Madhya Pradesh Assembly Elections Results 2023
-
మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌కు అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జితూ పటా్వరీకి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ చీఫ్ ఖర్గే శనివారం ఆదేశాలిచ్చారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 66 సీట్లే దక్కిన సంగతి తెలిసిందే. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ ప్రమాణం
భోపాల్/రాయ్‌పూర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మంగూభాయి పటేల్ సీఎంగా మోహన్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్దా, రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తానని చెప్పారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సీఎంగా విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయి ప్రమాణం స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ‘రామ్ రామ్’
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. -
Five States Election: అసెంబ్లీలలో కొత్త నీరు
దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి కొత్త నీరు శరవేగంగా చేరుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టగల ఈ ధోరణి తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచి్చనట్టు కని్పంచింది. వాటన్నింటిలో కలిపి ఏకంగా 38 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరారు! మెజారిటీ సాధనలో వెటరన్ ఎమ్మెల్యేలదే పై చేయిగా నిలిచినా, రాజకీయ రంగంలో మాత్రం మొత్తమ్మీద కొత్త గాలులు వీస్తున్నాయనేందుకు ఈ ఎన్నికలు స్పష్టమైన సూచికగా నిలిచాయి. మూడింట్లో కొత్తవారి జోరు మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజేతల జాబితాను పరిశీలిస్తే ఇప్పటికే కనీసం రెండు నుంచి మూడుసార్లు నెగ్గిన అనుభవజు్ఞలైన ఎమ్మెల్యేలు అందులో 38 శాతం మంది ఉన్నారు. అయితే సరిగ్గా అంతే శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇప్పటికే మూడుసార్లకు మించి ఎమ్మెల్యేలుగా చేసిన వెటరన్లలో ఈసారి 24 శాతం మంది గెలుపొందారు. రాష్ట్రాలవారీగా చూస్తే తొలిసారి ఎమ్మెల్యేల జాబితాలో గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ టాప్‌లో నిలవడం విశేషం. అక్కడ ఈసారి మొత్తం 90 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 52 శాతం మంది కొత్త ముఖాలే! వెటరన్లు కేవలం 18 శాతం కాగా అనుభవజు్ఞలు 30 శాతమున్నారు. తెలంగాణలో కూడా 119 మంది ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది తొలిసారి ఎన్నికైనవారే! ఈ దక్షిణాది రాష్ట్రంలో 21 శాతం మంది వెటరన్లు, 34 శాతం మంది అనుభవజు్ఞలు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కూడా 40 మంది ఎమ్మెల్యేల్లో 47 శాతం మంది కొత్తవారున్నారు. వెటరన్లు 18 శాతం, అనుభవజు్ఞలు 35 శాతంగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో మాత్రం కొత్తవారి హవా కాస్త పరిమితంగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం వెటరన్లు 31 శాతం మంది ఉండగా అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేల శాతం 36గా ఉంది. రాష్ట్రంలో 33 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజస్తాన్ ఎమ్మెల్యేల్లో మాత్రం 46 శాతం మంది అనుభవజ్ఞులే. వెటరన్లు 24 శాతం కాగా తొలిసారి నెగ్గినవారు 30 శాతమున్నారు. మెజారిటీలో వెటరన్లదే పైచేయి ఓవరాల్ గెలుపు శాతంలో వెనకబడ్డా, మెజారిటీ సాధనలో మాత్రం వెటరన్లు సత్తా చాటారు. మూడు రాష్ట్రాల్లో కొత్తవారు, అనుభవజు్ఞల కంటే ఎక్కువ మెజారిటీని వెటరన్లు సాధించారు. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి చూస్తే వెటరన్లు సగటున 22,227 ఓట్ల మెజారిటీ సాధించగా కొత్తవారు 20,868 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక అనుభవజు్ఞల సగటు మెజారిటీ 20,495 ఓట్లు. జనాకర్షణలో వెటరన్లు ఇప్పటికీ సత్తా చాటుతున్నారనేందుకు వారు సాధించిన మెజారిటీలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీలవారీగా చూస్తే... ఇక ఐదు రాష్ట్రాల ఫలితాలను పార్టీలవారీగా చూస్తే బీజేపీ ఎమ్మెల్యేల్లో కొత్తవారు 38 శాతం మంది ఉన్నారు. 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 27 శాతం మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనుభవజ్ఞులు బీజేపీ కంటే ఎక్కువగా 43 శాతం మంది ఉన్నారు. తొలిసారి నెగ్గిన వారు 34 శాతం కాగా వెటరన్లు 23 శాతంగా తేలారు. ఇతర పార్టీలన్నీ కలిపి చూస్తే కొత్త ఎమ్మెల్యేలు ఏకంగా 47 శాతముండటం విశేషం! 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 19 శాతానికి పరిమితమయ్యారు. చిన్న, ప్రాంతీయ పార్టీల్లో కొత్త వారి జోరు ఎక్కువగా ఉందనేందుకు ఇది స్పష్టమైన సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీకి ఓటేసినందుకు దాడి.. భద్రతకు సీఎం భరోసా
భోపాల్: బీజేపీకి ఓటేసినందుకు బావ వరుస అయ్యే వ్యక్తి తనపై దాడి చేశాడని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్‌లోని అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన సమీనా బీ అనే మహిళ డిసెంబ్ 4న బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా గమనించిన జావేద్ ఖాన్ బీజేపీకి ఎందుకు ఓటు వేశావంటూ వేధించటం మొదలుపెట్టాడు. దుర్భషలాడిన తన బావ జావేద్‌ను ఆమె ప్రశ్నించగా.. అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆపై బీజేపీ మద్దతుగా నిలిస్తే ఊరుకోనని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇచ్చిన ఫిర్యాదుతో సెహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే ఆమె జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీన్ సింగ్‌ను కూడా కలిసి తనపై దాడి చేసిన జావేద్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలిసిన సీఎం శీవరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. ఆమె తన పిల్లలతో సీఎం చౌహాన్ కలిసి.. తాను బీజేపీ ఓటు వేసినందుకు తన బావ జావేద్ దాడి చేసినట్లు తెలిపారు. జావేద్ నుంచి తమకు భద్రత కల్పించాలని ఆమె సీఎంను కోరారు. సీఎంను కలిసిన అనంతరం సమీనా బీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని సీఎం కోరినట్లు తెలిపారు. దానికి సీఎం చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. తన పిల్లల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు. ఓటు ఎవరికి వేయాలనేది తన హక్కు అని చెప్పారు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించిందని అన్నారు. సీఎం శివరాజ్సంగ్ చౌహాన్.. ఎప్పుడూ తప్పు చేయరని, అందుకు ఆయన పార్టీ అయిన బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధిందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. -
Madhya Pradesh Assembly Election Results 2023: ఇందుగలదందులేదని...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ, ఆ క్రమంలో రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం ఏడు ప్రాంతాలకు గాను ఒక్క గ్వాలియర్–చంబల్లోనే కాంగ్రెస్ కాస్తో కూస్తో పోటీ ఇవ్వగలిగింది. ఆ ప్రాంతాన్ని రెండు పారీ్టలు చెరో సగం అన్నట్టుగా పంచుకున్నాయి. మిగతా ప్రాంతాలంతటా కమల సునామీయే అన్నట్టుగా సాగింది. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయఢంకా మోగించింది. దాంతో అధికారంపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. 8 శాతం పెరిగిన బీజేపీ ఓట్లు 2018ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పోలైన ఓట్లలో ఏకంగా 8 శాతం పెరుగుదల నమోదైంది! అప్పుడు పార్టీ 41.02 శాతం ఓట్లు సాధించగా ఈసారి దాన్ని 48.55కు పెంచుకుంది. దాంతో మూడింట రెండొంతుల విజయం సాధ్యపడింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో పెద్దగా మార్పు లేదు. దానికి 2018లో 40.89 శాతం రాగా ఈసారి 40.4 శాతం పోలయ్యాయి. 2018లో కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 0.8 శాతం ఓట్లు తక్కువే వచ్చాయి.అయినా బీజేపీకి 109 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 114 దక్కాయి! మాల్వా–నిమార్ ఈ ప్రాంతం 16 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. మొత్తం 73 స్థానాలు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 57 సీట్లు నెగ్గిన బీజేపీ 2018కి వచ్చేసరికి కేవలం 32 స్థానాలకు పరిమితమైంది. ఈసారి మాత్రం బాగా పుంజుకుని 20 సీట్లను పెంచుకుంది. ఏకంగా 52 స్థానాలను ఒడిసిపట్టింది. ఇక కాంగ్రెస్‌కు 2018లో ఈ ప్రాంతంలో 38 సీట్లొచ్చాయి. ఈసారి మాత్రం కమలం జోరు దెబ్బకు కాంగ్రెస్ 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతం నుంచి నెగ్గిన బీజేపీ ప్రముఖుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ తదితరులున్నారు. గ్వాలియర్–చంబల్ 34 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో మాత్రం బీజేపీ జోరుకు కాంగ్రెస్ కాస్త కళ్లెం వేయగలిగింది. బీజేపీ 19 సీట్లు నెగ్గగా కాంగ్రెస్ కూడా 15 స్థానాలను కైవసం చేసుకుంది. 2018లోనైతే ఆ పార్టీ ఇక్కడ ఏకంగా 26 సీట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో మొత్తమ్మీద 114 స్థానాలు సాధించి అధికారంలోకి రావడానికి మాల్వా–నిమార్‌తో పాటు ఈ ప్రాంతంలో అద్భుత ప్రదర్శన ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ప్రాంతం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచి్చన రాజ వంశీకుడు జ్యోతిరాదిత్య సింధియా కంచుకోట. ఈసారి బీజేపీ బాగా పుంజుకుని మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవడానికి, కాంగ్రెస్ చతికిలపడటానికి ప్రధానంగా సింధియా కరిష్మాయే కారణమైంది. ఇక్కడి నుంచి పోటీ పడ్డ ప్రముఖుల్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజయం సాధించగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా మాత్రం ఓటమి చవిచూడటం విశేషం! బుందేల్‌ఖండ్ 26 సీట్లున్న ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 20 స్థానాలు కొల్లగట్టింది. గతంతో పోలిస్తే దానికి 6 సీట్లు పెరిగాయి. 2018లో 10 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి ఆరింటితో సరిపెట్టుకుంది. రాష్ట్ర రాజధానితో కూడిన ఈ ప్రాంతంలో 20 స్థానాలున్నాయి. పరిసర ప్రాంతాలనూ కలుపుకుంటే 36 సీట్లుంటాయి. ఇక్కడ బీజేపీ ఈసారి 31 సీట్లు ఒడిసిపట్టింది. 2018లో ఇక్కడ 12 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి ఐదింటితో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నియోజకవర్గం బుధ్నీ ఈ ప్రాంతం కిందికే వస్తుంది. అక్కడినుంచి ఈసారి ఆయన ఏకంగా లక్షా నాలుగు వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. భోపాల్ మహాకోశల్ 47 స్థానాలున్న మహాకోశల్‌లో బీజేపీ ఈసారి 31 స్థానాలను ఒడిసిపట్టింది. 2018తో పోలిస్తే అదనంగా 14 సీట్లు నెగ్గింది. అప్పుడు 28 స్థానాలు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి 12 సీట్లు పోగొట్టుకుని 16కు పరిమితమైంది. ఇక్కడి నుంచి నెగ్గిన ప్రముఖుల్లో పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఉన్నారు. తన కంచుకోట ఛింద్వారా నుంచి ఆయన మంచి మెజారిటీతో గెలుపొందారు. కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే మాత్రం ఇక్కడి నివాస్ స్థానం నుంచి ఓటమి చవిచూడటం విశేషం. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ మాత్రం నర్సింగాపూర్ నుంచి విజయం సాధించారు. వింధ్య 30 అసెంబ్లీ సీట్లున్న ఈ ప్రాంతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అచ్చు గుద్దినట్టు పునరావృతమయ్యాయి. బీజేపీ 24 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లు దక్కాయి. ఇక్కడి సత్నా స్థానం నుంచి బీజేపీ ఎంపీ గణేశ్‌సింగ్ ఓటమి చవిచూశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Assembly Elections 2023: మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బీజేపీ కసరత్తు!
న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు సీనియర్ నేత విజయ్‌వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్‌లో మహంత్ బాలక్‌నాథ్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌషిక్, మాజీ ఏఐఎస్ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే. -
Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 230 స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ 163 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ 66 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు అయితే ఈ ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులలో చాలా మంది ఓటమిని చవిచూశారు. ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్, మేనల్లుడు ప్రియవ్రత్ సింగ్ సహా చాలా మంది బంధువులు వారి వారి నియోజకవర్గాల్లో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కొడుకు జైవర్ధన్ సింగ్ మాత్రమే రఘోఘర్ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక దిగ్విజయ్ మద్దతుదారులు అనేక మంది ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా లహర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ గోవింద్ సింగ్, రౌ నియోజకవర్గం జీతూ పట్వారీ ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలకు ముందు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ గెలుపు పట్ల చాలా విశ్వాసంగా కనిపించారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ఎలాగైనా గణనీయమైన స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోవాలని భావించినా ప్రజలు భిన్న తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలో అత్యంత సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ప్రస్తుత ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయనే చెప్పుకోవాలి. -
Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్‌లో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు. ఆద్యంతమూ ఆధిక్యమే... ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో తొలుత కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్‌గఢ్‌లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్‌లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నిరుత్సాహంలో కాంగ్రెస్ గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్‌లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. రాజస్తాన్ బీజేపీదే 115 అసెంబ్లీ స్థానాల్లో విజయం 69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గెహ్లోత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు. సీఎం గెహ్లోత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రా్రïÙ్టయ లోక్తాంత్రిక్ పార్టీ, రా్రïÙ్టయ లోక్‌దళ్ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ జోద్పూర్ జిల్లాలోని సర్దార్‌పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాషాయమే 163 స్థానాలు బీజేపీ కైవసం 66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్‌తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్‌కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో విరబూసిన కమలం 54 సీట్లతో బీజేపీ విజయహాసం 35 స్థానాలతో కాంగ్రెస్ ఓటమి రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. క్వింటాల్ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్‌దేవ్ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి చతికిలపడింది. సీఎం బఘెల్ తన సొంత నియోజకవర్గం పటన్‌లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘెల్ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్‌కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది. -
హ్యాట్రిక్‌కు గ్యారంటీ
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన హ్యాట్రిక్ విజయం.. 2024 ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల్లో సాధించబోయే హ్యాట్రిక్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ఘన విజయం తర్వాత ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ వందలాది మంది పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ మూడు రాష్ట్రాల్లో కలిపి హ్యాట్రిక్ సాధించాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే హ్యాట్రిక్ గెలుపునకు ఈరోజు విజయం గ్యారంటీని ఇస్తోంది. ఇది చక్కని సంకేతం. ఈ ఫలితాలు అహంకార ‘ఇండియా’ కూటమికి గట్టి హెచ్చరిక. ఆత్మనిర్భరత, పారదర్శక, సుపరిపాలన భారత్‌ను కాంక్షించే బీజేపీ ఎజెండాకు ఈ గెలుపు మద్దతుగా నిలిచింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా గతంలో విపక్షాల అగ్రనేతలు గ్రూప్ ఫొటో దిగటాన్ని మోదీ ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు. ‘‘ స్టేజీ మీద వారసత్వ నాయకులంతా ఒక్క చోటకు చేరితే మంచి ఫొటోలు దిగగలరు. కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలుపొందలేరు. ఈ ఫలితాలు కాంగ్రెస్, దాని గర్విష్ఠి కూటమికి పెద్ద గుణపాఠం నేర్పాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల నమ్మకాన్ని పెంచుతోంది మోదీ సర్కార్ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి తమ నేతలపై తప్పుడు అవినీతి కేసులను బనాయిస్తోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను మోదీ ప్రస్తావించారు. ‘ అవినీతికి వ్యతి రేకంగా మేం చేస్తున్న పోరాటానికి ప్రజలు ఈ ఫలితాల రూపంలో మాకు మద్దతు పలికారు. అవినీతిలో మునిగిన పారీ్టలకు ఓటర్లు ఈ ఫలితాల రూపంలో వారి్నంగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి, ప్రజలకు మధ్య మరెవరూ రాలేరు. ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఓటర్లు ఇలాగే తీసి పక్కనపడేస్తారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు నాదో విన్నపం. దేశాభివృద్ధి ఊపందుకున్న ఈ తరుణంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాజకీయాలు చేయొద్దు. దేశాన్ని విభజించే, విచి్ఛన్నం చేసే శక్తులతో జట్టుకట్టొద్దు’’ అని హితవు పలికారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో దేశ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేందుకు కష్టపడుతుంటాయి. అదను కోసం ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి వారితో జాగ్రత్త’ అంటూ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. ‘ఈ గెలుపు భారత్‌పై ప్రపంచదేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఇది భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ‘అభివృద్ధి చెందిన భారత్’ సాకారం కోసం మనం చేపడుతున్న ఎజెండాకు ప్రజా మద్దతుకు లభిస్తోందని ఈ ఫలితాలు చాటుతున్నాయి. దేశంలో చక్కటి మెజారిటీతో అధికారంలోకి వచ్చే సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్న విషయాన్ని ప్రపంచదేశాలు కళ్లారా చూశాయి’’ అని మోదీ అన్నారు. ఈ భూతాలను బీజేపీయే తరిమికొట్టగలదు ‘అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాల ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలనే ఈ మూడు భూతాలను తరిమికొట్టే సత్తా ఒక్క బీజేపీకే ఉందని యావత్ భారతదేశమే భావిస్తోంది. అవినీతి భరతం పట్టే బీజేపీకి ఇప్పటికే దేశవ్యాప్త మద్దతు దక్కుతోంది. అవినీతితో అంటకాగే నేతలకు ఇది సూటి హెచ్చరిక. అవినీతిపరులకు రక్షణగా ఉండే వ్యక్తులు, తప్పులను దాచిపెట్టే వ్యక్తులే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాళ్లొకటి గమనించాలి. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజా మద్దతు ఉందని ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా ఈ వ్యక్తులు అర్ధం చేసుకోవాలి’’ అని విపక్షాలను పరోక్షంగా విమర్శించారు. ఆ కులాల సాధికారత దేశ సాధికారత ‘‘దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అని దేశంలో నాలుగే పెద్ద కులాలున్నాయి. ఈ కులాలు సాధికారత సాధించిననాడే దేశ సాధికారత సాధ్యపడుతుంది. దేశంలో దాదాపు అన్ని ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగల వారంతా ఈ నాలుగు వర్గాల్లోనే ఉన్నారు. బీజేపీ తమ విధాన నిర్ణయాలు, పథకాల ద్వారా వీరి సాధికారతకు కృషిచేస్తోంది. ఈ ఫలితాలొచ్చాక మేం గెలిచామని ప్రతి ఒక్క రైతు, యువజన ఓటరు, పేద, అణగారిన వర్గాల వ్యక్తులు గొంతెత్తి నినదిస్తున్నారు. గొప్ప భవిష్యత్తు కోసం యువత కలలు కంటోంది. ఈ రోజు ఫలితాలు చూశాక 2027కల్లా అభివృద్ధిచెందిన భారత్ సాకారం అవుతుందని ప్రతి ఒక్క పౌరుడు భరోసాగా ఉన్నాడు. నిజాయితీగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీ స్వప్నం సాకారమవ్వాలనేదే నా సంకల్పం. ప్రపంచంలో భారత ఆర్థికాభివృద్ధి దూసుకుపోతూ దేశ మౌలికరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ స్వప్నాలు సాకారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ మోదీనే ఎంచుకుంటారు’’ అని రాసి ఉన్న భారీ కటౌట్‌ను బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. -
మామా.. సీఎం మామా!
మధ్యప్రదేశ్‌లో బీజేపీ సాధించిన ఘనవిజయం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌తో హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ గెలవవచ్చని భావించినా, ఈ స్థాయి విజయం మాత్రం అనూహ్యమే. ఎందుకంటే మధ్యలో 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయిస్తే రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీదే అధికారం. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం దాకా కూడా కొట్టొచ్చినట్టుగా కని్పంచిన ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీ, ముఖ్యంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సమర్థంగా అధిగమించిన వైనం అబ్బురపరిచేదే. రాష్ట్ర ప్రజలు ప్రేమగా ‘మామ’ అని పిలుచుకునే చౌహాన్ ఈ విషయంలో ముందునుంచే పక్కాగా వ్యవహరిస్తూ వచ్చారు. ఒక్కొక్కటిగా పలు ప్రజాకర్షక పథకాలను తెరపైకి తెస్తూ ప్రజల్లో అసంతృప్తిని తగ్గించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ మేనియా, బూత్ స్థాయి నుంచి పక్కా ఎన్నికల ప్రణాళిక, పారీ్టపరంగా వ్యవస్థాగతమైన బలం వంటివన్నీ అందుకు తోడయ్యాయి. వ్యక్తిగతంగా శివరాజ్‌కు ఉన్న మంచి పేరు కూడా బాగా కలిసొచ్చింది. వివాదాలకు దూరంగా నిరాడంబర వ్యక్తిత్వంతో రాష్ట్ర ప్రజల మనసుల్లో ఆయన పట్ల మొదటి నుంచీ ఉన్న సానుకూల భావన ఓట్ల రూపంలోనూ ప్రతిఫలించింది. ఇక సమన్వయరాహిత్యం కాంగ్రెస్ పార్టీని ఈసారి బాగా దెబ్బ తీసింది. పీసీసీ చీఫ్ కమల్‌నాథ్, అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్ మధ్య విభేదాలు ప్రచార పర్వంలో పలుసార్లు తెరపైకి వచ్చాయి. ‘లాడ్లీ’ సూపర్ హిట్... ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు ప్రజాకర్షక పథకాలకు శివరాజ్ తెర తీస్తూ వచ్చారు. అధికారంలోకి వస్తే నారీ సమ్మాన్ నిధి పేరిట ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీకి ప్రతిగా లాడ్లీ బెహనా యోజన తీసుకొచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,250 చొప్పున ఇచ్చే ఈ పథకం బాగా హిట్టయింది. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3,000కు పెంచుతానని కూడా శివరాజ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2.72 కోట్ల మహిళా ఓటర్లుంటే, ఏకంగా కోటిన్నర మంది మహిళలు దీని లబి్ధదారులు! ఇది బీజేపీకి బాగా కలిసి వచి్చందని భావిస్తున్నారు. అంతేగాక శివరాజ్‌పై అధిష్టానం అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ఆయన్ను తిరిగి సీఎం అభ్యర్థి రేసులో బలంగా నిలిపింది. అంతర్గత సమస్యలను అధిగమిస్తూ... ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి మధ్యప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా కూడా ఏమీ లేదు. సుదీర్ఘ కాలంగా సీఎంగా ఉన్న 64 ఏళ్ల శివరాజ్ పని కూడా అయిపోయిందని, ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ కెరీర్‌కు తెర పడ్డట్టేనన్న ప్రచారమూ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకునేందుకు అధిష్టానం కూడా ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తూ వచి్చంది. సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించలేదు. ఇటు బీజేపీలో అంతర్గతంగా కూడా పరిస్థితులు గొప్పగా లేవు. నేతల గ్రూపు తగాదాలతో పాటు కార్యకర్తల్లోనూ నిస్తేజం ఆవహించిన పరిస్థితి! అలాంటి స్థితిని క్రమంగా బీజేపీకి అనుకూలంగా మార్చడంలో, నేతల్లో ఐక్యత సాధించడంతో పాటు కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంలో శివరాజ్ విజయం సాధించారు. తనను సీఎం అభ్యరి్థగా ప్రకటించకపోయినా ఎన్నికల బాధ్యతలను తలకెత్తుకుని నడిపించారు. మేరా బూత్, సబ్ సే మజ్బూత్... