Parvesh Verma
-
ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్‌లో ఆప్‌ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. జాట్ నేత అయిన పర్వేశ్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు. అతిశీ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు. పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్22 మంది ఆప్ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే! ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి. -
కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. ఎవరీ పర్వేష్ వర్మ?
ఢిల్లీ: 27ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా, కొరకరానికి కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ని బీజేపీ చిత్తు చేతింది. ఆ పార్టీ చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బీజేపీ (bjp) మూడోసారి విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు?హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు దీరనుంది? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. రేపటి నుంచి నాలుగు రోజులపాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. పర్యటన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుత ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ మార్లేనా తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. అతిశీ రాజీనామా అనంతరం, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఉత్తర్వులు వెలువరించారు.ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కావడంతో కేజ్రీవాల్‌ను ఓడించి జైంట్ కిల్లర్‌గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ (parvesh verma) గవర్నర్ సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలతో ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా,బీజేపీ తరఫున చివరి సారిగా పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్లతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, వర్మకు 30,088ఓట్లు వచ్చాయి. వర్మ అంతకుముందు 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వచ్చించారు. ఎవరీ పర్వేష్ వర్మ?ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. పర్వేష్ వర్మ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముండ్కా నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.పర్వేష్ వర్మ విజయంపై ఆయన కుమార్తెలు త్రిష, సనిధి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.‘అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఎప్పటికీ చేయరు మా తండ్రి గెలుపుతో పాటు పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూశాం. ఆ సమయం రానే వచ్చింది.ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని వ్యాఖ్యనించారు. -
ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?.. రేసులో పర్వేశ్ వర్మ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై నెగ్గిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ(47) పేరు మార్మోగిపోతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంంలో కేజ్రీవాల్‌పై 4,089 ఓట్ల తేడాతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. వర్మకు 30,088 ఓట్లు, కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లు లభించాయి. పశ్చిమ ఢిల్లీకి చెందిన పర్వేశ్ వర్మ రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. ఓటర్లకు చేరువయ్యారు. ఎన్నికలకు రెండు నెలల ముందే ఇంటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గరిష్ట స్థాయిలో ఓటర్లను కలుసుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్‌వర్మ ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఓడించి, బీజేపీ తరపున నూతన ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. బాల్యం నుంచే సంఘ్ భావజాలం పర్వేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. తండ్రి బాటలో నడుస్తూ 1991లో ఆర్ఎస్ఎస్లో చేరారు. బాల స్వయంసేవక్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీ యువమోర్చాలో చేరారు. యువమో ర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు. తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలోని మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో అదే నియోజకవర్గంలో 4.78 లక్షల ఓట్ల మెజార్టీతో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి సాహిబ్‌సింగ్ వర్మ స్థాపించిన ‘రా్ష్ట్రీయ స్వాభిమాన్’ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకుంటున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయిన పర్వేశ్ వర్మ మంచి వక్తగా పేరుగాంచారు. ఇప్పటి ఎన్నిల్లో కేజ్రీవాల్‌ను తానే ఢీకొట్టబోతున్నానని బహిరంగంగా ప్రకటించారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి కేజ్రీవాల్ సీఎం అయ్యారు. రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ శర్మ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘అది కేజ్రీవాల్ పనే .. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్(AAP) ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్‌వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ.‘ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. తమ కార్యకర్తల చేత కుర్చీలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాల్ నగర్ లో నిన్న(ఆదివారం) కుర్చీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ఆప్ నేతలే పని. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో పడ్డారు ఆప్ నేతలు. ఇది కేజ్రీవాల్.. ఆప్ కార్యకర్తల చేత చాలా తెలివిగా చేయిస్తున్నారు. ఒక ట్రాలీలో కుర్చీలను తీసుకెళ్తున్న వ్యక్తి వాటిని పంపిణీ చేస్తున్నాడు. ఆ కార్యకర్త కేజ్రీవాల్ పంపిన కార్యకర్తే’ అని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సైతం జత చేశారు. వెంటనే కేజ్రీవాల్పైఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.వారికి భూములివ్వండి.. నగరానికి వారే బ్యాక్బోన్కాగా, వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కేజ్రీవాల్. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. -
కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. కానీ.. ప్రధాన పారీ్టలన్నీ గెలుపుగుర్రాలను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 70అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను శనివారం బీజేపీ 29మందితో తొలి జాబితా విడుదల చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్, తాజా సీఎం ఆతిశీలతో ఇద్దరు మాజీ ఎంపీలు తలపడబోతున్నారు. ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పారీ్టకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా చోటు దక్కింది. కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎంల కుమారులు బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ స్థానం హాట్ స్పాట్‌గా మారింది. ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. రేఖా గుప్తాను శాలిమార్ బాగ్ నుంచి, కుమారి రింకూని సీమాపురి(ఎస్సీ) నుంచి బీజేపీ రంగంలోకి దింపుతోంది. కేజ్రీవాల్ వర్సెస్ ఇద్దరు మాజీ సీఎంల కుమారులు ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ మూడు దఫాలుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగోసారీ ఇక్కడి నుంచే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పోటీ చేయనున్నారు. దీంతో ఈ సీటుపైనే అందరి దృష్టీ పడింది. కల్కాజీ స్థానం నుంచి తొలిసారి ఆప్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం ఆతిశీపై మాజీ ఎంపీ రమేష్ బిదూరిని బీజేపీ పోటీకి దింపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఏకంగా సీఎం ఆతిశీపై పోటీకి నిలపడం గమనార్హం. ఇద్దరు ఆప్ మాజీ మంత్రులకు టికెట్లు ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. పటేల్ నగర్ ఎస్సీ స్థానం నుంచి ఆప్ మాజీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్, ప్రస్తుతం నజఫ్‌గఢ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైలాష్ గెహాŠల్త్కు చోటు కలి్పంచింది. అయితే నజఫ్‌గఢ్‌కు బదులుగా ఆయన స్థానాన్ని మార్చి బిజ్వాసన్ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. గాంధీ నగర్ నుంచి మాజీ కాంగ్రెస్ మంత్రి అరవిందర్‌సింగ్ లవ్లీకి బీజేపీ టికెట్ ఇచి్చంది. అలాగే, ఆప్ నుంచి ఛత్తర్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరిన కర్తాల్ సింగ్ తన్వర్ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇదీ చదవండి: నేను అద్దాల మేడ కట్టుకోలేదు