ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ,బీజేపీలు విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ ఆమ్ ఆద్మీ అంటే విపత్తు అని సంబోధించగా.. అందుకు ఆమ్ ఆద్మీ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ రూ.2,700 కోట్లతో ఇల్లు కట్టుకుని, రూ.8,400 కోట్లతో విమానంలో ప్రయాణించే వ్యక్తి మోదీ అంటూ సెటైర్లు వేశారు.
అంతేకాదు ఢిల్లీకి నిజమైన విపత్తు బీజేపీతోనే ఉంది. మొదటి విపత్తు ఏంటంటే? ఢిల్లీకి సీఎం అభ్యర్థిపై స్పష్టత లేకపోవడం, రెండవ విప్తత్తు ఢిల్లీ భవిష్యత్‌పై స్పషటత లేకపోవడం. మూడవది ఢిల్లీ ఎన్నికలకు బీజేపీకి ఎజెండా లేదు’ అని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో నివాసితుల కోసం 1,675 ఫ్లాట్‌లు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ నిర్మించింది. ఆ ఇళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఇటీవల చోటుచేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తుగా పేర్కొన్న మోదీ.. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment