సాక్షి, హైదరాబాద్: ‘సిమి’ ముష్కరుల దాడిలో అసువులు బాసిన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజుల కుటుంబాలకు చెరో రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పదవీకాలం ముగిసే వరకు కానిస్టేబుళ్లకు రావాల్సిన జీతభత్యాలను వారి కుటుంబ సభ్యులకు చెల్లిస్తామన్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. అలాగే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు.