
ఉగ్రవాది మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి
నల్గొండ:జిల్లాలో జరిగిన పో్లీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఎండీ ఎజాజ్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందకు తండ్రి అజీజుద్దీన్ నల్గొండకు చేరుకున్నాడు. సోమవారం మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి వచ్చిన అజీజూద్దీన్ నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకున్నాడు.
జానకీపురం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు దుండగులను మధ్య ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.. ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారు.