భువనగిరి: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భువనగిరి డివిజన్ పోలీస్ బృందానికి ఎస్పీ ప్రభాకర్‌రావు రివార్డులను అందజేశారు. శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దుండగులను హతం చేసిన సంగతి తెలిసిందే. భువనగిరి డీఎస్పీ ఎస్. మోహన్‌రెడ్డికి రూ.15 వేలు, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి రూ.10 వేలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ఇచ్చారు.
భువనగిరి డీఎస్పీ కార్యాలయంలో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారందరితో ఎస్పీ సమావేశమై సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.