kishanreddy
-
ఈసారి ప్లాస్టిక్‌రహిత కుంభమేళా: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:కుంభమేళాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని,హాజరై పుణ్యస్నానం ఆచరిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం(డిసెంబర్ 15) కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుంది. 30 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.వేలాది సాధు సంతులు ఈ కుంభ మేళాలో పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున హిందువులు ఈ కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయనున్నారు.కుంభమేళా జరిగే రోజులను పవిత్ర మైన రోజులుగా హిందువులు భావిస్తారు. ఈసారి ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా జరగనుంది. తెలంగాణ నుంచి వేలాది భక్తులు కుంభమేళాలో పాల్గొననున్నారు’అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
మూసీ నిద్రకు ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా?: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్:పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్17) మీడియాతో మాట్లాడారు.‘నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా..? కిషన్‌రెడ్డి నిజాయితీగా నిద్రకు వెళితే మూసీ రివర్‌బెడ్‌లో నివసించే వారి కష్టాలు తెలిసేవి.కలుషితమైన నీరు,గాలి మధ్య వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు.మంచి నీరు,మంచి వాతావరణం కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారు.గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.డీపీఆర్ వచ్చాక గోడలు కట్టాలో ఇంకేమైనా చెయ్యాలా అనేదానిపై సలహాలు ఇవ్వండి’అని శ్రీధర్‌బాబు సూచించారు. -
మూసీ నిద్రలో కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్‌పేట తులసీరామ్‌నగర్‌లో మూసీ నిద్ర కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు.మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి.లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా.అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం.నిజాంకు భయపడలేదు..నీకు భయపడతామా. బుల్డోజర్కు భయపడం.పేదలు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తానంటే అడ్డుకోము. ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. ఒక కేంద్ర మంత్రిగా..ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా..ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా. వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు.మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేశాం.వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా స్కూల్ కట్టాం. వైఎస్సార్ ఉన్నప్పుడే అంబర్ పేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు.ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు..ప్రజల తరఫున..ప్రజల కోసం..ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది.ఎంత మందిని జైల్లో వేస్తావో..ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం.ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు..ప్రజల కోసం భరిస్తాం’అని కిషన్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: కిషన్‌రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా: మంత్రి పొన్నం -
జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్‌రెడ్డి ప్రశ్న
సాక్షి,హైదరాబాద్:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్ ఇంఛార్జ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి శుక్రవారం(అక్టోబర్11) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్లో మరోరకంగా పోలరైజ్ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్‌కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది -
‘మహిళల గురించి మాట్లాడటం.. ఆ రెండు పార్టీలకు అలవాటే’
హైదరాబాద్, సాక్షి: కుటుంబాలు, మహిళలు గురించి అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అలవాటు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని బహిష్కరించాలి. ఇలా మాట్లాడటం కేసీఆర్ మొదలు పెట్టారు. దాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. మార్పు రావాల్సి ఉంది. కుటుంబ వ్యక్తిగత విషయాలు ఫోన్ ట్యాప్ చేసి విని బ్లాక్ మెయిల్‌తో డబ్బులు వసూలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు విన్నరనీ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. రెండు పార్టీలు కూడా ఇలాంటి భాషతో తెలంగాణ రాజకీయాలను దిగజార్చూతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి...ఏకపక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదు. ఈ కూల్చివేతల విధ్వంసాన్ని ఆపాలని ఇదివరకే సీఎంకు లేఖ రాశా. గతంలో కేసీఆర్ కూడా మూసి బ్యూటీఫికేషన్ అంటూ మార్కింగ్ చేశారు. దాన్నే ఇప్పుడు సీఎం రేవంత్ తలకెత్తుకున్నారు. పేదల ఇళ్ళ కూల్చివేతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకుండా మూసి సుందరీకరణ ఎవరికి కావాలి?. లక్షన్నర కోట్లల్లో సగం పెట్టీ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సెట్ చేయండి. డ్రైనేజీ, వరద నీటి డ్రైన్ల మీద శ్రద్ద పెట్టండి. మూసి సుందరీకరణ అంటే ముందు రిటైనింగ్ వాల్ కట్టండి. పేదలకు నిర్మిస్తామన్న ఇళ్లు ఏమైయ్యాయి. హామీలు పక్కదోవ పట్టించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోవలోనే సీఎం రేవంత్ వెళ్తున్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ దొందూ దొందే. దొంగల పార్టీలు.. దోపిడీ పార్టీలు.హైడ్రా అంటే రేవంత్. రేవంత్ అంటేనే హైడ్రా. హైడ్రాను పుట్టించిన రేవంత్ బాధ్యుడు. ధైర్యం ఉంటే ఫాం హౌజ్‌లు, బడా బిల్డింగ్లు కట్టిన వాళ్ళవి కుల్చండి. ఓవైసీ ఫాతిమ కాలేజీ ఎందుకు కూల్చడం లేదు? పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి ఆర్జీ, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్లను కులిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. పేదల ఇళ్ళ కూల్చివేతలను సహించేది లేదు. కూల్చివేతలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి అన్నారు.చదవండి: Konda Surekha Controversy: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. సమంతకు కొండా సురేఖ క్షమాపణలు -
ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు
సాక్షి,హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ
సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్‌లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్‌రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు. -
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లవి బ్లాక్మెయిల్ పాలిటిక్స్: కిషన్‌రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేనని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం(జులై 25) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ సర్కారు పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు పొందుపరిచాం. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తప్పుడు ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం(జులై 12) జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘లోక్ సభ ఎన్నికల్లో అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు వందల రోజులు గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. తెలంగాణను దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి డబ్బులు పంపిస్తోంది. పాంచ్ న్యాయం పేరిట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని మేనిఫెస్టోలో పెట్టారు. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడు లేనంతగా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. పదేళ్ల పాటు అధికారంలో అన్న బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. 44 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చింది.కాంగ్రెస్, బీఆర్ఎస్లది ఒకటే డీఎన్ఏ. నాణేనికి బొమ్మ, బొరుసులలా రెండూ అవినీతి పార్టీలే. మజ్లీస్ పార్టీ నేతలు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదు. ఎంఐఎం అధినేత పార్లమెంట్లో జై భారత్ మాతా అనకుండా.. జై పాలస్తీనా అనడం సిగ్గు చేటు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతోంది. నీళ్ళు ఏవో... పాలు ఏవో .. ప్రజలు అర్థం చేసుకోవాలి’అని కిషన్‌రెడ్డి కోరారు. -
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్, బీఅర్ఎస్.. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘సీఎం రేవంత్, కేసిఆర్.. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహాలోకంలో ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అంత పచ్చగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ దేశంలో అవినీతిని పెంచి పోషించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి చేసిందేమీ లేదు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయింది. కేసిఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి... అబద్ధాలు అవలీలగా చెప్తారు. రేవంత్, కేసీఆర్ దొందూ దొందే. ఇద్దరు అబద్దాల ఆడటంలో ఆరిదేరారు.కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకొని 75 ఏళ్లుగా రాజకీయం చేస్తుంది. ఏనాడు కాంగ్రెస్‌కి భద్రత దళాల మీద నమ్మకం లేదు. వారిని అవమాన పరిచే విధంగా అనేక సార్లు మాట్లాడారు.పాకిస్తాన్ దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. బీజేపి ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి.. వాళ్ల తొక కట్ చేసి నడ్డి విరిచాం. కాంగ్రెస్ అసమర్థతతో పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగింది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారత్ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్ పాకిస్తాన్‌ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్ పుల్వామ మీద మాట్లడటామా?. కాంగ్రెస్ కూటమి వ్యక్తీ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలో ఉంటూ.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ.. పాకిస్తాన్‌కి మద్దతుగా మాట్లాడతారా?’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దు: కిషన్‌రెడ్డి
సాక్షి, మహబూబునగర్: కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన దేవరకద్ర కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ‘ఏప్రిల్ నెలలలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ముందు ప్రపంచ దేశాల అధ్యక్షులు చేతులు కట్టుకొని నిలబడే స్థాయికి వచ్చాము. తొమ్మిదిన్నర సంవత్సరాలలో సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తి మోదీ. మరీ కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. దేశం అంటే అంకితభావంతో పనిచేసే వ్యక్తి మోదీ. 5 వందల సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి గుడి కూల్చి మసీదు కట్టాడు. కానీ నేడు టెంటులో ఉన్న రాముడికి భవ్య మైన మందిరం నిర్మించాడు మోదీ సంకల్పం అదే. ... దేశంలో ఎక్కడ కూడా ఈపాలనలో అల్లర్లు జరిగిన చరిత్ర లేదు. సర్జికల్ స్ట్రైక్ చేయించి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాదులను చంపిన చరిత్ర మోడీది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీది. ధర్మం వైపు ఉన్న మోదీ కావాలా అధర్మం వైపు ఉన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏ రంగంలో అయిన మోదీ చరిష్మా కనిపిస్తుంది. ... దేవరకద్రలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి హామీ ఇస్తున్నా. దేశం లో ప్రజలందరూ మోదీ వైపు ఉన్నారు. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను కమలంకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యం. రాష్ట్రంలో రాహుల్ టాక్స్ వేస్తున్నారు. ఇక్కడ దోపిడీ చేసి ఎన్నికలలో ఖర్చు పెట్టాలని దోపిడీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది వారు బీజేపీ వైపు నిలబెడుతారనే నమ్మకం ఉంది’ అని కిషన్‌రెడ్డి అన్నారు. -
విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన కిషన్‌రెడ్డి
సాక్షి,నారాయణపేట: మక్తల్‌లో కృష్ణా నది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం నారాయణపేటకు బయలుదేరే ముందు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీకి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. పదేళ్ళలో కేంద్రం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ‘గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం. కంటి వైద్యం కోసమో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసమో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు ఉంది. బీఆర్ఎస్తో మాకు పొత్తు ప్రసక్తే లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తప్ప రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలు క్లస్టర్ల వారిగా ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. హస్తినలో సీఎం రేవంత్ -
TS: కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ నేతలు బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు వెళుతున్నాయని చెప్పారు. సనత్‌నగర్‌కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానిస్తే మోదీ గౌరవించారని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్ -
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణ కోసం ఎన్హెచ్ఏఐకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది.. -
‘మోదీ ప్రధాని కాకముందు రాష్ట్రంలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారు’
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, దిల్సుఖనగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్టులు జరిగాయని అన్నారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్లలోకూడా బాంబ్ బ్లాస్టులు జరిగాయని తెలిపారు. పాకిస్థాన్‌లో కూర్చొని రిమోట్ నొక్కితే భారత్‌లో బాంబ్ బ్లాస్టులు జరిగేవని అన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వేళ్లుపాతుకొని భారత్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని తెలిపారు. మతకలాహాలు ప్రేరేపించి, ఆడీఎక్స్‌లు పేల్చేవాళ్లని, ఏకే 47లు పంపేవాళ్లని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు, కర్ఫ్యూ లు, ఎకే 47లు, RDXలు లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించడం జరిగిందని గుర్తుచేశారు. భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదని తెలిపారు. ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీగా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేదన్నారు.ఇవాళ పాకిస్థాన్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.పాకిస్థాన్ గత పాపాలను ఇప్పుడు అనుభవిస్తోందని అన్నారు. చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ -
TS: స్పీడ్ పెంచిన బీజేపీ.. పొలిటికల్ ఇంచార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంఛార్జ్‌లు వీరే.. ►హైదరాబాద్- రాజసింగ్ ►సికింద్రాబాద్- లక్ష్మణ్ ►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి ►మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి ►అదిలాబాద్- పాయాల్ శంకర్ ►పెద్దపల్లి- రామారావు పటేల్ ►కరీంనగర్- ధన్ పాల్ సూర్యనారాయణ ►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి ►జహీరాబాద్- వెంకట రమణ రెడ్డి ►మెదక్- పాల్వాయి హరీష్ ►మహబూబ్ నగర్- రామచందర్ రావు ►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి ►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి ►భువనగిరి - NVSS ప్రభాకర్ ►వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి ►మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు ►ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి -
TS: 28న రాష్ట్రానికి అమిత్ షా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్వేత పత్రం, బీఆర్ఎస్ స్వేద పత్రం రెండూ అవినీతి పత్రాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 28న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతోనూ అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. వీరంతా తెలంగాణ మూడవ అసెంబ్లీ తొలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు బీజేఎల్పీ నేత ఎంపిక మాత్రం పెండింగ్‌లోనే ఉంది. ఇదీచదవండి..‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’ -
TS: పార్లమెంట్ ఎన్నికలు..పొత్తులపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రబారీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందనేది ప్రచారం మాత్రమే. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయి’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ‘రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి’ అని నేతలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదీచదవండి..‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
బీజేపీ ఓట్‌షేర్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటాం. సమీక్షించుకున్న తర్వాత రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగింది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘ తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీలో గెలిచింది. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అవుతారో తెలీదు అదో విచిత్రమైన పరిస్థితి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడించి మా అభ్యర్థి గెలిచారు. దేశ రాజకీయాల్లో ఇదో చరిత్ర. వెంకటరమణారెడ్డికి నా అభినందనలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయంతో ప్రధాని మోదీకి దేశ ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తోంది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం’ అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మా మీద ఏడ్చి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్‌కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తాం. ప్రజల పక్షాన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశాం. మా పోరాటం వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగింది. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తాం. ఢిల్లీ వెళ్లి ఇక్కడున్న పరిస్థితులు ఎన్నికల ఫలితాలపై అధిష్టానానికి వివరిస్తా’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..కేసీఆర్ కోసం ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్యేలు -
సీఎంను ఓడించి చరిత్ర సృష్టిస్తారు! : కిషన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించి కామారెడ్డి ప్రజలు చరిత్ర సృష్టిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం కామారెడ్డిలో పార్టీ నియోజకవర్గ బూత్ విజయ్ అభియాన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కిషన్‌రెడ్డికి జాతీయ రహదారిపై పొందుర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారినుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్‌రోడ్డు, ఇందిరాచౌక్ మీదుగా రాజారెడ్డి గార్డెన్ వరకు సాగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు చైతన్యశీలురని, బీఆర్ఎస్ నేతలు ఎన్ని కోట్లు కుమ్మరించినా వారిని కొనలేరని పేర్కొన్నారు. కేసీఆర్‌ను గజ్వేల్ ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే ఆయన వారికి చేసిందేమీ లేదన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ తెలంగాణలో రోడ్ల గురించి గొప్పగా మాట్లాడారని, ఆ జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల పేరుతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. నా ఆస్తి కార్యకర్తలే.. తన యావదాస్తి బీజేపీ కార్య కర్తలు, ప్రజలేనని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బూత్ విజయ్ అభియాన్‌లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ కార్యకర్తలు నోట్లు, బీరు, బిర్యానీలకు ఆశపడి వచ్చేవారు కాదన్నారు. తమకు ప్రతి గ్రామంలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. బీఆర్ఎస్కు బీజేపీ సత్తా చూపాలనే శుభం ఫంక్షన్ హాల్ ముందు నుంచి ర్యాలీ తీశామన్నారు. కామారెడ్డిలో ధర్మానికి, నీతి, నిజాయితీకి పేరైన బీజేపీకి.. అవినీతి, అధర్మం, అక్రమాలకు మారుపేరైన బీఆర్ఎస్కు మధ్య యుద్ధం జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని పేర్కొన్నారు. వాళ్లొస్తే పెనంమీంచి పొయ్యిలో పడ్డట్లే.. బీఆర్ఎస్ వాళ్లు బర్రెలు తింటే, కాంగ్రెస్ వాళ్లు ఏనుగులు తినే రకమని, వారికి అధికారం అప్పగిస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 365 మంది విద్యార్థులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ దని, మలిదశ ఉద్యమంలో 1,200 మందిని పొట్టన పెట్టుకున్నదీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్ని వంచించిందన్నారు. ఇక్కడా అవే గ్యారంటీలతో వస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులిస్తున్నారని, వాళ్లు గెలిచినా గతంలోలాగే బీఆర్ఎస్ గూటికి చేరతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనన్న విషయాన్ని ప్రజలు మరచిపోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావలసిందేనని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన సాగుతోందని, రాష్ట్రంలో బీసీ సీఎం నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. బీసీలు బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు. 24 గంటలూ అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డితో మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వెంకటరమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. రాష్ట్రంలో ఏర్పడబో యే బీజేపీ ప్రభుత్వంలో ఆయనను మంత్రిగా నిలబెట్టే బాధ్యత తనదని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులు మురళీధర్‌గౌడ్, మహీపాల్‌రెడ్డి, నీలం రాజులు, చీకోటి ప్రవీణ్, కుంట లక్ష్మారెడ్డి, విపుల్ జైన్, శ్రీనివాస్, శ్రీకాంత్, వెంకట్‌రెడ్డి, నరేందర్, తేలు శ్రీనివాస్ తదిరతులు పాల్గొన్నారు. కామారెడ్డికి ఒరిగిందేమీ లేదు.. తెలంగాణ వచ్చిన తర్వాత కామారెడ్డికి జరిగిన మేలు ఏమీ లేకపోగా, రైతులు తయారు చేసే బెల్లం మీద ఆంక్షలు పెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, డబ్బు, అధికార దుర్వినియోగం, మజ్లిస్ పార్టీల మీదే నమ్మకం ఉందని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న ముఖ్యమంత్రి వందలసార్లు మాట తప్పారన్నారు. ఆయన తల నరుక్కోవడం కాదని, బీఆర్ఎస్ పార్టీ తల నరికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
నిజామాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో
-
‘రేపు ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు’
ఢిల్లీ: రేపు(మంగళవారం) మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డ్లను ప్రధాని ప్రకటించారు. పసుపు బోర్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా రైతుల డిమాండ్ ఉంది. రేపు మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు.నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలమూరు సభ జరిగింది. ఈ నెల 10వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తారు. అక్టోబర్ 5,6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయి. జేపీ నడ్డా రానున్న ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేస్తారు.అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన ఉంటుంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
రేపు మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ టూర్
-
TS Election 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్.. మజ్లిస్ ఆత్మలే..! : మంత్రి కిషన్‌రెడ్డి
వరంగల్: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 13 నెలల భీకర పోరాటం.. వేలాది మంది బలిదానాలతో వచ్చిందని, ఈ వాస్తవాలను నిజాం వారసుడు ఖాసీం రజ్వీకి చెందిన మజ్లిస్ పార్టీ కోసం నాడు కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్ సర్కార్ వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈరెండు పార్టీలు.. మజ్ల్లిస్ ఆత్మలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమైక్యతా దినోత్సం పేరిట కేసీఆర్ సర్కారు తెలంగాణకు ఉన్న చరిత్ర కనుమరుగు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీగా పరకాల అమరధామం చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భుక్తి కోసం.. స్వేచ్ఛా వాయువుల కోసం తుపాకులకు గుండెలను ఎదురుపెట్టి వేలాది మంది బలిదానాలతో 75 సంవత్సరాల తెలంగాణ విమోచన చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీకి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో నాటి తెలంగాణ చరిత్ర గురించి లేదా అని ప్రశ్నించారు. చరిత్రకారులు విమోచన దినోత్సవం అంటారని.. తెలంగాణ సమైక్యత అనే వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబం కోసమన్న ఆయన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం కోసమేనన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే ప్రజల కోసం పార్టీ పని చేస్తుందన్నారు. ఆత్మగౌరవం ఉన్నోళ్లు.. బీఆర్ఎస్కు ఓటు వేయరు : ఈటల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్కు ఓటు వేయరని అన్నారు. కులమతాలకతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని మహా భారతంలో ధర్మరాజు సిద్ధాంతంతో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసీఆర్ సర్కార్ ఉద్దెర బేరం చేస్తుండగా.. బీజేపీ నగదు చెల్లించే పని చేస్తోందన్నారు. తనను ఓడించేందుకు ఉప ఎన్నికల్లో ఊరురా తిరిగిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఈసారి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులను, సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, మార్తినేని ధర్మారావు, మొలుగూరి భిక్షపతి, జయపాల్, కొండేటి శ్రీధర్, చింతల రామచంద్రారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ప్రబారీ మురళీధర్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్‌రావు, దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గుజ్జుల సత్యనారాయణరావు, కాచం గురుప్రసాద్, మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులపై థర్డ్ డిగ్రీ అమానుషం.. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించి ఆందోళన చేసిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషం అని కిషన్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం రాత్రి కిషన్‌రెడ్డి.. నాయకులతో కలిసి సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీ సులతో కొట్టించిన ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ తిరుపతి మాదిగ, బాధ్యులు కలిసి మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.