aslam ayub
-
ఉగ్రవాది మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి
నల్గొండ:జిల్లాలో జరిగిన పో్లీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఎండీ ఎజాజ్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందకు తండ్రి అజీజుద్దీన్ నల్గొండకు చేరుకున్నాడు. సోమవారం మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి వచ్చిన అజీజూద్దీన్ నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకున్నాడు. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు దుండగులను మధ్య ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.. ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. -
‘సిమి’ కీటకాలే
-
ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు రివార్డులు
భువనగిరి: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో పాల్గొన్న భువనగిరి డివిజన్ పోలీస్ బృందానికి ఎస్పీ ప్రభాకర్‌రావు రివార్డులను అందజేశారు. శనివారం జరిగిన ఎన్కౌంటర్లో దుండగులను హతం చేసిన సంగతి తెలిసిందే. భువనగిరి డీఎస్పీ ఎస్. మోహన్‌రెడ్డికి రూ.15 వేలు, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి రూ.10 వేలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ఇచ్చారు. భువనగిరి డీఎస్పీ కార్యాలయంలో ఎన్కౌంటర్లో పాల్గొన్న వారందరితో ఎస్పీ సమావేశమై సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
‘సిమి’ కీటకాలే
ఎన్కౌంటర్ దుండగులను మధ్యప్రదేశ్‌కు చెందిన సిమి ఉగ్రవాదులుగా నిర్ధారించిన పోలీసులు మృతులు అబు ఫైజల్ ముఠాలోని ఎజాజుద్దీన్, అస్లం మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో ధ్రువీకరణ ఖాండ్వా జైలు నుంచి పరారైన ఆరుగురిలో వీరు సభ్యులు పలు రాష్ట్రాల్లో పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలు సాక్షి, హైదరాబాద్: ముష్కర మూక గుట్టు వీడింది. అనుమానించినట్లే దుండగులు నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాదులని తేలింది. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు దుండగులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించారు. ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ముష్కరుల కాల్పులకు ముగ్గురు పోలీసులు బలి కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన తీరు, ఇతర అంశాలను బట్టి దుండగులు ఎవరన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసుల సాయంతో వారిని సిమి ఉగ్రవాదులుగా ఆదివారం నిర్ధారించారు. దుండగులను మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కారేలీకి చెందిన ఎండీ ఎజాజుద్దీన్(తండ్రి పేరు అజీజుద్దీన్), అదే రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లా గణేష్ తలాయ్కు చెందిన ఎండీ అస్లామ్ అలియాస్ బిలాల్(తండ్రి పేరు అయూబ్)గా ధ్రువీకరించినట్లు డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చిన ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్‌ను విశ్లేషించిన తర్వాతే ముష్కరుల గుర్తింపుపై రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా స్పందించడం గమనార్హం. పోలీసులంటే పగ..! అబు ఫైజల్ ఉగ్రమూకకు పోలీసులంటే పగ. ముంబైకి చెందిన అబు ఫైజల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హోమియోపతి వైద్యం చదువుకున్నాడు. అదే రాష్ట్రంలోని ఖాండ్వాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఖాండ్వా జిల్లాలో సిమి కదలికలను పసిగట్టిన స్థానిక ఉగ్రవాద నిరోధక విభాగం(ఏటీఎస్) అబు ఫైజల్ భార్య, మరదలితోపాటు పలువురిని అరెస్టు చేసింది. అప్పటికే సిమి కార్యకలాపాలకు ఆకర్షితుడైన ఫైజల్ ఈ అరెస్ట్‌లతో పోలీసులపై పగ పెంచుకున్నాడు. జానకీపురం ఎన్కౌంటర్లో మృతిచెందిన ఎజాజుద్దీన్, అస్లాంతో పాటు మధ్యప్రదేశ్‌కే చెందిన మహబూబ్, అంజాద్, జాకీర్ హుస్సేన్‌తో కలిసి ఉగ్రమూకగా ఏర్పడ్డాడు. ఉగ్రవాదుల ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసిన ఖాండ్వా ఏటీఎస్ కానిస్టేబుల్ సీతారాం యాదవ్‌ను లక్ష్యం చేసుకున్న ఈ ముఠా 2009 నవంబర్‌లో ఆయన్ను హతమార్చింది. పోలీసులపై తీవ్ర స్థాయిలో పగ ఉండడం వల్లే తాజాగా రాష్ర్టంలోనూ పోలీసులు తారసపడగానే ఆ ముఠా సభ్యులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తప్పిన భారీ ముప్పు! ఖాండ్వా ఏటీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో గతంలో అరెస్టయిన ఈ ఉగ్రమూక 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు గోడ దూకి తప్పించుకుంది. తర్వాత రెండు నెలలకే ముఠా నేత అబు ఫైజల్ పోలీసులకు చిక్కాడు. మిగిలిన ఐదుగురు ఉగ్రవాదులు మాత్రం అప్పటి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కూడా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఈ ముఠా సభ్యులు ఉన్నారు. విచ్చలవిడి నేరప్రవృత్తితో కరుడుగట్టిన ఈ ఉగ్రవాదులు పలు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. 2009 నుంచి ఇప్పటివరకు తమిళనాడు, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా 11 బ్యాంకులను దోచుకున్నారు. ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించేవారని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్రోహ చర్యకో లేక బ్యాంకు దోపిడీకో పథక రచన చేసుకుని హైదరాబాద్‌కు వచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం అమలులో భాగంగా ఎజాజుద్దీన్, అస్లామ్.. విజయవాడకు వెళ్తూ గత బుధవారం రాత్రి సూర్యాపేట బస్టాండ్‌లో స్థానిక పోలీసులకు తారసపడ్డారని, చివరకు వారి ఎన్‌కౌంటర్‌తో భారీ ముప్పు తప్పిందని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ ముఠాలోని మిగిలిన ఉగ్రవాదులు మహబూబ్, అంజాద్, జాకీర్ హుస్సేన్ కదలికలపై మాత్రం నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఎన్కౌంటర్ పై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు
నల్లగొండ: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), యాంటీ టైరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జానకీపురం గ్రామానికి చెందిన కొందరిని విచారించారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముంబైకి చెందిన ఏటీఎస్ టీం జానకీపురం వెళ్లింది. వారి వెంట జిల్లాకు చెందిన ఒక సీఐ, ఎస్ఐతో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ కూడా ఉన్నారు. సాయంత్రం సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు కూడా తమ దర్యాప్తునకు అవసరమైన వివరాలను సేకరించి వెళ్లారు. మరోవైపు ఘటనాస్థలానికి మధ్యప్రదేశ్, కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు కూడా వచ్చి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి పరారైన దుండగులు వీరేనన్న సమాచారంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. మరోవైపు కర్ణాటకలో విధ్వంసం సృష్టించటానికి ప్రణాళికలు రూపొందించిన ముఠా సభ్యులు వీరేనన్న కోణంలో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మన రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాగా, దుండగుల మృతదేహాలను ఉంచిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి వద్దకు కూడా ఏటీఎస్ బృందాలు వచ్చి వెళ్లాయి. అత్యంత గోప్యంగా అధికారులు ఆసుపత్రిలోనికి వెళ్లి తమకు అవసరమైన సమాచారం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ శాంతిభద్రతల అదనపు డీజీ సుధీర్‌లాక్టాకియా, ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకరరావులు కూడా దుండగుల మృతదేహాలను పరిశీలించి వెళ్లినట్టు తెలుస్తోంది. విస్తృత కూంబింగ్.. కాగా, అసలు ఈ దుండగులు ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఆక్టోపస్ పోలీసులతో కలిసి దాదాపు 150 మంది వరకు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా నిందితులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి గుట్టల్లో పెద్ద ఎత్తున గాలింపులు జరిపారు. కాగా, ఆదివారం ఉదయం సమయంలో మరోసారి జిల్లాలో వదంతులు వ్యాపించాయి. తుంగతుర్తి మండలంలోని కుక్కడం గ్రామంలో మరో దుండగుడు స్థానికులకు తారసపడ్డాడని పుకార్లు రావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, పోలీసులు నాగారం, అర్వపల్లి గుట్టల్లో కూంబింగ్ నిర్వహించిన తర్వాత అలాంటిదేమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
సిమి ఉగ్రవాదుల అరాచకాల చిట్టా!
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరు సిమి ఉగ్రవాదులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్లు దేశంలో పలు ప్రాంతాలలో అనేక అరాచకాలకు పాల్పడ్డారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వీరు 2009లో మధ్యప్రదేశ్‌లోని సాత్నా జైలర్ సంజయ్ పాండేపై హత్యాయత్నం చేశారు. 2009లో తీవ్రవాద నిరోధక దళంలో పని చేస్తున్న సీతారామ్ నాయక్ అనే కానిస్టేబుల్ని హత్య చేశారు. 2009 జనవరిలో బీజేపీ నేత ప్రమోద్ తివారీపై కాల్పులు జరిపారు. అదే సంవత్సరం విజయ్ ముండీ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో 9 లక్షల 50 వేల రూపాయలు దోపిడీ చేశారు. దేవాస్‌లోని నర్మదా గ్రామీణ బ్యాంకులో లక్షా 50 వేల రూపాయలు దోపిడీ చేశారు. 2010లో రత్నాం జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్‌లో రెండు లక్షల రూపాయలు దొంగిలించారు. 2010 మార్చిలో ఇటార్సీలో కెనారా బ్యాంకులో దోపిడీ చేశారు. 2010 సెప్టెంబరులో భోపాల్‌లో మణప్పురం బ్యాంకు బ్రాంచ్‌లోకి ప్రవేశించి ఒక వ్యక్తి నుంచి పది తులాల బంగారం దోచుకెళ్లారు. -
దుండగుల వివరాలు బట్టబయలు!
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరూ సిమి కార్యకర్తలుగా నిర్ధారణ అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో మృతదేహాలను మధ్యప్రదేశ్ ఏటీఎస్ పో్లీసులు పరిశీలించారు. వారు మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుంచి పరారైన సిమి కార్యకర్తల వేలిముద్రలను తీసుకువచ్చారు. మృతదేహాలను పరిశీలించి, ఆ వేలి ముద్రలతో పోల్చి చూసి వారిని అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా నిర్ధారించారు. యూపీకి చెందిన ఈ ఇద్దరూ ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. వీరు 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 2010లో భో్పాల్లోని ఓ బంగారు దుకాణంలో వీరు చోరీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు చోరీకి పాల్పడింది కూడా వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం 2013 అక్టోబరు 1న ఖండ్వా జైలు నుంచి ఆరుగురు తప్పించుకొని పారిపోయారు. వారిలో అయిదుగురు సిమి కార్యకర్తలు కాగా, ఒకరు స్థానిక నేరస్థుడు. వారు ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు వెంటిలేటర్ విరగగొట్టి బ్యారెక్ నుంచి బయటకు వచ్చారు. దుప్పట్లను తాడులా పేని 16 అడుగుల గోడను ఎక్కి, కిందకు దిగి పారిపోయారు. అయోధ్య రామమందిరం కేసు తీర్పు ఇచ్చిన అలహాబాద్ బెంచ్‌లో ముగ్గురు జడ్జిలను హత్య చేయాలని అప్పట్లో వారు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఆ కుట్రను అమలు చేయడానికి వారు రెండు నెలలు రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. వారు తమ పని పూర్తి చేసుకోవడానికి స్థానికంగా ఉన్న మరో సిమి కార్యకర్త సహాయం కోరినట్లు తెలుస్తోంది. ఇదే ప్రయత్నంలో వారు 2011 జూన్‌లో అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి పారిపోయినవారిలో అబిద్ మీర్జా, అస్లాం అయూబ్, అబు ఫైసల్, షేక్ మహబూబ్, మహ్మద్ ఇజాజుద్దీన్, జాకీర్ బాదల్ ఉన్నారు. పరారైన కొన్ని గంటలకే అబిద్ మీర్జాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబరు 24న అబు ఫైసల్‌ను బర్వానీలో పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి అస్లాం అయూబ్, మహ్మద్ ఇజాజుద్దీన్, జకీర్ బాదల్ పరారీలో ఉన్నారు. 2009 నవంబరు 11 ఏటీఎస్ కానిస్టేబుల్ని హత్య చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.బోఫాల్‌లో రెండు బ్యాంకులలో చోరీ చేసి, ఆ సొమ్ముని తీవ్రవాద కార్యకలాపాలకు వాడినట్లు వారిపై కేసులు ఉన్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో మృతి చెందిన ఇద్దరూ 2010 నవంబరులో లక్నోలో ఉన్నట్లు తెలుస్తోంది. దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మరో ఉగ్రవాది నల్లొండ జిల్లాలోనే తిరుగుతున్నట్లు పో్లీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం తెలంగాణ పోలీసులతోపాటు మహారాష్ట్ర పోలీసులు కూడా వెతుకుతున్నారు. -
కొద్దిసేపట్లో దుండగులు ఎవరో తేలనుంది
నల్గొండ: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల సంఘటనా స్థలానికి మధ్య ప్రదేశ్ పోలీసులు వచ్చారు. ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్ వేలిముద్రలను వారు తీసుకువచ్చారు. నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో తీవ్రవాదుల మృతదేహాలను ఆ పో్లీసులు పరిశీలిస్తారు. దుండగులు ఎవరనేది ఆధారలతోసహా నిర్ధారిస్తారు. నల్గొండ జిల్లాలో కాల్పులకు పాల్పడింది సిమి ఉగ్రవాదులేనని ఇంటిలిజెన్స్ వర్గాలు, కేంద్ర హొం శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా నిర్ధారించారు. యూపీకి చెందిన ఈ ఇద్దరూ ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. వీరు 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 2010లో భో్పాల్లోని ఓ బంగారు దుకాణంలో వీరు చోరీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు చోరీకి పాల్పడింది కూడా వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు.