సీఎం అతిశీ వర్సెస్ రమేష్ బిదూరి
29 అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
వీరిలో ఇద్దరు ‘ఆప్’, ఒక కాంగ్రెస్ మాజీ మంత్రి
న్యూఢిల్లీ బరిలో ఒక సీఎం, ఇద్దరు మాజీ సీఎంల కుమారులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. కానీ.. ప్రధాన పారీ్టలన్నీ గెలుపుగుర్రాలను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 70అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను శనివారం బీజేపీ 29మందితో తొలి జాబితా విడుదల చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్, తాజా సీఎం ఆతిశీలతో ఇద్దరు మాజీ ఎంపీలు తలపడబోతున్నారు.
ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పారీ్టకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా చోటు దక్కింది. కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎంల కుమారులు బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ స్థానం హాట్ స్పాట్‌గా మారింది. ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. రేఖా గుప్తాను శాలిమార్ బాగ్ నుంచి, కుమారి రింకూని సీమాపురి(ఎస్సీ) నుంచి బీజేపీ రంగంలోకి దింపుతోంది.
కేజ్రీవాల్ వర్సెస్ ఇద్దరు మాజీ సీఎంల కుమారులు
ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ మూడు దఫాలుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగోసారీ ఇక్కడి నుంచే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పోటీ చేయనున్నారు. దీంతో ఈ సీటుపైనే అందరి దృష్టీ పడింది. కల్కాజీ స్థానం నుంచి తొలిసారి ఆప్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం ఆతిశీపై మాజీ ఎంపీ రమేష్ బిదూరిని బీజేపీ పోటీకి దింపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఏకంగా సీఎం ఆతిశీపై పోటీకి నిలపడం గమనార్హం.
ఇద్దరు ఆప్ మాజీ మంత్రులకు టికెట్లు
ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. పటేల్ నగర్ ఎస్సీ స్థానం నుంచి ఆప్ మాజీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్, ప్రస్తుతం నజఫ్‌గఢ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైలాష్ గెహాŠల్త్‌కు చోటు కలి్పంచింది. అయితే నజఫ్‌గఢ్‌కు బదులుగా ఆయన స్థానాన్ని మార్చి బిజ్వాసన్ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. గాంధీ నగర్ నుంచి మాజీ కాంగ్రెస్ మంత్రి అరవిందర్‌సింగ్ లవ్లీకి బీజేపీ టికెట్ ఇచి్చంది. అలాగే, ఆప్ నుంచి ఛత్తర్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరిన కర్తాల్ సింగ్ తన్వర్ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
ఇదీ చదవండి: నేను అద్దాల మేడ కట్టుకోలేదు
Comments
Please login to add a commentAdd a comment