
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే మంత్రులకు శాఖలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.
మరోవైపు, బీజేపీ కొత్త ప్రభుత్వానికి ఢిల్లీలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు తీర్చాల్సి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం హామీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే...
1. మహిళలకి నెలకు రూ.2500 ఉచిత ఆర్థిక సహాయం, గర్భిణులకు 21 వేల రూపాయల ఆర్థిక సహాయం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం.
2. యమునా నది ప్రక్షాళన
3. వాయు కాలుష్య నిర్మూలన
4. మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం
5. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలు సహా సంక్షేమ పథకాల అమలు
6. మహిళల భద్రత
7. దేశ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం.

Comments
Please login to add a commentAdd a comment