
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishanreddy) అన్నారు. శుక్రవారం(జనవరి17) కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అంశంపై మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్(CongressParty)కు ఢిల్లీలో దిక్కు లేదు..ఢిల్లీ(Delhi) ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతివ్వడం లేదు. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటి చర్చే ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీ గా ఉంటుంది’అని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి.
అదే నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొందరు నేతల మాటలు హద్దులు మీరుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) భావిస్తుండగా ఆప్‌ను ఈసారైన ఓడించి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పనిచేస్తోంది.
ఢిల్లీలో పేరుకు ముక్కోణపు పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యనే ఉండనుందని తెలుస్తోంది. కేసుల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో కీలక హామీలు
Comments
Please login to add a commentAdd a comment