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి బీజేపీ ముందునుంచే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచి్చంది. గత జూలై నుంచే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా, మరో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయనకు డిప్యూటీగా నియమించింది. ఇంకోమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ కనీ్వనర్‌గా వేసి ప్రతి విషయంలోనూ ముందునుంచే శ్రద్ధ తీసుకుంది. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ సూచించిన ‘మేరా బూత్, సబ్ సే మజ్బూత్’ కార్యక్రమం మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీకి మంచి ఫలితాలిచి్చంది. బలమైన స్థానిక నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో బూత్ పరిధిలో పార్టీ అవకాశాలను బలోపేతం చేసే బాధ్యతను నాయకత్వం అప్పగించింది. వారి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహించింది. దీనికి తోడు మోదీ కూడా రాష్ట్రంలో ప్రచారంతో హోరెత్తించారు 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాలకు యువతతో పాటు మహిళలు విపరీతంగా స్పందించారు. ‘ఎంపీ (మధ్యప్రదేశ్) మనసులో మోదీ, మోదీ మనసులో ఎంపీ’ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Madhya Pradesh: చౌహాన్ చరిష్మా.. బీజేపీ ఘన విజయానికి కారణాలివే..
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తన అత్యుత్తమ రాజకీయ విజయాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిన విజయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయానికి దోహదం చేసిన ఐదు కీలక అంశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిపై పట్టు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రారంభంలోనే అర్థం చేసుకుంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తీవ్రమైన గ్రౌండ్ వర్క్ చేశారు. కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలు ఎన్నికలలో పోటీ చేశారు. 'లాడ్లీ బహ్నా' పథకం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా 'లడ్లీ బహనా' పథకం చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని నడిపించింది. మధ్యప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే 'లాడ్లీ బెహనా' పథకాన్ని ప్రారంభించిన బీజేపీ మహిళా కార్డు అధికార పార్టీకి బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. సామాన్యులకు అందుబాటులో చౌహాన్ సామాన్యులకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పేరుంది. ఆయన్ను ఇక్కడి ప్రజలు 'మామా'గా పిలుచుకుంటారు. బీజేపీ సంస్థాగత బలం బీజేపీ సంస్థాగత బలం, దాని హిందుత్వ కార్డు, ప్రధానమంత్రి అభివృద్ధి మంత్రం, ప్రచారంలో జాతీయ అహంకారం గురించి మాట్లాడటం బీజేపీకి బాగా పనిచేసినట్లు కనిపించింది. ప్రభావవంతమైన పోల్ వ్యూహం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భోపాల్‌లో మోదీ ప్రారంభించిన ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
Madhya Pradesh: బీజేపీ కార్యకర్తల సంబరాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించి మెజారిటీ మార్కును సునాయాసంగా అధిగమించి భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో సంబరాలు మిన్నంటాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం భోపాల్‌లోని తన నివాసంలో సంతోషంగా కనిపించారు. తన కుటుంబంతో కలిసి విజయ సంకేతాన్ని చూపుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచకుని సందడి చేశారు. చౌహాన్ తన కుటుంబంతో సహా భోపాల్‌లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను పలకరించారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 66 స్థానాల్లో ముందంజలో ఉంది. -
Madhya Pradesh: ‘పాంచ్’ పంచ్.. ఐదోసారి అధికారం దిశగా బీజేపీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో స్పష్టమైన మెజార్టీతో అధికారం దిశగా బీజేపీ పయనిస్తోంది. 230 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాషాయ పార్టీ 160పైగా నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేక మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందా అన్నది చూడాలి. నాలుగుసార్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారిగా 2005లో మొదటి సారిగా సీఎం అయ్యారు. ఆ తర్వాత 2008లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో మరోసారి గెలిచి బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మూడోసారి సీఎంగా చేసింది. 2018 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 109 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2020లో ఆ పార్టీ సీనియర్ జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చౌహాన్ బంపర్ మెజార్టీ మధ్యప్రదేశ్ 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో 1,04,974 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మొత్తం 1,64,951 ఓట్లు వచ్చాయి. -
Madhya Pradesh: బీజేపీ తొలి విజయం
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నమోదు చేసింది. బుర్హాన్పూర్ జిల్లాలోని నేపానగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గెందూ బాయి ఓటమి పాలయ్యారు. మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు పోలవగా సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. -
MP: దూసుకెళ్తున్న ‘మామ’.. బంపర్ మెజార్టీలో సీఎం చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి కమల్ నాథ్ చింద్వారాలో వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ 56,124 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్ విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్య మంత్రి లాడ్లీ బెహనా యోజన పథకం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిందని నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహిళలు చౌహాన్‌పై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు. -
MP: చారిత్రక విజయం మాదే.. మాజీ సీఎం కోడలు ధీమా
భోపాల్: మధ్యప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 160 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 67 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. కాగా మధ్యప్రదేశ్‌లో తాము చారిత్రక విజయం సాధిస్తున్నట్లు మాజీ సీఎం బాబూలాల్ గౌర్ కోడలు, గోవింద్‌పురా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని కృష్ణ గౌర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 2024 లోక్‌సభ ఎన్నకలలో రాష్ట్రంలోని 29 స్థానాల్లోనూ విజయం సాధించడమే తమ తదుపరి లక్ష్యమని కృష్ణ గౌర్ పేర్కొన్నారు. -
MP Election Results 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ గెలుపు
Live Updates.. 160 సీట్లలో బీజేపీ విజయం, మరో 3 చోట్ల ఆధిక్యం 63 చోట్ల కాంగ్రెస్ విజయం, 2 స్థానాల్లో ముందంజ 163 స్థానాల్లో బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో 155 సీట్లలో బీజేపీ విజయం, మరో 12 చోట్ల ముందంజ 61 చోట్ల కాంగ్రెస్ విజయం, 5 స్థానాల్లో ముందంజ ఒక సీటు గెలిచిన భారత్ ఆదివాసీ పార్టీ 152 స్థానాల్లో బీజేపీ విజయం మధ్యప్రదేశ్‌లో 152 సీట్లలో గెలుపొందిన బీజేపీ, మరో 12 చోట్ల ఆధిక్యం 56 చోట్ల కాంగ్రెస్ విజయం, 9 స్థానాల్లో ముందంజ ఒక చోట భారత్ ఆదివాసీ పార్టీ గెలుపు మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ 122 స్థానాలలో బీజేపీ విజయం. మరో 42 చోట్ల ఆధిక్యం 36 చోట్ల కాంగ్రెస్ గెలుపు. 29 నియోజకవర్గాల్లో ముందంజ. 60 దాటిన బీజేపీ విజయాలు ఇప్పటివరకూ 61 స్థానాల్లో బీజేపీ గెలుపు. 105 స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యం. 15 చోట్ల కాంగ్రెస్ విజయం, 48 స్థానాల్లో ముందంజ. ► మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. #WATCH | A clash broke out between BJP and Congress workers in Madhya Pradesh's Shajapur; police used lathi charge to disperse them. More details awaited. pic.twitter.com/lXBEtzumme — ANI (@ANI) December 3, 2023 మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు బీజేపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. 159 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. 62 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. భారతీయ ఆదివాసీ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. బీజేపీ తొలి విజయం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నేపానగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపు. మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు. ► మధ్యప్రదేశ్‌లో భారీలో లీడింగ్‌లో ఉన్న బీజేపీ. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. కేంద్రమంత్రి ఆశ్విణి వైష్ణవ్, పార్టీ నేతలతో సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan and Union Minister and BJP leader Ashwini Vaishnaw exchange sweets as the party leads in #MadhyaPradeshElection2023 pic.twitter.com/H2zbIatcn5 — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 164 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 63 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 2 స్థానాల్లో లీడింగ్ ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌లో దూసుకుపోంది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్తో కలిసి బీజేపీ నేతలు నరేంద్రసింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సిందియా ఇతర పార్టీ నేతలు.. సీఎం చౌహాన్ నివాసంలో కౌంటింగ్ తీరును పరిశీలిస్తున్నారు. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan along with party leaders Narendra Singh Tomar and Jyotiraditya Scindia observes election results as the counting of votes continues, in Bhopal As per ECI, the BJP is leading on 153 seats in MP. pic.twitter.com/frlpg9rpdv — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు బీజేపీ 158 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 69 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 2 స్థానంలో లీడింగ్ ► బీజేపీకి భారీ విజయం లభిస్తుందని నమ్మకం: అశ్విని వైష్ణవ్ బీజేపీకి భారీ విజయం లభించిందని, దానిపై తాము నమ్మకంగా ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించారని పేర్కొన్నారు. #WATCH | Madhya Pradesh: Union Minister and BJP leader Ashwini Vaishnaw says, "BJP has got a big victory and we were confident about it...Modi ji MP ke mann mein hain aur Modi ji ke mann mein MP hai..." pic.twitter.com/uR44egMD7V — ANI (@ANI) December 3, 2023 ► ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుంది: సీఎం శివరాజ్ మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్ ఉన్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన ప్రజల హృదయాలను కదిలించారని, దాని ఫలితం ఇదేనని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి, మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పథకాలు కూడా ప్రజల హృదయాలను హత్తుకున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఒక కుటుంబంగా మారిందని, ప్రజలు తమపై ఉన్న ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుందని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. అది ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. #WATCH | #MadhyaPradeshElections2023 | Incumbent CM Shivraj Singh Chouhan says, "Modi ji MP ke mann mein hain aur Modi ji ke mann mein MP hai. He held public rallies here and appealed to the people and that touched people's hearts. These trends are a result of that. Double-engine… pic.twitter.com/MHOUthgsR — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 150 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 64 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 1 స్థానంలో లీడింగ్ ► మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్: వీడి శర్మ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి మోదీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్తల కృషితో ప్రతి బూత్‌లో 51% ఓటింగ్ తీర్మానాన్ని నెరవేరుస్తున్నందుకు తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను చూసి ప్రజలు ప్రధాని మోదీని ఆశీర్వదించారని తెలిపారు. #WATCH | #MadhyaPradeshElections2023 | As BJP crosses the halfway mark and leads on 133 seats in the state as per official EC trends, Madhya Pradesh BJP president VD Sharma says, "We had said 'Madhya Pradesh ke mann mein Modi aur Modi ke mann mein Madhya Pradesh' - people blessed… pic.twitter.com/EWl9zYkijP — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 148 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 60 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 1 స్థానంలో ముందంజ. ► ఇలాంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కాకూడదు: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కావొద్దని సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి విషాదం పునరావృతం కావొద్దని, దానిని నిర్ధారించడానికి, అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు. బాధితులకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన తెలిపారు. #WATCH | On the anniversary of the 1984 Bhopal Gas tragedy, Madhya Pradesh CM SS Chouhan says, "Such a tragedy should never get repeated. To make sure of this, there should be a balance between development and the environment. I pay my tributes to the victims of this tragedy." pic.twitter.com/NjGJ39iN6x — ANI (@ANI) December 3, 2023 ► బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుంది: నరోత్తమ్ మిశ్రా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి, దతియా సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. #WATCH | #MadhyaPradeshElections2023 | State Home Minister and BJP candidate from Datia, Narottam Mishra says, "BJP will win 125-150 seats. Not only in Madhya Pradesh but the BJP will also form government in Rajasthan and Chhattisgarh..." pic.twitter.com/wzmOtoxTYc — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 133 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 52 స్థానాల్లో లీడింగ్. ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాతున్న క్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా భోపాల్‌లోని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజ. #WATCH | Madhya Pradesh | Union Minister and BJP leader Jyotiraditya Scindia arrives at the residence of incumbent Chief Minister Shivraj Singh Chouhan, in Bhopal. As per the latest official EC trends, BJP is leading on 73 seats and Congress on 28 in the state. pic.twitter.com/q9beNm7ybh — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం: ప్రహ్లాద్ సింగ్ పటేల్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని కేంద్రమంత్రి, నర్సింగపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గతం కంటే ఈసారి మెరుగ్గా పనిచేస్తామని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వస్తున్న ట్రెండ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. #WATCH | Union Minister and BJP candidate from Narsinghpur says, "I have always said that in Madhya Pradesh, the BJP will come to power with a huge mandate... I had already said that we would perform better in the elections in five states than last time. The trends that are… pic.twitter.com/tr0oy3kRp7 — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజ. In initial trends, BJP leading on 73 seats, Congress on 28 seats in Madhya Pradesh pic.twitter.com/ESwsSQqkwy — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కమల్ నాథన్ భోపాల్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమై కౌంటింగ్ ట్రెండ్‌ను పరిశీలిస్తున్నారు. ►బీజేపీ 37 స్థానాల్లో లీడింగ్. ► కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజ. #WATCH | Madhya Pradesh Congress president Kamal Nath and other leaders of the party gather at the state party office in Bhopal. As per the latest official EC trends, BJP is leading on 37 seats and the Congress on 7 seats in the state. pic.twitter.com/MNGpStJQcN — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడ్ మధ్యప్రదేశ్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటి వరకు బీజేపీ.. 13 కాంగ్రెస్.. 2 #WATCH | Counting of votes underway for #MadhyaPradeshElections2023. Visuals from a counting centre in Chhatarpur. As per the latest official EC trends, BJP is leading on 13 and Congress on 2 seats here. pic.twitter.com/cWxKEWo6eF — ANI (@ANI) December 3, 2023 ► పోస్టల్ బ్యాలెట్లో సాగర్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. షాజాపూర్‌లో బీజేపీ 5,645 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో కాంగ్రెస్‌కు 4,392 ఓట్లు వచ్చాయి. శివపురిలో బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్ 2,322 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దామోలోని జబేరా అసెంబ్లీ స్థానం నుంచి ధర్మేంద్ర సింగ్ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్లో ధర్మేంద్ర సింగ్‌కు 4,272 ఓట్లు, ప్రతాప్ సింగ్‌కు 2,425 ఓట్లు, వినోద్ రాయ్‌కు 1,431 ఓట్లు వచ్చాయి. జైత్‌పూర్‌లోని షాదోల్ నుంచి కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలీరాజ్‌పూర్‌లో బీజేపీ 2,200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. జోబాట్‌లో కాంగ్రెస్ 1,100 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఖర్గోన్లో బీజేపీ అభ్యర్థి బాలకృష్ణ పటీదార్ ఆధిక్యంలో ఉన్నారు. భగవాన్పురా కాంగ్రెస్‌కు చెందిన కేదార్ డాబర్ ముందంజలో ఉన్నారు. కస్రవాడలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సచిన్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. షాదోల్ జిల్లా జైసింగ్ నగర్లో బీజేపీ ముందంజలో ఉంది. సాంచిలోని రైసన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. భోజ్‌పూర్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఉదయపురాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సిల్వానీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ► జబల్పూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన నివాసంలో.. విజయం సాధించాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. ► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్స్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఇక్కడ 216 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 126 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► జబల్పూర్ జిల్లాలోని పటాన్ స్థానంలో బీజేపీ 2811 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నార్త్ సెంట్రల్ అసెంబ్లీలో బీజేపీ 3311 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బార్గీలోనూ బీజేపీ ముందంజలో ఉంది. చింద్వారాలో బీజేపీకి చెందిన మోనికా బట్టీ అమరవారా ముందంజలో ఉన్నారు. చౌరాయ్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. సౌసర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. చింద్వారాలో కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ముందంజలో ఉన్నారు. పాంధుర్ణంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బుర్హాన్పూర్లో బీజేపీ అభ్యర్థి అర్చన చిట్నీస్ తొలి రౌండ్లో ముందంజలో ఉన్నారు. ఖర్గోన్ జిల్లాలోని కస్రావాడ్ నుంచి బీజేపీ 821 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నర్సింగపూర్‌లో తొలి రౌండ్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ఒక బూత్‌లో 47 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► తొలి ట్రెండ్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 208 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► సెహోర్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. సెహోర్ అసెంబ్లీలో బీజేపీ 163 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అష్టాలో కాంగ్రెస్ 341 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బుద్నీలో సీఎం శివరాజ్ ముందంజలో ఉన్నారు. ఇచ్ఛావర్‌లో తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ► గ్వాలియర్‌లోని దబ్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే వెనుకంజలో ఉన్నారు. గ్వాలియర్ రూరల్ స్థానంలో బీజేపీకి చెందిన భరత్ సింగ్ కుష్వాహ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాహిబ్ సింగ్ గుర్జార్ ముందంజలో ఉన్నారు. గ్వాలియర్-ఈస్ట్ స్థానంలో బీజేపీకి చెందిన మాయా సింగ్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ సతీష్ సికార్వార్ ముందంజలో ఉన్నారు. పన్నాలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో ఉంది. పొవాయ్ స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. షాదోల్‌లోని బియోహరి స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. బర్వానీలోని సెంద్వా స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ సంచలనం సృష్టిస్తొంది. 137 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుణ జిల్లా రఘోఘర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జైవర్ధన్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా ప్రజానీకం తమ వెంటే ఉన్నారని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఎన్ని సీట్లు వస్తాయనేది నేనేమి చెప్పాలేను. మేమైతే విజయంపై నమ్మకంగా ఉన్నామన్నారు. ► మధ్యప్రదేశ్‌లో 113 సీట్ల తొలి ట్రెండ్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గ్వాలియర్‌లో పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ► మధ్యప్రదేశ్‌లో తొలుత 42 సీట్ల ట్రెండ్ వెలువడింది. బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాతియాకు చెందిన నరోత్తమ్ మిశ్రా ప్రారంభ ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు. ► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్ మొదలైంది. ఈ ధోరణి కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా మొరెనా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తెరిచారు. రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ►కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ముందు నుంచి నేను ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీజేపీ గెలిచే అవకాశమే లేదు. #WATCH | Counting of votes | Bhopal, Madhya Pradesh: Senior Congress leader Digvijaya Singh says, "...I had said this earlier and I say it today as well - 130 plus. We are getting 130 seats, rest is to be seen." On incumbent CM Shivraj Singh Chouhan, he says, "Not only is his… pic.twitter.com/y1NhF5f36R — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. Counting of votes for Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana Assembly elections begins. pic.twitter.com/Raj87zBuaI — ANI (@ANI) December 3, 2023 ►కౌంటింగ్ వేళ కాంగ్రెస్ నేతల హంగామా.. #WATCH | Music, dance and celebrations outside the Congress headquarters in Delhi, ahead of the counting of votes for the four-state elections. pic.twitter.com/ex9OmkBwFQ — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. Counting of votes in 4 States today Congress leader PC Sharma in Bhopal says, "The party will win 135-175 seats in Madhya Pradesh." pic.twitter.com/ObENIXU1x3 — ANI (@ANI) December 3, 2023 #WATCH | Bhopal, Madhya Pradesh: On counting of votes, BJP candidate Rameshwar Sharma says, "There will be a shower of blessings & BJP government will be formed...What has Congress given to the people in its 62 years of politics?..." pic.twitter.com/9Q6VjqY7um — ANI (@ANI) December 3, 2023 #WATCH Bhopal, Madhya Pradesh: On counting of votes, BJP leader Arvind Singh Bhadoria says, "With the blessings of the public, the BJP government is going to be formed in Madhya Pradesh under the leadership of Shivraj Singh. If there was anyone who stood in the interests of the… pic.twitter.com/03LqAO9ftk — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. ►2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116