Bhopal encounter
-
భోపాల్ ఎన్‌కౌంటర్‌పై ఆడియో,వీడియో టేపులు
-
తల, ఛాతీలపై కాల్చి చంపారు!
సిమి కార్యకర్తల పోస్టుమార్టమ్ భోపాల్: తల, ఛాతీలపై కాల్చడంతోనే 8 మంది సిమి కార్యకర్తలు చనిపోయినట్లు మృతుల కుటుంబాల లాయర్ పర్వేజ్ అలమ్ తెలిపారు. వారిపై ముందువైపు నుంచే కాల్పులు జరిపారని చెప్పే పోస్టుమార్టమ్ నివేదికను తాను చూశానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నడుము కింది భాగంలోనే పోలీసులు కాల్చాలని, కాని నడుము పైభాగంలో కాల్పులు జరిపారని పేర్కొన్నారు. భోపాల్ జైలులోని మిగిలిన 20 మందికిపైగా సిమి కార్యకర్తలపైనా విచక్షణా రహితంగా దాడి జరిగిందని ఆరోపించిన పర్వేజ్.. వారికి వైద్య పరీక్షలు జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. కాగా, పోస్టుమార్టమ్ అనంతరం సిమి కార్యకర్తల మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. ‘బిర్యానీ తింటున్నారు’ ‘ఉగ్రవాద నిందితులు జైళ్లలో ఏళ్లపాటు చికెన్ బిర్యానీ తింటూ గడిపేస్తున్నారు. విచారణ పూర్తయి, వారికి శిక్ష పడ్డానికి చాలా ఏళ్లు పడుతుంది. దీంతో రోజూ బిర్యానీ బాగా తింటారు.తర్వాత తప్పించుకుంటారు. నేరాలకు పాల్పడతారు. అవినీతి కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నప్పుడు, ఉగ్రవాదులను శిక్షించేందుకు మాత్రం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఎందుకు ఉండకూడదు’ అని మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. -
జైల్లో బిర్యానీ తిని.. తప్పించుకుంటున్నారు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర మంత్రులు.. భోపాల్ ఎన్కౌంటర్ ఘటనను సమర్థిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్నవారు ఏళ్లతరబడి జైళ్లలో చికెన్ బిర్యానీ తింటూ, తప్పించుకుని పారిపోయి మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చౌహాన్ అన్నారు. ఉగ్రవాదదాడి కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఎనిమిదిమంది నిషేధిత సిమి కార్యకర్తలు ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసుల చర్యలను మధ్యప్రదేశ్ సీఎం, మంత్రులు సమర్థిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నాక ఖైదీలు పోలీసులపై కాల్పులు జరిపారని, దీంతో వారు ఎదురు కాల్పులు జరపక తప్పలేదని చెప్పారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
భోపాల్ ఎన్కౌంటర్.. చర్లపల్లి జైలులో అలర్ట్
హైదరాబాద్: భోపాల్ సెంట్రల్ జైలు గార్డును హతమార్చి ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకోవడం, కొద్ది గంటల్లోనే వారంతా పోలీసుల చేతిలో హతమైపోయిన నేపథ్యంలో దేశంలోని అన్ని సెంట్రల్ జైళ్లలో అలర్ట్ ప్రకటించారు. ఇటు హైదరాబాద్ శివారులోని చర్లపల్లి సెంట్రల్ జైలు అదికారులు కూడా అప్రమత్తమయ్యారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు ఐఎస్ఐ తీవ్రవాదులు చర్లపల్లి జైలులోనే విచారణ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. నిందితులున్న మంజీర బ్యారక్‌లో షిఫ్టుకు ఐదుగురు వార్డర్ల చొప్పున జైలర్ స్థాయి అధికారి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఖైదీల కదలికలపై జైళ్లశాఖ ఉన్నతాధికారులతో ..ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. ఈ ఖైదీల విచారణకు ప్రత్యేకంగా జైలులోని కోర్టు ఏర్పాటు చేశారు. -
వాళ్లను చంపాం.. మమల్ని పొగడండి!
-
వాళ్లను చంపాం.. మమ్మల్ని పొగడండి!
‘పరారైన వాళ్లను చంపినందుకు మీరు మమ్మల్ని ప్రశంసించాలి. వాళ్లు మరిన్ని ప్రమాదకరమైన పనులు చేయకుండా మేం అడ్డుకున్నాం’ అని మధ్యప్రదేశ్ జైళ్లశాఖ మంత్రి కుసుమ్ మెహ్‌దెలే వ్యాఖ్యానించారు. భద్రతాపరమైన లోపాల వల్లే సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోగలిగారని ఆమె అంగీకరించారు. సిమీ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినందుకు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశంసించాలని చెప్పుకొచ్చారు. ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న భోపాల్ సెంట్రల్ జైలులోని కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని అంగీకరించారు. ‘మా వైపున పలు లోపాలు ఉన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. జైలు లోపల ఉన్న కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. అంతేకాకుండా వారు ఎలా అంతపెద్ద ప్రహారీ గోడను ఎక్కారన్నది కూడా తెలియాల్సి ఉంది’ ఆమె పేర్కొన్నారు. సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిదిమంది ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. అనంతరం పోలీసుల ఎన్కౌంటర్లో వాళ్లు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ విషయంలో శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం, పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి!
-
బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి!
భోపాల్: ‘జిందా హై.. మారో’ (బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి).. సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఓ పోలీసు అన్న మాటలివి.. సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిదిమంది ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోగా.. పోలీసుల ఎన్కౌంటర్లో వాళ్లు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మొబైల్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో నిజమైనదా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, పారిపోయిన సిమీ ఉగ్రవాదులు లొంగిపోయేందుకు సిద్ధపడినా.. నిరాయుధులైన వారిని పోలీసులు కాల్చిచంపేసి.. ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఛాతి మీద కాల్చు.. అతను చనిపోతాడు' అని మరో పోలీసు అంటున్న మాటలు కూడా ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. జైలు నుంచి పరారైన సిమీ ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని, దీంతో వారు హతమయ్యారని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని ఆయన తెలిపారు. సోమవారం తెల్లవారుజామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్న సంగతి తెలిసిందే. స్టీల్ కంచం, గ్లాస్‌తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేసి.. అనంతరం బెడ్షీట్లను తాడులా చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారు. కొంతసేపటికే స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఎనిమిది మంది జాడ కనుక్కొని.. వారిని ఎదురుకాల్పుల్లో హతమార్చారు. అయితే, ఈ ఎన్కౌంటర్ ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హతమైన ప్రదేశంలో సిమీ ఉగ్రవాదులు జీన్స్ ప్యాంట్లు, స్పోర్ట్స్ షూలలో కనిపించారు. అంతేకాకుండా వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. వారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. జైలు బయట-లోపల వారికి సహకరించింది ఎవరనే దానిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.