగా విమర్శిస్తోంది. ఈ నెల 3, 5 తేదీల్లో పరివర్తన యాత్రలో భాగంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శీష్ మహల్ కేంద్రంగానే కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలు మనోజ్ తివారీ, బాన్సురీ స్వరాజ్, ప్రదీప్ ఖండేల్వాల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి నేతలు బీజేపీ గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. ఒంటరి పోరులో కాంగ్రెస్ 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు పోటీ పడుతోంది. గత రెండు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ , ఆస్థిత్వాన్ని చాటుకునేందుకు కష్టపడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోరాడి 18.19% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్ల శాతంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అంశాన్ని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్, అల్కా లాంబ, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్ వంటి పార్టీ సీనియర్ నేతలు ఆప్‌కు పోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. -
‘నన్ను క్షమించండి.. ప్రియాంక గురించి అలా మాట్లాడాల్సింది కాదు’
ఢిల్లీ: ‘నన్ను క్షమించండి. ప్రియాంక గాంధీ (priyanka gandhi) గురించి అలా మాట్లాడాల్సింది కాదు. నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను’అని ఢిల్లీ కాల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి (Ramesh Bidhuri) క్షమాపణలు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (delhi assembly elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.ఈ తరుణంలో కాల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బిదూరి వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియాశ్రీనేట్ మండిపడ్డారు.మహిళల పట్ల బిదూరి మనస్తత్వాన్నిఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని, ఇది బీజేపీ నిజ స్వరూపమని పేర్కొన్నారు. బిదూరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. అవును. ప్రియాంక గాంధీ గురించి నేను మాట్లాడింది నిజమే. హేమామాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించారు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుందనే ఏమో ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు. 👉చదవండి: ప్రియాంకగాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు నోటిని అదుపులో పెట్టుకోకపోతేనోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తన పార్టీ మాజీ ఎంపీలకు తెలిసొచ్చేలా చేసింది బీజేపీ అధినాయకత్వం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 400పై చిలుకు లోక్‌సభ స్థానాల్ని గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేసింది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేష్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు సీట్లను నిరాకరించింది. వారిలో రమేష్ బిదురి ముందు వరసలో ఉన్నారు. రమేష్ బిదురిఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది.అనంత్‌కుమార్ హెగ్డేకర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది.పర్వేష్ సాహిబ్సింగ్ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశ్చిమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది.ప్రజ్ఞాసింగ్ ఠాకూర్మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించినా, ముంబై ఉగ్ర దాడుల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. అందుకే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను పక్కన పెట్టేసింది. -
‘శీష్‌మహల్’ ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్
ఢిల్లీ : ‘కోవిడ్-19 సమయంలో ఢిల్లీ ప్రజలు బాధపడుతుంటే.. కేజ్రీవాల్ మాత్రం శీష్‌మహల్‌ను నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యారు. శీష్‌మహల్ (Sheeshmahal) కోసం పెట్టిన ఖర్చు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రజల సంక్షేమం కంటే ఆయనకు విలాసాలు కావాల్సి వచ్చిందంటూ’ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ (Namo Bharat) కారిడార్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం. అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says "The 'AAP-DA' people have left no stone unturned in destroying Delhi's transport system. These people are not paying any attention to the maintenance of buses. The common citizens of Delhi have suffered… pic.twitter.com/I93IqlMaKz— ANI (@ANI) January 5, 2025 అదే సమయంలో కేజ్రీవాల్ అధికారిక నివాసంపై మోదీ ప్రశ్నలు సంధించారు. మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా ప్రాధాన్యమని సూచించారు.అనంతరం, మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ..ఆప్ నాయకత్వం దేశ రాజధాని ఢిల్లీని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. అవినీతి, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు. ‘దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారని మోదీ నొక్కాణించారు.👉చదవండి : ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సెటైర్లు -
కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. కానీ.. ప్రధాన పారీ్టలన్నీ గెలుపుగుర్రాలను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 70అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను శనివారం బీజేపీ 29మందితో తొలి జాబితా విడుదల చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్, తాజా సీఎం ఆతిశీలతో ఇద్దరు మాజీ ఎంపీలు తలపడబోతున్నారు. ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పారీ్టకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా చోటు దక్కింది. కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎంల కుమారులు బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ స్థానం హాట్ స్పాట్‌గా మారింది. ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. రేఖా గుప్తాను శాలిమార్ బాగ్ నుంచి, కుమారి రింకూని సీమాపురి(ఎస్సీ) నుంచి బీజేపీ రంగంలోకి దింపుతోంది. కేజ్రీవాల్ వర్సెస్ ఇద్దరు మాజీ సీఎంల కుమారులు ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ మూడు దఫాలుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగోసారీ ఇక్కడి నుంచే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పోటీ చేయనున్నారు. దీంతో ఈ సీటుపైనే అందరి దృష్టీ పడింది. కల్కాజీ స్థానం నుంచి తొలిసారి ఆప్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం ఆతిశీపై మాజీ ఎంపీ రమేష్ బిదూరిని బీజేపీ పోటీకి దింపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఏకంగా సీఎం ఆతిశీపై పోటీకి నిలపడం గమనార్హం. ఇద్దరు ఆప్ మాజీ మంత్రులకు టికెట్లు ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. పటేల్ నగర్ ఎస్సీ స్థానం నుంచి ఆప్ మాజీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్, ప్రస్తుతం నజఫ్‌గఢ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైలాష్ గెహాŠల్త్కు చోటు కలి్పంచింది. అయితే నజఫ్‌గఢ్‌కు బదులుగా ఆయన స్థానాన్ని మార్చి బిజ్వాసన్ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. గాంధీ నగర్ నుంచి మాజీ కాంగ్రెస్ మంత్రి అరవిందర్‌సింగ్ లవ్లీకి బీజేపీ టికెట్ ఇచి్చంది. అలాగే, ఆప్ నుంచి ఛత్తర్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరిన కర్తాల్ సింగ్ తన్వర్ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇదీ చదవండి: నేను అద్దాల మేడ కట్టుకోలేదు -
అతిశీపై అల్కా లాంబా పోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. కేవలం ఒక్క అభ్యర్థి ఆల్కా లాంబా పేరుతో శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిశీపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆల్కా లాంబా పోటీ చేయబోతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆల్కా లాంబా 2015లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా నెగ్గడం గమనార్హం. -
ఆప్ ఎన్నికల వ్యూహం.. ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది(2025) ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెలువరించిన అభ్యర్థుల రెండో జాబితాలో పార్టీ వ్యూహం వెల్లడయ్యింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యిఆప్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాతవారికి తిరిగి టిక్కెట్లు దక్కలేదు. పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు కేటాయించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాన్ల స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో అంత్యంత ఆసక్తికరంగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థులు, కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలకు మించిన రీతిలో ఆప్ వారిపై నమ్మకం వ్యక్తం చేసింది.విమర్శలకు చెక్ పెడుతూ..పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలపై ఓటర్లకు ఉన్న ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం ఇచ్చిన కారణంగా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను విమర్శించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడను ఆప్ ప్లే చేసింది. ఈసారి ఎన్నికలు అంత సులువు కాదని వ్యూహకర్తలు కూడా భావిస్తున్నారట. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందంటున్నారు.ప్రజాభిప్రాయ సేకరణఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆప్ తమ అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిందని సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసిన చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై మూడు స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మిగిలిన 20 సీట్లలో రాఖీ బిర్లాన్, మనీష్ సిసోడియాల సీట్లు కూడా మారాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టిక్కెట్లు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలోకి దించింది. వీరిలో 90 శాతం మంది ఆప్ కౌన్సిలర్లు కావడం విశేషం. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రజాదరణ పొందిన కౌన్సిలర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది.ఈ కౌన్సిలర్లకు ఆప్ టిక్కెట్లునరేలా నుంచి దినేష్ భరద్వాజ్, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, జనక్‌పురి నుంచి ప్రవీణ్ కుమార్, డియోలి నుంచి ప్రేమ్ కుమార్ చౌహాన్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్ని, త్రిలోక్‌పురి నుంచి అంజనా పర్చా (మాజీ కౌన్సిలర్)కు ఆప్ టిక్కెట్లు కేటాయించింది. ఇదేవిధంగా త2020లో ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ టిక్కెట్లు కేటాయించింది. ఈ జాబితాలో రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్, గాంధీ నగర్ నుంచి నవీన్ చౌదరి ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.ఇది కూడా చదవండి: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత -
కేజ్రీవాల్ చేతిలో మొహల్లా బస్సుల బ్రహ్మాస్త్రం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న ఆప్ మరోమారు అధికారం సొంతం చేసుకునేందుకు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటిలో ఒకటే ‘మొహల్లా’.. మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.మొహల్లా క్లినిక్‌లకు అమితమైన ఆదరణకేజ్రీవాల్ సారధ్యంలో ఢిల్లీలో ఏర్పాటైన 300కు పైగా మొహల్లా క్లినిక్‌లు అమితమైన ప్రజాదరణ పొందాయి. 1.6 కోట్ల మంది మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను అందుకున్నారు. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ రోడ్లపైకి ఎక్కనున్న మొహల్లా బస్సులు రవాణా రంగంలో మరో విప్లవానికి నాంది పలకబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొహల్లా బస్సులు బ్రహ్మాస్త్రంగా మారనున్నాయనే మాట కూడా వినిపిస్తోందిమహిళల భద్రతే ధ్యేయంగా..మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొహల్లా బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. శాంతిభద్రతల అంశాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచుకునే ఉద్దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా బస్సులను తీసుకువస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఢిల్లీ ఎంత అభద్రతలో ఉందో తెలియజేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటామో లేదో అనే అభద్రతా భావంతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం మొహల్లా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తోంది. గల్లీల్లోనూ సులభంగా తిరిగేలా..మొహల్లా బస్సులు 9 మీటర్ల పొడవు కలిగివుంటాయి. ఇవి చిన్నపాటి గల్లీల్లోనూ సులభంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేజ్రీవాల్-అతిషి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మొహల్లా బస్సుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలో మరో రెండు వారాల్లో ఢిల్లీ రోడ్లపై మొహల్లా బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులో 23 సీట్లు ఉండనున్నాయి. అలాగే 13 మంది నిలుచునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా 36 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఆరు సీట్లు మహిళలకు కేటాయించారు.రాత్రి 10 గంటల వరకూ అందుబాటులో..తొలిదశలో 140 మొహల్లా బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మొత్తం 16 గంటల్లో 12 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విధంగా ఒక్కరోజులో లక్షా 20 వేల 960 మంది ప్రయాణికులు ఒక రోజులో ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొహల్లా బస్సులు ప్రారంభం కావడం విశేషం. మొహల్లా బస్సుల వినియోగం ఢిల్లీ రవాణా రంగంలో ఒక మైలురాయిగా మారనుందనే మాట వినిపిస్తోంది. మొహల్లా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు. ఫలితంగా వీటి నుంచి కాలుష్యం ఏర్పడదు. ఇది కూడా చదవండి: మరోమారు తెరపైకి అమృత్సర్.. -
టెక్నాలజీతో ఓటింగ్ పెంచుతాం
న్యూఢిల్లీ: టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఓట్ల శాతాన్ని పెంచుతామని, పలు కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఓటేసేలా చేస్తామని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రణ్‌బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. త్వరలోనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ కోడ్లు, సోషల్ మీడియాల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తామని చెప్పారు. ‘జోష్ టాక్స్’ ప్రతినిధుల ద్వారా కాలేజీలు, ఇతర సంస్థల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రముఖ రేడియో జాకీ నవీద్ ఖాన్, కథక్ డాన్సర్ అలక్‌నంద దాస్‌గుప్త, క్రీడాకారులు మానిక బాత్రా, రిషభ్ పంత్ పాల్గొననున్నట్లు చెప్పారు. మొత్తం 1.4 కోట్ల మంది ఓటర్లని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పత్పార్గంజ్ నుంచి బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. 15 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారారు. 24 మంది కొత్త వారు కాగా మొత్తం 8 మంది మహిళలు కూడా బరిలో ఉన్నట్లు తెలిపారు. -
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి
హన్మకొండ చౌరస్తా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారాని కి రావాలని జిల్లా నేతలకు ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూ చిం చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన భూ సేకరణ అంశంపై శనివారం సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు కొప్పుల రాజు హాజరుకాగా, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్‌తో పాటు సీజే శ్రీని వాస్, డాక్టర్ హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ఘం టా నరేందర్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో కొప్పుల రాజు మాట్లాడుతూ ఢిల్లీ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. అలాగే ఫిబ్రవరిలో వరంగల్‌లో జరగనున్న ఎస్సీ సెల్ సమ్మేళ నం విజయవంతానికి కృషి చేయాలన్నారు. -
విధానసభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికలను కమలదళం....అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ ఎన్నికలో సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అభ్యర్థులను ప్రకటించడం మినహా ఎన్నికలకు సంబంధించి అన్ని సన్నాహాలు చేసిన ఆ పార్టీ విజయంకోసం పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల సలహాలతో స్థానిక నాయకత్వం ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తోందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. విజయావశాశాలు గల నేతలకే టికెట్ ఇస్తారని చెబుతున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే ఇక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభజనంతో గెలవాలని బీజేపీ ఆశిస్తోంది. దీంతోపాటు ఢిల్లీ కోసం మోదీ సర్కారు ఇటీవల చే పట్టిన చర్యలను వివరించి ఓట్లు అడగాలని భావిస్తోంది. అనధికార కాలనీలకు చట్టబద్ధత కల్పించడం, నగరంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం కోసం మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, సిక్కు అల్లర్ల బాధితులకు నష్టపరిహారం అందించడం, ఈ-రిక్షాలకు చట్టబద్ధత కల్పించడం వంటి చర్యలను ప్రధానంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇంటింటికి ప్రచారంపై దృష్టి సారించాలంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలను ఆదేశించింది. ఏ ఒక్క ఇంటినీ విడిచిపెట్టరాదని, ప్రతి ఓటరును కలవాలలని ఆదేశించింది.బూత్‌స్థాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వహణ కోసం 150 మంది సభ్యులతో ఓ కమిటీని కూడా నియమించింది. దళితులు, గ్రామీణులు, అనధికార కాలనీ వాసులు, మహిళలు... ఇలా అన్నివర్గ్గాల ఓటర్లను ఆక ట్టుకోవడానికి కమలదళం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఒక్కో వర్గాన్ని ఆకట్టుకునే బాధ్యతను నగరానికి చెందిన ఏడుగురు ఎంపీలకు అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొన్న అనుమానాలను నివృత్తి అంశానికి ప్రాధాన్యమివ్వనుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభుత్వోద్యోగులలో బీజేపీపట్ల వ్యతిరేకతకు దారితీయవచ్చని కొందరు అంటున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఇటీవల ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ పదవీ విరమణ వయసును తగ్గించే యోచన లేదని ప్రకటించారు. యువతను ఆకట్టుకోవడం 100 మందితో కూడిన బీజేపీ ఐటీ విభాగం... సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గ డ్కారీ, వెంకయ్యనాయుడు,జేపీ నడ్డా, పీయూష్‌గోయల్ , సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీలు పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. ఎన్నికల ప్రచారం పాల్గొనాలంటూ హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులను కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ర్యాలీలో పాలుపంచుకోనున్నారు. ఢిల్లీకి చెందిన కేంద్ర మంత్రి డా. హర్షవర్ధన్‌కు కూడా ఎన్నికల బాధ్యతలను అప్పగించినప్పటికీ గతంలో మాదిరిగా ఆయన ఈసారి కీలకపాత్ర పోషించబోరని అంటున్నారు. -
ఈ రోజు ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్
-
ఢిల్లీలో ఎన్నికల నగారా!
-
ఓటేసిన సోనియా, షీలా