‘అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలా?’
‘అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలా?’
Published Mon, Oct 31 2016 3:59 PM | Last Updated on Thu, Aug 9 2018 5:00 PM
హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకుని.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ లో హతమైన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సిమి కార్యక్తరల ఎన్ కౌంటర్ పై సుప్రీం జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడివని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాగా మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. సోమవారం తెల్లవారుజామున స్టీల్ కంచం, గ్లాస్తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ను కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఉగ్రవాదుల జాడను కనుగొన్నారు. అయితే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించడంతో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చింది. భోపాల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఖేడీ గ్రామంలో పోలీసులు 8 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు.
Advertisement