రివేంజ్‌ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే | Telangana Election Results: MLC Kavitha Greets Korutla People For MP Arvind Defeat Against Sanjay Kalvakuntla - Sakshi
Sakshi News home page

Telangana Assembly Election Results: ఎమ్మెల్సీ హ్యా‍ప్పీ..!

Published Sun, Dec 3 2023 5:16 PM | Last Updated on Sun, Dec 3 2023 5:38 PM

Mlc Kavitha Greets Korutla People For Mp Arvind Defeat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ‍ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు  మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ  ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరుట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ​ చేతిలో ఓటమి పాలయ్యారు.

కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్‌ గెలుపులో ఎమ్మెల్సీ కవిత​ పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్‌ ఏ పార్లమెంట్‌ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్‌ ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్‌ తీర్చుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత  పగ పూర్తిగా తీరుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇదే విషయమై కవిత ట్విట్టర్‌లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు  తెలిపారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement