ఢిల్లీ : ‘కోవిడ్-19 సమయంలో ఢిల్లీ ప్రజలు బాధపడుతుంటే.. కేజ్రీవాల్ మాత్రం శీష్‌మహల్‌ను నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యారు. శీష్‌మహల్ (Sheeshmahal) కోసం పెట్టిన ఖర్చు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రజల సంక్షేమం కంటే ఆయనకు విలాసాలు కావాల్సి వచ్చిందంటూ’ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ (Namo Bharat) కారిడార్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.
మోదీ మాట్లాడుతూ..‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం. అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says "The 'AAP-DA' people have left no stone unturned in destroying Delhi's transport system. These people are not paying any attention to the maintenance of buses. The common citizens of Delhi have suffered… pic.twitter.com/I93IqlMaKz
— ANI (@ANI) January 5, 2025
అదే సమయంలో కేజ్రీవాల్ అధికారిక నివాసంపై మోదీ ప్రశ్నలు సంధించారు. మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా ప్రాధాన్యమని సూచించారు.
అనంతరం, మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ..ఆప్ నాయకత్వం దేశ రాజధాని ఢిల్లీని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. అవినీతి, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు.
‘దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారని మోదీ నొక్కాణించారు.
👉చదవండి : ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment