ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం.. | Delhi New Chief Minister Rekha Gupta Oath Ceremony At Ramlila Ground Live Updates, Highlights And Viral Videos | Sakshi
Sakshi News home page

Delhi CM Oath Ceremony: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం..

Published Thu, Feb 20 2025 8:50 AM | Last Updated on Thu, Feb 20 2025 1:29 PM

Delhi Chief Minister Rekha Gupta Oath Ceremony At Ramlila Ground Live Updates

Delhi CM Rekha Gupta Oath Ceremony Live Updates..

👉ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా మం‍త్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. 

 👉ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్‌ వర్మ, రవీందర్‌ ఇంద్రజ్‌ సింగ్‌, మంజిందర్‌ సింగ్‌ సిర్సా, ఆశిశ్‌ సూద్‌, కపిల్‌ మిశ్రా, పంకజ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

 

👉ముఖ్యమంత్రి, మం‍త్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 

 

👉ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతల హాజరయ్యారు. 

👉 యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులు

  • ఢిల్లీలో కీలక పరిణామం..
  • యమునా నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త ప్రభుత్వం
  • యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులు
  • ప్రమాణ స్వీకారం అనంతరం యమునా నది తీరానికి వెళ్ళనున్న సీఎం, మంత్రులు 
     

👉రామ్‌లీలా మైదానానికి చేరుకున్న రేఖా గుప్తా.. ఆమెకు స్వా‍గతం పలికిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. 

👉ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ..‘ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఎంను అవుతానని నాకు తెలియదు. 48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసన సభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే మార్చి ఎనిమిది నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.

 

👉ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్‌ గుప్తాకు అవకాశం. ఈ సందర్బంగా విజేందర్‌ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు. స్పీకర్‌ స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు. అయితే, గతంలో సభ జరుగుతున్న సమయంలో మార్షల్స్‌.. విజేందర్‌ గుప్తాను బయటకు ఎత్తుకెళ్లారు. అధికార ఆప్‌ నేతలపై కామెంట్స్‌ చేయడంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు. 

 

 

👉రామ్‌లీల మైదానం వద్ద బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మరోవైపు.. రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. 

 👉 ఇక, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. అలాగే, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్‌ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.

 

మోదీకి థ్యాంక్స్‌: రేఖా గుప్తా భర్త

👉రేఖా గుప్తా భర్త మనీష్‌ గుప్తా మాట్లాడుతూ.. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పప్రధాని మోదీకి ​కృతజ్ఞతలు తెలిపారు. 

 

 👉ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా నేడు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో పర్వేష్‌ వర్మ, అశిశ్‌ సూద్‌, మన్‌జిందర్‌ సింగ్‌ సిర్సా, రవీందర్‌ ఇంద్రాజ్‌ సింగ్‌, కపిల్‌ మిశ్రా, పంకజ్‌ కుమార్‌సింగ్‌ ఉన్నారు. 

👉అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హైకమాండ్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి సీఎంగా అవకాశం దక్కింది. అయితే, దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

రేఖా గుప్తా రాజకీయం ప్రస్థానం ఇలా.. 
👉హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్‌ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్‌ సింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్‌ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్‌ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్‌ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

మోదీకి కృతజ్ఞతలు
👉ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పని చేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement