SIMI terrorists
-
సిమి మాస్టర్ మైండ్ సహా 11మందికి జీవితఖైదు
ఇండోర్: సిమి అగ్రనేత, మాస్టర్ మైండ్ సప్ధర్ నగోరి సహా 11 మంది సిమి ఉగ్రవాదులకు ఇండోర్ జిల్లా కోర్టు సోమవారం జీవితఖైదు విధించింది. అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండటంతో పాటు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో దోషులుగా ఉన్న వీరికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. 2008లో జరిగిన వరుస పేలుళ్ల రూపకల్పనలో నగోరి కీలకపాత్ర పోషించాడు. ఈ పేలుళ్లలో సుమారు 57మంది మృతి చెందారు. కాగా నగోరి అహ్మదాబాద్ సబర్మతి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
8 మందినీ చంపేశారు.. కంగ్రాట్స్!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో తాజాగా రెండు ఆడియో క్లిప్స్ బయటపడ్డాయి. అండర్ ట్రయల్ ఖైదీలను వెంబడించిన బలగాలకు, పోలీసు కంట్రోల్ రూంకు మధ్య జరిగిన సంభాషణలుగా వీటిని చెబుతున్నారు. వైర్లెస్లో అయితే సరిగా వినపడదని, అందువల్ల సొంత మొబైల్ ఫోన్లు వాడాలని అధికారులు అక్కడకు వెళ్లిన సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్ల సంభాషణలు ఇలా ఉన్నాయి... ''వాళ్లను అన్నివైపుల నుంచి చుట్టుముట్టండి.. కంగ్రాట్యులేషన్స్, మొత్తం ఎనిమిది మందీ చనిపోయారట, డీఎస్పీ క్రైం చెప్పారు. వెరీగుడ్. వాళ్ల శవాలు మధ్యలో పడి ఉన్నాయి'' అని ఒకరు అన్నారు. ''వెనక్కి రావద్దు. అందరు చార్లీలకు చెప్పండి, వాళ్లను చుట్టుముట్టి పని పూర్తిచేయండి'' అని మరో గొంతు చెప్పింది. ఈ ఆడియో క్లిప్పింగుల గురించి తనకు ఇంకా ఏమీ తెలియదని, తాను వినలేదని.. తమ దర్యాప్తులో మొత్తం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఐడీ ఎస్పీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆయన ఈ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీని గురించి అధికారులు చెప్పే విషయాలకు, వీడియోల్లో ఉన్న విషయాలకు పొంతన లేకుండా పోతోంది. అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే భోపాల్ సెంట్రల్ జైలుకు ఉన్న 32 అడుగుల ఎత్తయిన గోడను దుప్పట్ల సాయంతో ఉగ్రవాదులు దూకారని పోలీసులు చెబుతున్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ గొంతు కోసి మరీ వాళ్లు పారిపోయారు. అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజాము సమయంలో (దీపావళి రోజు అర్ధరాత్రి) ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ కేసు విషయంలో వస్తున్న ప్రశ్నలన్నింటినీ కూడా దర్యాప్తులో భాగంగా తాము జతచేస్తామని, ఉగ్రవాదులు తప్పించుకున్నప్పటి నుంచి ఎన్కౌంటర్లో మరణించేవరకు గడిచిన ఏడు గంటల్లో జరిగిన ఘటనలన్నింటినీ కూడా పరిశీలిస్తామని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి తెలిపారు. అయితే.. తమకు, ఉగ్రవాదులకు మధ్య భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు అంటున్నారు. వాళ్ల వద్ద నుంచి నాటు తుపాకులు, కొన్ని పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్‌లు, ఇప్పటికే ఉన్న వీడియోలు నిజమైనవా కావా అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. -
8 మందినీ చంపేశారు.. కంగ్రాట్స్!
-
వాళ్లు ఎవరైనా కాల్చిపారేయాల్సిందే!
లక్నో: భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత పోలీసుల చేతిలో హతమైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ ఘటనపై ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారందరినీ చంపేయాల్సిందేనని, వారు సిమీ ఉగ్రవాదులా? లేక వేరేవారా? అన్నది చూడకూడదని వ్యాఖ్యానించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్ నివాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ సందర్శించడంపైనా ఆయన తనదైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ జవాను నివాసాన్ని సందర్శించారని పేర్కొన్నారు. -
అజాత శత్రువు
-
సిమి ఉగ్రవాదుల పోస్టుమార్టం నివేదిక వెల్లడి
-
భోపాల్ ఎన్కౌంటర్.. చర్లపల్లి జైలులో అలర్ట్
హైదరాబాద్: భోపాల్ సెంట్రల్ జైలు గార్డును హతమార్చి ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకోవడం, కొద్ది గంటల్లోనే వారంతా పోలీసుల చేతిలో హతమైపోయిన నేపథ్యంలో దేశంలోని అన్ని సెంట్రల్ జైళ్లలో అలర్ట్ ప్రకటించారు. ఇటు హైదరాబాద్ శివారులోని చర్లపల్లి సెంట్రల్ జైలు అదికారులు కూడా అప్రమత్తమయ్యారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు ఐఎస్ఐ తీవ్రవాదులు చర్లపల్లి జైలులోనే విచారణ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. నిందితులున్న మంజీర బ్యారక్‌లో షిఫ్టుకు ఐదుగురు వార్డర్ల చొప్పున జైలర్ స్థాయి అధికారి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఖైదీల కదలికలపై జైళ్లశాఖ ఉన్నతాధికారులతో ..ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. ఈ ఖైదీల విచారణకు ప్రత్యేకంగా జైలులోని కోర్టు ఏర్పాటు చేశారు. -
వాళ్లను చంపాం.. మమల్ని పొగడండి!
-
వాళ్లను చంపాం.. మమ్మల్ని పొగడండి!
‘పరారైన వాళ్లను చంపినందుకు మీరు మమ్మల్ని ప్రశంసించాలి. వాళ్లు మరిన్ని ప్రమాదకరమైన పనులు చేయకుండా మేం అడ్డుకున్నాం’ అని మధ్యప్రదేశ్ జైళ్లశాఖ మంత్రి కుసుమ్ మెహ్‌దెలే వ్యాఖ్యానించారు. భద్రతాపరమైన లోపాల వల్లే సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోగలిగారని ఆమె అంగీకరించారు. సిమీ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినందుకు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశంసించాలని చెప్పుకొచ్చారు. ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న భోపాల్ సెంట్రల్ జైలులోని కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని అంగీకరించారు. ‘మా వైపున పలు లోపాలు ఉన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. జైలు లోపల ఉన్న కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. అంతేకాకుండా వారు ఎలా అంతపెద్ద ప్రహారీ గోడను ఎక్కారన్నది కూడా తెలియాల్సి ఉంది’ ఆమె పేర్కొన్నారు. సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిదిమంది ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. అనంతరం పోలీసుల ఎన్కౌంటర్లో వాళ్లు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ విషయంలో శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం, పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి!
-
బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి!
భోపాల్: ‘జిందా హై.. మారో’ (బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి).. సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఓ పోలీసు అన్న మాటలివి.. సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిదిమంది ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోగా.. పోలీసుల ఎన్కౌంటర్లో వాళ్లు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మొబైల్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో నిజమైనదా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, పారిపోయిన సిమీ ఉగ్రవాదులు లొంగిపోయేందుకు సిద్ధపడినా.. నిరాయుధులైన వారిని పోలీసులు కాల్చిచంపేసి.. ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఛాతి మీద కాల్చు.. అతను చనిపోతాడు' అని మరో పోలీసు అంటున్న మాటలు కూడా ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. జైలు నుంచి పరారైన సిమీ ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని, దీంతో వారు హతమయ్యారని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని ఆయన తెలిపారు. సోమవారం తెల్లవారుజామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్న సంగతి తెలిసిందే. స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేసి.. అనంతరం బెడ్షీట్లను తాడులా చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారు. కొంతసేపటికే స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఎనిమిది మంది జాడ కనుక్కొని.. వారిని ఎదురుకాల్పుల్లో హతమార్చారు. అయితే, ఈ ఎన్కౌంటర్ ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హతమైన ప్రదేశంలో సిమీ ఉగ్రవాదులు జీన్స్ ప్యాంట్లు, స్పోర్ట్స్ షూలలో కనిపించారు. అంతేకాకుండా వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. వారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. జైలు బయట-లోపల వారికి సహకరించింది ఎవరనే దానిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జైళ్ల నుంచి ముస్లింలే ఎందుకు పారిపోతారు: దిగ్విజయ్
ప్రతిసారీ జైళ్ల నుంచి ముస్లింలు మాత్రమే ఎందుకు పారిపోతారు.. హిందువులు ఎందుకు పారిపోరని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్రవాదుల కాల్చివేత ఘటనపై ఆయన స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరిపించాలని, దాన్ని కోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ముస్లింలు మాత్రమే ఎందుకు జైళ్ల నుంచి పారిపోతున్నారని, అసలు సమస్య ఏంటన్న విషయంపై కూడా దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను మధ్యప్రదేవ్ హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఖండించారు. మన దేశంలో ఎప్పుడైనా ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో మరణించగానే దాని మీద అనుమానాలు వ్యక్తం చేయడానికి కొంత మంది సిద్ధంగా ఉంటారని, ముఖ్యంగా అందులో కాంగ్రెస్ వాళ్లే ముందుంటారని అన్నారు. సిమి ఉగ్రవాదుల వ్యవహారంలో ఇక దర్యాప్తు ఏమీ అవసరం లేదని, పోలీసులు మొత్తం సమాచారం అందించారని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశంపై మాత్రమే ఎన్ఐఏ విచారణ జరుగుతుందని భూపీంద్ర సింగ్ అన్నారు. -
సిమీ ఉగ్రవాదులకు జీన్స్ వెనుక మిస్టరీ!
-
8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్కౌంటర్’
- భోపాల్ జైలులో సెంట్రీని చంపి పరారైన సిమి కార్యకర్తలు - తర్వాత కొన్ని గంటలకే పోలీసు కాల్పుల్లో హతం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసులతో ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్కౌంటర్ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తలపైకి అతి సమీపం నుంచి తుపాకీతో కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్కౌంటర్ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తల శరీరాలపైకి అతి సమీపం నుంచి తపాకీతో బుల్లెట్లు కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సిమి కార్యకర్తలు 8 మంది విచారణ ఖైదీలుగా జైలులో ఒకే సెల్లో ఉండేవారని.. ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగివున్న సమయంలో అర్ధరాత్రి దాటాక 2-3 గంటల మధ్య వారు సెంట్రీని హతమార్చి జైలు నుంచి తప్పించుకున్నారని భోపాల్ డీఐజీ రామన్‌సింగ్ తెలిపారు. స్పూన్లు, ప్లేట్లను పదునైన ఆయుధాలుగా వాడి ఒక సెంట్రీని కట్టివేసి, మరొక సెంట్రీని చంపేశారని.. తమ దుప్పట్లను తాడుగా కట్టి, దాని సాయంతో జైలు గోడలు ఎక్కి తప్పించుకున్నారని చెప్పారు. ఈ 8 మందిలో ఇద్దరు మూడేళ్ల కిందట ఖాంద్వాలోనూ ఇదేవిధంగా జైలు నుంచి తప్పించుకుని, ఆ తర్వాత పట్టుబడ్డట్లు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గాలింపు చేపట్టింది. తప్పించుకున్న వారి ఊహాచిత్రాలను విడుదల చేసి, ఒక్కొక్కరి తలపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది గంటలకే సెంట్రల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలోని మాలిఖేదా గ్రామంలో ఈ 8 మందీ దాక్కున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందిందని.. పోలీసు విభాగానికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక బృందం(సీటీజీ), ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్లు సోమవారం ఉదయం వారిని చుట్టుముట్టగా వారు ఎదురుదాడికి దిగారని.. పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిని కాల్చిచంపారని డీఐజీ చెప్పారు. ఉగ్రవాదులు టూత్‌బ్రష్‌లు, చెక్కతో చేసిన తాళంచెవులతో జైలు గదుల తాళాల్ని తెరిచారని చెప్పారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తమ వెంట తెచ్చుకున్న పదునుదేర్చిన స్పూన్లు, ప్లేట్లు వంటి వాటిని పోలీసులపై దాడికి ఉపయోగించారని రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్ తెలిపారు. అయితే.. వారు కరడుగట్టిన ఉగ్రవాదులని, సెమీ-ఆటోమేటిక్ తుపాకులు, పదునైన మారణాయుధాలు ఉపయోగించారని, పోలీసులపై కాల్పులు జరిపారని ఐజీ యోగేష్చౌదరి తెలిపారు. హోంమంత్రి, ఐజీ ప్రకటనల్లో తేడా ఉండటంతో ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు తలెత్తాయి. మృతులపై తుపాకీ కాల్పులు...: ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఆ వీడియోలో.. సిమి కార్యకర్తలు అచేతనంగా నేలపై పడి ఉండగా, వారిపై ఒక పోలీసు.. రైఫిల్‌తో అతి సమీపం నుంచి గురి చూసి కాల్పులు జరుపుతున్న దృశ్యం కనిపించింది. చనిపోయివున్న ఒక వ్యక్తి జేబులో నుండి కొత్తదిగా కనిపిస్తున్న కత్తిని మరొక పోలీసు బయటకు తీయటం, మళ్లీ అదే స్థానంలో పెట్టేయడం వీడియోలో ఉంది. ‘ఇటువంటి పనులను వీడియో తీస్తారా?’ అని ఓ పోలీసు అనడం కూడా వినిపించింది. మరో వీడియోలో.. ఉగ్రవాదులు ఒక రాతిగుట్టపై ఉండగా, వారిని చుట్టుముట్టాలని పోలీసులు చెప్పడం వినిపించింది. ఈ వీడియోల వాస్తవికత నిర్ధారణ కాకపోయినప్పటికీ.. సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపేసి, ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు నాటకం అల్లుతున్నారన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. అయితే.. వారు ఎదురు కాల్పుల్లోనే చనిపోయారని హోంమంత్రి భూపీందర్‌సింగ్ పునరుద్ఘాటించారు. అది ఎన్కౌంటర్ అని, వారిని తుదముట్టించటం మినహా పోలీసులకు ప్రత్యామ్నాయం లేకపోయిందన్నారు. సిమి ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోవడంపై జాతీయ దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. మృతుల వివరాలు ఇవీ...: ఎన్కౌంటర్ మృతులను అమ్జాద్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మొహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహ్బూద్ గుడ్డు, మొహమ్మద్ కాలిద్ అహ్మద్, అకీల్, మాజిద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి తుపాకులు, ఇతర మారణాయుధాలతో పాటు, జీపీఎస్ సౌకర్యం గల రిస్ట్ వాచీలు, బెల్టులు, రన్నింగ్ షూస్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, బ్యాంకు దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడ్డారన్నారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి.. రాష్ట్ర జైళ్ల డీఐజీ, భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ జైల్ సూపరింటెండెండ్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు నుంచి తప్పించుకోవడంపై నివేదిక ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు: ఒవైసీ ఎన్కౌంటర్ వాస్తవికతను నిర్ధారించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. హోంమంత్రి, పోలీసుల కథనాలు భిన్నంగా ఉన్నందున న్యాయ విచారణ జరపాలని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ డిమాండ్ చేశారు. నెలలో కూతురి పెళ్లి.. భోపాల్: సిమి కార్యకర్తలు భోపాల్ జైలు నుంచి తప్పించుకునేందుకు హత్య చేసిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్యాదవ్ కుమార్తె వివాహం డిసెంబర్ 9వ తేదీన జరగాల్సి ఉంది. ఆయన తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉండగా సిమి కార్యకర్తల చేతిలో చనిపోయాడని.. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆయన బంధువులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. రమాశంకర్ ఇద్దరు కుమారులు శంభునాథ్ (36) గువాహటిలో, ప్రభునాథ్ (32) హిస్సార్‌లో సైన్యంలో పనిచేస్తున్నారని వివరించారు. సిమి చరిత్ర ఇదీ మొహమ్మద్ అహ్మదుల్లా అధ్యక్షుడిగా ‘సిమి’ 1977లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఏర్పాటైంది. మొదట్లో ఇది జమాతే ఇస్లామీ హింద్‌కు విద్యార్థి విభాగం. అమెరికాపై సెప్టెంబర్11 దాడుల తర్వాత అదే నెలలో దీన్ని నిషేధించారు. 2008 ఆగస్ట్‌లో నిషేధాన్ని ఎత్తేసి, భద్రత దృష్ట్యా ఆ ఏడాది మళ్లీ నిషేధం విధించారు. మరో ఐదేళ్లపాటు నిషేధించాలని 2014లో కేంద్రం నిర్ణయించింది. టాడా, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం వంటి చట్టాల కింద సిమి సభ్యులపై కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లకు సిమి పంథాను మార్చుకుని ఉగ్రవాదం బాటపట్టింది. ఉత్తరప్రదేశ్‌లో సిమీకి ఎక్కువ పట్టుంది. ధార్వాడ టు హైదరాబాద్ వయా భోపాల్! సాక్షి, బెంగళూరు: ఎన్కౌంటర్ హతుల్లో ముగ్గురు కొద్దికాలం పాటు కర్ణాటకలోని ధార్వాడాలో ఉన్నట్లు సమాచారం. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. అబుల్ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన ఈ ముగ్గురు 2014లో ధార్వాడ తేజశ్వినీ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకున్నారు. ఈ సమయంలోనే చెన్నై రైల్వేస్టేషన్‌తో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లకు పథకాలు రచించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు చేరి అక్కడ బాంబుపేలుళ్లకు పాల్పడ్డారు. తిరిగి బీదర్‌కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. -
‘అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలా?’
-
సిమీ ఉగ్రవాదులకు జీన్స్ వెనుక మిస్టరీ!
భోపాల్: జైలు నుంచి పరారై.. ఆ తర్వాత హతమైన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఉదంతం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. జైలు నుంచి పరారైన ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారని మధ్యప్రదేశ్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ ఎన్కౌంటర్ ఘటనపై పోలీసులు చెప్తున్న సమాచారంలో స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సోమవారం తెల్లవారుజామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేసి.. అనంతరం బెడ్షీట్లను తాడులా చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారు. అనంతరం స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఎనిమిది మంది జాడ కనుక్కొని.. వారిని ఎదురుకాల్పుల్లో హతమార్చారు. అయితే, ఈ ఎన్కౌంటర్ ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హతమైన ప్రదేశంలో సిమీ ఉగ్రవాదులు జీన్స్ ప్యాంట్లు, స్పోర్ట్స్ షూలలో కనిపించారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వారు జైలు యూనిఫాం వేసుకున్నారా? లేక జీన్స్ ప్యాంట్లు, స్పోర్ట్స్ షూస్ కలిగి ఉన్నారా? అన్నది తెలియదు. లేక జైలు నుంచి పరారైన తర్వాత వారు వీటిని ధరించారా? అన్నది మిస్టరీగానే ఉన్నది. ఇక ‘మేం పట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో మేం ఎదురుకాల్పులు జరిపా’మని పోలీసులు అంటున్నారు. అయితే, జైలు నుంచి పరారై బయటకు రాగానే వారి వద్దకు ఆయుధాలు ఎలా వచ్చాయన్నది తేలలేదు. అలాగే స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పరారైన ఎనిమిది మంది జాడ కనుగొన్నామని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి చెప్తుండగా.. నిజానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం జనావాసాలకు రెండుమైళ్ల దూరంలో ఉంది. అక్కడ జనసంచారం కూడా లేదని తెలుస్తోంది. ఇలాంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తును మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. అలాగే, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జైలుశాఖ సీనియర్ అధికారులపై వేటు వేశారు. -
‘అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలా?’
హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకుని.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ లో హతమైన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సిమి కార్యక్తరల ఎన్ కౌంటర్ పై సుప్రీం జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడివని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. సోమవారం తెల్లవారుజామున స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్‌ను కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఉగ్రవాదుల జాడను కనుగొన్నారు. అయితే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించడంతో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చింది. భోపాల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఖేడీ గ్రామంలో పోలీసులు 8 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. -
పరారైన 8మంది ఉగ్రవాదుల హతం
-
పరారైన 8మంది ఉగ్రవాదుల హతం
భోపాల్: పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం తెల్లవారుజామున స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్‌ను కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఉగ్రవాదుల జాడను కనుగొన్నారు. అయితే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించడంతో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చింది. భోపాల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఖేడీ గ్రామంలో పోలీసులు 8 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. -
జైలు నుంచి 8మంది ఉగ్రవాదుల ఎస్కేప్
-
జైలు నుంచి 8మంది ఉగ్రవాదుల ఎస్కేప్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేశారు. సిమీ ఉగ్రవాదులు బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారని భోపాల్ ఎస్పీ అరవింద్ సక్సెనా తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. యూపీ, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులో జరిగిన పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉంది. మరోపైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జైలు ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు మధ్య ప్రదేశ్ హోం మంత్రి భూపేంద్రసింగ్ వెల్లడించారు. సిమీ ఉగ్రవాదుల పరారీకి సంబంధించి పూర్తిసమాచారాన్ని అందించవల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇంతకుమందు కూడా ఇదే తరహాలో సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు. 2013లో ఏడుగురు సిమీ ఉగ్రవాదులు ఖాంద్వా జైలు మరుగుదొడ్డి కిటికీ ఇనుప రాడ్డులను తొలిగించి పరారయ్యారు. ఇద్దరు జైలు సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేసి రైఫిళ్లు, వైర్లెస్ సెట్లను తస్కరించారు. పరారైన వారిలో ఇద్దరు ఉగ్రవాదులు నల్లగొండ జిల్లా ఎన్కౌంటర్లో హతమయ్యారు. -
ఉగ్రజాడలు
♦ వికారాబాద్‌లో ఇబ్రహీం ముఠా కదలికలు ♦ పాస్‌పోర్టుల ఆధారంగా సిమ్‌కార్డుల కొనుగోలు ♦ స్థానిక జిరాక్స్ సెంటర్లో పాస్‌పోర్టుల జిరాక్స్‌లు ♦ వీటిని ఎక్కడైనా తస్కరించారా? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చించోళి- వికారాబాద్ మధ్య రాకపోకలు సాగించినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడి ఒకవేళ హైదరాబాద్‌లో దాడుల వ్యూహం ఫలిస్తే.. కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ఉగ్రవాడులు ప్రణాళిక రూపొందించుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మరోసారి జిల్లాలో ‘ఉగ్ర’మూలాలు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సంచరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన టైస్టులు ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ పలుమార్లు వికారాబాద్, చించోళి పట్టణాల కు రాకపోకలు సాగించినట్లు స్పష్టమైంది. పోలీసుల కళ్లుగప్పి ఐసిస్ అగ్రనేతలతో మాట్లాడేందుకు వినియోగించిన సిమ్ కార్డులలో రెండు చిరునామాలు జిల్లాకు చెందినవే కావడంతో పోలీసు యంత్రాంగం నివ్వెరపోయింది. జిల్లాకు చెందిన ఇద్దరి వ్యక్తుల పాస్‌పోర్టుల ఆధారంగానే ఎయిర్టెల్ సిమ్ కార్డులను పొందినట్లు తేలింది. ఇబ్రహీం స్థానిక బీజేఆర్ చౌరస్తాలోని ఓ ఇంటర్నెట్ సెంటర్లో జిరాక్సులు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. రంజాన్ పండగ వేళ రాజధానిలో విధ్వంస రచనకు కుట్రపన్నిన ఇబ్రహీంతో సహా మరో నలుగురు ఐసిస్ తీవ్రవాదులపై ఎన్ఏఐ మెరుపు దాడులు చేసి చాకచక్యంగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో సిమ్‌కార్డులు పొందడానికి ఎలాంటి ఆధారాలను సమర్పించారు? ఆ పాస్‌పోర్టులు ఎక్కడి నుంచైనా తస్కరించారా? ఎవరైనా సమకూర్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా వీరికి ఎవరైనా సహకారం అందించారా అనే విషయంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ సిమ్‌కార్డులతో ఎవరెవరితో సంభాషణలు జరిపారనే అంశంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు టవర్ లోకేషన్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. వికారాబాద్‌లో బీఈ చదివి.. పాతబస్తీకి చెందిన ఇబ్రహీం యజ్దానీకి వికారాబాద్‌తో గతం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2003లో స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన యజ్దానీ.. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడే ఐసిస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఇబ్రహీం.. ఇక్కడే ముఠా ఏర్పాటు చేశాడు. రాజధానిలో ఒకేసారి పలుచోట్ల బాంబు పేలుళ్లు, తుపాకులతో విరుచుకుపడేలా ప్లాన్ వేశాడు. అయితే, ఎన్ఐఏ అధికారుల అప్రమత్తంతో హైదరాబాద్‌కు ఉగ్రముప్పు తప్పింది. ఒకవేళ వారి వ్యూహం ఫలిస్తే.. దాడుల అనంతరం కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లుగా ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసింది. వికారాబాద్‌లో సొంతంగా స్థావరం ఏర్పాటుచేసుకోవాలనుకున్నారా? ఎవరైనా సహకారం అందిస్తున్నారా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సిమీ తీవ్రవాదులకు శిక్షణ గతంలో స్టూడెంట్ మూవ్మెంట్ ఆఫ్ ఇస్లామిక్(సిమీ) తీవ్రవాదులు కూడా వికారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ పోలీసులకు పట్టుబడిన సిమీ అగ్రనేత సప్ధర్ నగోరి కూడా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆయుధాల వాడకంలో అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నామని చెప్పారు. మరోవైపు గతేడాది వరంగల్ పోలీసుల చేతిలో ఎన్కౌంటరైన వికారుద్దీన్ కూడా చేవెళ్ల సమీపంలోని మదర్సాలో కొన్నాళ్లపాటు తలదాచుకున్నానని పోలీసుల ముందు అంగీకరించారు. తాజాగా ఐసిస్ ముఠా కదలికలు కూడా వికారాబాద్‌లో కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఇంకా చిక్కలేదట!
రూర్కెలాలో పట్టుబడ్డ‘సిమి’ ఉగ్రవాదులు ఎన్ఐఏ వెబ్సైట్లో వీరు ఇంకా వాంటెడ్‌గానే.. వివరాలు అప్డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని... కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భారీ బ్యాంకు చోరీతో పాటు దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు ఇంకా చిక్కలేదట. గత నెల 17న ఒడిశాలోని రూర్కెలాలో పట్టుబడ్డారు కదా..! అనుకుంటున్నారా? వాస్తవానికి వీరు దొరికినా... జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెబ్సైట్ ప్రకారం మాత్రం ఇంకా వాంటెడే. ఆ ముష్కరులపై రివార్డులూ ఇంకా కొనసాగుతున్నాయి. ముప్పతిప్పలు పెట్టిన ముష్కరులు... సిమి ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్ తదితరులు 2013 అక్టోబర్ 1న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో అబు ఫైజల్‌ను అరెస్టుచేశారు. మిగిలిన ఐదుగురు ఉగ్రవాదులు ‘మాల్-ఏ-ఘనీమఠ్’ (ఉగ్రవాద చర్యలకు నిధుల సమీకరణ) కోసం ‘జమాత్ అల్ ముజాహిదీన్’ పేరుతో కొత్త మాడ్యుల్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థతో పాటు దేశ వ్యాప్తంగా అనేక నేరాలు చేశారు. గతేడాది మెదక్ జిల్లా సంగారెడ్డికి చేరుకున్న మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, మహ్మద్ ఎజాజుద్దీన్ అక్కడి ప్రభుత్వ కళాశాల సమీపంలో ఓ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్యాపేట ఉదంతంతో 2015 ఏప్రిల్ 4న జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరూ హతమయ్యారు. బిజ్నూర్ కేసులో రివార్డ్స్ ప్రకటన.. జానకీపురం ఎన్‌కౌంటర్‌కు ముందే ఈ ఐదుగురు ముష్కరులతో ఖాండ్వా ప్రాంతానికే చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ సాలఖ్ జత కట్టాడు. అనేక నేరాలను జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్ అలియాస్ పప్పులతో కలిసి చేశాడు. జానకీపురం ఉదంతం జరిగినప్పుడు మాత్రం మిగిలిన నలుగురూ తెలంగాణకు రాలేదు. దీనికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో వీరు ఆశ్రయం పొందుతున్న ఇంట్లో 2014 సెప్టెంబర్ 12న ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్ తీవ్రంగా గాయపడ్డాడు. జానకీపురం ఉదంతం తర్వాత గతేడాది ఏప్రిల్ 24న ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. చిక్కినా ఆ జాబితాలోనే... దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఈ నలుగురు ఉగ్రవాదుల్ని వాంటెడ్ జాబితాలో చేర్చిన దర్యాప్తు సంస్థ ఒక్కొక్కరిపై రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ అంశాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వాంటెడ్ జాబితా’లో పొందుపరిచారు. గత నెల 17న ఒడిశాలోని రూర్కెలా ప్రాంతంలో తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులతో పాటు వారికి సహాయంగా ఉంటున్న ఓ ఉగ్రవాది తల్లి సైతం పట్టుబడింది. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇది జరిగి నెల దాటినా... ఇప్పటికీ ఎన్ఐఏ వెబ్సైట్ ప్రకారం మాత్రం ఈ ముష్కరులు వాంటెడ్‌గానే ఉన్నారు. సైట్‌ను అప్డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎన్ఐఏ వెబ్సైట్ ప్రకారం సిమి ఉగ్రవాదులు ‘పరారీలోనే’ ఉండిపోయారు. -
ఉనికి బయట పడనీయరు!
కరుడుగట్టిన ఉగ్రవాదుల నైజమిది ‘ప్రాణాల పైకి’ వచ్చినా పారిపోవడమే హత్యాయత్నం చేసినా ప్రతీకారం ఉండదు తాజా ఉదాహరణలుగా ‘సిమి’, అఫ్రిదిలు కరుడుగట్టిన ఛాందసవాదం.. అర్థంపర్ధం లేని ప్రతీకారేచ్ఛతో అజ్ఞాత జీవితం గడిపే గజ ఉగ్రవాదులు ఏ దశలోనూ తమ ఉనికి బయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చివరకు ప్రాణాలపైకి వస్తే... పారిపోవడం లేదా సాధారణ వ్యక్తుల్లా సహాయం అర్థించడానికి ప్రాధాన్యమిస్తారు. తాము చిక్కితే తమ ‘లక్ష్యం’ దెబ్బతింటుందన్న వారి భావనే దీనికి కారణమని నిఘా వర్గాలంటున్నాయి. అయితే పట్టుబడే పరిస్థితులు వస్తే మాత్రం ఆ ఉగ్రవాదుల్లో అంతర్గతంగా ఉన్న మానవమృగాలు జూలు విదులుస్తాయని, అలాంటి పరిస్థితుల్లో పోలీసుల్ని చంపడానికీ వెనుకాడరని వివరిస్తున్నారు. గత నెలలో ఒడిశాలోని రూర్కెలాలో దొరికిన ‘సిమి’ ఉగ్రవాదులు, జనవరిలో బెంగళూరులో పట్టుబడిన ‘ఐఎం’ ఉగ్రవాది ఆలం జెబ్ అఫ్రిది వ్యవహారాలే తాజా ఉదాహరణలుగా చెప్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ఐదుగురిదీ ‘ఘన’ చరిత్రే... నిషిద్ధ సిమికి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు 2013 అక్టోబర్ 25న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. ఇద్దరు అదే ఏడాది పట్టుబడగా... ఎజాజుద్దీన్, అస్లం, అంజద్, మహబూబ్, జకీర్ మాత్రం అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అప్పటికే వీరిపై దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు సంబంధించిన కేసులున్నాయి. 2014 ఫిబ్రవరి 1న కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్బీఐ నుంచి రూ.46 లక్షలు దొచుకుపోయారు. అదే ఏడాది మేలో ఈ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్కు చేరుకుంది. 40 శాతం కాలినా ఎస్కేప్... అక్కడి జతాన్ ప్రాంతంలో ఉన్న లీలోదేవీ అనే మహిళ ఇంట్లో ఈ ‘ఉగ్ర’ ముఠా అద్దెకు దిగింది. తాము మొరాదాబాద్‌కు చెందిన వారమని, బిజ్నూర్లోని పేపర్ మిల్లులో పని చేస్తున్నామని ఇంటి యజమానులకు చెప్పింది. దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్రపన్నిన ఈ మాడ్యుల్ ఆ ఇంట్లోనే స్థానికంగా లభించే పదార్థాలను వినియోగించి బాంబులు తయారీ చేపట్టింది. 2014 సెప్టెంబర్ 12 ఉదయం 10.45 గంటలకు మహబూబ్ చేతిలో ఓ బాంబు పేలిపోయింది. దీంతో అతడి శరీరంపై 40 శాతానికి పైగా గాయాలయ్యాయి. అయినప్పటికీ తమ ఉనికి బయటపడకూడదని తక్షణం ఆ ఇల్లు వదిలి ఐదుగురూ బయటకు వచ్చేశారు. మహబూబ్‌కు దుప్పటి కప్పి, స్థానికంగా ఉన్న వైద్యుడి వద్ద చికిత్స చేయించి... అతడితో పరారయ్యారు. చిక్కుతామనుకుంటే చంపేందుకూ... ఈ ముఠా ఖాండ్వా జైలుకు వెళ్లడానికి ముందు, జైలు నుంచి తప్పించుకునే క్రమంలోనూ పోలీసుల్ని చంపింది. గతేడాది ఏప్రిల్‌లో ఎజాజుద్దీన్, అస్లం విజయవాడకు వెళ్లే ప్రయత్నాల్లో హైదరాబాద్‌లో బస్సు ఎక్కారు. సూర్యాపేటలో బస్సును తనిఖీ చేసిన పోలీసులు వీరిని అనుమానించి కిందికి దింపడంతో ఓ హోంగార్డు, కానిస్టేబుల్‌ను కాల్చి చంపడంతో పాటు ఇన్స్పెక్టర్పై హత్యాయత్నం చేశారు. జానకీపురంలోనూ తమను పట్టుకోవడానికి యత్నించిన ఎస్సైను పొట్టనపెట్టుకున్నారు. అదే సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో వీరిద్దరూ హతమయ్యారు. ఆపై ఈ ముఠాలోకి సాలఖ్ వచ్చి చేరాడు. రూర్కెలాలోనూ వీరి ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు సాలఖ్ తన తుపాకీతో పోలీసులపై హత్యాయత్నం చేశాడు. ‘భత్కల్’ బ్రదర్స్‌కు సన్నిహితుడు... గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపురాకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాదబాటపట్టాడు. హలోల్‌లో జరిగిన ఉగ్రవాద శిక్షణకు హాజరుకావడంతో పాటు మరికొందరినీ ఉగ్రబాట పట్టించాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్‌మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్స్లో సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించిన సైకిళ్లను ఆలమే సమకూర్చాడు. దర్యాప్తు సంస్థలు 2009లో ఐఎం మాడ్యుల్‌ను గుర్తించి వరుస అరెస్టులు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆలమ్ అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. ‘వాంటెడ్’పై హత్యాయత్నం... అఫ్రిది దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూర్ రోడ్లో తలదాచుకుంటున్నాడు. అక్కడి దొడ్డనాగమంగళం ప్రాంతంలో నివసిస్తూ ఏసీ మెకానిక్‌గా రఫీఖ్ అహ్మద్ పేరుతో చెలామణి అవుతున్నాడు. ఇతడిపై ఏడాది క్రితం ‘హత్యాయత్నం’ జరిగింది. ఇది చేయించింది రఫీఖ్ మాజీ యజమాని. తన దగ్గర పని చేసి మానేసిన అఫ్రిది తనకు సంబంధించి రెగ్యులర్ కస్టమర్స్‌ను వేరే ఏసీ మెకానిక్స్ వద్దకు పంపుతున్నాడని కొందరు మునుషుల్ని పెట్టించి మరీ అఫ్రిదిపై దాడి చేయించాడు. చావుదెబ్బలు తిన్నా సరే అఫ్రిది మాత్రం వారిపై తిరగబడలేదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు. వీటిలో ఏది చేసినా తన ఉనికి బయటపడుతుందనే... అమాయకుడిగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తనపై హత్యాయత్నం చేశారని కేసు నమోదు చేయించాడు. ‘తనదాకా’ వస్తే బరితెగింపే... పోలీసు, నిఘా వర్గాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన తర్వాతా అఫ్రిది తన ‘పంథా’ కొనసాగించాడు. ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పని చేశాడు. చెన్నై రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు, బెంగళూరు చర్చ్ స్ట్రీట్ బ్లాస్ట్‌లతో పాటు ఫ్రెంచ్ కాన్సులేట్ కార్యాలయానికి నిప్పు పెట్టడం, బెదిరింపు లేఖలు పంపడం తదితర చర్యలకూ ఉపక్రమించాడు. జనవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న దొడ్డనాగమంగళం వద్ద తనను పట్టుకోవడానికి ప్రయత్నించి పోలీసు అధికారిపై మాత్రం హత్యాయత్నం చేసి చిక్కాడు. హైదరాబాద్‌లో చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్తోనూ ఇతడికి సంబంధాలున్నాయి. -
ఒక్కో చోట ఒక్కో ‘పేరు’!
చెలామణి అయిన ‘రూర్కెలా’ ఉగ్రవాదులు ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నివాసాలు తెలంగాణలో వీరిపై నాలుగు కేసులు పీటీ వారెంట్‌పై తేవాలని నిర్ణయం నేడో, రేపు చేరుకోనున్న ముష్కరమూక సిటీబ్యూరో: తెలంగాణ, ఒడిస్సా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో బుధవారం రూర్కెలాలో చిక్కిన సిమి ఉగ్రవాదుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో ఇద్దరు సభ్యులు హతమైన తర్వాత ఈ ముఠా ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అంతా ఒకే కుటుంబంగా, ఒక్కో చోట ఒక్కో వృత్తి పేరు చెప్తూ చెలామణి అయ్యారని స్పష్టమైంది. రూర్కెలాలో చిక్కిన షేక్ మహబూబ్, అంజద్ ఖాన్, జకీర్ హుస్సేన్, మహ్మద్ సాలఖ్‌లను వివిధ ఏజెన్సీలకు చెందిన బృందాలు ప్రశ్నిస్తున్నాయి. జానకీపురం ఎన్‌కౌంటర్‌కు కొన్ని రోజుల ముందు తెలంగాణకు వచ్చిన ఎజాజుద్దీన్, అస్లం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఉన్న ప్రభుత్వ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో తాము పాత వస్త్రాల వ్యాపారం చేస్తామని, త్వరలోనే కుటుంబసభ్యులు వస్తారంటూ యజమానితో చెప్పారు. వీరిద్దరూ రెక్కీ కోసం విజయవాడకు వెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే జానకీపురం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఉదంతం జరిగినప్పుడు మిగిలిన నలుగురు ఉగ్రవాదులతో పాటు మహబూబ్ తల్లి నజ్మాబీవీ పశ్చిమ ఒడిస్సాలోని సంబల్పూర్లో నివసిస్తున్నారు. ఎన్కౌంటర్ విషయం తెలియడంతోనే అక్కడ నుంచి జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు మకాం మార్చారు. కొన్ని రోజులకే ఒడిస్సాలోని భద్రక్ పట్టణానికి వచ్చి కార్పెంటర్లమంటూ నాన్గమొహల్లా ప్రాంతంలో ఉన్న మున్నా ఖాన్ ఇంట్లో అద్దెకు దిగారు. నెలకు రూ.వెయ్యి చొప్పున అద్దె ఒప్పందం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో అక్కడ నుంచి రాంచీకి వెళ్లి కొన్ని రోజుల పాటు నివసించారు. ఆపై రూర్కిలాలోని నాలా రోడ్లో ఉన్న ఖురేషీ మొహల్లాకు వచ్చి పూల వ్యాపారులమంటూ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రూర్కెలాలో చిక్కిన ముష్కరులపై ఇప్పటి వరకు తెలంగాణలో నాలుగు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులకు సంబంధించి షేక్ మహబూబ్, అంజద్ ఖాన్, జకీర్ హుస్సేన్, మహ్మద్ సాలఖ్‌లను ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకువచ్చి విచారించడానికి పోలీ సులు సన్నాహాలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో నలుగురు ముష్కరుల్నీ తీసుకువచ్చే అవకాశం ఉంది. -
ఆ నలుగురూ దొరికేశారు!
♦ రూర్కెలాలో పట్టుబడిన మోస్ట్‌వాంటెడ్ సిమి ఉగ్రవాదులు ♦ ఓ ఉగ్రవాది తల్లిని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు ♦ తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్ ♦ చొప్పదండి బ్యాంక్‌లో చోరీ ఈ ముష్కరుల పనే ♦ జానకీపురంలో హతమైంది వీరి ప్రధాన అనుచరులే సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని.. దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాదులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా నగరంలో బుధవారం తెల్లవారుజామున తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్, మహ్మద్ సాలఖ్, షేక్ మహబూబ్, అంజాద్‌లను అరెస్టు చేశారు. వారితో పాటు ఓ ఉగ్రవాది తల్లి సైతం పట్టుబడింది. అక్కడి ప్లాంట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మాలారోడ్ ప్రాం తంలో మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్ మూడు గంటల శ్రమ తర్వాత సఫలీకృతమైంది. ఈ ముష్కరులపై మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 40 కేసుల వరకు ఉన్నాయి. అబు ఫైజల్ నేతృత్వంలో గ్రేట్ ఎస్కేప్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. సిమి మధ్యప్రదేశ్ శాఖకు చీఫ్‌గా పనిచేసిన ఇతడు డాక్టర్‌గా చెలామణి అవుతూనే దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొన్నాడు. ఓ హత్యాయత్నం కేసులో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైల్లో ఉంచారు. దోపిడీ, బందిపోటు దొంగతనం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాండ్వాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాధిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్, అబిద్మీర్జా సైతం ఖాండ్వా జైల్లోనే ఉన్నారు. పేద, దిగువ మధ్య తరగతి కుంటుంబాలకు చెందిన వీరిని అబు ఫైజల్ ఆకర్షించాడు. ఈ ఏడుగురూ 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. అడ్డువచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అబిద్ పోలీసులకు చిక్కాడు. 2013 డిసెంబర్లో మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్‌ను అరెస్టుచేశారు. ఇతడి విచారణలో జైలు నుంచి పారిపోవడానికి ఇండియన్ ముజాహిదీన్ ఆపరేషన్స్ చీఫ్ యాసీన్ భత్కల్ స్కెచ్ వేసినట్లు బయటపడింది. చొప్పదండిలో భారీ చోరీ.. ఈ ఉగ్రవాదులు ‘మాల్-ఏ-ఘనీమఠ్’ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాల నిధుల సమీకరణ కోసం జమాత్ అల్ ముజాహిదీన్ అనే కొత్త మాడ్యుల్ ఏర్పాటు చేశారు. వీరికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా, బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ-బి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు సహకరించారు. నిధుల సమీరణ కోసం అనేక ప్రాంతాల్లో దోపిడీలు చేసిన ఈ ముఠా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోనూ అడుగుపెట్టింది. అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను టార్గెట్ చేసుకున్న వీరు.. 2014 ఫిబ్రవరి 1న బ్యాంకుపై దాడి చేసి రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. జానకీపురంలో ఇద్దరు హతం.. గత ఏడాది మరోసారి తెలంగాణలో సిమి ఉగ్రవాదులు అడుగుపెట్టారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చేరుకున్న బిలాల్, ఎజాజుద్దీన్ అక్కడ ఓ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీలు చేస్తున్న సూర్యాపేట ఇన్స్పెక్టర్ మొగిలయ్యతో పాటు కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డ్ మహేష్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఉదంతంలో లింగయ్య, మహేష్ చనిపోయారు. అదే నెల 4న జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో వీరిద్దరూ హతమవగా.. ఆత్మకూరు(ఎం) ఎస్సై సిద్ధయ్య వీరమరణం పొందారు. వీరితో జత కట్టిన మరో వ్యక్తి.. ఖాండ్వా ప్రాంతానికే చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ సాలఖ్ వీరితో జతకట్టాడు. జకీర్ హుస్సేన్, షేక్ మహబూబ్, అంజాద్‌తో కలసి అనేక నేరాలు చేశాడు. 2014 సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో వీరు ఆశ్రయం పొందుతున్న ఇంట్లో పేలుడు సంభవించడంతో షేక్ మహబూబ్ గాయపడ్డాడు. మహబూబ్ తల్లి నజ్మాబీ అప్పటి నుంచి వీరితో కలిసే తిరుగుతోంది. ఈ ఉగ్రవాదులను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి కరీంనగర్, మహబూబ్‌నగర్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
హైదరాబాద్‌పై అల్‌కాయిదా పడగ?
సాక్షి, హైదరాబాద్: అమెరికాను గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా ఛాయలు నగరంలోనూ కనిపిస్తున్నాయి. గతేడాది ఆ సంస్థలో చేరేందుకు వెళ్తూ ఇద్దరు మహారాష్ట్ర వాసులు సికింద్రాబాద్‌లో చిక్కడం.. తాజాగా అల్‌కాయిదాకు ఆర్థిక సాయం చేస్తున్న ఆరోపణలపై అమెరికాలో నివసిస్తున్న ఇద్దరు హైదరాబాదీల్ని ఎఫ్‌బీఐ అరెస్టు చేయడం కలకలం సృష్టిం చింది. వీటికితోడు నాగ్‌పూర్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన హఫీజ్ ఆన్లైన్ ద్వారా సిటీకి చెందిన కొందరిని సంప్రదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరి ణామాలను దృష్టిలో పెట్టుకున్న నిఘా వర్గా లు అత్యంత అప్రమత్తమయ్యాయి. ఇప్పటి వరకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఐఎస్ఐఎస్కు తోడు అల్‌ఖాయిదాతో నగరంతో ఉన్న లింకులపై లోతుగా ఆరా తీస్తున్నాయి. ఏటీఎస్‌కు చిక్కిన రెహ్మాన్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గతవారం యవత్మాల్ జిల్లాలోని పూసద్‌కు చెందిన హఫీజ్ ముజిబర్ రెహ్మాన్ అలియాస్ సలీమ్ మాలిక్‌ను అరెస్టుచేశారు. ఓ ప్రార్థనాస్థలంలో పనిచేస్తున్న ఈ యువకుడు ఆన్లైన్ ద్వారా అల్‌కాయిదాకు మద్దతుగా ‘జిహాద్’ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతడికి గత ఏడాది సికింద్రాబాద్‌లో చిక్కిన అహ్మద్‌ఖాన్, ముసద్దీర్లతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు. రెహ్మాన్ సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన కొందరితో సంప్రదింపులు జరిపినట్లు ఏటీఎస్ అనుమానిస్తూ ఆ కోణంలో ఆరా తీస్తోంది. సైదాబాద్, మల్లేపల్లి వాసులే: తాజాగా అల్‌కాయిదాకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఆ దేశంలో నలుగురిని అరెస్టు చేసింది. ఇలా చిక్కిన వారిలో హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన ఇంజనీర్లు మహ్మద్ యహ్యా ఫారూఖ్, మహ్మద్ ఇబ్రహీం జుబేర్ ఉన్నారు. వీరిద్దరూ అన్నదమ్ములే. ఈ విషయంపై ఆరా తీసిన రాష్ట్ర నిఘా వర్గాలు వీరి తండ్రి పేరు మహ్మద్ అహ్మద్ షాకేర్గా గుర్తించారు. సైదాబాద్ పరిధిలోని అక్బర్బాగ్లో యహ్యా నివసించిన ఇంటినీ పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ యహ్యా సోదరి ఉంటున్నట్టు తేలింది. ఇబ్రహీం న్యూ మల్లేపల్లిలోని సీఐడీ క్వార్టర్స్‌లో నివసించాడు. గతేడాది ఆ ఇద్దరూ... మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ జిల్లా షా కాలనీకి చెందిన షా ముసద్దీర్ అలియాస్ తల్హా, అంగోలీ జిల్లా అఖడ్‌బాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్ ఖాన్ ఉగ్రవాద బాటపట్టి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో చేరారు. ఫేస్బుక్ ద్వారా అల్‌కాయిదాకు ఆకర్షితులయ్యారు. ఆ సంస్థలో శిక్షణ పొందేందుకు అఫ్ఘానిస్థాన్‌కు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా నగరానికి చేరుకున్న వీరిని గతేడాది అక్టోబర్ 22న సికింద్రాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీ, తెలంగాణల్లోనే సిమి ఉగ్రవాదులు!
-
ఏపీ, తెలంగాణల్లోనే సిమి ఉగ్రవాదులు!
- మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల అనుమానం సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయత్నాల్లో భాగంగా సూర్యాపేటలో పోలీసుల్ని చంపి, ఇద్దరు సహచరుల్ని కోల్పోయిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే తలదాచుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో ఇంకా ఓ మహిళ సహా ఐదుగురు ఉన్నట్లు వారు నిర్ధారించారు. ఆ ఐదుగురి ఫొటోలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిన రెండు రాష్ట్రాల అధికారులు.. ప్రధానంగా జిల్లా, రాష్ట్ర సరిహద్దులు, పారిశ్రామికవాడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఖాండ్వా జైలులో ఉన్న అబు ఫైజల్, ఎజాజుద్దీన్ మహ్మద్, జాకీర్ హుస్సేన్, మహబూబ్, అస్లం అయూబ్ ఖాన్, అంజద్ రంజాన్ ఖాన్, అబిద్‌లు గత ఏడాది అక్టోబర్‌లో తప్పించుకున్నారు. వీరిలో అబు ఫైజల్, అబిద్‌లు చిక్కగా... సూర్యాపేట ఉదంతంలో ఎజాజ్, అస్లం నేలకొరిగారు. మిగిలిన ముగ్గురితో కొత్తగా మహ్మద్ సాలక్, మహబూబ్ తల్లి నజ్మాబీ జత కట్టినట్లు అధికారులు గుర్తించారు. మరో వర్గం వ్యక్తుల పేర్లతో పాత/కొత్త వస్త్రాలు విక్రయించే వారి మాదిరిగా నివసించడం వీరి నైజమని, అందువల్ల ఇలాంటి వారిపై కన్నేసి ఉంచాల్సిందిగా సూచించారు. పుణేలో జరిగిన బాంబు పేలుడుతో పాటు మహారాష్ట్రకు సంబంధించిన పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మహబూబ్, అంజాద్, జకీర్లపై రూ.10 లక్షల రివార్డు సైతం ఏటీఎస్ ప్రకటించింది. -
ఇంద్రకీలాద్రిపై సెల్ఫోన్ల కోసం కౌంటర్
సాక్షి, విజయవాడ : సిమీ ఉగ్రవాదులు తమ దాడులకు దుర్గగుడిని లక్ష్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ తెచ్చుకునే సెల్ఫోన్లను భద్రపరుచుకునేందుకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ కౌంటర్‌ను దేవస్థానం సిబ్బందే నిర్వహిస్తారా? లేక కాంట్రాక్టర్‌కు లీజుకు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. పైరవికి సిద్ధమైన కాంట్రాక్టర్ ఇంద్రకీలాద్రిపై సెల్ఫోన్లు భద్రపరిచే కౌంటర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలంటూ దుర్గగుడిపై గతంలో వివిధ రకాల కాంట్రాక్టులు చేసిన ఒక కాంట్రాక్టర్ ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఒకొక్క భక్తుడి నుంచి సెల్ ఫోన్ భద్రపరిచేందుకు రూ.5 లేదా రూ.10 వసూలు చేస్తానని, దేవస్థానం నిర్ణయించిన అద్దె చెల్లిస్తానని ఆ కాంట్రాక్టర్ ప్రతిపాదించాడని సమాచారం. ప్రస్తుతం సిమీ ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఈ కాంట్రాక్టర్ తన ఫైల్ పరిశీలించాలంటూ అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్‌కే అవకాశం ఇవ్వాలని ఈవో సీహెచ్.నర్సింగరావుపై ప్రభుత్వ పెద్దల నుంచి వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రజాప్రతినిధుల వత్తిడికి తలొగ్గి సెల్ఫోన్లు భద్రపరిచే కౌంటర్‌ను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారా? లేక భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా దేవస్థానం సిబ్బందితోనే నిర్వహిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. లీజుకు ఇస్తే దేవస్థానానికి ఆదాయం వస్తుందంటూ ఈవోను తప్పదోవ పట్టించేందుకు లీజెస్ విభాగం సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అసలు కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? లేదా? అని కూడా ఈవో ఆలోచిస్తున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. -
దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా..
ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన దేవస్థానం, పోలీసు అధికారులు కొండపై నిఘా కట్టుదిట్టం ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక విజయవాడ : నిత్యం భక్తులతో జనసమ్మర్థంగా ఉండే ఇంద్రకీలాద్రిపై సిమీ ఉగ్రవాదులు కన్నేశారా.. దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా.. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్) దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో సోమవారం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అబుఫైజల్ గ్యాంగ్‌కు చెందిన సిమీ ఉగ్రవాదులు అస్లాం, ఇజాజ్ అహ్మద్ హతమైన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఫైజల్ సహా ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా.. ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ఇద్దరూ గతంలో విజయవాడలో జనసమ్మర్థంగా ఉండే కొన్ని ముఖ్యమైన స్థలాలపై రెక్కీ నిర్వహించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. రెండోసారి విజయవాడకు వస్తూనే ఎన్కౌంటర్లో చనిపోయారని, మిగిలిన నలుగురు ఉగ్రవాదులు రాజధాని ప్రాంతంలోనే తలదాచుకున్నారనే అనుమానాలు ఇంటిలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. అధికారులు అప్రమత్తం... ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు వెంటనే దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవయ్యతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కమాండెంట్ నాగమల్లేశ్వరరావు, సివిల్ పోలీసు, సెక్యూరిటీ సిబ్బందితో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల గురించి చర్చించారు. దేవస్థానంలో మూడు షిఫ్టుల్లోనూ కలిపి 113 మంది ఓపీడీఎస్ సిబ్బంది, 18 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 20 మంది హోమ్‌గార్డులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి వీరు సరిపోతారని, అయితే వీరు నిరంతరం నిఘాను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. సెల్ఫోన్లపై నిషేధం! ప్రస్తుతానికి దేవస్థానంలో సెల్ఫోన్లను అధికారులు అనుమతిస్తున్నారు. అయితే సెల్ఫోన్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి భక్తులు అక్కడ పెట్టుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పోలీసు, సెక్యురిటీ అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న డాగ్ చెకింగ్, భక్తుల బ్యాగుల చెకింగ్లను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి భక్తుల బ్యాగులను అనుమతించకూడదనే నిబంధన మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. దేవస్థానానికి వచ్చే దారులన్నింటిలోనూ రాత్రివేళల్లోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దేవస్థానంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తామని, అవసరమైతే మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని దేవస్థానం అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక... విజయవాడ నగరంలో సిమీ ఉగ్రవాదుల జాడలు కనపడుతున్న నేపథ్యంలో దేవస్థానంలో తీసుకునే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న రక్షణ చర్యలపై పోలీసు, దేవస్థానం అధికారులు ఒక ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోరిక మేరకే ఈ నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి సెక్యురిటీ పరంగా ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు వస్తే వాటిని కూడా తక్షణం అమలు చేసేందుకు దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. -
ఇంతకీ వారెవరు ?
బెజవాడలో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ? విజయవాడ: విజయవాడలోని పాతబస్తీ, భవానీపురం ప్రాంతాలకు చెందిన నలుగురు యువకుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వీరెరవనే విషయమై స్థానిక పోలీసులు నోరు మెదపడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురినీ అధికారులు ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని తెలిసింది. నల్లగొండ జిల్లా అర్వపల్లి ‘సిమి’ ఉదంతం నేపథ్యంలో ఉగ్రవాదుల కన్ను విజయవాడపై ఉన్నట్లు వెలుగులోకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, నిఘా వర్గాలు నగరంపై డేగకన్ను వేశాయి. ఎన్ఐఏ, నిఘా విభాగాలతో కూడిన ప్రత్యేక సంయుక్త బృందం దాదాపు వారం క్రితం ఇక్కడికి వచ్చింది. నగరంలోని పాతబస్తీతోపాటు భవానీపురం ప్రాంతానికి చెందిన 22 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిని పలు కోణాల్లో విచారించిన తరువాత 18 మందిని విడిచిపెట్టింది. మిగిలిన నలుగురినీ మాత్రం రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. వీరంతా సిమి లేదా ఐఎస్ఐఎస్కి చెందినవారనే కోణాల్లోనే విచారణ సాగుతున్నట్లు సమాచారం. -
సంగారెడ్డిలో సిమి జాడలు!
పట్టణ సమీపంలో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల అనుమానం ఉగ్రవాదులు సంగారెడ్డి నుంచి విజయవాడకు వెళ్తూ పట్టుబడినట్లు సమాచారం సాక్షి, సంగారెడ్డి: నల్లగొండ ఎన్కౌంటర్లో మరణించిన సిమి ఉగ్రవాదులు మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. ఈ నెల రెండో తేదీన ఉగ్రవాదులు సంగారెడ్డి నుంచే విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలో పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం. ఉగ్రవాదులు అస్లాం, ఎజాజ్ ఇద్దరు కూడా రంగారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామంలో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసు దర్యాఫ్తులో తేలినట్లు తెలిసింది. ఈ మేరకు వారు అద్దెకు తీసుకున్న గదిని పోలీసులు రహస్యంగా పరిశీలించి, ఇంటి యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్‌ను లూటీ చేసిన అనంతరం వాళ్లు ఇదే గదిలో ఆశ్రయం పొందినట్టు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాది ఎజాజ్ ముత్తూట్ ఫైనాన్స్ లూటీలో ఉన్నారని పోలీసులు నిర్ధారించడం, అతని మృతదేహాన్ని బ్యాంకు సిబ్బంది కూడా గుర్తుపట్టడంతో ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారనే ఆరోపణకు బలం చేకూరుతోంది. దీనిపై జిల్లా ఎస్పీ సుమతి వివరణ కోరగా ఉగ్రవాదులు ఇల్లు అద్దెకు తీసుకున్నారనటం నిజం కాదన్నారు. -
’నా భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తా ’
-
నా భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తా'
వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద అనీఫ్ భార్య, బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్కౌంటర్లో హతమైన వికారుద్దీన్ గ్యాంగ్‌కు బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనీఫ్ మృతదేహాన్ని చూడటానికి పోలీసులు అనుమతించటం లేదని అనీఫ్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. సాక్ష్యాలు లేనందునే అనీఫ్‌ను ఎన్కౌంటర్ చేశారని, ఎన్‌కౌంటర్‌పై పూర్తి విచారణ జరిపించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆస్పత్రిలోకి రానివ్వకుండా పోలీసులు నెడుతున్నారని, తన భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తానని ఆమె అన్నారు. కాగా ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, వారి నుంచి అనుమతి రాగానే బంధువులకు మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
ఎంజీఎంలో ప్రారంభమైన పోస్ట్‌మార్టం
వరంగల్ : వరంగల్ ఎన్కౌంటర్లో మృతి చెందిన వికారుద్దీన్ గ్యాంగ్‌కు ఎంజీఎంలో బుధవారం పోస్ట్‌మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నిపుణులు రాజు, కృపాల్ సింగ్, నాగమోహన్, ఇస్మాయిల్ బృందంతో పాటు, 8మంది వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. సుమారు పోస్ట్‌మార్టంకు అయిదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పోస్ట్‌మార్టం నేపథ్యంలో ఎంజీఎం వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నారు. -
వికార్ గ్యాంగ్ హతం..
►వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మృతి ►జాతీయ రహదారిపై ఎస్కార్ట్ బస్సులోనే కాల్పులు ►వరంగల్ జైలునుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్తుండగా ఘటన ►పోలీసులపై దాడికి యత్నించిన వికార్ గ్యాంగ్ ►ఆయుధాలు లాక్కుని ఎదురుదాడి చేసే యత్నం.. ►నిందితులను కాల్చి చంపిన పోలీసులు ►వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నేడు పోస్ట్‌మార్టం ►అన్యాయంగా చంపారు.. సీబీఐ దర్యాప్తు జరపాలి: వికార్ తండ్రి ►ఇది పోలీసుల ప్రతీకార హత్య: అసదుద్దీన్ ఒవైసీ ►హైకోర్టు జడ్జితో విచారణకు హక్కుల సంఘాల డిమాండ్ నల్లగొండ-వరంగల్ జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్ వరంగల్: రాష్ట్రంలో మరో సంచలనం. ఇద్దరు సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ను మరువక ముందే మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈసారి కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌తోపాటు అతని గ్యాంగ్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని టంగుటూరు శివారులో జాతీయ రహదారిపైనే మంగళవారం కాల్పు లు జరిగాయి. ఇందులో వికార్ అహ్మద్(29) అలియాస్ వికారుద్దీన్‌తోపాటు సయ్యద్ అమ్జద్(23), ఇజార్ ఖాన్(29), మహమ్మద్ జకీర్(32), మహమ్మద్ హనీఫ్(34) మృతి చెందా రు. పలు ఉగ్రవాద నేరాల్లో విచారణ ఖైదీలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న వీరిని కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. మూత్రవిసర్జన కోసమంటూ వాహనాన్ని నిలిపేలా చేసి ఉగ్రవాదులు పోలీసులపైకి తిరగబడ్డారని పోలీ సులు తెలిపారు. ఆయుధాలను లాక్కునేం దుకు యత్నించడంతో పోలీసుల కాల్పుల్లో నిందితులంతా అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాలన్నీ ఎస్కార్ట్ వాహనంలోనే పడి ఉన్నాయి. చేతులకు బేడీలు అలానే ఉన్నాయి. ఓ నిందితుడి చేతిలో మాత్రం పోలీసుల ఆయుధం ఉంది. ఒకేసారి ఐదుగురు ఉగ్రవాదులు హతమవడం రాష్ర్టంలో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇజార్‌ఖాన్ మినహా మిగతా వారంతా హైదరాబాద్ వాసులే. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు నిషేధిత సిమి, లష్కరేతొయిబా ఉగ్రవాద సంస్థలతో వికార్కు సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తన కుమారుడిని అన్యాయంగా చంపారని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వికారుద్దీన్ తండ్రి అహ్మద్ డిమాండ్ చేశారు. ఇవి పోలీసుల ప్రతీకార హత్యలని, దీనిపై మానవ హక్కుల సంఘంతో విచారణ జరిపించాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఎన్కౌంటర్ చట్ట విరుద్ధమని, హైకోర్టు జడ్జితో విచారణ చేయాలని హక్కుల సంఘాలు మండిపడ్డాయి. హైవేపైనే ఘటన.. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు ఆర్ముడ్ రిజర్వ్(ఏఆర్) సబ్ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని పోలీసుల బృందం మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఐదుగురు ఖైదీలను తీసుకుని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నీలం రంగు ఐషర్ వ్యానులో హైదరాబాద్‌కు బయలుదేరింది. పలు ఉగ్రవాద నేరాల్లో నిందితులుగా ఉన్న వికార్ గ్యాంగ్‌ను విచారణ నిమిత్తం నాంపల్లి ఏడో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. బస్సులో వికారుద్దీన్, సయ్యద్ అమ్జద్, ఇజార్ ఖాన్, మహమ్మద్ జకీర్, మహమ్మద్ హనీఫ్తోపాటు వీరికి బందోబస్తుగా డ్రైవర్ సహా 13 మంది ఏఆర్ పోలీసులు ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ మీదుగా వరంగల్ జిల్లా సరిహద్దు దాటి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాక 10.20 గంటల సమయంలో నల్లగొండ జిల్లా ఆలేరు మండలం టంగుటూరు శివారుకు చేరుకోగానే మూత్రవిసర్జన చేస్తామని ఉగ్రవాదులు చెప్పారు. దీంతో పోలీసులు బస్సును నిలిపి వారిని కిందకు దిగమన్నారు. ఇదే సమయంలో పోలీసులపై వారు తిరగబడ్డారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వికారుద్దీన్‌తో పాటు మిగతా నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. 10.30 గంటల సమయంలో ఐదుగురు ఉగ్రవాదులూ చనిపోయారు. ఈ ఘటనలో ఆర్ఎస్ఐ సోమన్న గాయపడినట్లు ఐజీ నవీన్ చంద్ వివరించారు. అందరి కళ్లు ఇక్కడే.. సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద నిరోధక బృందాల(ఏటీఎస్) అధికారులు టంగుటూరు ఎన్కౌంటర్ ప్రదేశానికి వచ్చారు. సెంట్రల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూ రో, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టైస్ట్ స్క్వాడ్ బృందాలు, ఫోరెన్సిక్ బృం దం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. పోలీసుల నుంచి వివరాలు సేకరించాయి. ఎన్కౌంటర్ జరిగిన వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. మృతదేహాలను జనగామ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించడంతో జాతీయ రహదారిపై కల్వర్టులను బాంబ్స్క్వాడ్లు ముందుగా తనిఖీ చేశాయి. భారీగా ట్రాఫిక్ జామ్ జాతీయ రహదారిపైనే ఎన్కౌంటర్ జరగడంతో కొన్ని గంటలపాటు వరంగల్-హైదరాబాద్ మధ్య రాకపోకలన్నీ ఆగిపోయాయి. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులకు తోడు సాధారణ జనం కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు హైదరాబాద్ మీదుగా వచ్చే వాహనాలను ఆలేరు వద్ద కొద్దిసేపు నిలిపివేశారు. ఎన్కౌంటర్ జరిగిన మూడు గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించింది. జనగామ-సిద్ధిపేట రహదారిని ఆనుకుని ఈ ఆసుపత్రి ఉంది. జనం భారీగా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు, అధికారులు, ఆస్పత్రికి వచ్చిపోయే రోగులతో ఆసుపత్రి ప్రాంగణం సాయంత్రం వరకు కిక్కిరిసిపోయింది. వ్యానులోనే మృతదేహాలు ఎన్‌కౌంటర్‌తో ఐదుగురి మృతదేహాలు వాహనంలోనే చెల్లాచెదురుగా పడ్డాయి. ముగ్గురు నిందితులు సీట్లలోనే కూర్చున్నట్లుగా ఉండగా.. ఇద్దరు సీట్ల మధ్యన కిందపడిపోయి ఉన్నారు. ఎస్కార్ట్ వాహనమంతా రక్తపు మడుగుగా మారిం ది. బస్సులోంచి రక్తం ధారగా కిందకు కారింది. వాహనం కింద నేల కూడా రక్తం తో తడిసిపోయింది. వాహనం నిలిపిన ప్రదేశంలో మూడు చోట్ల రక్తపు మరకలు కనిపించాయి. పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను జనగామ ప్రాంతీ య ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నల్లగొండ జిల్లా పరిధిలో ఉండటంతో పోస్టుమార్టం ఎక్కడ నిర్వహించాలనే విషయంలో పోలీసులు కొంత ఆలోచించారు. భువనగిరికి తీసుకెళ్లాలని మొదట భావించినప్పటికీ అది దూరం కావడంతో చివరకు జనగామకే మృతదేహాలను తరలించారు. అయితే అక్కడ కూ డా ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
కలకలం కలవరం
♦ ముచ్చెమటలు పట్టించిన తుపాకీ ♦ నందిగామ ఘటనపై వెంటాడిన సిమీ అనుమానాలు ♦ దోపిడీ దొంగలని ముగింపు నందిగామ జాతీయ రహదారిపై దోపిడీ ఘటన పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. కొద్ది రోజులుగా సిమీ ఉగ్రవాదులు విజయవాడ నగరానికి రాకపోకలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజా ఘటన ఖాకీలను కలవరపర్చింది. విజయవాడకు చెందిన వ్యక్తిని తుపాకీతో బెదిరించి దోచుకున్నట్టు తెలిసిన వెంటనే జాతీయ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వాహనాలను తనిఖీ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో దోపిడీ దొంగల పనే అని తేలడంతో కూల్ అయ్యారు. జిల్లాలో పెరుగుతున్న గన్‌కల్చర్, దోపిడీ దొంగల బీభత్సం పోలీసుల పనితీరుకు సవాల్ విసురుతున్నాయి. విజయవాడ సిటీ : జాతీయ రహదార్లను అడ్డాగా చేసుకొని దోపిడీ ముఠాలు తిరుగుతున్నాయా? ఒంటరి వ్యక్తులను కారులో ఎక్కించుకొని తుపాకులతో బెదిరించే కొత్త సంస్కృతికి తెరలేపారా? నందిగామ, రాజమండ్రిలో జరిగిన దోపిడీలను పరిశీలిస్తే ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఆయుధాలతో హైవే ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. అవకాశం ఉన్నచోట దోపిడీలకు తెగబడుతున్నాయి. నందిగామ సమీపంలోని హనుమంతునిపాడు సమీపంలో జరిగిన దోపిడీ కూడా ఇదే తరహాలో జరిగి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. విజయవాడకు చెందిన పప్పుల వ్యాపారి పులిపాటి సురేష్‌కుమార్‌ను నందిగామ సమీపంలోని హనుమంతునిపాడు వద్ద తుపాకీ చూపి బెదిరించిన వ్యక్తులు అతని ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి వెళ్లేందుకు కుమ్మరిపాలెం సెంటర్లో బస్సు కోసం వేచి చూస్తున్న సురేష్‌కుమార్‌ను ఏపీ 31క్యూ 3438 ఎరుపు రంగు ఇండికా కారులో వెళుతున్న వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. తాము సూర్యాపేట వరకు వెళుతున్నట్టు చెప్పడంతో సురేష్‌కుమార్ వారి కారెక్కగా హనుమంతునిపాడు వద్ద దోపిడీ జరిగింది. గత రాత్రి రాజమండ్రిలో ఓ వ్యక్తిని బెదిరించి నగలు దోచుకున్న వ్యక్తులు కూడా వీరేనని బాధితుని సమాచారం ఆధారంగా భావిస్తున్నారు. అక్కడ దోపిడీ చేసిన తర్వాత ఏలూరు లేదా రాజమండ్రిలో ఆదివారం రాత్రి షెల్టర్ తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం. ఒక్కరేనా... జరిగిన దోపిడీ ఒకే తరహాదైనప్పటికీ కారు రంగులు తేడా రావడం పోలీసులకు అంతుచిక్కడం లేదు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రిలో ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకొని బెదిరించిన ఆగంతకులు నగదు, నగలు దోపిడీ చేశారు. ఆగంతకులు తెలుపు రంగు కారులో వచ్చినట్టు అక్కడి పోలీసులకు బాధితుడు తెలిపాడు. ఇక్కడ ఎరుపు రంగు కారులో వచ్చి దోపిడీ చేశారు. దోపిడీ చేసిన విధానం, వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాష రెండు చోట్లా బాధితులు చెప్పేది ఒకే విధంగా ఉంది. అంటే అక్కడ దోపిడీ చేసిన వ్యక్తులే ఇక్కడ కూడా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ నేరం చేసిన తర్వాత కారు మార్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని బట్టి ముఠాలో ఎక్కువ మంది సభ్యులు ఉండొచ్చని తెలుస్తోంది. నందిగామ దోపిడీ నిందితులు తెలంగాణా జిల్లాలకు పరారై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ దిశగా అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో విశాఖ పోలీసుల సాయంతో కారు యజమానిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బాధితుడు చెపుతున్న కారు విశాఖ రవాణా శాఖ కార్యాలయంలో రశ్మిత పాత్రో అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. దీనిని బట్టి కారు ఉపయోగిస్తున్న వ్యక్తుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కల్చర్ దోపిడీల్లో గన్ కల్చర్ మొదలైంది. గతంలో జరిగిన దోపిడీలకు భిన్నంగా తుపాకీ చూపించి సొత్తు దోచుకునే ముఠాలు తయారయ్యాయి. గతంలో జాతీయ రహదార్లను అడ్డాగా చేసుకొని దోపిడీలు చేసిన ముఠాలు అనేకం ఉన్నాయి. నిర్జన ప్రదేశాల్లో వాహనాలను ఆపి దోచుకునేవారు. ఇందుకు భిన్నంగా కొత్త కల్చర్ రావడం పోలీసులను కలవరపరుస్తోంది. లిఫ్ట్ పేరిట నమ్మకంగా కారు ఎక్కించుకొని పిస్టల్ చూపి బెదిరించి దోపిడీలకు పాల్పడటం ఇటీవల కొత్తగా వెలుగులోకి వస్తోంది. గన్ చూపించి వ్యక్తుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రా ల్లో కారు చౌకగా నాటు తుపాకులు దొరుకుతున్నాయి. రూ.15వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చిస్తే ఆధునిక ఆయుధాలు, తూటాలు ఇస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మాఫియా, కిరాయి హంతక ముఠాలు ఈ తరహా ఆయుధాలు వాడుతున్నాయి. కొత్తగా దోపిడీ ముఠాలు వీటిని వినియోగించడం ఆందోళనకర పరిణామం. -
రెడ్ అలర్ట్
♦ జిల్లాలో ‘సిమి’ కదలికలపై నిఘా నేత్రం ♦ పోలీసుల ముమ్మర తనిఖీలు ♦ జీపీఆర్ సిస్టమ్ ద్వారా దర్యాప్తు కడప అర్బన్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సిమి ఉగ్రవాదుల కదలిక జిల్లాకు కూడా పాకిందని ఉన్నతాధికారుల ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు.. కడప నగరంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సిమి ఉగ్రవాది నెల్లూరు నుంచి జిల్లాలో ప్రవేశించాడని జీపీఆర్ సిస్టమ్ ద్వారా భావించారు. కడపలోని మాసాపేట సర్కిల్, దేవునికడప రోడ్డు, పెద్దదర్గా సమీపాల్లో సదరు సభ్యుని కదలికలు ఉన్నాయని అనుమానించారు. ప్రతి వాహనాన్ని కడప అర్బన్ పోలీసులు తనిఖీలు చేశారు. మరోవైపు మాసాపేట సర్కిల్ సమీపంలో ఓ వాహనం ఉండడంతో దానిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే, సదరు వాహనం ప్రొద్దుటూరుకు సంబంధించిన వ్యక్తిదిగా నిర్ధారించారు. తనిఖీల అనంతరం ఎవరూ పట్టుబడకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల్లో సదరు నిందితుడు కర్నూలు వైపు వెళ్లాడని సమాచారం రాగానే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో దోపిడీలకు పాల్పడిన ముఠా సభ్యుడని అనుమానం కడప నుంచి కర్నూలు వైపు బయలుదేరిన సదరు నిందితుడు నంద్యాల మీదుగా కర్నూలుకు చేరుకోగానే అక్కడి పోలీసులకు ముందస్తుగా జిల్లా సీసీఎస్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కొద్ది సమయంలోనే కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. విచారణ చేస్తే జిల్లాలోని వరుస దోపిడీలు, జువారీ, ఆర్టీపీపీలలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన ముఠాలోని ప్రధాన సభ్యుడిగా భావిస్తున్నారు. ఉగ్రవాది కదిలికలంటూ హల్చల్ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటికే ముగ్గురు పోలీసులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ క్రమంలో సిమి ఉగ్రవాదుల కదలిక జిల్లాలో ప్రధానంగా కడప నగరంలో ఉందని తెలియగానే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఉగ్రవాది కదలికలు నెల్లూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు మీదుగా వచ్చి మాసాపేట సర్కిల్, పెద్దదర్గా వరకు వెళ్లి.. మరలా మాసాపేట సర్కిల్ మీదుగా దేవునికడప మీదుగా బైపాస్‌రోడ్డుకు చేరుకుని తర్వాత కర్నూలు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఆయుధాలతోపాటు పటిష్ఠ బందోబస్తుతో వచ్చి వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా మొత్తం ఈ సమాచారంతో అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు రెండు రోజుల నుంచి సెమి ఉగ్రవాదుల కదలిక, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలంటూ పోలీసు అధికారులందరికీ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన సంఘటనల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు కూడా స్పెషల్ పార్టీ పోలీసుల సమన్వయంతో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. సిమి ఉగ్రవాదుల నైజం సిమి ఉగ్రవాదులు నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో పోలీసులపై ఉన్నట్లుండి కాల్పులు జరిపారని.. పోలీసులు పోరాడి అమర వీరులయ్యారని వారి గమనాన్ని కూడా ఉన్నతాధికారులు జిల్లా పోలీసులకు సూచించినట్లు సమాచారం. వారు దోపిడీలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలను సైతం నిర్దాక్షిణ్యంగా మట్టుబెడతారని, అలాగే పోలీసులు యూనిఫాంలో ఉన్నా లేక మఫ్టీలో ఉన్నా వారిని పసిగట్టి వెంటనే తమ దగ్గరున్న ఆయుధాలతో కాల్పులు జరుపుతారని చెప్పినట్లు విశ్వసనీయం సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అధికారులు జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఖాకీల చేతిలో ఆయుధం
♦ ‘సిమీ’ కీటకాలను కాలరాసేందుకు సిద్ధమవుతున్న సైన్యం ♦ నల్గొండ ఘటనతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం ♦ ఎస్సై స్థాయి నుంచి ప్రతి ఒక్కరికీ తుపాకీ తప్పనిసరి ♦ ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సాక్షి, విశాఖపట్నం : చేతిలో ఆయుధం లేకపోయినా ఉగ్ర మూకలకు ఎదురొడ్డి..పోరాడి ప్రాణాలు విడిచిన పోలీసు అమర వీరుల త్యాగం నిద్రాణంలో ఉన్న ఆ శాఖను మేల్కొలుపుతోంది. నష్టం జరిగిన తర్వాత ఎంతగా విచారించినా ఫలితం శూన్యం అని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ సత్తా ఏమిటో చూపిం చాలని నిర్ణయించారు. గుండె ధైర్యానికి ఆయుధాన్ని జోడిస్తున్నారు. మ్కుర మూ కల ఆట కట్టించేందేకు కదం తొక్కుతున్నారు. సిటీ పరిధిలో పోలీస్ కమిషనర్, ముగ్గురు డీసీపీలు, ముగ్గురు ఏడీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 17 స్టేషన్లు, ఒక్కో స్టేషన్‌కు ఇద్దరు ముగ్గురు ఎస్సైలు , వందలాది మంది కానిస్టేబుళ్లు నగరాన్ని నేరస్థుల నుంచి కాచుకుంటున్నారు. జిల్లా పరిధిలో ఎస్పీ,డీఎస్పీలు స్పెషన్ బ్రాంచ్, గ్రేహౌండ్స్ దళాలతో కలిసి నేరస్థులు, మావోయిస్టులను ఎదుర్కొంటున్నారు. అయినా జిల్లా,సిటీ పరిధిలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్థులు దర్జాగా తమ పనులు చక్కబెడుతూనే ఉన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ నేరాల స్వరూపం వేరుగా ఉంటుంది. హత్యలు, మానభంగాలు, రౌడీయిజం వంటివి నామమాత్రంగానే కనిపిస్తుంటాయి. కానీ వైట్ కాలర్ నేరాలు, రియల్ ఎస్టేట్ దందాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడే కొందరు ఖాకీలు వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఇదంతా కేవలం అంతర్గత సమస్య. కానీ సిమీ తీవ్రవాదుల వంటి ముష్కరులను ఎదుర్కోవడం సమిష్టి బాధ్యతగా పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నెల 8న పార్లమెంటరీ మీడియా లా సదస్సుకు విశాఖ వేదిక కానుంది. అనేక దేశాల ప్రతినిధులకు నగరం ఆతిధ్యమివ్వనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు వస్తున్నారు. ఈ నేపధ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇలాంటి సమయంలో సిమీ తీవ్రవాదుల కదలికలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా,సిటీ పరిధిలోని ఎస్సై స్థాయి నుంచి ఆ పైన అధికారులందరికీ తుపాకీలు తప్పనిసరి చేశారు. సోమవారం నుంచి వారికి ఆయుధాలు అందజేస్తున్నారు. మంగళవారం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు. తనిఖీల సమయంలో ఆయుధంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాల్సిందేనని చెప్పారు. అంతే కాకుండా రాత్రి గస్తీలో ఇవి తప్పనిసరి చేస్తూ సీపీ అమిత్‌గార్గ్ ఆదేశాలిచ్చారు. నగరంలో ఇప్పటికే విజువల్ పోలీసింగ్ ప్రారంభించి అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇంటిలిజెన్స్, నిఘా బృందాలను రంగంలోకి దింపారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ముమ్మరం చేశారు. అవసరమైతే ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నారు. -
ఎదురైతే... ఎదుర్కోగలమా?
సిమి ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అనుమానాలు హైదరాబాద్: పోలీసుల్నే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న సిమి ముఠాకు చెందిన ముగ్గురు రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుడుగట్టిన ఈ ముఠాను సాధారణ విధుల్లో ఉండే పోలీసులు తమ దగ్గరున్న ఆయుధాలతో ఎదుర్కోగలరా..? వీటిని వినియోగించే సామర్థ్యం సిబ్బందిలో ఎందరికుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పీ బలగాలు మినహా పోలీసుస్టేషన్లలో తాతల కాలం నాటి మస్కట్లు... తండ్రుల తరం నాటి .303లే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ప్రతి పోలీస్స్టేషన్లోనూ ఇన్స్పెక్టర్, ఎస్సైలతో పాటు దాదాపు 50 మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల దగ్గర పిస్టల్ ఉంటుంది. ఎస్సైల దగ్గర రివాల్వర్లు ఉంటున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా అనేకచోట్ల ఇవి కూడా అందరికీ అందుబాటులో లేవు. మరోపక్క పోలీసుస్టేషన్ మొత్తానికీ కలిసి 10 నుంచి 15 వరకు మాత్రమే మస్కట్లు, .303లు ఉంటాయి. మస్కట్‌తో ఒకసారికి ఒక తూటా (రౌండ్) మాత్రమే పేల్చే వీలుంది. మళ్లీ పేల్చాలంటే ఇంకో రౌండ్ అందులో లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక .303 విషయానికి వస్తే... ఏకకాలంలో 10 రౌండ్లు అందులో పెట్టే అవకాశం ఉన్నా... ఒక రౌండ్ పేల్చిన తరవాత లివర్ లాగి కాగ్ చేసి మరో రౌండ్ కాల్చాలి. ఎల్ఏఆర్ వ ంటి ఆటోమాటిక్, ఎస్ఎల్ఆర్ వంటి సెమీ ఆటో మేటిక్ ఆయుధాలు కేవలం బందోబస్తు, భద్రతా విధుల్లో ఉండే బలగాల వద్ద మినహా ఏ పోలీస్ స్టేషన్లోనూ కనిపించవు. ఇక అందుబాటులో ఉన్న కొద్దిపాటి గ్లోక్ పిస్టల్స్ కేవలం ఉన్నతాధికారుల దగ్గరే ఉంటున్నాయి. ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసుస్టేషన్లలో వినియోగిస్తున్న ఆయుధాలన్నీ కాలం చెల్లినవే. ఇతర పోలీసు విభాగాలు ఏనాడో మర్చిపోయిన .98 పిస్టల్, .38 రివాల్వర్, .303 రైఫిల్స్, 410 మస్కట్లను ప్రజలను రక్షించడానికి ‘పొదుపుగా’ కేటాయిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖుల రక్షణకు కేటాయించే గన్మెన్లకు మాత్రం అత్యాధునిక ఆయుధాలైన ఎస్ఎల్ఆర్, ఏకే-47, కార్బైన్లు ఇస్తున్నారు. పోలీసుల వద్ద ఆయుధాలు లేకపోవడం ఒక సమస్య అయితే... ఉన్న వాటిని పోలీసులు ఎంతవరకు సమర్థంగా వినియోగించగలరనేది సందేహం మరోవైపు ఉత్పన్నమవుతోంది. ఎప్పుడో శిక్షణ కాలంలో తప్ప ఆ తరవాత తుపాకీ పేల్చిన అధికారులు అరుదు. కేవలం ఏఆర్, ఏపీఎస్పీ బలగాలకే ఫైరింగ్ ప్రాక్టీసు ఉంటోంది. సాధారణ పోలీసులకూ గతంలో నిర్వహించే యాన్యువల్ ఫైరింగ్స్ని పోలీసులు ఇప్పుడు మర్చిపోయారు. ఓ జిల్లా ఎస్పీనో, కమిషనరేట్లకు చెందిన కమిషనరో తమ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయిద్దామనుకున్నా ఆ స్థాయిలో తూటాల సరఫరా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆయుధం అలంకార ప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘దాడులు జరగకుండా చూడాలి’ హైదరాబాద్: అత్యాధునిక ఆయుధాలు పోలీసుల వద్ద లేకపోవడం, వారి భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం ఈ ‘ఉగ్ర’దాడి ఘటనలో స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ సీపీఎం కమిటీ పేర్కొంది. భవిష్యత్‌లోనైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది. -
విషమంగానే ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్యం
వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస కామినేని ఆస్పత్రిలో సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్: సిమి ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూర్(ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యానికి ఆయన శరీరం ఏమాత్రం సహకరించట్లేదని, మెదడు పనితీరులో ఎలాంటి పురోగతి లేదని గత మూడు రోజులుగా ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందం స్పష్టం చేసింది. మరో రెండు రోజులు గడిస్తేకానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉదయం మెడికల్ బులెటన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు వివరించింది. మెదడులోని బుల్లెట్‌ను ముట్టుకుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదమని, ప్రస్తుత పరిస్థితుల్లో దాని జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక మరోసారి శస్త్రచికిత్స చేసి పొత్తికడుపు, చిన్నమెదడులో ఉన్న బుల్లెట్లను తొలగించనున్నట్లు తెలిపింది. మరోవైపు సిద్ధయ్యను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఎంత ఖర్చైనా భరించి సిద్ధయ్య ప్రాణాలను కాపాడతామని సిద్ధయ్య సోదరుడు దస్తగిరికి హామీ ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి ఉత్తమ వైద్య నిపుణులను రప్పించడమో లేదా మెరుగైన వైద్యం కోసం మరెక్కడికైనా తరలించడమో చేస్తామన్నారు. సీఎం వెంట ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఉన్నారు. కాగా, కేసీఆర్ రాకకు ముందే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆస్పత్రికి చేరుకొని ఎస్ఐ సిద్ధయ్యను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు, ఇతర బంధువులను ఓదార్చారు. జగన్ వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి ఇదే ఆస్పత్రిలో చేరిన రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో వైద్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: టీ టీడీపీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో మృతి చెందిన పోలీసులకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుతో కలసి కామినేని ఆస్పత్రిలో ఎస్ఐ సిద్ధయ్యను పరామర్శించిన అనంతరం ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు తెలంగాణ పౌరుషాన్ని చూపారన్నారు. ఎంత ఖర్చు అయినా భరిస్తాం హోంమంత్రి నాయిని ఎస్ఐ సిద్ధయ్యను బతికించుకునేందుకు ఎంత ఖర్చైనా భరిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం కామినేని ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిద్ధయ్యకు చికిత్స అందించేందుకు దేశ, విదేశాల్లోని వైద్యులను రప్పించేందుకూ సిద్ధమన్నారు. ముష్కరులను తొలుత దోపిడీ దొంగలుగా భావించామని, అనంతర పరిణామాల దృష్ట్యా వారు ఉగ్రవాదులని తేల్చామన్నారు. ఎన్కౌంటర్లో మృతులైన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. -
లక్నో దోపిడీలో ‘జానకీపురం’ మృతులు?
లక్నో: సంచలనం సృష్టించిన లక్నో ఏటీఎం దోపిడీలో నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మరణించిన సిమి తీవ్రవాదుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఆ దోపిడీలో.. ఏటీఎంలో నగదు నింపుతున్నప్పుడు వచ్చిన దుండగులు భద్రతా సిబ్బందిలో ముగ్గుర్ని అత్యంత సమీపంనుంచి కాల్చేసి రూ. 50 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని సోమవారం నల్లగొండకు పంపిస్తున్నామని లక్నో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ యశస్వి యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎనిమిది సంఘటనలతో పాటు అనేక దోపిడీల్లో మరణించిన తీవ్రవాదుల హస్తం ఉందని తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారని తెలిపారు. -
ఉగ్రవాది మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి
నల్గొండ:జిల్లాలో జరిగిన పో్లీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఎండీ ఎజాజ్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందకు తండ్రి అజీజుద్దీన్ నల్గొండకు చేరుకున్నాడు. సోమవారం మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి వచ్చిన అజీజూద్దీన్ నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకున్నాడు. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు దుండగులను మధ్య ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.. ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. -
‘సిమి’ కీటకాలే
-
రామన్నపేట పోలీసులకు హ్యాట్సాఫ్
రామన్నపేట: దేశవ్యాప్తంగా పలు నేరాలకు పాల్పడి జిల్లాలో వరుసగా ముగ్గురు పోలీసులను పొట్టనపెట్టుకున్న సిమి తీవ్రవాదులు మహ్మద్ ఎజాజ్, అస్లాం ఆయూబ్‌లను మట్టుపెట్టిన ఘనత రామన్నపేట పోలీసులకే దక్కింది. శుక్రవారం అర్ధరాత్రి పొద్దుపోయే దాక వెహికల్ చెకింగ్ నిర్వహించిన సీఐ ఎ.బాలగంగిరెడ్డి శనివారం ఉదయం మోత్కూర్, అర్వపల్లి పరిసరాల్లో ముష్కరులు సంచరిస్తున్నారని సమాచారం తెలుసుకొని గన్‌మెన్ జానకిరామ్‌తోపాటు, రామన్నపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన బి.వెంకటేశ్వర్లు, ఎన్.నిరంజన్ అనే కానిస్టేబుళ్లను వెంట తీసుకొని ప్రైవేటు వాహనంలో డ్రైవర్ శ్రీనుతో కలిసి మోత్కూరు బయలుదేరారు. మోత్కూరు మండలం జానకీపురం శివారులో ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ముష్కరులు సీఐపై కాల్పులకు తెగబడగా ఆయన వాహనంలోనే ఉన్న గన్‌మెన్ జానకిరామ్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, నిరంజన్ అగంతకులపై బుల్లెట్ల వర్షం కురిపించి మట్టుపెట్టారు. ఆ క్షణంలో వారు సమయస్ఫూర్తిని ప్రదర్శించనట్లయితే ఇంకా ప్రాణనష్టం జరిగేదని తెలుస్తుంది. ముష్కరులను మట్టుపెట్టింది రామన్నపేట పోలీసులేనని తెలుసుకొని స్థానికులు అభినందించారు. -
నల్లగొండకు ‘నలుగురు’
సూర్యాపేటలో బస్సు దిగింది ఇద్దరు కాదు.. ముగ్గురు పోలీసులు అనుమానించకపోవడంతో జారుకున్న మూడో వ్యక్తి సీసీ టీవీ ఫుటేజీలో తేలిన వైనం.. ఇద్దరు దుండగుల నుంచి ల్యాప్‌టాప్ తీసుకెళ్లినట్లు అనుమానం కూంబింగ్‌లో దొరికిన బ్యాగ్.. మూడు సెల్ఫోన్లు లభ్యం! సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఐబీ బృందం సాక్షి ప్రత్యేక ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్కౌంటర్ ఘటనలకు మధ్య కాలంలో నల్లగొండ జిల్లాలోకి నలుగురు దుండగులు ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట బస్టాండ్‌లో బస్సులో నుంచి దిగింది ఇద్దరు కాదని, ముగ్గురని పోలీసులంటున్నారు. ఈ విషయం సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా తేలిందని చెబుతున్నారు. పోలీసులు ఇద్దరినే అనుమానించి కిందకు దింపడంతో మూడో వ్యక్తి చడీచప్పుడు చేయకుండా బస్టాండ్ నుంచి బయటకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. సీఐ మొగిలయ్య బృందంపై కాల్పులు జరిపిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న హైదరాబాద్ స్టాప్ నుంచి అతను బయటకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు దుండగులతో అతను కలవలేదని దర్యాప్తులో తేలుతోంది. ముగ్గురు సిమీ ఉగ్రవాదులు తెలంగాణలో ప్రవేశించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవలే పోలీసులను హెచ్చరించడం కూడా ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. మరోవైపు ఈ ముగ్గురికి తోడు ఇంకో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చినట్లు ఎన్కౌంటర్ స్థలంలో లభించిన రైల్వే టికెట్ ద్వారా తెలుస్తోంది. అంటే మొత్తం నలుగురు వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించారన్నమాట! అందులో ఇద్దరు ఎన్కౌంటర్లో హతమవగా, మరో ఇద్దరు ఎక్కడున్నారనేది అంతుపట్టడం లేదు. వెలుగులోకి అనేక విషయాలు ఈ ఎన్కౌంటర్లో హతమైన దుండగులకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఘటనపై పలు దర్యాప్తు సంస్థల విచారణలో ఈ వివరాలు బయటపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సూర్యాపేట కాల్పుల సందర్భంగా పోలీసుల నుంచి ఎత్తుకెళ్లిన కార్బైన్ నుంచి దుండగులు 19 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. బస్టాండ్ ఘటన తర్వాత నాలుగు సార్లు కాల్పులు జరిగాయి. బస్టాండ్ బయట ఓ కారుపై, ఆ తర్వాత అర్వపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ వద్ద తుంగతుర్తి సీఐపై, ఆ తర్వాత జానకీపురం సమీపంలోని ఇసుక దిబ్బల్లో స్థానికులు, పోలీసులపై.. చివరిగా, ఎన్కౌంటర్ స్పాట్లో కాల్పులు జరిపారు. ఈ నాలుగుసార్లు తమ వద్ద ఉన్న తుపాకులతో పాటు కార్బైన్ నుంచి కూడా 19 రౌండ్లు కాల్చారంటే వారు ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారో అర్థమవుతోంది. బైక్ నడుపుతున్న దుండగుడి నడుము చుట్టూ ప్రత్యేక పౌచ్ ఉందని, అందులో దాదాపు 30 రౌండ్ల బుల్లెట్లున్నాయని సమాచారం. కాగా, సూర్యాపేట బస్టాండ్‌లో లభించిన ఒడిశా రాష్ట్ర గుర్తింపు కార్డుపై కూడా పలు వాదనలు వినిపిస్తున్నాయి. వీరు గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా అడవుల్లో జరిగిన ఉగ్రవాద శిక్షణ శిబిరానికి హాజరయ్యారని, అప్పుడే ఆ రాష్ట్రంలో ఈ కార్డు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల నుంచి పర్సులు కొట్టేస్తుంటారని, వాటిలో లభించే గుర్తింపు కార్డులను అవసరం మేరకు ఉపయోగించుకుంటారని కూడా భావిస్తున్నారు. కాగా, దుండగులకు చెందిన ఓ బ్యాగ్ దొరికినట్లు సమాచారం. అయితే, ఇది ఘటనా స్థలంలో కాకుండా కూంబింగ్ జరుపుతున్నప్పుడు దొరికినట్లు తెలుస్తోంది. అందులో మూడు సెల్ఫోన్లు లభ్యమయ్యాయని, వాటిలోని సమాచారాన్ని ఐబీ అధికారులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అయితే, బ్యాగ్‌లో కొన్ని వస్తువులు మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సూర్యాపేట బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో లభించిన దృశ్యాల ప్రకారం బస్సు దిగుతున్నప్పుడు దుండగుల్లో ఒకడు పెద్ద బ్యాగును తీసుకెళ్లాడు. అందులో ల్యాప్‌టాప్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ను మహారాష్ట్రలోని పూణెలో కొనుగోలు చేసినట్టు సమాచారం. కానీ, కూంబింగ్‌లో దొరికిన బ్యాగ్‌లో మాత్రం ల్యాప్‌టాప్ లేకపోవడం గమనార్హం. ఈ ల్యాప్‌టాప్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చేసి పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు రివార్డులు
భువనగిరి: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో పాల్గొన్న భువనగిరి డివిజన్ పోలీస్ బృందానికి ఎస్పీ ప్రభాకర్‌రావు రివార్డులను అందజేశారు. శనివారం జరిగిన ఎన్కౌంటర్లో దుండగులను హతం చేసిన సంగతి తెలిసిందే. భువనగిరి డీఎస్పీ ఎస్. మోహన్‌రెడ్డికి రూ.15 వేలు, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి రూ.10 వేలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ఇచ్చారు. భువనగిరి డీఎస్పీ కార్యాలయంలో ఎన్కౌంటర్లో పాల్గొన్న వారందరితో ఎస్పీ సమావేశమై సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
తీవ్రవాదులకు తెలంగాణ స్థావరం కాకూడదు
ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సూచన సాక్షి, హైదరాబాద్: పదే పదే బంగారు తెలంగాణ కోసం మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బంగారు తెలంగాణ తీవ్రవాదులకు, దోపిడీ దొంగలకు, అరాచక శక్తులకు స్థావరం కాకుండా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ సూచించారు. ఆదివారం ఆయన లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పేరుతో ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు చేసేకన్నా.. ప్రజల మాన, ప్రాణాలను అనుక్షణం కాపాడే హోంశాఖకు అధిక నిధులు కేటాయించి పోలీసు శాఖను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయపడ్డ పోలీసులకు అవసరమైతే బయటి నుంచి వైద్యనిపుణులను రప్పించి ప్రాణాలు కాపాడాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్‌కు అధునాతన ఆయుధాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సమకూర్చాలన్నారు. తెలంగాణ సత్తా, పౌరుషాన్ని చాటిన పోలీసులు వెంకటేశ్వర్లు, మధు, రమేశ్‌లకు తక్షణమే అవార్డులు ప్రకటించి, ప్రమోషన్‌ను ఇవ్వాలని సూచించారు. -
కాల్పులపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో జరిగిన వరుస సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు చూపించిన ధైర్యం గొప్పదని, వారికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులను, ఉగ్రవాద సంస్థలను నియంత్రించడానికి పోలీసుల్లో మరింత స్థైర్యాన్ని పెంచాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ముడిపడి ఉన్న ఈ సంఘటనలపై లోతుగా విచారణ జరగాలన్నారు. ఇందుకు జాతీయ పరిశోధనా సంస్థకు రాష్ట్ర పోలీసులు సహకరించాలని సూచించారు. ఘటనలో సిమి ఉగ్రవాదులు ఉన్నట్టు తేలినా రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ‘సిమి’ ముష్కరుల దాడిలో అసువులు బాసిన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజుల కుటుంబాలకు చెరో రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పదవీకాలం ముగిసే వరకు కానిస్టేబుళ్లకు రావాల్సిన జీతభత్యాలను వారి కుటుంబ సభ్యులకు చెల్లిస్తామన్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. అలాగే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. -
కేసీఆర్ సారూ.. జర పరామర్శించరూ!
మృతుల కుటుంబాలకు లభించని సీఎం పరామర్శ సాక్షి, హైదరాబాద్: ‘సిమి’ ఉగ్రవాదులు నల్లగొండ జిల్లాలో సృష్టించిన మారణహోమంలో అసువులు బాసిన పోలీసు కుటుం బాలతోపాటు గాయపడ్డ పోలీసులకు ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ పరామర్శ లభించలేదు. ముష్కరుల తూటాలకు బలైన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేశ్లతోపాటు క్షతగాత్రు లను పరామర్శించేందుకు విపక్ష పార్టీల నేతలంతా కదిలి వచ్చినా ప్రభుత్వంలోని ‘ముఖ్య’నేతలు రాకపోవడంపై పోలీ సులు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తీవ్రవాద దాడులు జరిగినప్పుడు సీఎంలే స్వయంగా బాధిత పోలీసు కుటుంబాలను పరామర్శించేవారు. కాగా, ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి మాత్రమే ఆదివారం కామినేని ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. -
‘సిమి’ కీటకాలే
ఎన్కౌంటర్ దుండగులను మధ్యప్రదేశ్‌కు చెందిన సిమి ఉగ్రవాదులుగా నిర్ధారించిన పోలీసులు మృతులు అబు ఫైజల్ ముఠాలోని ఎజాజుద్దీన్, అస్లం మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో ధ్రువీకరణ ఖాండ్వా జైలు నుంచి పరారైన ఆరుగురిలో వీరు సభ్యులు పలు రాష్ట్రాల్లో పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలు సాక్షి, హైదరాబాద్: ముష్కర మూక గుట్టు వీడింది. అనుమానించినట్లే దుండగులు నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాదులని తేలింది. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు దుండగులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించారు. ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ముష్కరుల కాల్పులకు ముగ్గురు పోలీసులు బలి కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన తీరు, ఇతర అంశాలను బట్టి దుండగులు ఎవరన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసుల సాయంతో వారిని సిమి ఉగ్రవాదులుగా ఆదివారం నిర్ధారించారు. దుండగులను మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కారేలీకి చెందిన ఎండీ ఎజాజుద్దీన్(తండ్రి పేరు అజీజుద్దీన్), అదే రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లా గణేష్ తలాయ్కు చెందిన ఎండీ అస్లామ్ అలియాస్ బిలాల్(తండ్రి పేరు అయూబ్)గా ధ్రువీకరించినట్లు డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చిన ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్‌ను విశ్లేషించిన తర్వాతే ముష్కరుల గుర్తింపుపై రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా స్పందించడం గమనార్హం. పోలీసులంటే పగ..! అబు ఫైజల్ ఉగ్రమూకకు పోలీసులంటే పగ. ముంబైకి చెందిన అబు ఫైజల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హోమియోపతి వైద్యం చదువుకున్నాడు. అదే రాష్ట్రంలోని ఖాండ్వాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఖాండ్వా జిల్లాలో సిమి కదలికలను పసిగట్టిన స్థానిక ఉగ్రవాద నిరోధక విభాగం(ఏటీఎస్) అబు ఫైజల్ భార్య, మరదలితోపాటు పలువురిని అరెస్టు చేసింది. అప్పటికే సిమి కార్యకలాపాలకు ఆకర్షితుడైన ఫైజల్ ఈ అరెస్ట్‌లతో పోలీసులపై పగ పెంచుకున్నాడు. జానకీపురం ఎన్కౌంటర్లో మృతిచెందిన ఎజాజుద్దీన్, అస్లాంతో పాటు మధ్యప్రదేశ్‌కే చెందిన మహబూబ్, అంజాద్, జాకీర్ హుస్సేన్‌తో కలిసి ఉగ్రమూకగా ఏర్పడ్డాడు. ఉగ్రవాదుల ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసిన ఖాండ్వా ఏటీఎస్ కానిస్టేబుల్ సీతారాం యాదవ్‌ను లక్ష్యం చేసుకున్న ఈ ముఠా 2009 నవంబర్‌లో ఆయన్ను హతమార్చింది. పోలీసులపై తీవ్ర స్థాయిలో పగ ఉండడం వల్లే తాజాగా రాష్ర్టంలోనూ పోలీసులు తారసపడగానే ఆ ముఠా సభ్యులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తప్పిన భారీ ముప్పు! ఖాండ్వా ఏటీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో గతంలో అరెస్టయిన ఈ ఉగ్రమూక 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు గోడ దూకి తప్పించుకుంది. తర్వాత రెండు నెలలకే ముఠా నేత అబు ఫైజల్ పోలీసులకు చిక్కాడు. మిగిలిన ఐదుగురు ఉగ్రవాదులు మాత్రం అప్పటి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కూడా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఈ ముఠా సభ్యులు ఉన్నారు. విచ్చలవిడి నేరప్రవృత్తితో కరుడుగట్టిన ఈ ఉగ్రవాదులు పలు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. 2009 నుంచి ఇప్పటివరకు తమిళనాడు, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా 11 బ్యాంకులను దోచుకున్నారు. ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించేవారని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్రోహ చర్యకో లేక బ్యాంకు దోపిడీకో పథక రచన చేసుకుని హైదరాబాద్‌కు వచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం అమలులో భాగంగా ఎజాజుద్దీన్, అస్లామ్.. విజయవాడకు వెళ్తూ గత బుధవారం రాత్రి సూర్యాపేట బస్టాండ్‌లో స్థానిక పోలీసులకు తారసపడ్డారని, చివరకు వారి ఎన్‌కౌంటర్‌తో భారీ ముప్పు తప్పిందని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ ముఠాలోని మిగిలిన ఉగ్రవాదులు మహబూబ్, అంజాద్, జాకీర్ హుస్సేన్ కదలికలపై మాత్రం నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఎన్కౌంటర్ పై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు
నల్లగొండ: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), యాంటీ టైరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జానకీపురం గ్రామానికి చెందిన కొందరిని విచారించారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముంబైకి చెందిన ఏటీఎస్ టీం జానకీపురం వెళ్లింది. వారి వెంట జిల్లాకు చెందిన ఒక సీఐ, ఎస్ఐతో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ కూడా ఉన్నారు. సాయంత్రం సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు కూడా తమ దర్యాప్తునకు అవసరమైన వివరాలను సేకరించి వెళ్లారు. మరోవైపు ఘటనాస్థలానికి మధ్యప్రదేశ్, కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు కూడా వచ్చి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి పరారైన దుండగులు వీరేనన్న సమాచారంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. మరోవైపు కర్ణాటకలో విధ్వంసం సృష్టించటానికి ప్రణాళికలు రూపొందించిన ముఠా సభ్యులు వీరేనన్న కోణంలో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మన రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాగా, దుండగుల మృతదేహాలను ఉంచిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి వద్దకు కూడా ఏటీఎస్ బృందాలు వచ్చి వెళ్లాయి. అత్యంత గోప్యంగా అధికారులు ఆసుపత్రిలోనికి వెళ్లి తమకు అవసరమైన సమాచారం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ శాంతిభద్రతల అదనపు డీజీ సుధీర్‌లాక్టాకియా, ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకరరావులు కూడా దుండగుల మృతదేహాలను పరిశీలించి వెళ్లినట్టు తెలుస్తోంది. విస్తృత కూంబింగ్.. కాగా, అసలు ఈ దుండగులు ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఆక్టోపస్ పోలీసులతో కలిసి దాదాపు 150 మంది వరకు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా నిందితులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి గుట్టల్లో పెద్ద ఎత్తున గాలింపులు జరిపారు. కాగా, ఆదివారం ఉదయం సమయంలో మరోసారి జిల్లాలో వదంతులు వ్యాపించాయి. తుంగతుర్తి మండలంలోని కుక్కడం గ్రామంలో మరో దుండగుడు స్థానికులకు తారసపడ్డాడని పుకార్లు రావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, పోలీసులు నాగారం, అర్వపల్లి గుట్టల్లో కూంబింగ్ నిర్వహించిన తర్వాత అలాంటిదేమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
సిమి ఉగ్రవాదుల అరాచకాల చిట్టా!
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరు సిమి ఉగ్రవాదులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్లు దేశంలో పలు ప్రాంతాలలో అనేక అరాచకాలకు పాల్పడ్డారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వీరు 2009లో మధ్యప్రదేశ్‌లోని సాత్నా జైలర్ సంజయ్ పాండేపై హత్యాయత్నం చేశారు. 2009లో తీవ్రవాద నిరోధక దళంలో పని చేస్తున్న సీతారామ్ నాయక్ అనే కానిస్టేబుల్ని హత్య చేశారు. 2009 జనవరిలో బీజేపీ నేత ప్రమోద్ తివారీపై కాల్పులు జరిపారు. అదే సంవత్సరం విజయ్ ముండీ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో 9 లక్షల 50 వేల రూపాయలు దోపిడీ చేశారు. దేవాస్‌లోని నర్మదా గ్రామీణ బ్యాంకులో లక్షా 50 వేల రూపాయలు దోపిడీ చేశారు. 2010లో రత్నాం జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్‌లో రెండు లక్షల రూపాయలు దొంగిలించారు. 2010 మార్చిలో ఇటార్సీలో కెనారా బ్యాంకులో దోపిడీ చేశారు. 2010 సెప్టెంబరులో భోపాల్‌లో మణప్పురం బ్యాంకు బ్రాంచ్‌లోకి ప్రవేశించి ఒక వ్యక్తి నుంచి పది తులాల బంగారం దోచుకెళ్లారు. -
దుండగుల వివరాలు బట్టబయలు!
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరూ సిమి కార్యకర్తలుగా నిర్ధారణ అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో మృతదేహాలను మధ్యప్రదేశ్ ఏటీఎస్ పో్లీసులు పరిశీలించారు. వారు మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుంచి పరారైన సిమి కార్యకర్తల వేలిముద్రలను తీసుకువచ్చారు. మృతదేహాలను పరిశీలించి, ఆ వేలి ముద్రలతో పోల్చి చూసి వారిని అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా నిర్ధారించారు. యూపీకి చెందిన ఈ ఇద్దరూ ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. వీరు 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 2010లో భో్పాల్లోని ఓ బంగారు దుకాణంలో వీరు చోరీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు చోరీకి పాల్పడింది కూడా వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం 2013 అక్టోబరు 1న ఖండ్వా జైలు నుంచి ఆరుగురు తప్పించుకొని పారిపోయారు. వారిలో అయిదుగురు సిమి కార్యకర్తలు కాగా, ఒకరు స్థానిక నేరస్థుడు. వారు ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు వెంటిలేటర్ విరగగొట్టి బ్యారెక్ నుంచి బయటకు వచ్చారు. దుప్పట్లను తాడులా పేని 16 అడుగుల గోడను ఎక్కి, కిందకు దిగి పారిపోయారు. అయోధ్య రామమందిరం కేసు తీర్పు ఇచ్చిన అలహాబాద్ బెంచ్‌లో ముగ్గురు జడ్జిలను హత్య చేయాలని అప్పట్లో వారు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఆ కుట్రను అమలు చేయడానికి వారు రెండు నెలలు రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. వారు తమ పని పూర్తి చేసుకోవడానికి స్థానికంగా ఉన్న మరో సిమి కార్యకర్త సహాయం కోరినట్లు తెలుస్తోంది. ఇదే ప్రయత్నంలో వారు 2011 జూన్‌లో అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి పారిపోయినవారిలో అబిద్ మీర్జా, అస్లాం అయూబ్, అబు ఫైసల్, షేక్ మహబూబ్, మహ్మద్ ఇజాజుద్దీన్, జాకీర్ బాదల్ ఉన్నారు. పరారైన కొన్ని గంటలకే అబిద్ మీర్జాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబరు 24న అబు ఫైసల్‌ను బర్వానీలో పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి అస్లాం అయూబ్, మహ్మద్ ఇజాజుద్దీన్, జకీర్ బాదల్ పరారీలో ఉన్నారు. 2009 నవంబరు 11 ఏటీఎస్ కానిస్టేబుల్ని హత్య చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.బోఫాల్‌లో రెండు బ్యాంకులలో చోరీ చేసి, ఆ సొమ్ముని తీవ్రవాద కార్యకలాపాలకు వాడినట్లు వారిపై కేసులు ఉన్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో మృతి చెందిన ఇద్దరూ 2010 నవంబరులో లక్నోలో ఉన్నట్లు తెలుస్తోంది. దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మరో ఉగ్రవాది నల్లొండ జిల్లాలోనే తిరుగుతున్నట్లు పో్లీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం తెలంగాణ పోలీసులతోపాటు మహారాష్ట్ర పోలీసులు కూడా వెతుకుతున్నారు. -
ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హై అలర్ట్
-
ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హై అలర్ట్
నెల్లూరు: సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు బుధవారం హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ , తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు ఇప్పటికే తడ పోలీసులకు పంపించారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టి... అక్కడ పని చేస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.