పోచారం రికార్డు బ్రేక్‌ విక్టరీ | Telangana Elections 2023 Results Updates: Pocharam Record Break Victory Against Enugu Ravinder Reddy In Banswada - Sakshi
Sakshi News home page

Telangana Election Results 2023: పోచారం రికార్డు బ్రేక్‌ విక్టరీ

Published Sun, Dec 3 2023 2:10 PM

 TS Elections 2023 Results Updates: Pocharam Record Break Victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి  చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్‌ ఉండేది.  ఆ సెంటిమెంట్‌ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్‌గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్‌ చేశారు.

అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్‌గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement