Telangana Assembly Election Results 2023
-
ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. సహజంగా ఓడిపోతే బాధపడతారు. కాని బండి సంజయ్ ఓడినందుకు ఏమాత్రం బాధపడటంలేదన్నది పార్టీలో టాక్. మళ్ళీ ఎంపీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు బండి. తెలంగాణ బీజేపీలో స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన బండి సంజయ్‌కు ఎంపీగా ఉండటమే ఇష్టమంటున్నారు. పార్టీ హైకమాండ్ బలవంతం మీదే ఎమ్మెల్యేగా పోటీ చేశారట. అసలు బండికి ఎంపీ పదవంటే అంత మోజు ఎందుకు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ఆ పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు.. మరికొన్ని మరకలు అలా ఒకదాని వెంట మరొకటి అలా కనిపిస్తూనే ఉంటాయన్నది టాక్. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్ వంటివారితో పొసగకపోవడం.. బయట వినిపించిన కొన్ని ప్రచారాలతో మొత్తానికి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయారు. పార్టీ పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కుతుండవచ్చని అంతా ఊహించారు. బండిలో కూడా ఏదో ఓ మూల ఆ ఆశ ఉండేది. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినా.. చాలాకాలం బండి సంజయ్ ఫీవర్ మాత్రం బీజేపీ క్యాడర్ ను వెంటాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కు హెలిక్యాప్టర్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రచారం చేయించిందంటేనే.. మాస్ లీడర్‌గా బండి అవసరం ఎంతుందో పార్టీ గమనించిందనే అనుకోవాలి. అయితే అసెంబ్లీ బరిలో నిలబడటానికి ససేమిరా అన్న బండిని.. రెండుసార్లు ఓడిన కరీంనగర్ సీటులోనే మూడోసారి బరిలోకి దింపింది. దీంతో మొదట నారాజ్ గానే ఉన్న బండి సంజయ్ ప్రచారంలో మెరుపులు మెరిపించారు. ఒక దశలో అన్ని సర్వేలు, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బండిదే విజయమని తేల్చాయి. కానీ, ఎప్పుడూ కరీంనగర్ అసెంబ్లీ ఫలితాల్ని ప్రభావితం చేసే ముస్లిం మైనార్టీ ఓట్లే ఈసారి కూడా బీఆర్ఎస్ కే ఎక్కువగా పోలవ్వడంతో పాటుగా..హిందూ ఓట్ పోలరైజేషన్ బండిని గెలిపించే స్థాయిలో టర్న్ కాలేదు. దీంతో బండి సంజయ్ కరీంగనర్ అసెంబ్లీ బరిలో మళ్ళీ దెబ్బతిన్నారు. అయితే బండిపై గెలిచిన గంగుల కమలాకర్‌కు వచ్చిన మెజారిటీ 3 వేల ఓట్ల పైచిలుకే కావడంతో..ఆయనకు చాలా ఊరట కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరిదాకా వచ్చి ఓడిపోయానన్న బాధ కొద్ది రోజులు కనిపించినా.. ఈసారి పోలైన ఓట్ల సంఖ్య బాగా పెరగడంతో మరోవైపు ఆనందం కనిపించింది. అదే సమయంలో తాననుకున్నట్లే మళ్లీ ఎంపీ బరిలో నిలిచేందుకు రూట్ క్లియర్ అయిందన్న భావన కనిపిస్తోంది. సాధారణంగా గెలిచిన వారు పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బండి సంజయ్ తాను ఓటమి పాలైనా.. తన కొరకు కష్టించిన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, బంధు మిత్రులందిరినీ పిలిచి ఓ పెద్ద విందే ఏర్పాటు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలే తన టార్గెట్ గా బండి ప్రయత్నాలు మొదలెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఓవైపు పార్టీలోనే తన అంతర్గత శత్రువుల్లా తయారైన ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ వంటివారికి తన సోషల్ మీడియా టీమ్స్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బయటి ప్రత్యర్థులతో పోటీకి సిద్ధమయ్యేందుకు బండి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తంగా కార్పోరేటర్ స్థాయి నుంచి ఎదిగిన బండి రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు, మరికొన్ని విజయాలు కలిసి.. బాగా రాటుదేల్చాయనే కామెంట్స్ పొల్టికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: దక్షిణ తెలంగాణపై ఫోకస్.. బీజేపీ వ్యూహం ఏంటి? -
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి. ► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌లోనే.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి. ► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి. -
అక్కడి ఓటు..ఇక్కడి గుట్టు !
-
Five States Election: అసెంబ్లీలలో కొత్త నీరు
దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి కొత్త నీరు శరవేగంగా చేరుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టగల ఈ ధోరణి తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచి్చనట్టు కని్పంచింది. వాటన్నింటిలో కలిపి ఏకంగా 38 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరారు! మెజారిటీ సాధనలో వెటరన్ ఎమ్మెల్యేలదే పై చేయిగా నిలిచినా, రాజకీయ రంగంలో మాత్రం మొత్తమ్మీద కొత్త గాలులు వీస్తున్నాయనేందుకు ఈ ఎన్నికలు స్పష్టమైన సూచికగా నిలిచాయి. మూడింట్లో కొత్తవారి జోరు మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజేతల జాబితాను పరిశీలిస్తే ఇప్పటికే కనీసం రెండు నుంచి మూడుసార్లు నెగ్గిన అనుభవజు్ఞలైన ఎమ్మెల్యేలు అందులో 38 శాతం మంది ఉన్నారు. అయితే సరిగ్గా అంతే శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇప్పటికే మూడుసార్లకు మించి ఎమ్మెల్యేలుగా చేసిన వెటరన్లలో ఈసారి 24 శాతం మంది గెలుపొందారు. రాష్ట్రాలవారీగా చూస్తే తొలిసారి ఎమ్మెల్యేల జాబితాలో గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ టాప్‌లో నిలవడం విశేషం. అక్కడ ఈసారి మొత్తం 90 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 52 శాతం మంది కొత్త ముఖాలే! వెటరన్లు కేవలం 18 శాతం కాగా అనుభవజు్ఞలు 30 శాతమున్నారు. తెలంగాణలో కూడా 119 మంది ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది తొలిసారి ఎన్నికైనవారే! ఈ దక్షిణాది రాష్ట్రంలో 21 శాతం మంది వెటరన్లు, 34 శాతం మంది అనుభవజు్ఞలు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కూడా 40 మంది ఎమ్మెల్యేల్లో 47 శాతం మంది కొత్తవారున్నారు. వెటరన్లు 18 శాతం, అనుభవజు్ఞలు 35 శాతంగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో మాత్రం కొత్తవారి హవా కాస్త పరిమితంగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం వెటరన్లు 31 శాతం మంది ఉండగా అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేల శాతం 36గా ఉంది. రాష్ట్రంలో 33 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజస్తాన్ ఎమ్మెల్యేల్లో మాత్రం 46 శాతం మంది అనుభవజ్ఞులే. వెటరన్లు 24 శాతం కాగా తొలిసారి నెగ్గినవారు 30 శాతమున్నారు. మెజారిటీలో వెటరన్లదే పైచేయి ఓవరాల్ గెలుపు శాతంలో వెనకబడ్డా, మెజారిటీ సాధనలో మాత్రం వెటరన్లు సత్తా చాటారు. మూడు రాష్ట్రాల్లో కొత్తవారు, అనుభవజు్ఞల కంటే ఎక్కువ మెజారిటీని వెటరన్లు సాధించారు. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి చూస్తే వెటరన్లు సగటున 22,227 ఓట్ల మెజారిటీ సాధించగా కొత్తవారు 20,868 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక అనుభవజు్ఞల సగటు మెజారిటీ 20,495 ఓట్లు. జనాకర్షణలో వెటరన్లు ఇప్పటికీ సత్తా చాటుతున్నారనేందుకు వారు సాధించిన మెజారిటీలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీలవారీగా చూస్తే... ఇక ఐదు రాష్ట్రాల ఫలితాలను పార్టీలవారీగా చూస్తే బీజేపీ ఎమ్మెల్యేల్లో కొత్తవారు 38 శాతం మంది ఉన్నారు. 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 27 శాతం మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనుభవజ్ఞులు బీజేపీ కంటే ఎక్కువగా 43 శాతం మంది ఉన్నారు. తొలిసారి నెగ్గిన వారు 34 శాతం కాగా వెటరన్లు 23 శాతంగా తేలారు. ఇతర పార్టీలన్నీ కలిపి చూస్తే కొత్త ఎమ్మెల్యేలు ఏకంగా 47 శాతముండటం విశేషం! 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 19 శాతానికి పరిమితమయ్యారు. చిన్న, ప్రాంతీయ పార్టీల్లో కొత్త వారి జోరు ఎక్కువగా ఉందనేందుకు ఇది స్పష్టమైన సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాకన్నా బర్రెలక్క బెటరంటున్నారు బాబు..!
-
ప్రజాస్వామ్యానికి దూరమైతే మిగిలేది ఇదే!
తెలంగాణ ఏర్పడిన తరువాత శాసనసభకు జరిగిన మూడో ఎన్ని కలు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యేకమైనవి. ఈ ఎన్ని కలలో ప్రజలు ఆయన ధోరణిని ఓడించారనడం సబబు. రంగం నుంచి బీజేపీ తప్పుకొన్న విషయం ఎన్నికల సంరంభానికి ముందే వెల్లడైంది. మునుగోడు ఉప ఎన్నిక వరకూ అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీదే అన్నంత ధీమా ఉందన్నది నిజం. ఈ ఎన్నికలు ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్‌ను తొలిసారి అధికారంలో నిలబెట్టాయి. బీజేపీ కూడా స్వయంకృత అప రాధాలకు అతీతం కాదన్న విషయాన్ని రుజువు చేశాయి. కానీ కేసీఆర్‌కు మాత్రం ఈ ఎన్నికలు గొప్ప గుణపాఠాలు. నిజానికి ప్రజాస్వామ్యానికి దూరంగా జరిగే నేతలకు మిగిలే అంతిమ అనుభవం ఇదేనని చాలా గొప్పగా చెప్పాయి. ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ అన్న నినాదం ఉద్య మానికి ఊపిరి ఇచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముమ్మాటికీ ఆత్మగౌరవం అనే నినాదం మీద నిర్మితమైందని మరచిపోలేం. అయితే కేసీఆర్ ఈ రకమైన సెంటిమెంట్‌ను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గౌరవించిన తీరు ముందు నుంచి ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఆయన మొదటి మంత్రిమండలి మహిళా ప్రాధాన్యం లేకుండానే చిరకాలం నడిచింది. కేసీఆర్ ఉద్యమ నేత స్థాయి నుంచి సీఎం పదవికి వెళ్లిన వ్యక్తేనా అనిపించేలా చేయడానికి ఇది చాలు. అప్పటి నుంచి 2023 ఎన్నికలలో ఆయన పార్టీ ఓటమి వరకూ జరిగిన కొన్ని పరిణామాలు కేసీఆర్ వ్యక్తిత్వం గురించి ప్రశ్నించుకునేటట్టు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ ఈ ఎన్నికలలో ఎమ్మె ల్యేగా గెలిచిన తరువాత చేసిన వ్యాఖ్యలలో ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఉంది. తాను తొమ్మిదేళ్లలో అసలు కేసీఆర్ ఇంటర్వ్యూ కూడా సంపాదించలేక పోయానని బయటపెట్టారు. అలా అని సొంత పార్టీ నాయకులనూ, ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ప్రగతి భవన్‌లోకి నేరుగా అనుమతించారని అనుకుంటే పొరపాటు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ను వీడుతూ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉద్యమ నేత స్థాయి నుంచి ముఖ్యమంత్రి పీఠానికి వెళ్లిన కేసీఆర్ ఈ విషయాన్ని అసలు గుర్తించారా? ముమ్మా టికీ లేదు. అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ తాత్వికతనే విస్మరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి హైదరాబాద్‌తో సహా తెలంగాణ ఇతర ప్రాంతాలలోనూ నివాసం ఏర్పరుచు కున్నారు. కానీ తెలంగాణ సమాజం ఆత్మగౌరవం గురించి ఆలోచింపచేసినవారు కొందరు ఆంధ్ర ప్రాంతీయులేనన్న వాదన ఉంది. అలాంటి అవమానాలను తెలంగాణ సమాజం భరించలేదు. నిజానికి ఏ సమాజమూ భరించదు. ఏదో ఒకరోజు ప్రశ్నిస్తుంది. మద్రాసు ప్రెసిడెన్సీలో తమి ళుల నుంచి అవమానాలను ఎదుర్కొన్న తెలుగ భాషా ప్రాంతాల వారు, నిజాం రాజ్యంలో తెలుగు ప్రాంతాల వారి పట్ల కూడా అదే ధోరణి ప్రదర్శించారంటే సత్యదూరం కాబోదు. అంతకంటే పెద్ద వాస్తవం కేసీఆర్ కూడా సీఎం హెూదాలో అవమానకరమైన ధోరణిలోనే వ్యవహరించడం! విలేకరుల సమావేశాలలో ఆయన వ్యవహరించిన తీరు అసలు ప్రజాస్వామ్యానికి శోభను కూర్చేదని ఎవరైనా అన గలరా? పత్రికా స్వేచ్ఛ గురించి ఆయన ఏనాడూ గౌరవంగా లేరు. ప్రశ్న ఎంత లోతైనదైనా ఆయన దానికి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దేశ ప్రజలకు అనుభవమే. దీనికి మించినది ఎన్నికల ప్రచార సభలలో ఆయన ప్రదర్శించిన ధోరణి. ‘నేను చెప్పేది నేను చెప్పాను. నాకు ఓటేయకపోతే మీ ఖర్మ’ అనే దాకా ఆయన వెళ్లారు. ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకమున్న ఏ నాయకుడూ చేయడు, చేయకూడదు! తనకు ఓటు వేయమని అడగ డానికి వెళ్లి, సభలో చప్పట్లు చరిచిన వారిపై కూడా విరుచు కుపడే స్వభావం ఆయన స్థాయిని నిజంగానే దిగజార్చించింది. ‘వాడిని ఇలా గుంజుకు రండి’, ‘కిరికిరిగాళ్లు’ వంటి మాటలు తరచు వాడడం సభా మర్యాద కూడా కాదన్న సంగతి ఆయన పూర్తిగా విస్మరించారు. గుజరాత్ వాళ్లకీ, ఢిల్లీ వాళ్లకీ ఇక్కడేం పని అంటూ ఆయన అత్యంత హేయంగా మాట్లాడారు. టీఆర్ఎస్ రూపు మార్చి బీఆర్ఎస్ అయిన తరువాత మహారాష్ట్రకు ఈయన ఎన్నిసార్లు పోయి రాలేదు! మహారాష్ట్ర వాసుల నుంచి ఆయనకు ఇలాంటి ప్రశ్నే వస్తే దానికి ఎలా స్పందించి ఉండేవారు? అవతలి పక్షం, అంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రయోగించిన భాష దారుణం. దానికి ఆ పార్టీల నాయకుల నుంచి కూడా అలాంటి స్పందనే వచ్చింది. ఈ ధోరణి ఎక్కడో ఒకచోట ఆగి ఉండవలసింది. ఈ రకమైన చొరవ విపక్షాల నుంచి మొదలై ఉంటే కేసీఆర్‌కు మంచి గుణపాఠం అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇది అహంకార ధోరణి అని నిస్సంశయంగా చెప్ప డానికి ప్రజాస్వామ్య వాదులు వెనుకాడరు. దానికి తెలంగాణ సమాజం పెద్ద మూల్యమే చెల్లించింది. తెలంగాణ సాధనకు ఉపయోగపడిన నినాదంలోని నీళ్ల కోసం వృథాగా కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం, మేడిగడ్డల దగ్గర ఎదురైన అనుభవాలు ఇవే. అక్కడ కేసీఆర్ ఇంజనీర్ అవతారం కూడా ఎత్తారని ఇప్పుడు జనం చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంలో కూడా ఆయన మాటే అంతిమంగా ఉండేదన్న విమర్శ కూడా కొద్దికాలం వినిపించింది. కేసీఆర్ నియంతృత్వ ధోరణి ఈ ఎన్నికలలో ఓటమి తరువాత కూడా కొనసాగడం ప్రజలను నిశ్చేష్టులను చేసింది. పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు స్వయంగా వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పించడం మర్యాద. ఇది రాజకీయ సంప్రదాయం కూడా. తెలంగాణతో పాటే ఎన్నికలు జరుపుకొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ మర్యాదను పాటించిన ఉదాహరణ ఎదురుగానే ఉంది. కానీ కేసీఆర్ తన ఓఎస్డీ ద్వారా గవ ర్నర్‌కు రాజీనామా లేఖను పంపించి గజ్వేల్‌లోని ఫామ్ హౌస్‌కు వెళ్లిపోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పక తప్పదు. గెలిస్తే సరే, ఓడినా కూడా రెండు దఫాలు ముఖ్య మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన సొంత పార్టీ కార్యకర్తల పట్ల చూపవలసిన కనీస బాధ్యతను కూడా కేసీఆర్ ఎందుకు చూపలేకపోయారు? ఆయన కాకుండా పార్టీ నేతగా ఆయన కుమారుడు కేటీఆర్ ధన్యవాదాలు తెలియచేసే బాధ్యతను స్వీకరించడం కూడా సరైనది కాదు. ఇది అహంకారం కాదు అని ఆ పార్టీ నాయకులు ఎవరైనా చెబితే అది కూడా చాలదు. ఎందుకంటే అహంకారమేనన్న వాస్తవాన్ని అప్పుడు కేసీఆరే రూఢి చేసినట్టు అవుతుంది. కేసీఆర్‌కూ గవ ర్నర్కూ విభేదాలు ఉండవచ్చు. అయినా ఒక ప్రజా నాయ కునిగా కేసీఆర్ తన బాధ్యతను తాను నిర్వర్తించి ఉండవల సింది కాదా! రాజస్థాన్‌లో కూడా సొంత పార్టీ నియమించిన గవర్నర్ లేరు. అధికారం నుంచి దిగిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ కేంద్రంలో బీజేపీ నియమించినవారే. మరి ఆయన ఆ మర్యాద ఎందుకు చూపించారు? ఆత్మ గౌరవం అంటే అహంకార ప్రదర్శన కాదు. ఈ సంగతి కేసీఆర్‌కు ఎవరైనా ఇంకా ముందే గుర్తు చేసి ఉండ వలసింది. ఈ ఎన్నికలలో కేసీఆర్–బీఆర్ఎస్ ఓటమి రాష్ట్రాన్ని ‘అభివృద్ధి చేయనందుకు’ అని ఒక్కమాటలో చెప్పలేం. అందుకు ఆ పార్టీ అంతో ఇంతో చేసింది. మన్ను తిన్న పాములా పడి ఉన్న కాంగ్రెస్ ఆరేడు మాసాలలోనే ఇంత ఫలితం సాధించడానికీ, బీఆర్ఎస్ ఓడిపోవడానికీ కారణం కేసీఆర్ అహంకార ధోరణి! అది బీఆర్ఎస్ గుర్తించ వలసి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయ కుడు అంటే, ప్రజానీకాన్ని గుర్తించని నాయకుడనే. ఇక్కడ ఓడిపోయినది అలాంటి నాయకుడే! ప్రజలకు దూరమైన నాయకుడే!! పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ–మెయిల్: pvg@ekalavya.net -
కాంగ్రెస్ పాఠం నేర్చేనా?
మూడు హిందీ ప్రాంత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ సాధించిన అద్భుతమైన విజయం ఎన్నికల విజయం మాత్రమే కాదు. ఇది భారత రాజకీయాల వర్తమానంతోపాటు భవిష్యత్తు గురించి కూడా వివిధ వ్యక్తావ్యక్త సందేశాలను కలిగి ఉంది. ఉత్తర భారతదేశంలో ఆ పార్టీకి భారీఎత్తున ప్రజాభి మానం ఉందని బీజేపీ విజయాలు తెలియజేస్తున్నాయి. హిందీ ప్రాంత ఓటర్లతో ఆ పార్టీ అంత లోతైన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలిగింది, ముఖ్యంగా బీజేపీపై ప్రజల విశ్వాసం గురించి ఈ ఫలితాల నుండి వెలువడుతున్న పెద్ద సందేశం ఏమిటి? సాంఘిక సంక్షేమ రాజకీయం, రిజర్వేషన్లకు సంబంధించి కులగణన కేంద్రక రాజకీయాలు అనే రెండు ప్రధాన అంశాలను కేంద్రంగా చేసుకొని ఈ ఎన్నికలు జరిగాయి. సంక్షేమ చర్యల రాజకీయాలను ప్రధాన పోటీదారులైన బీజేపీ, కాంగ్రెస్‌లు అనుసరించాయి. బీజేపీ తన ప్రణాళికా బద్ధమైన ఎన్నికల ప్రచారం ద్వారా, డబుల్ ఇంజిన్ సర్కార్‌తో కలిగే ప్రయోజనాలను ప్రచారం చేసింది. ఒకే సమయంలో కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నందున కలిగిన ప్రయోజనాలను ప్రచారంలో ఎత్తి చూపింది బీజేపీ. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విశేషించి పేర్కొన్నారు కమలనాథులు. కాంగ్రెస్, బీజేపీలు తమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారిని ఎవరికి వారు తయారుచేసుకోగలి గాయి. కానీ కాంగ్రెస్ ఇంకా తన లబ్ధిదారులతో రాజ కీయ సంస్థాగత సంబంధాలను ఏర్పరచుకోలేదు. అయితే, బీజేపీ తన లబ్ధిదారులను ఒక సంఘంగా – ఒక సముదాయంగా–వారితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంది. మామా, లాడ్లీ బెహనా (ప్రియమైన సోదరి) వంటి కుటుంబ సంబంధ పదజాలాన్ని వాడటం ద్వారా, వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా బీజేపీ ఈ పని చేయ గలిగింది. పార్టీ కార్యకర్తలు వివిధ పథకాల లబ్ధిదారులతో హోలీ, దీపావళి, రక్షా బంధన్ వంటి పండు గలను జరుపుకోవడం ప్రారంభించారు. తన వంతుగా,కాంగ్రెస్ కూడా పేద ప్రజలకు పథకాలను అందించింది, కానీ వారితో దీర్ఘకాలిక భావోద్వేగ సంబం ధాన్ని ఏర్పరచుకోలేకపోయింది. హిందీ ప్రాంత వాసి మనస్సు... తనతో గౌరవంగా, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న పార్టీతో స్పష్టంగా కనెక్ట్ అయి ఉంటుంది. బీజేపీ రాజకీయ పదజాలం... ఆర్థిక సమస్య లనూ, అభివృద్ధినీ అట్టడుగు స్థాయిలో ప్రతిధ్వనించే సాంస్కృతిక, సామాజిక భావోద్వేగాల చట్రంలో రూపొందించింది. రెండవది – గ్రామీణ భారతదేశంలోని గ్రామీణ ప్రజలకు నమ్మకం చాలా ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయాలతో ప్రజలలో మత, సాంస్కృతిక భద్రతకు భరోసా కల్పించడం ద్వారా వారిలో అపారమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఎన్నికలలో కూడా మోదీ తనకు తానుగా ప్రచారానికి పూను కుని, ఓటర్లకు ‘నేను ఇక్కడ ఉన్నాను, నేను మీ కోసం పని చేస్తాను’ అనే భరోసా ఇచ్చే రిస్క్ తీసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించకుంటే అది మోదీ ప్రతిష్ఠపై ప్రభావం చూపి ఉండేది. మూడవది – హిందూత్వం. బీజేపీ తన రాజకీయాలను హిందూత్వ భావనపై నిర్మించి, పునరుద్ధరించే ఆధార్ భావాన్ని (ఫౌండేషనల్ ఎమోషన్) ను హిందువులు అధికంగా ఉన్న హిందీ ప్రాంత రాష్ట్రాల్లో అందించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాన్ని ప్రధాన ప్రచారా యుధంగా మలచుకొంది. రామ్ భద్రాచార్య వంటి అనేక మంది సనాతన ధర్మ సాధువులు ఈ ఎన్నికలను ధర్మం, అధర్మాల మధ్య యుద్ధంగా అంచనా వేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కమల్‌నాథ్ నియోజకవర్గమైన ఛింద్వారాలో జరిగిన ఓ మీటింగ్‌లో తమ ధర్మాన్ని కాపాడే పార్టీకి మద్దతు ఇవ్వాలని రామ్ భద్రాచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సాధువులు తమ సమావేశాల్లో ఇచ్చిన ప్రవచనాలలో,డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. కాంగ్రెస్‌ను స్టాలిన్ పార్టీకి మద్దతుదారుగా చూపారు. అలా ఆ పార్టీని సనాతన విరోధిగా చిత్రించారు. సనాతన ధర్మంపై మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వరకు సాగిన ఈ ప్రచారం హిందీ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసే ప్రజా కథనంగా ఉద్భవించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్లలోని గిరిజనులు, దళితులపై కూడా ఇది ప్రభావం చూపింది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ఓటర్లను వారి కుల గుర్తింపుపై సమీకరించేందుకు కుల గణన డిమాండ్‌పై కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడింది. ఈ ఎన్నికల్లో దాని వ్యూహం పూర్తిగా విఫలమైంది. హిందీ ప్రాంత రాష్ట్రాల్లో కులం ప్రభావం కొనసాగుతోంది. కానీ ప్రజల మూడ్ మారిందని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇది బహుళ ఆకాంక్షల యుగం. కుల చైతన్యం ఒక ఆకాంక్ష మాత్రమే. ‘కుల గుర్తింపు తర్వాత ఏమిటి’అనేది ఓటర్ల మనసులోని ప్రశ్న. బీజేపీ ఇకపై బ్రాహ్మణ–బనియా పార్టీ కాదనే వాస్త వాన్ని కాంగ్రెస్ కూడా అంగీకరించలేదు, బీజేపీ నాయకత్వంలో ఓబీసీలు ఉన్నారు. కాబట్టి, కుల గణన ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఓబీసీల సంఘటిత సమీకరణ దాదాపు అసాధ్యం. ఈ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇవి ముఖ్యంగా హిందీ ప్రాంతంలో తన వ్యూహాలు, ప్రజలతో రాజకీయంగా వ్యవహరించే తీరు (డిక్షన్) గురించి పునరా లోచించడానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తాయి. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు ఇరుసుగా కాంగ్రెస్‌కు దాని స్థానం దానికి ఉండవచ్చు. అయితే, కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియల్లో జరిగే చర్చలు, ప్రాధా న్యాలను ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. తాజా ఫలితాలు ప్రధాని మోదీ ప్రతిష్ఠను బలోపేతం చేశాయి. ఇది నిస్సందేహంగా బీజేపీపై సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుంది. బద్రీనారాయణ్ వ్యాసకర్త అలహాబాద్‌లోని ‘గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇనిస్టిట్యూట్’లో ప్రొఫెసర్ -
ప్రజల వాణిని వినిపించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే
-
Telangana: కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
-
లెక్క ఎక్కడ తప్పింది?
సాక్షి, హైదరాబాద్: కమలదళంలో అంతర్మథనం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి కారణాలేమిటి? గట్టిగా పోరాడినా కూడా అనుకున్న విధంగా ఫలితాలను ఎందుకు సాధించలేకపోయామనే కోణంలో పార్టీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన 111 సీట్లలో 8 స్థానాల్లో మాత్రమే గెలుపునకు పరిమితం కావడంపై రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో అంతర్గత సమీక్షలకు రంగం సిద్ధమైంది. పార్టీకి పట్టుతో పాటు, ముగ్గురు ఎంపీలు గెలిచిన ఉమ్మడి జిల్లాల పరిధిలో, ముఖ్యనేతలు (ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్) ఓటమి పాలవడం, దుబ్బాకలో మరో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓటమికి కారణాలు ఏమిటంటూ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే, 2023లో 8 సీట్లలో గెలుపు, ఓటింగ్ శాతం 14కి పెంచుకోవడం ద్వారా మరీ తీసికట్టుగా కాకుండా గౌరవప్రదమైన ఫలితాలనే సాధించినా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోలేక పోయేందుకు ప్రభావం చూపిన అంశాలేమిటా అన్న లోతైన చర్చ సాగుతోంది. గతం కంటే మెరుగే కానీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాం.. ఈ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీచేసి 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకోవడం (2018లో 118 సీట్లలో పోటీచేస్తే 104 చోట్ల డిపాజిట్లు గల్లంతు), పలు సీట్లలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడంతో పాటు గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం వంటివి పార్టీకి కలిసొచ్చే అంశాలేనని అంచనా వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ సర్కార్‌పై, అధికార బీఆర్ఎస్పై హోరాహోరీగా పోరాడినా.. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమించినా.. ఆ మేరకు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనసభ ఎన్నికలపై దృష్టితో బీజేపీ సాగించిన కృషితో అధికార బీఆర్ఎస్కు బీజేపీనే తగిన ప్రత్యామ్నాయం అన్న స్థాయికి వెళ్లి అక్కడి నుంచి పరిస్థితి దిగజారడానికి దారితీసిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న దుష్ప్రచార ప్రభావమే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ క్రమం తప్పకుండా సాగించిన దుష్ప్రచారం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు రాష్ట్రనేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోవడం, ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కొందరు నేతలు అదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం వంటివి నష్టాన్ని కలగజేశాయని అంచనా వేస్తున్నారు. లోపాయికారిగా మిలాఖత్ కారణంగానే బీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వం, వివిధ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకోలేదనే పద్ధతుల్లో కాంగ్రెస్ సహా కొన్ని పక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదంటూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపేలా చేసిందనే చర్చ కూడా పార్టీలో వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో క్షేత్రస్థాయి సమీక్షలు ముగించుకుని వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని భావిస్తోంది. నిర్ణీత గడువు ప్రకారమైతే మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం ద్వారా మళ్లీ బీజేపీ సత్తాను చాటాలనే భావన పార్టీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. -
ప్రజాతీర్పును గౌరవిద్దాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జనవరి 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశమున్నా ప్రజల తీర్పును గౌరవిస్తూ హుందాగా తప్పుకున్నాం. ప్రజల తీర్పును గౌరవిస్తూ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. రాష్ట్ర రాజకీయాలు, పాలనలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’అంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందాం. ఎన్నికల క్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజం. నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. అందువల్ల నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. త్వరలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని కూడా ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుందాం..’అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లకుపైగా సుస్థిర పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో చెరగని ముద్ర వేసుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టడమేగాకుండా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించి గొప్ప పరివర్తన తీసుకురాగలిగామన్నారు. బీఆర్ఎస్ అంటే ఒక భరోసా అనే విశ్వాసాన్ని కలిగించామని చెప్పారు. మెజారిటీ ఎంత వచ్చింది? ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఏ తరహా పోటీని ఎదుర్కొన్నారు? లాంటి కొన్ని సాధారణ అంశాలను కూడా కేసీఆర్ ఆరా తీశారని ఆయనను కలిసిన నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఆయన కుశల ప్రశ్నలు సైతం వేసినట్లు చెప్పారు. హరీశ్, తదితరుల భేటీ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేటీఆర్ ఫామ్‌హౌస్ భేటీకి వెళ్లలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు కూడా కేసీఆర్‌ను కలిశారు. గజ్వేల్ ఎన్నికలో కేసీఆర్ ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ‘ఎన్నిక ధ్రువీకరణ సర్టిఫికెట్’ను అందజేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై కోలుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య స్థితిపై కేసీఆర్ వాకబు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రగతిభవన్ నుంచి ఫామ్‌హౌస్‌కు.. కేసీఆర్ దంపతులు ఆదివారం రాత్రి ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఒకటి రెండు రోజుల్లో బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి మారనున్నారు. వ్యక్తిగత సామానును తరలించే పని జరుగుతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ జనవాడలోని ఫామ్‌హౌస్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నట్లు తెలిసింది. -
ఆ లోక్‌సభ సెగ్మెంట్లలో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయపార్టీలకు మిశ్రమ స్పందన మిగిల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్కు నాలుగు లోక్‌సభ సెగ్మెంట్లలో కనీస ప్రాతినిధ్యమే దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి సైతం రాజధాని పరిధిలోని 3 లోక్‌సభ సెగ్మెంట్లలో గెలవలేకపోయింది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఆదిలాబాద్‌లోనే నాలుగు అసెంబ్లీ సీట్లతో పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో గుడ్డిలో మెల్లగా ఒకటి రెండు సీట్లతో ఉనికిని చాటుకుంది. బీఆర్ఎస్ నాలుగు చోట్ల జీరో... మూడు చోట్ల ఒక్కో స్థానమే 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్కు లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే...నాలుగు చోట్ల ప్రాతినిధ్యం దక్కలేదు. పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లోని 28 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం, గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఇక పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలోని 21 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. భువనగిరి ఎంపీ పరిధిలో కేవలం జనగామలో మాత్రమే టీఆర్ఎస్ గెలవగా, మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, నల్లగొండలో సూర్యాపేట, మహబూబాబాద్‌లో భద్రాచలం సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా ఆరేసి సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ రాజధానిలో హస్తవాసి బాగాలేదు ముఖ్యమంత్రి రేసులో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి 2019 ఎన్నికల్లో 13వేల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ఉన్న హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా, మిగతా ఆరుచోట్ల బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. బీజేపీ నలుగురు ఎంపీలున్నా నిరాశే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు లోక్సభసీట్లలోనూ నిరాశే మిగిలింది. కేవలం ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీ నుంచి ఓడిపోయినా, ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూరు, ముథోల్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఒకింత ఓదార్పు. మరో ఎంపీ సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. సంజయ్ పోటీ చేసిన కరీంనగర్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌లలో బీఆర్ఎస్ గెలుపొందడం విశేషం. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్‌లలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పోటీ చేసిన కోరుట్లలో ఆయనే ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నాంపల్లిలో ఎంఐఎం స్వల్ప తేడాతో కాంగ్రెస్‌పై విజయం సాధించింది. -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్‌రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్‌ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్‌భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్‌లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్‌ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్‌భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది. మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏకవాక్య తీర్మానానికి ఆమోదం సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్మున్షీ, అజయ్‌కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది. కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్‌కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. గెలిచిన వారికి అభినందనలు ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్‌భవన్‌లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్‌ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్ పార్క్ హయత్‌లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్’ మెసేజ్ కాదు.. ‘స్మార్ట్’ మెసేజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. -
TS: సీఎం పదవి పంచాయితీ..ఢిల్లీకి సీనియర్లు..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మళ్లీ స్టార్టయింది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక తంతు వాయిదాపడింది. సీఎం పదవి ఎవరికివ్వాలనే పంచాయితీ అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. సీఎం ఎంపిక కోసం సోమవారం హైదరాబాద్‌లో జరగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్‌లో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం ఎవరనేది నిర్ణయించే బాధ్యతను ఎమ్మెల్యేలలంతా కలిసి ఏకవాక్య తీర్మానం ద్వారా అధిష్టానానికి అప్పగించారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి మారిపోయింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేల సమావేశం నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి లాబీయింగ్..? సీఎం పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడటం లేదని తెలుస్తోంది. తామూ పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్‌కు మొర పెట్టుకోనున్నట్లు సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందనుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు పార్టీ నుంచి ఏ నిర్ణయం రాకపోవడంతో రాజ్‌భవన్ నుంచి ఇవాళ సాయంత్రం వెళ్లిపోయారు. ఎల్లా హోటల్లోనే ఎమ్మెల్యేలు.. అయితే సీఎం ఎవరనేదానిపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం ఎవరనే నిర్ణయాన్ని ఖర్గే వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోమవారం సమావేశమైన గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఫైనలయ్యేదాకా వారంతా అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16వ తేదీ దాకా మన ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉంది(తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి గడువు జనవరి 16వ తేదీ దాకా ఉంది). కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరగుతుందో చూద్దాం’’ అని అన్నట్లు తెలుస్తోంది. అలాగే.. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేద్దాం. అదే మీటింగ్‌లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం అని ఆయన ఎమ్మెల్యేలతో అన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వాళ్లలో నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు ఉన్నారు. -
TS: సీఎం ప్రమాణస్వీకారం వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది. మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ మూడో శాసనసభను గెజిట్‌లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్‌భవన్ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. అప్డేట్స్ -
బీఆర్ఎస్ది ఘోర పరాజయం కాదా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీది ఘన విజయమేనా? ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ది ఘోర పరాజయమేనా?.. ఈ ఫలితాలు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చాయి? మొత్తం ఫలితాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ పార్టీది పూర్తి స్థాయి వేవ్ కాదనే అర్ధం అవుతోంది. అలాగే బీఆర్ఎస్ది ఘోర పరాజయం కాదని తెలుస్తుంది. ఎంత కాదన్నా ఓటమి ఓటమే కాబట్టి దానికి ఎలాంటి మినహాయంపు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే కాని, కాంగ్రెస్ కు వచ్చిన పాజిటివ్ ఓటు కాదనిపిస్తోంది. ✍️కాంగ్రెస్ ప్రభంజనం అయితే డెబ్బై నుంచి ఎనభై సీట్లవరకు సంపాదించి ఉండేది. మిత్రపక్షం సీపీఐ గెలిచిన సీటుతో కలిపి కాంగ్రెస్‌కు 65 స్థానాలే దక్కాయి. అంటే మెజార్టీకి అవసరమైన దానికన్నా ఐదు సీట్లే ఎక్కువచ్చాయి. బొటాబొటి మెజార్టీ అన్నమాట!. గత ఎన్నికలలో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చాయి. అప్పుడు అది పాజిటివ్ వేవ్ గా కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ కు అదే తరహాలో సీట్లు వచ్చి ఉంటే వారి మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేశారన్న భావన కలిగేది. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మేనిఫెస్టోలు రెండూ దాదాపు ఒకరకంగానే ఉన్నాయి. ✍️ఉమ్మడి ఖమ్మం,నల్గొండ,వరంగల్ వంటి జిల్లాలలో కాంగ్రెస్ స్వీప్ చేస్తే.. హైదరాబాద్ నగరం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో బీఆర్ఎస్ వేవ్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఒకటి తప్పా అన్ని సీట్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఖాతాలోకి రాగా, కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కకపోవడం నిదర్శనంగా కనిపిస్తోంది. అయినా బీఆర్ఎస్ ఎందుకు ఓటమిపాలైంది? ఇది బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంకృతాపరాధం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అహంభావ దోరణే అయనను దెబ్బ తీసింది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను ఆయనే పోశారనిపిస్తోంది. ✍️భారతీయ జనతా పార్టీ తన గ్రాఫ్ పెంచుకుంటుందని ఊహించినట్లే జరిగింది. కాని, అది ఆశించినంత పెరగలేదని చెప్పాలి. కాంగ్రెస్‌కు వేవ్ రాకపోతే హంగ్ పరిస్థితి ఏర్పడవలసి ఉంది. బీఆర్ఎస్ కు సొంతంగా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయినప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది. ఆ విషయాన్ని ఎంతో అనుభవం కలిగిన కేసీఆర్ కనిపెట్టలేకపోయారు. ముందస్తుగా అభ్యర్ధుల ప్రకటన చేయడం వ్యూహాత్మకంగా సరైందే అయినా.. వారిలో నెగిటివ్ ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని మార్చకుండా అతి విశ్వాసానికి పోయారు. ఫలితంగా.. 39 సీట్లకే పరిమితం అయ్యారు. ఎమ్మెల్యేల మార్చకపోవడం వల్ల కనీసం పది,పదిహేను సీట్లను ఆయన చేజేతులారా కోల్పోయారు. అవి వచ్చి ఉంటే ఏభై నుంచి ఏభైఐదు సీట్ల వరకు బీఆర్ఎస్ లాగగలిగేది. అప్పుడు కాంగ్రెస్ కు అరవైఐదు సీట్లు రావడం కష్టం అయ్యేది. అయితే.. ఆఖర్లో కెసిఆర్ పన్నెండు సీట్లలో మార్చితే.. తొమ్మిదింట కొత్తవారు గెలిచిన సంగతి గమనించాలి. ✍️తెలంగాణలో హంగ్ వచ్చి ఉంటే.. కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇవ్వలేదు. ఎంఐఎం ఎటూ తనకే మద్దతు ఇస్తుంది కనుక బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి చాన్స్ ఉండేది. అది కేసీఆర్ వైఫల్యం. కేసీఆర్ తనకు అవసరం లేకపోయినా గత ఎన్నికలలో గెలిచిన తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. దానివల్ల బీఆర్ఎస్ లో ఉన్న నేతలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలలో పది మంది వరకు ఓటమి చెందారు. దీనికి ఉదాహరణ పాలేరు, కొత్తగూడెం లలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటివారిని ఆయన వదలుకోవల్సి వచ్చింది. ఇతర విమర్శలను పక్కనపెడితే.. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయతప్పిదాలు చేయడం వల్ల వారు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ✍️ కాంగ్రెస్ విషయాన్ని చూస్తే.. వరసగా మూడు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ.. అసాధారణ రీతిలో అరవై ఐదు సీట్లు గెలవడం గొప్ప విషయమే. ఇది కాదనం.. కాకపోతే దీనిని ఘన విజయంతో పోల్చలేకపోవడానికి కారణం ఏమిటంటే అనుకూల వేవ్ తెచ్చుకోలేకపోవడం. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి వరస పరాజయాలు ఎదురైనా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ వచ్చారు. ఘాటైన విమర్శలు సాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌లో అందరిని కలుపుకుని వెళ్లడంలో ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోయారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో కొంతమంది వృద్దనేతలను పక్కన బెట్టి యూత్ కు అవకాశం ఇచ్చారు. అలాగే మిర్యాలగూడ వంటి కాంగ్రెస్ గెలుపు అవకాశం ఉన్న సీటును సీపీఎంకు ఇవ్వకుండా నిరాకరించి పొత్తును వదలుకోవడానికి కూడా సిద్దపడ్డారు. పార్టీలో టిక్కెట్లురాని వారి అసంతృప్తిని తగ్గించడంలో అసమ్మతి ఎక్కువగా లేకుండాచేయడంలో ఆయన సఫలం అయ్యారు. ఒకవైపు తనను తాను అందరికి ఆమోదయోగ్యమైన నేతగా గుర్తింపు పొందే విధంగా ప్రయత్నిస్తూనే తన ఆధిపత్యం తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన ప్రధాన నేతగా రేవంత్ ఒక్కరే కనిపించారు.తద్వారా పార్టీలో జోష్ పెంచారు. ✍️ భారతీయ జనతా పార్టీ నిజానికి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని ఒక దశలో వాతావరణం ఏర్పడింది. కానీ ఆ పార్టీ అధిష్టానం ఏ ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు చేసిందోకాని, అలాగే కొన్నిపరిణామాలకు ఎందుకు కారణం అయిందో కాని.. కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లయింది. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తానే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయని ప్రజలలో గుర్తింపు పొందగలిగింది. ఆరు గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని చెప్పలేం. కాకపోతే ఎన్నికలలో గెలిచాక ఆ మేనిఫెస్టోపై అందరూ దృష్టి పెడతారు. ప్రజలు ముందు అధికారంలో ఉన్న పార్టీపై తమ వ్యతిరేకత చూపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏమి చేయబోతోంది గమనిస్తారు!. ✍️ కేసీఆర్ అత్యధిక సమయం ప్రగతి భవన్ కే పరిమితం అవడం, ప్రజలకు తగు సమయం ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలవరన్న ప్రచారం జరగడం మొదలైన విషయాలు బాగా అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. కొత్త సచివాలయం కట్టాలని ఏ జ్యోతిష్కుడు చెప్పారో కాని.. అది కూడా ప్రజలలో నెగిటివ్ పెంచింది. వందల కోట్ల రూపాయలు వృథా చేశారన్న అభిప్రాయం వచ్చింది. దళిత బంధు స్కీం పేరుతో పది లక్షల రూపాయల ఆర్దికసాయం చేయడం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా. దానిని అమలు చేయడానికి ముందుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వారికే అవి దక్కుతున్నాయని మిగిలినవారికి కోపం తెప్పించింది.అందులో ముప్పై శాతం డబ్బు అవినీతి కింద పోతోందని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దళితులకుమాత్రమే బంధు స్కీమ్ ఇస్తారా అని బీసీలు, మైనార్టీలు తదితర వర్గాలు ప్రశ్నించసాగాయి. అవన్నీ బీఆర్ఎస్కు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంలో మంచి ఉద్దేశమే ఉన్నా, దానిని నిపుణుల నిర్ణయాలకు వదలకుండా, తానే అన్నీ చేయగలనని భావించి తదనుగుణంగా వ్యవహరించడం పెద్ద ప్రమాదమే అయింది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడం కేసీఆర్‌కు తీరని అప్రతిష్ట తెచ్చింది. నిజంగా ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలిగి ఉంటే ఉత్తర తెలంగాణలో భారీ స్థాయిలో సీట్లు గెలవాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గణనీయ ఫలితాలు సాధించింది. దీనిని బట్టే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ✍️ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిగా పరీక్షలు నిర్వహించలేకపోవడం, గ్రూప్ పరీక్షలు జరిగి ఉద్యోగాలు రాకపోవడం కూడా బాగా డ్యామేజ్ అయింది. కేటీఆర్ స్వయంగా వెళ్లి దానిని చక్కదిద్దడానికి యత్నించినా, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకోవడం తో వారిలో పలువురు ఊరూవాడా తిరిగి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రభావితం చేయగలిగారు. కుటుంబ పాలన అనే విమర్శకు సరైన సమాధానం చెప్పలేకపోయారు.వీటన్నిటికి మించి ఆయన రెండో నియోజకవర్గంగా కామారెడ్డిని ఎంపిక చేసుకోవడం కూడా తెలివైన నిర్ణయం కాదని ఆయన ఓటమి రుజువు చేసింది. ఎవరికి చెప్పకుండా, అచ్చంగా గతంలో ఎన్.టి.ఆర్ కల్వకుర్తిలో పోటీచేసి పరాజయం చెందిన రీతిలోనే కేసీఆర్ ఓటమిపాలయ్యారు. ఇన్ని లోపాలు ఉన్నా ఓవరాల్ గా చూసినప్పుడు ప్రభుత్వ పనితీరు మరీ నాసిరకంగా లేదు. ✍️మంత్రిగా కేటీఆర్ బాగానే రాణించారు. హైదరాబాద్ లో ఐటి పరిశ్రమకు సంబందించి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. హైదరాబాద్ లో అభివృద్ది పనులు బాగానే చేశారు. అందువల్లే పార్టీకి ఈ మాత్రం అయినా సీట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంక్షేమ స్కీములను అమలు చేశారు. రైతు బంధు , రైతుల రుణ మాఫీ వంటివాటిని చాలావరకు చేశారు. అయితే పట్టణాలపై పెట్టిన దృష్టి.. పల్లె ప్రాంతాలలో పెట్టలేదన్న భావన బలపడింది. ఎందుకో ఏడాది నుంచే పల్లెల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. దానిని తగ్గించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయింది. ఇంకో సంగతి చెప్పాలి. ఈనాడు వంటి మీడియా కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచి, ప్రభుత్వ పొరపాట్లను,లోటుపాట్లను బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. కేవలం మీడియా వల్లే పార్టీలు గెలవడం, ఓడడం జరగదని మరోసారి తేలింది. కేసీఆర్ యజ్ఞం చేసినా ఈ విడత విజయం సాధించలేదు. అందువల్ల అలాంటి సెంటిమెంట్లు కొంతమేరే తప్ప ఎప్పుడూ ఉపయోగపడవని కూడా రుజువైంది. బీజేపీ గనుక బండి సంజయ్ ను మార్చకపోవడం, డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తామంటూ ప్రచారం చేసినా, అలా జరగకపోవడం తదితర కారణాలతో బీజేపీ తన అవకాశాలాను తానే వదలుకుందనిపిస్తుంది. బీజేపీ మరికాస్త మెరుగ్గా పనిచేసినా హంగ్ వచ్చి ఉండేది. అప్పుడు బీజేపీకి చక్రం తిప్పే అవకాశం వచ్చేదేమో! ✍️తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత విజయం సాధించడం కాంగ్రెస్‌కు పెద్ద ఊరట. మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవలేకపోయిన బాధ ఉన్న సమయంలో కొంత ఊరటగా తెలంగాణలో గెలిచారు. తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను యధావిధిగా అమలు చేయడం అంత తేలికైన సంగతి కాదు. కాంగ్రెస్ వాటిని అమలు చేస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు పొందగలుగుతుంది. లేకపోతే మాత్రం ఆ ఎన్నికలు కాంగ్రెస్ కు పెద్ద సవాలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమైన పాయింటే. ఆ పార్టీలో నాయకత్వ స్థాయిలో కేటీఆర్, హరీష్ రావు ల మధ్య విబేధాలు వంటివి చోటు చేసుకుంటే చాలా కష్టాలు వస్తాయి. తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధికారం వచ్చిందన్న సంతోషం ఉన్నా, భవిష్యత్తులో ఎన్నో గండాలు అధిగమనించవలసి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా నిలబడగలిగితేనే భవిష్యత్తు ఎన్నికలలో ప్రభావం చూపగలుగుతుంది. వీటిలో ఏది జరగకపోయినా బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు బీఆర్ఎస్ కు కాస్ట్ లీ అనుభవం అయితే, కాంగ్రెస్ కు మరీ ఫ్రీ హాండ్ ను ప్రజలకు ఇవ్వలేదు. బీజెపిని ఇంకా వెయిటింగ్ లోనే ఉంచారని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బీజేపీ ఓట్‌షేర్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటాం. సమీక్షించుకున్న తర్వాత రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగింది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘ తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీలో గెలిచింది. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అవుతారో తెలీదు అదో విచిత్రమైన పరిస్థితి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడించి మా అభ్యర్థి గెలిచారు. దేశ రాజకీయాల్లో ఇదో చరిత్ర. వెంకటరమణారెడ్డికి నా అభినందనలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయంతో ప్రధాని మోదీకి దేశ ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తోంది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం’ అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మా మీద ఏడ్చి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్‌కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తాం. ప్రజల పక్షాన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశాం. మా పోరాటం వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగింది. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తాం. ఢిల్లీ వెళ్లి ఇక్కడున్న పరిస్థితులు ఎన్నికల ఫలితాలపై అధిష్టానానికి వివరిస్తా’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..కేసీఆర్ కోసం ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్యేలు -
కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రెండుసార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టేశారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మొత్తంగా 64 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హస్తం పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా సినీపరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే ఇండస్ట్రీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు. చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ వైరల్.. -
నెరవేరని హ్యాట్రిక్ కల
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం
-
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం.. 119 స్థానాలకు గాను 64 స్థానాలు కైవసం.. నేడు సీఎల్పీ సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
ప్రజాసేవలో డాక్టర్లు..!
సాక్షి, హైదరాబాద్: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్ సర్జన్లు కాగా, ఒకరు జనరల్ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్ కాగా ఒకరు న్యూరో సర్జన్ ఉన్నారు. ఇక ముగ్గురు ఎంఎస్ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్ సర్జన్. ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు. -
కమల వికాసం.. విలాపం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 2018 ఎన్నికల్లో 118 సీట్లలో పోటీచేసి కేవలం ఒక సీటు గెలిచి 7 శాతం ఓటింగ్‌కు పరిమితమైన స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి 14 శాతం ఓటింగ్ సాధించడం వరకే కమలదళం పరిమితమైంది. పోటీ చేసిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలుస్తామనే అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి.. బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 32.20 లక్షల ఓట్లు సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ నుంచే రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఉత్తర తెలంగాణనే బీజేపీని ఆదుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 3 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో బీజేపీ అగ్రనాయకులైన మోదీ, అమిత్ షా, నడ్డా నిర్వహించిన ప్రచారం కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడిందని నాయకులు అంచనా వేస్తున్నారు. నిజంకాని అంచనాలు.. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కొన్ని సీట్లు కలిపి మొత్తం 18కిపైగానే గెలుస్తామనే బీజేపీ ముఖ్యనేతల అంచనాలు నిజం కాలేదు. హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విజయం సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఓదార్పు మిగిల్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలిచినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలేవీ ప్రతిబింబించకపోవడం పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్లో), ధర్మపురి అరి్వంద్ (కోరుట్లలో), సోయం బాపూరావు (బోథ్‌లో)తోపాటు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్‌లలో), ఎం. రఘునందన్‌రావు (దుబ్బాకలో) ఓడిపోవడం బీజేపీకి అంతుబట్టడంలేదు. పనిచేయని బీసీ నినాదం...ఎస్సీ వర్గీకరణ... బీజేపీ బీసీ నినాదం, అధికారానికి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం, మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకొనేందుకు పొందుపరిచిన అంశాలేవీ ఫలితాల సాధనలో బీజేపీకి కలసి రాలేదు. బీసీ నినాదం తీసుకున్నారే తప్ప ఈ వర్గాలను చేరుకొని వారి మద్దతు సాధించడంలో పార్టీ విఫలమైంది. ఎస్సీ–19, ఎస్టీ–12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటునూ పార్టీ గెలవలేకపోయింది. ఈ సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టి మిషన్–31ను ప్రారంభించినా పెద్దగా ఆ దిశగా కృషి చేయకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గెలిచిన 8 సీట్లలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు (36 మందికి సీట్ల కేటాయింపు) కాగా ఐదుగురు జనరల్ కేటగిరీకి చెందినవారు. పార్టీ గెలిచిన 8 సీట్లలో (రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డి మినహా) ఆరుగురు తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. అయితే మహిళలకు 12 టికెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరూ విజయం సాధించలేదు. కమలాన్ని దెబ్బతీసిన అంశాలెన్నో... రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుపై 3–4 నెలలపాటు సందిగ్ధత నెలకొనడం... ఎన్నికలకు ముందు సంజయ్‌ను హఠాత్తుగా మార్చడం.. బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, అధికార బీఆర్ఎస్ అవినీతిపై ఆరోపణలు గుప్పించి వాటిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ లేదా దర్యాప్తునకు ఆదేశించకపోవడం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారు బహిరంగ సభల్లో ఆరోపించినా దర్యాప్తుకు మొగ్గుచూపకపోవడం వంటివి పార్టీపై ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, విజయశాంతి వంటి అసంతృప్త నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వివేక్, రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. -
జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీచేసినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా కలిపి కొన్ని వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటూ కూడా కొందరు స్థానిక నాయకులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్‌గౌడ్, కోదాడ నుంచి మేకల సతీశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో లక్ష్మణ్‌గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌రావు, వైరాలో డాక్టర్ తేజావత్ సంపత్‌నాయక్, అశ్వారావుపేట నుంచి ముయబోయిన ఉమాదేవి పోటీచేశారు. కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు రాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పోటీచేసిన తాండూరులో మూడువేలకు పైగా మాత్రమే వచ్చాయి. కోదాడలో 1,200 ఓట్లు, నాగర్‌కర్నూల్‌లో 1,800 ఓట్లు, ఖమ్మంలో 1,500 ఓట్లు, కొత్తగూడెంలో 1,800, వైరాలో 2,600, అశ్వారావుపేటలో 2,200 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ‘కామన్స్ సింబల్’దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్ సింబల్‌కూడాను ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు. జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్పల్లి, తాండూరు, తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. -
ఫలితాలపై విస్మయం..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్ షా సమీక్ష నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్‌కు గురిచేసింది. అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్‌లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
ఉమెన్.. డబుల్ డిజిట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్‌కు చేర్చారు. ప్రస్తుతం గెలుపొందిన పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు ఆరుకు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్‌సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే! ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది. గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి. గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు. ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్‌గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు! అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు. మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి. ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది. ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్‌ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి. నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్ కోదండరావ్‌ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి. ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా కాంగ్రెస్ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి. ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు – వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త, మొబైల్ – 9951942242 -
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది..
‘పాలమూరు’లో కాంగ్రెస్ హవా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 12 గెలుపొంది సత్తా చాటింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డికి చుక్కెదురైంది. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీఎమ్మార్ మధ్య రౌండ్ రౌండ్‌కూ హోరాహోరీ పోరు కొనసాగింది. రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డికి 907 ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలిసారిగా 9 మంది.. ఉమ్మడి పాలమూరులో తొమ్మిది మంది తొలిసారి గా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి అభ్యర్థులు జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజే శ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో పాటు బీఆర్ఎస్ అలంపూర్ అభ్యర్థి విజయుడు తొలిసారిగా విజయం సాధించారు. ఇందులో అందరూ యువతే కావడం విశేషం. వనపర్తిలో గలాటా.. వనపర్తిలో చిట్యాల శివారులోని మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి కారు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో దుమారం చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోడ్డుపైనే సుమారు గంటన్నర సేపు ఆందోళనకు దిగగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంత్రులకు తప్పని ఓటమి.. మహబూబ్‌నగర్‌లో మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒక్కటి మినహా. అన్నింటా హస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీ‹Ùరెడ్డి గెలుపొందారు. మిగతా నియోజకవర్గాలైన నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో కుందూరు జయవీర్‌రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లో మందుల సామేల్, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి, ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలు పొందగా, రెండు స్థానాల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి అంతకుమించి 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రస్తుత విజయంతో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా తమ పట్టును సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైనే ఈ విజయాన్ని సాధించారు. ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యాన్ని కనబరచడం విశేషం. గిరిజన ఖిల్లాలో‘కమలం’ బోణీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పు ఇచ్చారు. తొలిసారిగా ఈ ప్రాంతం నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రాంతం నుంచి కమలనాథులు శాసనసభకు ఎన్నికకావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఇక్కడి ఓటర్లు అనూహ్య తీర్పునిచ్చారు. బీఆర్ఎస్పై అదే దెబ్బ.. గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి పది శాతం పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆదివాసీ, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూమి హక్కు పత్రాలు) 48వేల మందికి లక్ష ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారు. కానీ ఇవేమీ బీఆర్ఎస్కు ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆదివాసీ లంబాడా మధ్య వైరం, గిరిజనేతరులకు ఏజెన్సీ సమస్యలు బీఆర్ఎస్ను దెబ్బతీశాయి. మూడు ఎస్టీ స్థానాల్లో ఆసిఫాబాద్, బోథ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి అనిల్ జాదవ్ గెలుపొందగా, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలిచారు. నిర్మల్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ ఘోర ఓటమి పాలయ్యారు. కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. మొదటి నుంచి ఈ స్థానంలో త్రికోణ పోటీగా ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రమేశ్‌రాథోడ్, ఇటు జాన్సన్ నాయక్, వెడ్మ బొజ్జు బరిలో ఉండగా, చివరకు ఆదివాసీ నాయకుడికే పట్టం కట్టారు. ఇక్కడ 1984లో మాజీ మంత్రి కోటా్నక భీంరావు కాంగ్రెస్ నుంచి గెలవగా, మళ్లీ 40ఏళ్ళ తర్వాత ఓ ఆదివాసీకి విజయం వరించింది. ఓరుగల్లులో కాంగ్రెస్ హోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 చోట్ల గెలిచి అనూహ్య ఫలితాలను రికార్డు చేయగా, బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై కాంగ్రెస్ నుంచి ములుగు సీతక్క గెలుపొందారు. నర్సంపేటనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ విజయం సాధించారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. విలక్షణం.. ఇందూరు తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఇందూరు జిల్లా మరోసారి విలక్షణ తీర్పు తో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖా ముఖి పోరు జరగగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని ఉన్న 9 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ రేంజ్లో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం భూపతిరెడ్డి 21,963 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్రావు ప్రస్తుతం 24,001 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదన్మోహన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మినహా నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్మోహన్రావు, జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు సైతం శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కేవలం 3,062 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 1999, 2004, 2009లో బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్‌రెడ్డి వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో పనిచేశారు. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం షకీల్‌పై విజయం సాధించారు. పోచారం వరుసగా 5వ సారి, ప్రశాంత్‌రెడ్డి వరుసగా 3వ సారి విజయంబాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొందగా, 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018, 2023లలో వరుసగా 5 సార్లు విజయం సాధించడం గమనార్హం. స్పీకర్‌గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందుతారన్న సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్ చేశారు. పోచారం 23,464 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు గెలు పొందారు. ప్రశాంత్‌రెడ్డి కేవలం 4,533ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ ప్రస్తు తం 21,963 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
రేవంత్.. భట్టి.. ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్‌గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుంటారా? కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం. అమాత్యులెవరంటే...! మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు. ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. ఎంపికలో ఇవే కీలకం సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు. ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్‌లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
నెరవేరని ‘హ్యాట్రిక్’ కల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా మూడుమార్లు అధికారంలోకి వచ్చి ‘హ్యాట్రిక్’సాధించేందుకు భారత్ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డినా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. పార్టీ పేరు మార్పుతో ఓ వైపు జాతీయ రాజకీయాల్లో అరంగేట్రానికి బాటలు వేసుకుంటూనే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడాది కాలంగా సన్నద్ధమైనా అధికారం పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని బీ ఫామ్‌ల జారీ, ఇతర పార్టీల నుంచి చేరికలు, ఎన్నికల ప్రచార సభలు తదితరాలు అన్నింటా విపక్ష పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉన్నా.. అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు చేరువ కాలేకపోయింది. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 104 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండటం, అందులో సంగం మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండు కంటే ఎక్కువ పర్యాయాలు గెలిచిన వారే ఉండటం ప్రతికూలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 35 మంది పార్టీ ఎమ్మెల్యేలపై క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రతికూలత నెలకొందని నిఘా వర్గాలు, వివిధ సంస్థలు నివేదికలు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాన్ని కలిగించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లను మార్చక పోవడం వల్ల నష్టం జరిగిందని తేలినా.. మళ్లీ ‘సిట్టింగులకే టికెట్లు’అంటూ పెద్దపీట వేయడం నష్టం చేకూర్చినట్లు ఫలితాల సరళి వెల్లడిస్తోందని అంటున్నారు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి కొత్త వారికి అవకాశమిచ్చిన చోట 9 మంది గెలుపొందడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, రుణ మాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితబంధు, బీసీబంధు పథకాలు వంటి అంశాలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వ్యవహార శైలి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టడంలో కీలకంగా మారాయని అంటున్నారు. స్థానికంగా దృష్టి కేంద్రీకరించలేకపోయారా? ఈ ఏడాది మార్చి నుంచే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించి తొలి విడతలో జిల్లా కలెక్టరేట్లు, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సభలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలతో కేడర్‌ను కార్యోన్ముఖుల్ని చేసే పనికి పూనుకున్నారు. జూన్‌లో దశాబ్ది ఉత్సవాల పేరిట సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేశారు. అందరికంటే ముందుగా ఆగస్టులోనే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి అంతర్గత అసమ్మతి సర్దుబాటుకు పూనుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకమునుపే బీ ఫామ్‌లు జారీ చేశారు. ఇంత చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు టీఆర్ఎస్ పేరును ఏడాది క్రితం బీఆర్ఎస్గా మార్చడం, పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడంపై పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించే క్రమంలో స్థానికంగా పార్టీ, ప్రభుత్వంపై కేసీఆర్ అంతగా దృష్టి కేంద్రీకరించలేదనే అభిప్రాయం కూడా ఉంది. అభ్యర్థుల ప్రకటనకు ముందూ, తర్వాత టికెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడిన పొంగులేటి, తుమ్మల వంటి నేతలు తీరని నష్టం కలిగించారని అంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ధీటుగా ప్రకటించిన మేనిఫెస్టోను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పాక్షిక ఫలితాన్నే ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘తెలంగాణ మోడల్’కు మిశ్రమ స్పందన భారీగా ఓట్లు సాధిస్తుందని భావించిన ‘తెలంగాణ మోడల్’నినాదం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పొరుగునే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా సీట్లను సాధించి పెట్టింది. అయితే ‘తెలంగాణ మోడల్’లో అంతర్భాగమైన సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తాయనే లెక్కలు తారుమారై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ, ఇతర జిల్లాల్లో అరకొర ఫలితాన్నే ఇచ్చాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు ఐదు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోకేవలం రెండేసి స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. 2018 ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాన్ని అందించిన నల్లగొండలో సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో గద్వాల, ఆలంపూర్లో మాత్రమే గెలుపు సాధ్యమైంది. మొదట్నుంచీ పార్టీకి పూర్తి ప్రతికూలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటరు ప్రస్తుత ఎన్నికలోనూ అదే తీరును ప్రదర్శించడం గమనార్హం. కాంగ్రెస్‌కు హైదరాబాద్ నో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలు బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని 15 స్థానాలకు గాను మిత్రపక్షాలైన బీఆర్ఎస్, ఎంఐఎం చెరో ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లకు గాను పది స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రానికి ఓటర్లు ఏకపక్షంగా మద్దతు పలికారు. పొరుగునే ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను మంత్రి హరీశ్‌రావు సర్వశక్తులూ ఒడ్డటంతో సిద్దిపేట, గజ్వేల్ సహా ఏడు చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లోనూ బీఆర్ఎస్కు ప్రాతినిథ్యం దక్కగా, అధికార పగ్గాలు చేపడుతున్న కాంగ్రెస్‌కు హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటూ దక్కక పోవడం గమనార్హం. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాంహరీశ్రావు సాక్షి, హైదరాబాద్: ‘రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నిక సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు’అని హరీశ్‌రావు ఆదివారం ట్వీట్ చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. బీఆర్ఎస్ కార్యకర్తల కఠోర శ్రమకు కృతజ్ఞతలు. అధికారమున్నా లేకున్నా మనం తెలంగాణ ప్రజల సేవకులం. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పోరాడుదాం. కోరుట్ల ప్రజలకు ప్రత్యేకించి శుభాకాంక్షలు’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. హరీశ్‌రావుకు తగ్గిన మెజార్టీ 2018లో 1,18,699.. ఈసారి 82,308 ఓట్లు ఎమ్మెల్యేగా 7వ సారి విజయం సాక్షి, సిద్దిపేట: గత ఎన్నికల కంటే ఈసారి మాజీమంత్రి టి.హరీశ్‌రావుకు 36,391 మెజార్టీ తగ్గింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన హరీశ్‌రావుకు నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో 1,81,436 ఓట్లు పోలు కాగా, ఆయన 1,05,514 ఓట్లు సాధించారు. సమీపకాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణపై 82,308 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడోసారి హరీశ్‌రావు విజయం సాధించారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి సైతం 20 మంది ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
రేస్ గెలిచిన కాంగ్రెస్
అంతా ఊహించినట్టుగానే, ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల రేసు గెలిచింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటికే హస్తం పార్టీ ఆధిక్యతపై స్పష్టత వచ్చింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గాలి వీచింది. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకత ప్రభావం చూపింది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను మేజిక్ ఫిగర్‌ను దాటేసి 64 సీట్లతో హస్తం పార్టీ విజయం సాధించింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ప్రచారంలో ధీమాగా చెప్పిన బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ మొదట్లో డబుల్ డిజిట్ దాటేలా కనిపించినా.. చివరికి ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంఐఎం తమ ఏడు స్థానాలను నిలబెట్టుకున్నా కౌంటింగ్ ఆద్యంతం గట్టి పోటీనే ఎదుర్కొంది. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ఒకచోట గెలవగా.. సీపీఎం, బీఎస్పీ, జనసేన ఖాతా తెరవలేకపోయాయి. ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. గాంధీభవన్, రేవంత్ నివాసం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ బోసిపోయింది. ఫలితాలపై స్పష్టత రాగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తూ లేఖను గవర్నర్‌కు పంపగా, ఆమె వెంటనే ఆమోదించడం జరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు గవర్నర్ తమిళిసైని కలసి కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందజేశారు. సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో సీఎం ఎవరు అవుతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ గురితప్పిందని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎదురుదెబ్బలను ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకోవడం తమకు అలవాటేనని పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ ఇచ్చిన ‘మార్పు’నినాదం ప్రజల్లోకి వెళ్లింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ప్రభావం చూపింది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ స్థానాలకుగాను 118 చోట్ల పోటీచేసిన కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీసం 60 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉండగా.. నాలుగు సీట్లు ఎక్కువే ‘చే’జిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తొలిసారిగా రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటయ్యాక వరుసగా రెండుసార్లు గెలిచి తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 119 స్థానాల్లో పోటీచేసిన బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. సిట్టింగ్ మంత్రుల్లో ఆరుగురు ఓడిపోగా, చీఫ్ విప్, మరో ముగ్గురు విప్‌లకూ ఓటమి తప్పలేదు. కొన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపించినా.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆదరణతో బీఆర్ఎస్ గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు దక్కించుకుంది. ఇక జనసేనతో పొత్తు పెట్టుకుని, 111 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒకేచోట గెలిచిన కాషాయ పార్టీకి సంఖ్యాబలం పెరగడం ఊరట కలిగించే అంశమే. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ 7 సిట్టింగ్ స్థానాలను గెలిచి.. హైదరాబాద్ పాతబస్తీలో తన పట్టు నిలుపుకొంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా పోటీ చేసిన ఏకైక స్థానం కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించింది. ఖాతా తెరవని బీఎస్పీ, సీపీఎం, జనసేన ► రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గత నెల 30న జరగగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 107 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ.. బీజేపీతో పొత్తులో భాగంగా 8 చోట్ల పోటీ చేసిన జనసేన, 19 స్థానాల్లో బరిలో ఉన్న సీపీఎం, ఒక స్థానంలో పోటీచేసిన సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) పార్టీలు ఖాతా తెరవలేదు. ► రాష్ట్రంలోనే అత్యధికంగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు ఏకంగా 85,576 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అత్యల్పంగా 268 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ► బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో పోటీచేయగా.. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,031 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కామారెడ్డిలో ఓడిపోయారు. ► టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 32,532 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై విజయం సాధించారు. ► సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు 82,308 ఓట్ల మెజార్టీతో, సిరిసిల్లలో కేటీఆర్ 29,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ► స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో 23,464 ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసినవారు తిరిగి గెలవరనే సెంటిమెంట్‌ను ఆయన తిరగరాశారు. ► కాంగ్రెస్ సీనియర్లలో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్ర భాకర్, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, జి.వివేక్, జి.వినోద్, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు గెలుపొందగా.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, షబ్బీర్ అలీ తదితరులు ఓటమి పాలయ్యారు. బీజేపీ ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల ఓటమి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి గెలవలేకపోయారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలవడం గమనార్హం. బొటాబొటి ఓట్లతో గట్టెక్కింది వీరే.. చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్‌పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్లో గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,606, ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు. 20 మందికి 50వేలకుపైగా మెజారిటీ రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్ (బీఆర్ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. -
తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున కాంగ్రెస్ హవా కొనసాగగా, పశ్చిమ జిల్లాలో కమలం వికసించింది. మధ్యలో కారు ప్రయాణం సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమన్యాయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల చరిత్రలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం. కలిసొచ్చిన ముక్కోణ పోటీ.. నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ), అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(బీఆర్ఎస్), కూ చాడి శ్రీహరిరావు(కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చివరికి బీజేపీ బయటపడింది. సిర్పూర్లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ బరిలో ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఓట్లు పంచుకున్నాయి. ముథోల్‌లో బీఆర్ఎస్కు మై నార్టీ ఓట్లు కలిసి రాగా, ఇక్కడ కాంగ్రెస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోవడంతో మిగతా వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. ఆదిలాబాద్‌లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 6వేల మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదట బోథ్ స్థానంలోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నిలిచింది. ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు బీఆర్ఎస్ 22వేల మెజార్టీ సాధించింది. ఎస్టీ స్థానాల్లో బీఆర్ఎస్.. పది స్థానాల్లో ఎనిమిది చోట్ల చతికిల పడ్డ బీఆర్ఎస్ మూడు ఎస్టీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కోవ లక్ష్మీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాదని అనిల్ జాదవ్‌కు అవకాశం ఇస్తే, గెలిచారు. ఈ మూడు స్థానాల్లో ఖానాపూర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అప్పటి టీఆర్ఎస్కు రాగా ఆసిఫాబాద్ ఎస్టీ స్థానం మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చింది. ఇక్కడ ఈసారి బీఆర్ఎస్ గెలుచుకుంది. అసెంబ్లీకి కొత్త ముఖాలు.. రెండో ప్రయత్నంలో రామారావు పాటిల్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్‌బాబు, ఆదిలా బాద్ నుంచి పాయల్ శంకర్, బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తొలిసారిగా శాసనభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వినోద్, కోవ లక్ష్మీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. సిట్టింగ్‌ల ఓటమి! సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పది మంది ఓటమి పాలయ్యారు. నిర్మల్‌లో సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాలుగు సార్లు గెలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లి చిన్నయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ నుంచి టికెట్లు రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. -
సీఎం ఎవరనేది అప్పుడే తేలుస్తాం: డీకే శివకుమార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాతమన్నారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. హోటల్ నుంచి గవర్నర్‌ను కలవడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ థాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లారు. సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా.. లేదంటే నిర్ణయం మళ్లీ వాయిదా పడుతుందా అనేదానిపై క్లారిటీ లేదు. -
తెలంగాణ గడ్డపై తొలిసారి కాంగ్రెస్..
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకని ఒక సీటులో మాత్రమే పోటి చేసిన సీపీఐ విజయాన్ని అందుకుంది. దాంతో కాంగ్రెస్ 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజు(ఆదివారం) జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్.. అదే ఊపును కడవరకూ కొనసాగించింది. ఫలితంగా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ తొలిసారి జెండా ఎగురవేయనుంది. మొత్తం 119 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా, బీఆర్ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపును అందుకుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ చూస్తే వెనుకబడే ఉంది. ఎక్కడ కూడా లీడ్‌లోకి రాలేదు. కాంగ్రెస్ ఆది నుంచి 50 స్థానాల్లో ఆధిక్యం దక్కకుండా ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో బీఆర్ఎస్ వెనుకంజలో పయనించింది. కాగా, బీఆర్ఎస్ ఓటమిలో బీజేపీ పాత్ర ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నికలు పోరు ప్రారంభమైన నాటి నుంచి బీఆర్ఎస్-బీజేపీలు మిత్రులు అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగించింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీఆర్ఎస్కు ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తుందనే ప్రచారం కూడా కాంగ్రెస్ చేసింది. వీరిద్దరూ మిత్రపక్షాలేనని, బీఆర్ఎస్ ‘ఏ’ టీమ్ అయితే బీజేపీ ‘బీ’ అంటూ ప్రచారం సాగించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ సుమారు 14 శాతం ఓట్ల షేర్‌ను సాధించినట్లే కనబడుతోంది. అదే సమయంలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అభ్యర్థుల్లు ఎవరూ గెలవలేదు. చాలా చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..? -
కాటిపల్లి..కామారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పైచేయి సాధించారు. అయితే కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు ఇద్దిరినీ ఓడించిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. కామారెడ్డిలో పోటీచేసిన ఇరు పార్టీల అధినేతలపై సంచలన విజయం సాధించి వెంకటరమణారెడ్డి పాపులర్ అయ్యారు. కామారెడ్డిలో ఎవరికి ఎన్ని ఓట్లు... ఆదివారం ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కామారెడ్డి ఫలితం రౌండ్ రౌండ్‌కు తీవ్ర ఉత్కంఠ రేపింది. తొలుత ఈ స్థానంలో వెంకటరమణారెడ్డి లీడ్‌లో ఉండగా తర్వాత రేవంత్‌రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. చివరి రౌండ్లు లెక్కబెట్టే టైమ్‌కు రేవంత్‌రెడ్డిని వెనక్కి నెట్టేసి మళ్లీ వెంకటరమణారెడ్డి లీడ్‌లోకివచ్చారు. తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ ముందుకు దూసుకువచ్చి రేవంత్‌ను మూడో స్థానానికి నెట్టారు. చివరగా కౌంటింగ్ ముగిశాక కేసీఆర్‌పై వెంకటరమణారెడ్డి 6741 వేల ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డికి 66652 ఓట్లు రాగా, రెండవ స్థానంలో ఉన్న కేసీఆర్‌కు 59911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి.. ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్న వెంకటరమణారెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.ఈ ఎన్నికల్లో టికెట్ రాకముందు నుంచే ఆయనే బీజేపీ పార్టీ అభ్యర్థి అని కన్ఫామ్ అయిపోయింది. అయితే తర్వాత నియోజకవర్గానికి ఏకంగా ఇటు కేసీఆర్, అటు రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. దీంతో వెంకటరమణారెడ్డిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఎక్కడా కుంగిపోకుండా, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో వెంకటరమణారెడ్డి తన ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. పనిచేసిన లోకల్ కార్డు.. ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా లోకల్ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రచారంలో వాడి వేడి డైలాగులు ప్రయోగించారు. ‘గజ్వేల్ డిపో నుంచి వచ్చిన బస్సులు గజ్వేల్‌కు, కొడంగల్ నుంచి వచ్చిన బస్సులు కొడంగల్‌కు వెళ్లిపోతాయి. కామారెడ్డి డిపో బస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి’ అని తాను స్థానికుడిని అని పరోక్షంగా చెప్పేలా ప్రచారం చేశారు. వెంకటరమణారెడ్డి చెప్పిన ఈ మాటలు అక్కడి ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు గెలిచినా నియోజకవర్గంలో ఉండరని కామారెడ్డి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇదే ఆయన ఇద్దరు బడా నేతలపై విజయానికి కారణమైందని పొలిటికల్ అనలిస్టులు అభిపప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ తరపున గంప గోవర్ధన్ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే. -
రివేంజ్ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్ గెలుపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్ తీర్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత పగ పూర్తిగా తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయమై కవిత ట్విట్టర్లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి మద్దతు తెలిపిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుబంధం నిరంతరం పెరుగుతూ ఉంటుందని ఆశించారు. తెలంగాణ ప్రజలతో తమ అనుబంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రమించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. My dear sisters and brothers of Telangana, Thank you for your support to the @BJP4India. Over the last few years, this support has only been increasing and this trend will continue in the times to come. Our bond with Telangana is unbreakable and we will keep working for the… — Narendra Modi (@narendramodi) December 3, 2023 తెలంగాణలో నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ విజయభేరి మోగించింది. బీజేపీ కూడా 8 స్థానాలను కైవసం చేసుకుంది. అటు.. అధికార బీఆర్ఎస్ పార్టీ 31 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. -
సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమవడంతో తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి తన రాజీనామా లేఖను పంపించారు. సాధారణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత ముఖ్యమంత్రులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు నేరుగా రాజీనామా లేఖను సమర్పిస్తారు. దీనికి భిన్నంగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లకుండానే సీఎం పదవికి రాజీనమా చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ రాజీనామా చేసే కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పార్టీ ఓటమిని అంగీకరించారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. తమతప్పు సరిదిద్దుకుంటామని తెలిపారు. -
సీఎం ఆయనే..కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
బీజేపీ ఎంపీలకు షాక్.. కాంగ్రెస్ ఎంపీలకు జై
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంది. ఓ వైపు అసెంబ్లీలో బీజేపీ స్థానాలు 3 నుంచి రెట్టింపయి 8కి పెరిగే దిశగా ఉండగా మరోవైపు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ హవా నడిచిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలవడం గమనార్హం. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.కోరుట్లలో ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మీద, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ చేతిలో ఓడిపోయారు. ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి గెలుపొందడం విశేషం. బీజేపీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలవడం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, దుబ్బాక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై గెలుపొందారు. -
ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
-
సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే, కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరకి సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌లో జోష్ నింపే యత్నం చేశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు. మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్ తప్పకుండా అనివార్యం కావొచ్చు. ఎప్పటిలోగా..? కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్ నుంచి సిద్ధరామయ్య పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి. లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా? తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్‌గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టక తప్పదు..! -
ప్రగతి భవన్ పేరు.. ఇకపై ప్రజా భవన్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు విజయం కోసం చాలా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అటు.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం బాగా జరిగింది అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారు.. ఇవాళ్టి ప్రజా తీర్పు శ్రీకాంత్‌చారికి అంకితం చేస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రజలు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్ జోడో ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. అమరవీరులకు అంకితం.. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజయంలో 30 లక్షల నిరుద్యోగుల పట్టుదల ఉందని పేర్కొన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం చేేస్తున్నట్లు చెప్పారు. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన థాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. 'సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్ఎస్ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాతీర్పును అందరూ శిరసావహించాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు. గేట్లు తెరిచే ఉంటాయి.. ప్రగతి భవన్ పేరును మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇకపై డా. అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయం గేట్లు సామాన్య ప్రజలకు సదా తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అందరం కలిసి నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -
నేను సీఎం కాదు
-
ఓవర్ కాన్ఫిడెన్స్..బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదే..
-
ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లోనే దూసుకెళ్లారు. ఇక, ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. ఈరోజు ఫలితం గురించి బాధపడటం లేదు. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందాను. రెండుసార్లు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను ఒక అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు’ అంటూ కామెంట్స్ చేశారు. Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏 Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back… — KTR (@KTRBRS) December 3, 2023 మరోవైపు.. సిరిసిల్లలో కేటీఆర విజయం సాధించారు. దాదాపు 29వేల మెజార్టీతో కేటీఆర్ విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ 2018 ఎన్నికల్లో దాదాపు 89వేల మెజార్టీలో గెలుపొందారు. ఇక, ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్వల్పంగా రావడం కూడా కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులను నిరాశ పరచినట్టు తెలుస్తోంది. -
కాబోయే సీఎంకు అభినందనలు.. ఆర్జీవీ సంచలన ట్వీట్
తెలంగాణ ఎన్నికలపై సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ గెలవడంపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అభినందనలు తెలిపారు. రేవంత్ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ పోస్ట్ చేశారు. నవంబర్ 30న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. Hi @RahulGandhi ji , and #SoniaGandhi ji , For 1st time in many years I regained a tremendous respect for CONGRESS party 🙏🙏🙏because @revanth_anumula is going to be the Honourable C M of telangana 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 Since Congress lost in all other states , TELANGANA is a REVANTH REDDY win and not at all a congress win .. @RahulGandhi and #SoniaGandhi should thank their stars that they luckily got a BAHUBALI in @revanth_anumula — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 SUPER DUPER proud to know the present HONOURABLE CHIEF MINISTER of TELANGANA the WARRIOR KING REVANTH REDDY ..Hey @revanth_anumula Take 10000000000000000000000 BOWS🙏 pic.twitter.com/bQDVFdUjSP — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 -
బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం. బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్‌ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్‌ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్‌ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు. -
గెలుపును ముందే ఉహించాం..
-
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు (ఫొటోలు)
-
కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణాలు..!
-
మంత్రి పువ్వాడకు భారీ షాక్
ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. కచ్చితంగా ఈ సీటు గెలుస్తామనే పువ్వాడ ఆది నుంచి ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ జోష్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేశారు. ఖమ్మం సీటుపై ఆది నుంచి టార్గెట్ చేసిన కాంగ్రెస్.. అదే జోరును కడవరకూ కొనసాగించింది. కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నేత కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారు. ఎన్నికల ప్రచారహోరులో కూడా వీరిద్దరూ హోరీహోరీనే తలపించారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ మరింత ఆసక్తిని పెంచింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ప్రచారానికి వెళ్లారు. దానికి తోడు కాంగ్రెస్ జోరు కూడా తోడవడంతో ఖమ్మం నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
కాంగ్రెస్ గెలిస్తే..ఏపీ మీద ప్రభావం ఉండదు..
-
సీఎం పదవి ఇస్తే..: భట్టి కీలక వ్యాఖ్య
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల విజయం. తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా అని అన్నారాయన. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
కాంగ్రెస్ ఘన విజయం కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తమ్
-
తొలిసారి ఎమ్మెల్యేలు వీరే..!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు. వీరిలో అతి చిన్న వయసు వాళ్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తిలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి పోటీచేసిన మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యర్థి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు. వేములవాడలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆదిశ్రీనివాస్ విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్‌కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలవగా ఇదే జిల్లా నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కలకుంట్ల మదన్మోహన్రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా ఫస్ట్‌టైమ్ అధ్యక్షా అనే ఛాన్స్ వచ్చింది. -
అత్త వ్యూహం.. కోడలు విజయం
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. అత్త వ్యూహం.. కోడలు విజయం పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెక్‌పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఎన్ఆర్ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్ టికెటు సాధించడంలో సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి, అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్.. ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్‌కే షిప్ట్ అయ్యింది. -
పోచారం రికార్డు బ్రేక్ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్‌ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్‌గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్‌గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు
-
గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్‌లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్‌రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
డీకే శివకుమార్ ఫస్ట్ రియాక్షన్
-
బరిలో బంధువులు.. ఫలితం ఏంటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో బంధువులు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు, మామ అళ్లుల్లు ఇలా ఏదో ఒక రకంగా బంధుత్వాన్ని పంచుకున్నవారు ఎన్నికల్లో పోటీకి నిలిచారు. వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? మామా అల్లుడు.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. ఇక మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘనవిజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరుపున కోమటి రెడ్డి బ్రదర్స్ పోటీ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 21 వేల మెజార్టీతో గెలుపును ఖాయం చేసుకున్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో 54 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తండ్రి కోడుకులు.. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఓటమి దిశలో ఉన్నారు. అత్త.. అల్లుడు.. వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ తరుపున బాల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఫలితాల్లో గెలుపు దిశగా దూసుకుపోతూ దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇదే స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మేనత్త అన్నపూర్ణమ్మ ఓడిపోయింది. ఎర్రబెల్లి బ్రదర్స్.. వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్ బీజేపీ తరుపున పోటీలో నిలిచారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. గడ్డం సోదరులు.. సోదరులు గడ్డం వినోద్, గడ్డం వివేక్ విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. ఆయన సోదురుడు వివేక్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఇద్దరు విజయం సాధించడం గమనార్హం. కేసీఆర్.. కేటీఆర్.. తండ్రికొడుకులు సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీలో నిలవగా ఆయన కుమారుడు కేటీఆర్ సిరిసిల్లలో బరిలోకి దిగారు. కామారెడ్డిలో ఓటమి పాలైన కేసీఆర్ గజ్వేల్ మాత్రం విజయం సాధించారు. అటు.. సిరిసిల్లలో కేటీఆర్ అధికారాన్ని కాపాడుకోగలిగారు. భార్యాభర్తలు.. తెలంగాణ ఎన్నికల్లో భార్యభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పోటీలో నిలిచిన ఆయన భార్య పద్మావతి రెడ్డి ఘనవిజయం సాధించారు. -
తెలంగాణ కాంగ్రెస్ విజయ సారథి అనుముల రేవంత్‌రెడ్డి (ఫొటోలు)
-
రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ
-
తెలంగాణ ఫలితాలు: ఫిరాయింపుదారులకు దెబ్బ
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణమే. ఒక పార్టీలో నెగ్గి.. మరో పార్టీ కండువా కప్పేసుకోవడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జరుగుతుంటుంది. అలా.. పోటీ చేసిన ఫిరాయింపుదారులకు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మీద పోటీ చేసి నెగ్గి.. మరో పార్టీలోకి వెళ్లి.. ఇప్పుడు మారిన పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు బొక్కబోర్లాపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు.. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ 2023 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఫిరాయింపుదారుల్ని ఓటర్లు నిర్మోహమాటంగా తిరస్కరించారు. మెచ్చా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటలో గతంలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) తరఫున గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ తరఫునే పోటీకి దిగారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణకు ఓటర్లు పట్టం కట్టారు. ఫిరాయింపుదారి నాగేశ్వరరావుపై ఆది నారాయణ ఏకంగా 28,358 ఓట్లతో గెలుపొందారు. కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గంలో 2018లో కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చందర్ పోటీ చేయగా.. రామగుండం ప్రజలు ఆయన్ని ఓడించారు. ఫిరాయింపుదారి కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ 40 వేల ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు. పైలెట్ రోహిత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో గెలుపొందిన పైలెట్ రోహిత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తార్వత బీఆర్ఎస్లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన రోహిత్‌రెడ్డిని ఆ నియోజకవర్గం ప్రజలు ఓటర్లు తిరస్కరించారు. గండ్ర వెంకట రమణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈసారి ఫిరాయించిన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గండ్ర ఓటమిపాలయ్యారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల విరేశం చేతిలో చిరుమర్తి లింగయ్య ఓటమిపాలయ్యారు. ఆయితే లింగయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఫిరాయించిన బీఆర్ఎస్ నుంచి ఈసారి పోటీ చేశారు. నకిరేకల్ నియోజకవర్గ ఓటర్లు లింగయ్యను తిరస్కరించారు. వనమా వెంకటేశ్వర్ రావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో వనమా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచే మళ్లీ పోటి చేయగా ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి వనమా కొత్తగూడెంలో ఓడిపోయారు. సండ్ర వెంకటవీరయ్య గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సండ్ర అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023లో ఫిరాయించిన బీఆర్ఎస్ నుంచి మళ్లీ పోటీ చేయగా.. సత్తుపల్లి ఓటర్లు తిర్కరించారు. రేగా కాంతారావు గత ఎన్నికల్లో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంతారావు మళ్లీ బరిలో దిగారు. అయితే ఈసారి పినపాక సెగ్మెంట్ ఓటర్లు కాంతారావును తిరస్కరించారు. హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు హరిప్రియా నాయక్. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి.. బీఆర్ఎస్లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పికపాక నుంచి పోటీ చేసిన హరిప్రియ ఓటమిపాలయ్యారు. ఉపేందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్లోకి జంప్ చేశారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. ఆయన్ని పాలేరు నియోజకవర్గ ఓటర్లు తిర్కరించారు. సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు. ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎల్లారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన్ని ఎల్లారెడ్డి ఓటర్లు సురేందర్‌రెడ్డిని తిరస్కరించారు. హర్షవర్ధన్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఈసారి ఆయన ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ఓటర్లు హర్షవర్ధన్‌రెడ్డి తిరస్కరించారు. -
బొక్క బోర్లా పడ్డ జనసేన
-
రేవంత్ ఇంటికి తెలంగాణ డీజీపీ.. భద్రత పెంపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ విజయంతో హస్తం పార్టీ శ్రేణులు వేడుక సంబురాలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ను కలిసిన వారిలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ ఉన్నారు. కాంగ్రెస్ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించినట్టు తెలుస్తోంది. ఇక, రేవంత్ రెడ్డికి భద్రతను కూడా పెంచారు. మరోవైపు.. కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో రేవంత్ ఇంటికి చేరుకున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. *BREAKING* టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్#Revanthreddy pic.twitter.com/kwEBYPdduM — Yashwanth Reddy🇮🇳 (@Yashwanthgarla1) December 3, 2023 అంతకుముందు రేవంత్ రెడ్డి ట్వీట్ ఇది.. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j — Revanth Reddy (@revanth_anumula) December 3, 2023 -
మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్..నేతల సంబరాలు
-
సీఎం అభ్యర్థి ఎవరంటే..
-
జాడ లేని జనసేన.. పవర్ స్టార్ ప్రభావం ఏదీ?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన గుర్తు గ్లాస్ పగలిపోయేలా జనాలు పవన్‌కు పట్టించుకోలేదు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా జనసేనను ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు
సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు. -
తెలంగాణాలో కాంగ్రెస్ జోరు: సీతక్క ట్వీట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్‌లో ఆదినుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఫలితాల్లో తన జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయంతో తొలి బోణీ కొట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ.. అలియాస్ సీతక్క సంచలన ట్వీట్లతో సందడి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో అటు కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. ఇవి ట్విటర్లో వైరల్‌గా మారింది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్క ప్రస్తుతం భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. 200 cr Kcr money Vs seethakka After completing 13 rounds 20 thousand majority to seethakka .. More 9 rounds to go.. #TelanganaElectionResults @RahulGandhi @priyankagandhi @kharge @revanth_anumula @srinivasiyc — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం