భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి కమల్ నాథ్ చింద్వారాలో వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ 56,124 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్ విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్య మంత్రి లాడ్లీ బెహనా యోజన పథకం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిందని నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహిళలు చౌహాన్‌పై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment