Shivraj Chouhan
-
జార్ఖండ్‌లో ఎన్ఆర్సీ అమలు చేస్తాం: కేంద్ర మంత్రి
రాంచి: తాము జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్‌ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది...ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్‌లో ఎన్ఆర్సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్ఆర్సీ అంటే..అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’ -
బీజేపీ తొలి జాబితా.. శివరాజ్ చౌహాన్‌కు చోటు, ప్రగ్యా ఠాకూర్‌పై వేటు
గత రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్న 'శివరాజ్ సింగ్ చౌహాన్'కు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో స్థానం కల్పించింది. దీంతో ఈయన మధ్యప్రదేశ్‌లోని విదిషా నుంచి పోటీ చేయనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన ఘనత చౌహాన్‌దే. లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా, జాబితాలో చోటు సంపాదించిన పేర్లు మాత్రమే కాకుండా.. లోపాలు ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీరిలో ప్రధానంగా ఫైర్‌బ్రాండ్ లీడర్ ప్రగ్యా ఠాకూర్ ఉన్నారు. భోపాల్‌లో బీజేపీ ప్రగ్యా ఠాకూర్ స్థానంలో అలోక్ శర్మను ఎంపిక చేసింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని పేర్కొనడం మాత్రమే కాకుండా 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ కారణంగానే లోక్‌సభ సీటు ఇవ్వలేదు. ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్ప మరెవరూ స్పందించలేదు. ఆ సమయంలో క్షమాపణలు కోరినప్పటికీ.. నేను పూర్తిగా క్షమించలేనని మోదీ ఖరాకండిగా వెల్లడించారు. 2008 ఉగ్రదాడుల సమయంలో మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై వారు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. -
MP: దూసుకెళ్తున్న ‘మామ’.. బంపర్ మెజార్టీలో సీఎం చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి కమల్ నాథ్ చింద్వారాలో వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ 56,124 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్ విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్య మంత్రి లాడ్లీ బెహనా యోజన పథకం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిందని నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహిళలు చౌహాన్‌పై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు. -
Madhya Pradesh Elections 2023: కౌంటింగ్‌కి సన్నద్ధం.. నేతలతో చౌహాన్ భేటీ
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ముగిశాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నేతలతో భోపాల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. తమ అభ్యర్థులందరితో చర్చలు జరిపామని, కౌంటింగ్ రోజుకి కూడా సిద్ధమయ్యామని చౌహాన్ తెలిపారు. అంతకుముందు మంగళవారం భింద్ జిల్లాలోని అటర్ నియోజకవర్గంలోని కిషుపురా గ్రామంలో ఈసీఐ ఆదేశాల మేరకు రీపోలింగ్ జరిగింది. వీడియోలు తీసి పోలింగ్ గోప్యతను భంగపరిచారని రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ భదోరియా ఫిర్యాదు మేరకు రీపోలింగ్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే హేమంత్ కటారే బరిలో ఉన్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. మొత్తం 71.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
బరి తెగించిన వేటగాళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వేటగాళ్లు రెచ్చిపోయారు. వన్యమృగాలను వేటాడుతుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులు నేలకొరిగారు. ఒకరు పోలీసు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. అనంతరం సోదాల సమయంలో జరిగిన కాల్పుల్లో మరో నిందితుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుణ జిల్లా అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను మృతవీరులుగా ప్రకటించారు. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గ్వాలియర్ జోన్ ఐజీని బదిలీ చేశారు. సాగ బార్ఖేడ గ్రామ సమీపంలోని షారోక్ రోడ్డు వద్ద కొందరు దుండగులు వన్యప్రాణులను వేటాడుతున్నారన్న సమాచారం అందడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసు బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను దుండగులు లక్ష్యపెట్టలేదు. పోలీసులపైకి యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఎస్సై రాజ్‌కుమార్ జాటవ్, కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారాం మీనా అసువులు బాశారు. పోలీసులపై కాల్పులకు తెగబడిన నేరగాళ్లు బిధోరియాకు చెందిన వారిగా గుర్తించినట్లు హోం మంత్రి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో నలుగురి కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోందన్నారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి కృష్ణజింకల కళేబరాలు ఐదు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. చదవండి: లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు -
బాలుడిని రక్షించబోయి ప్రమాదంలో గ్రామస్తులు, నలుగురు దుర్మరణం
భోపాల్: బావిలో పడిపోయిన బాలుడిని కాపాడటానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బాలుడిని రక్షించే ప్రయత్నంలో ఒకేసారి అక్కడికి చేరడంతో అధిక బరువుతో గోడ కూలి బావిలో పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాదంలో చిక్కుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్, విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నఎన్‌డీఆర్‌ఆఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి. ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. వీరిలో 19 మందిని సిబ్బంది కాపాడారు. ఇంకా బావిలోనే చిక్కుకున్న మిగిలిన వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మరణించిన వారి కుటుంబాలకు సీఎం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంతోపాటు, ఉచిత వైద్య చికిత్స కూడా అందించనున్నామని వెల్లడించారు. అలాగే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు మంత్రి విశ్వాస్ సారంగ్, సహాయ, రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. MP: 4 bodies recovered from the spot so far in Ganjbasoda area of Vidisha. CM SS Chouhan announces an ex-gratia of Rs 5 Lakhs each for the next of the kin of the deceased & compensation of Rs 50,000 each to the injured. The injured will also be provided free medical treatment. pic.twitter.com/PgBs2hzFJB — ANI (@ANI) July 16, 2021 -
మద్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం
-
సింధియా-చౌహాన్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నారా? మధ్యప్రదేశ్ సీఎం పదవి దక్కలేదన్న బాధ వెంటాడుతోందా? బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌చౌహాన్‌తో సింధియా భేటీ ఆంతర్యం ఏంటి? మర్యాదపూర్వకంగా కలిశామని నేతలు చెబుతున్నా.. రాజకీయ కారణం ఉందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం , బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భోపాల్‌కి దూరంగా ఉండే సింధియా సోమవారం సిటీకొచ్చారు. తన సన్నిహితులను కలిసిన తర్వాత చౌహాన్ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. తర్వాత బయటకొచ్చిన చౌహాన్, సింధియా.. మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనంతరం కారు వరకూ వెళ్లి సింధియాకు వీడ్కోలు పలికారు శివరాజ్‌సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో సింధియా.. చౌహాన్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మర్యాదపూర్వకంగానే కలిశామని ఇద్దరు నేతలూ చెబుతున్నా.. రాజకీయ నేపథ్యం ఉండే ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించి ఇటీవలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు. సీఎం పదవి కోసం ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి సీనియర్ అయిన కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఇది సింధియా వర్గీయులను ఒకింత అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడాలని అనుచరులకు సర్దిచెప్పుకున్నారు. తాజాగా ఆయన చౌహాన్‌తో భేటీ అవడంతో ఈ విషయం మళ్లీ తెరమీదకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి కారణంగానే సింధియా.. చౌహాన్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్నదే త్వరలో మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉందని కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి హెచ్చరించారు. ఒక్క సీటే తేడా అయినా, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వమే. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో కమల్‌నాథ్ ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింధియా ఎర్రజెండా చూపిస్తే, ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అందుకే, సింధియా- చౌహాన్ భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే, అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహాన్ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిశారని.. పుకార్లు నమ్మొద్దని కాంగ్రెస్ చెబుతోంది. -
భోపాల్‌లో కీచకపర్వం
భోపాల్: భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. సివిల్స్ కోచింగ్‌కు వెళ్లివస్తున్న ఓ యువతిని అడ్డుకున్న నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ‘నువ్వు చెప్పేది సినిమా కథలా ఉంది’ అని హేళన చేశారు. హబీబ్‌గంజ్ లోకల్, ఎంపీ నగర్, హబీబ్‌గంజ్ జీఆర్పీ స్టేషన్లలోని పోలీసులు ఈ కేసు మా పరిధిలోకి రాదంటూ బాధితురాలిని 24 గంటలు తిప్పించారు. దీంతో చివరికి బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి ఇద్దరు నిందితుల్ని పట్టుకుని స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోచింగ్ నుంచి తిరిగొస్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని ఎంపీ నగర్లో సివిల్స్ శిక్షణ పొందుతున్న యువతి హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కోచింగ్ ముగించుకుని తిరిగివస్తుండగా దారిలో గోలు బీహారీ, అమర్ అనే ఇద్దరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. బలవంతంగా సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న కల్వర్టు దగ్గరకు ఈడ్చుకెళ్లి రేప్‌చేశారు. ఈ పాశవిక దాడిలో దుస్తులు చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏదైనా ఇవ్వాల్సిందిగా యువతి వారిని వేడుకుంది. ఇందుకు సరేనన్న గోలు దుస్తులతో పాటు మరో ఇద్దరిని తీసుకొచ్చాడు. అనంతరం నలుగురు కలసి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. మద్యం సేవిస్తూ మధ్యమధ్యలో సిగరెట్, తంబాకు కోసం విరామం ఇస్తూ దాదాపు 3 గంటల పాటు యువతిపై దారుణానికి పాల్పడ్డ దుండగులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె దగ్గరున్న చెవి రింగులు, ఫోన్, వాచ్, పర్సును గుంజుకుని పరారయ్యారు. ఈ పాశవిక ఘటన హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో జరిగింది. ప్రతిపక్షాల విమర్శలు బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై కాంగ్రెస్ పార్టీ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. పోలీస్ దంపతుల కుమార్తె ఎఫ్ఐఆర్ నమోదు కోసం మూడు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ విమర్శించారు. దీంతో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, ఫిర్యాదును సకాలంలో స్వీకరించని హబీబ్‌గంజ్, ఎంపీ నగర్, జీఆర్పీ పోలీస్స్టేషన్లకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. కథలు చెబుతున్నావా? భద్రతా విభాగంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల సాయంతో తనపై జరిగిన దారుణాన్ని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన యువతికి అక్కడ హేళనలు ఎదురయ్యాయి. యువతి వాంగ్మూలాన్ని విన్న పోలీస్ అధికారి ఒకరు సినిమా కథలు చెబుతున్నావా? అని హేళనగా మాట్లాడారు. హబీబ్‌గంజ్ లోకల్ పోలీస్‌స్టేషన్‌తో పాటు ఎంపీ నగర్, హబీబ్‌గంజ్ జీఆర్పీ పోలీసులు ఈ ఘటన మా పరిధిలోకి రాదన్నారు. గత్యంతరం లేక యువతి తెల్లవారేవరకు తండ్రితో కలసి జీఆర్పీ స్టేషన్‌ముందే నిరీక్షించింది. తిరిగి ఇంటికి వెళుతుండగా హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ సమీపంలోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డ గోలు, అమర్లను గుర్తించిన యువతి..తండ్రి సాయంతో వారిని తీసుకొచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో అప్పగించింది. -
