మృతుల కుటుంబాలకు లభించని సీఎం పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ‘సిమి’ ఉగ్రవాదులు నల్లగొండ జిల్లాలో సృష్టించిన మారణహోమంలో అసువులు బాసిన పోలీసు కుటుం బాలతోపాటు గాయపడ్డ పోలీసులకు ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ పరామర్శ లభించలేదు. ముష్కరుల తూటాలకు బలైన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేశ్‌లతోపాటు క్షతగాత్రు లను పరామర్శించేందుకు విపక్ష పార్టీల నేతలంతా కదిలి వచ్చినా ప్రభుత్వంలోని ‘ముఖ్య’నేతలు రాకపోవడంపై పోలీ సులు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తీవ్రవాద దాడులు జరిగినప్పుడు సీఎంలే స్వయంగా బాధిత పోలీసు కుటుంబాలను పరామర్శించేవారు. కాగా, ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి మాత్రమే ఆదివారం కామినేని ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.