దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి కొత్త నీరు శరవేగంగా చేరుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టగల ఈ ధోరణి తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచి్చనట్టు కని్పంచింది. వాటన్నింటిలో కలిపి ఏకంగా 38 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరారు! మెజారిటీ సాధనలో వెటరన్ ఎమ్మెల్యేలదే పై చేయిగా నిలిచినా, రాజకీయ రంగంలో మాత్రం మొత్తమ్మీద కొత్త గాలులు వీస్తున్నాయనేందుకు ఈ ఎన్నికలు స్పష్టమైన సూచికగా నిలిచాయి.
మూడింట్లో కొత్తవారి జోరు
మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజేతల జాబితాను పరిశీలిస్తే ఇప్పటికే కనీసం రెండు నుంచి మూడుసార్లు నెగ్గిన అనుభవజు్ఞలైన ఎమ్మెల్యేలు అందులో 38 శాతం మంది ఉన్నారు. అయితే సరిగ్గా అంతే శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇప్పటికే మూడుసార్లకు మించి ఎమ్మెల్యేలుగా చేసిన వెటరన్లలో ఈసారి 24 శాతం మంది గెలుపొందారు.
రాష్ట్రాలవారీగా చూస్తే తొలిసారి ఎమ్మెల్యేల జాబితాలో గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ టాప్‌లో నిలవడం విశేషం. అక్కడ ఈసారి మొత్తం 90 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 52 శాతం మంది కొత్త ముఖాలే! వెటరన్లు కేవలం 18 శాతం కాగా అనుభవజు్ఞలు 30 శాతమున్నారు. తెలంగాణలో కూడా 119 మంది ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది తొలిసారి ఎన్నికైనవారే! ఈ దక్షిణాది రాష్ట్రంలో 21 శాతం మంది వెటరన్లు, 34 శాతం మంది అనుభవజు్ఞలు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కూడా 40 మంది ఎమ్మెల్యేల్లో 47 శాతం మంది కొత్తవారున్నారు. వెటరన్లు 18 శాతం, అనుభవజు్ఞలు 35 శాతంగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో మాత్రం కొత్తవారి హవా కాస్త పరిమితంగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం వెటరన్లు 31 శాతం మంది ఉండగా అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేల శాతం 36గా ఉంది. రాష్ట్రంలో 33 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజస్తాన్ ఎమ్మెల్యేల్లో మాత్రం 46 శాతం మంది అనుభవజ్ఞులే. వెటరన్లు 24 శాతం కాగా తొలిసారి నెగ్గినవారు 30 శాతమున్నారు.
మెజారిటీలో వెటరన్లదే పైచేయి
ఓవరాల్ గెలుపు శాతంలో వెనకబడ్డా, మెజారిటీ సాధనలో మాత్రం వెటరన్లు సత్తా చాటారు. మూడు రాష్ట్రాల్లో కొత్తవారు, అనుభవజు్ఞల కంటే ఎక్కువ మెజారిటీని వెటరన్లు సాధించారు. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి చూస్తే వెటరన్లు సగటున 22,227 ఓట్ల మెజారిటీ సాధించగా కొత్తవారు 20,868 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక అనుభవజు్ఞల సగటు మెజారిటీ 20,495 ఓట్లు. జనాకర్షణలో వెటరన్లు ఇప్పటికీ సత్తా చాటుతున్నారనేందుకు వారు సాధించిన మెజారిటీలు నిదర్శనంగా నిలిచాయి.
పార్టీలవారీగా చూస్తే...
ఇక ఐదు రాష్ట్రాల ఫలితాలను పార్టీలవారీగా చూస్తే బీజేపీ ఎమ్మెల్యేల్లో కొత్తవారు 38 శాతం మంది ఉన్నారు. 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 27 శాతం మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనుభవజ్ఞులు బీజేపీ కంటే ఎక్కువగా 43 శాతం మంది ఉన్నారు. తొలిసారి నెగ్గిన వారు 34 శాతం కాగా వెటరన్లు 23 శాతంగా తేలారు. ఇతర పార్టీలన్నీ కలిపి చూస్తే కొత్త ఎమ్మెల్యేలు ఏకంగా 47 శాతముండటం విశేషం! 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 19 శాతానికి పరిమితమయ్యారు. చిన్న, ప్రాంతీయ పార్టీల్లో కొత్త వారి జోరు ఎక్కువగా ఉందనేందుకు ఇది స్పష్టమైన సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment