వాళ్లను చంపాం.. మమ్మల్ని పొగడండి!
వాళ్లను చంపాం.. మమ్మల్ని పొగడండి!
Published Tue, Nov 1 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
‘పరారైన వాళ్లను చంపినందుకు మీరు మమ్మల్ని ప్రశంసించాలి. వాళ్లు మరిన్ని ప్రమాదకరమైన పనులు చేయకుండా మేం అడ్డుకున్నాం’ అని మధ్యప్రదేశ్ జైళ్లశాఖ మంత్రి కుసుమ్ మెహ్‌దెలే వ్యాఖ్యానించారు. భద్రతాపరమైన లోపాల వల్లే సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోగలిగారని ఆమె అంగీకరించారు. సిమీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశంసించాలని చెప్పుకొచ్చారు. ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న భోపాల్ సెంట్రల్ జైలులోని కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని అంగీకరించారు.
‘మా వైపున పలు లోపాలు ఉన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. జైలు లోపల ఉన్న కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. అంతేకాకుండా వారు ఎలా అంతపెద్ద ప్రహారీ గోడను ఎక్కారన్నది కూడా తెలియాల్సి ఉంది’ ఆమె పేర్కొన్నారు. సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిదిమంది ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. అనంతరం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వాళ్లు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ విషయంలో శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం, పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Advertisement