సిమి కార్యకర్తల పోస్టుమార్టమ్
భోపాల్: తల, ఛాతీలపై కాల్చడంతోనే 8 మంది సిమి కార్యకర్తలు చనిపోయినట్లు మృతుల కుటుంబాల లాయర్ పర్వేజ్ అలమ్ తెలిపారు. వారిపై ముందువైపు నుంచే కాల్పులు జరిపారని చెప్పే పోస్టుమార్టమ్ నివేదికను తాను చూశానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నడుము కింది భాగంలోనే పోలీసులు కాల్చాలని, కాని నడుము పైభాగంలో కాల్పులు జరిపారని పేర్కొన్నారు. భోపాల్ జైలులోని మిగిలిన 20 మందికిపైగా సిమి కార్యకర్తలపైనా విచక్షణా రహితంగా దాడి జరిగిందని ఆరోపించిన పర్వేజ్.. వారికి వైద్య పరీక్షలు జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. కాగా, పోస్టుమార్టమ్ అనంతరం సిమి కార్యకర్తల మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు.
‘బిర్యానీ తింటున్నారు’
‘ఉగ్రవాద నిందితులు జైళ్లలో ఏళ్లపాటు చికెన్ బిర్యానీ తింటూ గడిపేస్తున్నారు. విచారణ పూర్తయి, వారికి శిక్ష పడ్డానికి చాలా ఏళ్లు పడుతుంది. దీంతో రోజూ బిర్యానీ బాగా తింటారు.తర్వాత తప్పించుకుంటారు. నేరాలకు పాల్పడతారు. అవినీతి కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నప్పుడు, ఉగ్రవాదులను శిక్షించేందుకు మాత్రం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఎందుకు ఉండకూడదు’ అని మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.
తల, ఛాతీలపై కాల్చి చంపారు!
Published Thu, Nov 3 2016 3:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement