
సాక్షి,హైదరాబాద్:పన్నెండేళ్లుగా ఢిల్లీకి పట్టిన గ్రహణం వీడిందని,రాజకీయాల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కేజ్రివాల్ మారారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కిషన్‌రెడ్డి శనివారం(ఫిబ్రవరి8) మీడియాతో మాట్లాడారు.‘ప్రజల తీర్పుతో కేజ్రీవాల్ నెత్తికి ఎక్కిన అహంకారం దిగింది. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే రాహుల్,కేసిఆర్,కేజ్రివాల్ ఎవరైనా ఓటమి చెందక తప్పదు.
ఢిల్లీలో కాంగ్రెస్ దీన స్థితి చూసి జాలేస్తోంది. రాహుల్ నాయకత్వం చేపట్టాక వారికి వచ్చిన ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కించడమే సాధ్యమవుతుంది. రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్,డబుల్ డక్ కొట్టింది. ఢిల్లీ తీర్పుతో కేజ్రీవాల్ లిక్కర్ స్కాం నిందితుడని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు గుండు సున్నా వచ్చింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం.ఆప్ ఓటమిలో ప్రధాన పాత్ర లిక్కర్ స్కామ్‌దే.తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారో కేటీఆర్ చెప్పాలి.అన్న హజారే ఉద్యమంలో అరవింద్ కేజ్రివాల్ కలుపు మొక్క’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment