
సాక్షి, హైదరాబాద్: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్ సర్జన్లు కాగా, ఒకరు జనరల్ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్ కాగా ఒకరు న్యూరో సర్జన్ ఉన్నారు.
ఇక ముగ్గురు ఎంఎస్ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్ సర్జన్. ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment