నల్లగొండ జిల్లాలో జరిగిన వరుస సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో జరిగిన వరుస సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు చూపించిన ధైర్యం గొప్పదని, వారికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులను, ఉగ్రవాద సంస్థలను నియంత్రించడానికి పోలీసుల్లో మరింత స్థైర్యాన్ని పెంచాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ముడిపడి ఉన్న ఈ సంఘటనలపై లోతుగా విచారణ జరగాలన్నారు. ఇందుకు జాతీయ పరిశోధనా సంస్థకు రాష్ట్ర పోలీసులు సహకరించాలని సూచించారు. ఘటనలో సిమి ఉగ్రవాదులు ఉన్నట్టు తేలినా రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.