నగరం నడిబొడ్డున 3గంటలపాటు గ్యాంగ్ రేప్
భోపాల్ : నగరం అడవిగా మారింది. కొన్ని క్రూరమృగాళ్లు కలిసి ఓ ఆడబిడ్డను వేటాడి, మూడు గంటలపాటు పీక్కుతిన్నాయి. నెత్తురుకారుతున్న తనవుతో.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే ‘సినిమా కథలు చెబుతున్నావా?’ అని వెటకారాలు ఎదురయ్యాయి. చివరికి బాధితురాలే కీచకులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొస్తేగానీ కేసు నమోదుకాలేదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఐఏఎస్ కోచింగ్‌కు వెళ్లొస్తూ : భోపాల్ శివారు గ్రామంలో నివసించే ఓ యువతి ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటోంది. ప్రతిరోజూ భోపాల్ నడిబొడ్డులోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించేంది. గురువారం సాయంత్రం.. కోచింగ్ సెంటర్ నుంచి రైల్వేష్టేషన్‌కు షార్ట్ కట్ రూట్లో వెళుతోన్న ఆమెను ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ చోటు నుంచి హబీబ్‌గంజ్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే!! దుస్తులు ఇమ్మంటే ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారు : మధ్యమధ్యలో సిగరెట్, తంబాకు కోసం విరామం ఇస్తూ గంటలపాటు యువతిపై అత్యాచారం చేశారు. దుస్తులు పూర్తిగా చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏవైనా ఇమ్మని బాధితురాలు వేడుకుంది. నిందితుల్లో ఒకడు ఇప్పుడే వస్తానని వెళ్లి, దుస్తులతోపాటు మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. నలుగురూ కలిసి ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె దగ్గరున్న ఫోన్, వాచ్, పర్స్‌లను గుంజుకొని, చివరికి రాత్రి 10 గంటల తర్వాత విడిచిపెట్టారు. సినిమా కథలు చెబుతున్నావా? : నడవలేని స్థితిలో ఎలాగోలా రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఆ రాత్రే.. తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే స్టేషన్ ఇన్చార్జి.. బాధితులు చెప్పిన కథనాన్ని నమ్మలేదు. పైగా, ‘సినిమా కథలు చెబుతున్నారా?’ అని ఎద్దేవా చేశాడు. అదే స్పాట్లో మళ్లీ కనిపించారు : తెల్లవారిన తర్వాత బాధితురాలు, ఆమె తండ్రి అసహాయ స్థితిలో పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ వైపునకు కదిలారు. సరిగ్గా అత్యాచారం జరిగిన ప్రదేశంలో.. తనను చెరబట్టిన ఇద్దరు కూర్చొని ఉండటం గమనించిందా యువతి. తండ్రి సహాయంతో ఆ ఇద్దరినీ తన్ని, గల్లాపట్టుకొని ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసింది. ఇక పోలీసులు కేసు నమోదుచేయక తప్పనిసరైంది. నిందితులను గొలూ బిహారీ, అమర్ భుటూలుగా గుర్తించారు. విపక్షాల ఆందోళన.. సీఎం సీరియస్ : హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ వద్ద గ్యాంగ్ రేప్, పోలీసుల అలసత్వంలపై విపక్ష కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణ చర్యగా ఫిర్యాదు నమోదు చేయడంలో అలసత్వం వహించిన పోలీస్ అధికారులను సస్సెండ్ చేశారు. బాధితురాలు అప్పగించిన ఇద్దరు నిందితుల ద్వారా మరో ఇద్దరిని పట్టుకున్నారు. మొత్తం నలుగురిపైనా నిర్భయ, తదితర చట్టాలకింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరూ భద్రతాదళ ఉద్యోగులే కావడం గమనార్హం. జాతీయ మహిళా కమిషన్ సైతం భోపాల్ గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించింది. కేసు వివరాలు పంపాల్సిందిగా మధ్యప్రదేశ్ డీజీపీకి శుక్రవారం ఒక లేఖ రాసింది. -
బలైన రైతులు.. కమిషన్ న్యాయం చెప్తుందా?
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన సంఘటనపై దర్యాప్తునకు రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించిన ఏకసభ్య కమిషన్ న్యాయం చెబుతుందా? చెప్పినా అది వెలుగులోకి వస్తుందా? వచ్చినా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన దశాబ్దకాలంలో దాదాపు డజను కమిషన్లను వేసింది. అందులో పది కమిషన్లు శివరాజ్ సింగ్ ప్రభుత్వం వేసినవే. కొన్ని కమిషన్లు ఇప్పటికీ తమ దర్యాప్తు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించలేదు. కొన్ని కమిషన్లు సమర్పించినా వాటిని ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురాలేదు. సామాజిక ఉద్యమాల వల్ల ఒకటి, రెండు కమిషన్ల నివేదికలు వెలుగులోకి వచ్చినా ఒక్కదానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎప్పటిలాగే ఈసారి కూడా సిట్టింగ్ జడ్జీతో కాకుండా రిటైర్డ్ జడ్జీ ఎస్కే జైన్‌తో పోలీసు కాల్పుల్లో రైతులు మరణించిన సంఘటనపై దర్యాప్తునకు ఏకసభ్య కమిషన్‌ను వేశారు. జస్టిస్ ఎస్కే జైన్ మొన్న జనవరి నెలలో రాష్ట్ర హైకోర్టు ఇండోర్ బెంచీ నుంచి రిటైర్డ్ అయ్యారు. రైతుల ఆందోళనను అణచివేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ మొదటిసారి స్పందిస్తూ రెండు సంఘ విద్రోహ శక్తుల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని చెప్పారు. ఆరో రైతు ఆ మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించారు. కాల్పులకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడం, మీడియా విమర్శలు గుప్పించడంతో భూపేందర్ సింగ్ మూడో రోజు పోలీసు కాల్పుల్లోనే రైతులు మరణించిన విషయాన్ని అంగీకరించారు. అయినప్పటికీ మరణించిన వారిలో డ్రగ్ స్మగ్లర్లు ఉన్నారంటూ మంద్సౌర్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన మాటలే నిజమైతే కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎందుకు ప్రకటిస్తారు? అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే కాల్పుల సంఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ను వేశారని నేషనల్ సెక్యులరిజమ్ ఫోరమ్ కన్వీనర్ లజ్జా శంకర్ హర్దేనియా ఆరోపించారు. ‘కమిషన్ ఆఫ్ జుడీషియల్ ఇంక్వైరీ యాక్ట్’ కింద ప్రభుత్వాలు విచారణ కమిషన్లు వేస్తుంటాయి. ఈ కమిషన్లు ఇచ్చిన నివేదికలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలన్న నిబంధన చట్టంలోనే లేదు. అందుకని ప్రభుత్వాలు కమిషన్ల తంతును తూతూ మంత్రంగా నిర్వహిస్తాయి. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను విచారించిన ఎస్కే ఝా కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2008, అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఝా కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ తన నివేదికను చౌహాన్ ప్రభుత్వానికి సమర్పించగా, గతేడాది ఫిబ్రవరిలో దాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. ఇప్పటికీ ఆ నివేదికలో ఏముందో బహిర్గతం చేయలేదు. ఈ వివేదికను ప్రజల ముందుంచాలంటూ నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు, సామాజిక కార్యకర్త మేథోపాట్కర్ ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పేరిట 3,000 నకిలీ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని, నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కేటాయింపుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నాడు జస్టిస్ ఝా కమిషన్‌ను వేశారు. విచారణ ఎదుర్కొంటున్న ఎనిమిది మంది అనుమానిత సిమీ కార్యకర్తలు భూపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని పారిపోతూ పోలీసుల కాల్పుల్లో మరణించారు. గతేడాది జరిగిన ఈ సంఘటపై సామాజిక కార్యకర్తలు, మీడియా స్పందించి, అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ పెద్ద పెట్టున గోల చేయడంతో చౌహాన్ దానిపైనా రిటైర్డ్ హైకోర్టు జడ్జీ ఎస్కే పాండే నాయకత్వాన ఓ విచారణ కమిషన్‌ను వేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ను సమర్థించేందుకు అందులో మరణించినవారు అత్యంత కరడుగట్టిన టెర్రరిస్టులని చౌహాన్ వాదిస్తూ వచ్చారు. మొన్న మార్చి నెలకు పాండే కమిషన్ కాల పరిమితి ముగియడంతో మరో మూడు నెలలు పొడిగించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ 2000 సంవత్సరంలో ఇండోర్ మేయర్‌గా ఉన్నప్పుడు ఆ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన భారీ పింఛను స్కామ్‌పై జస్టిస్ ఎన్కే జైన్ కమిషన్ విచారణ జరిపిన ఫైలు నేటికీ, అంటే 16 ఏళ్ల అనంతరం కూడా రాష్ట్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. మొన్నటి కాల్పుల్లో చనిపోయిన రైతులు ఎలాగు తిరిగొచ్చే అవకాశం లేదుకనుక కోటి రూపాయల కోసం వారి కుటుంబాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రాజీపడినట్లు కనిపిస్తున్నాయి. -
తల, ఛాతీలపై కాల్చి చంపారు!
సిమి కార్యకర్తల పోస్టుమార్టమ్ భోపాల్: తల, ఛాతీలపై కాల్చడంతోనే 8 మంది సిమి కార్యకర్తలు చనిపోయినట్లు మృతుల కుటుంబాల లాయర్ పర్వేజ్ అలమ్ తెలిపారు. వారిపై ముందువైపు నుంచే కాల్పులు జరిపారని చెప్పే పోస్టుమార్టమ్ నివేదికను తాను చూశానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నడుము కింది భాగంలోనే పోలీసులు కాల్చాలని, కాని నడుము పైభాగంలో కాల్పులు జరిపారని పేర్కొన్నారు. భోపాల్ జైలులోని మిగిలిన 20 మందికిపైగా సిమి కార్యకర్తలపైనా విచక్షణా రహితంగా దాడి జరిగిందని ఆరోపించిన పర్వేజ్.. వారికి వైద్య పరీక్షలు జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. కాగా, పోస్టుమార్టమ్ అనంతరం సిమి కార్యకర్తల మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. ‘బిర్యానీ తింటున్నారు’ ‘ఉగ్రవాద నిందితులు జైళ్లలో ఏళ్లపాటు చికెన్ బిర్యానీ తింటూ గడిపేస్తున్నారు. విచారణ పూర్తయి, వారికి శిక్ష పడ్డానికి చాలా ఏళ్లు పడుతుంది. దీంతో రోజూ బిర్యానీ బాగా తింటారు.తర్వాత తప్పించుకుంటారు. నేరాలకు పాల్పడతారు. అవినీతి కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నప్పుడు, ఉగ్రవాదులను శిక్షించేందుకు మాత్రం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఎందుకు ఉండకూడదు’ అని మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. -
జైల్లో బిర్యానీ తిని.. తప్పించుకుంటున్నారు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర మంత్రులు.. భోపాల్ ఎన్కౌంటర్ ఘటనను సమర్థిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్నవారు ఏళ్లతరబడి జైళ్లలో చికెన్ బిర్యానీ తింటూ, తప్పించుకుని పారిపోయి మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చౌహాన్ అన్నారు. ఉగ్రవాదదాడి కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఎనిమిదిమంది నిషేధిత సిమి కార్యకర్తలు ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసుల చర్యలను మధ్యప్రదేశ్ సీఎం, మంత్రులు సమర్థిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నాక ఖైదీలు పోలీసులపై కాల్పులు జరిపారని, దీంతో వారు ఎదురు కాల్పులు జరపక తప్పలేదని చెప్పారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
డిగ్గీరాజా రికార్డు బద్దలయింది
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం ముఖ్యమంత్రి స్థానంలో పదేళ్లు పూర్తి చేసుకొని అంతకుముందు మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌కు ఉన్న రికార్డును బద్దలు కొట్టేశారు. పదేళ్లకాలంపాటు మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొత్త రికార్డును లిఖించారు. 2005లో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్.. తొలిసారి ఎమ్మెల్యేగా బుద్ని నియోజకవర్గం నుంచి 1989-90 మధ్యలో ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం నచ్చి ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను మొత్తం జీవితాన్ని ప్రజలకోసమే వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీతో సహా పలువురు అగ్రనేతలు తనకు ఫోన్ కాల్ చేసి అభినందించారని, తన పనితీరు బాగుందని ప్రశంసలు కురిపించారని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1993 నుంచి 2003మధ్యకాలంలో పదేళ్లపాటు పనిచేశారు.