Assembly speaker
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్‌ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్‌రావు మరో పిటిషన్ వేశారు.మహారాష్ట్ర కేసులో..రాజ్యాంగంలోని పదో షెడ్యూల్.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది. -
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నర్వేకర్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. నర్వేకర్ ఆదివారం సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్‌లతో కలిసి అసెంబ్లీ కార్యదర్శి జితేంద్ర భోలెకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్పీకర్ పదవికి పోటీ పడరాదన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నిర్ణయంతో నర్వేకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం స్పీకర్ ఎన్నికపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శాసనసభ, శాసనమండలి సభ్యులతో జరిగే ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా, ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమిలోని పార్టీలకు వదిలేయాలని ఎంవీఏ నేతలు ఆదివారం సీఎం ఫడ్నవీస్‌ను కలిసి కోరారు. ప్రతిపక్ష నేత పదవిని కూడా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 288 సీట్లకుగాను మహాయుతి 230 స్థానాలను గెల్చుకోవడం తెల్సిందే. ముంబైలోని కొలాబా నుంచి మళ్లీ ఎన్నికైన రాహుల్ నర్వేకర్ గత 14వ అసెంబ్లీ స్పీకర్‌గా రెండున్నరేళ్లపాటు కొనసాగారు. ఆ సమయంలో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల వ్యవహారంపై మహాయుతి ప్రభుత్వానికి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు!మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. అతిత్వరలో విస్తరణ ఉంటుందని మహాయుతి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో కీలక భగస్వామి అయిన శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. కీలక శాఖలు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. శివసేన(షిండే) నుంచి మంత్రులుగా ప్రమాణం చేసేవారిలో ఆరుగురు మాజీ మంత్రులే ఉంటారని సమాచారం. కొత్తగా ఐదుగురికి మంత్రి యోగం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. కనీసం 13 మంత్రి పదవులు కావాలని శివసేన(షిండే) డిమాండ్ చేయగా 11 పదవులకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. -
స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లో శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర ప్రతివాదులు కూడా స్పందించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా, జీతభత్యాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారని.. ఇలాంటి వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం ద్వారా ఆయా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇలాంటి వారంతా ఐదేళ్ల పాటు యథేచ్ఛగా తమ అధికారాలను అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి వారిపై వెంటనే అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై అప్పటికే సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో రిజిస్ట్రీ అభ్యంతరం తెలుపుతూ పిల్‌కు నంబర్ కేటాయించలేదు. కానీ గత విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీని అందజేయడంతో నంబర్ కేటాయించాలని సీజే ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ఈ పిల్‌పై సోమవారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఏమన్నారు.. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన పిటిషన్లలో ఈ నెల 9న తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ చెప్పేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని.. ఆలోగా వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని స్పీకర్ కార్యదర్శికి జడ్జి తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, విచారణ షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేశారు. దీని వివరాలను రిజి్రస్టార్ (జ్యుడిషియల్)కు అందజేయాలని చెబుతూ కీలక తీర్పు వెలువరించారు. ఈ తీర్పు వెలువడి ఇప్పటికి రెండు వారాల సమయం గడిచింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం.. పార్టీ ఇన్ పర్సన్ కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఒక్కోసారి సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు పడుతోంది. ప్రతివాదులైన 10 మంది (దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి. అలాగే జీతభత్యాలు కూడా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ మధ్యంతర ఉత్తర్వుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. -
స్పీకర్ నిర్ణయాలపైన్యాయ సమీక్ష జరపొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నిర్ణయాలపై న్యాయసమీక్ష జరిపే అధికారం ధర్మాసనాలకు ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం హైకోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్‌ను ట్రిబ్యునల్ చైర్మన్‌గా పరిగణించాలని.. స్పీకర్‌కు కాకపోయినా, ట్రిబ్యునల్ చైర్మన్‌కు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తేలి్చచెప్పిందని పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, మాజీ ఏఏజీ రామచంద్రరావు హాజరయ్యారు.పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన్ను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7ను ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి. అని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి ముప్పన్న సుప్రీంకోర్టు ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచి్చంది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్ అవుతారని, అధికార పారీ్టకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోకుండా పదవీకాలం ముగిసేవరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.కైశమ్ మేఘచంద్రసింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్.. కేసులో స్పీకర్ రాజకీయ విధేయత కారణంగా పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని.. ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్ వద్ద ఉంచాలా.. వద్దా.. అనేది పార్లమెంట్ పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది’అని ఆర్యామ సుందరం వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశాలను హైకోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలాలుసుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగేందుకు మార్గం సుగమమైంది. మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌తో పాటు పలు సంఘాలు తీవ్రస్థాయిలో చేసిన ఉద్యమానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలుఅందుతాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ల అమల్లో స్పష్టత లేకపోవడంతో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు వర్గీకరణ ద్వారాన్యాయం జరగనుంది. – వలిగి ప్రభాకర్ ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు -
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా. -
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు.‘‘ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది.అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి, కానీ అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది.👉 ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ -1953 చట్టంలోని 12-Bలో ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరనే విషయాన్ని నిర్వచించారు. విపక్షంలో ఉన్నపార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. 👉 కానీ.. జూన్ 21న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే YSRCPని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కాని, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలోకాని, మీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయి. చట్టాన్ని చూస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో కానీ, ఆ పార్టీ శాసనసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్షనేతగా స్పీకర్ గుర్తించడంలో ఎలాంటి సందిగ్ధతకు తావు లేదు.👉 గౌరవ స్పీకర్ ఇటీవల నన్ను ఉద్దేశించి అన్న మాటలు యూట్యూబ్ ఛానళ్లలో పబ్లిష్ అయ్యాయి. "ఓడిపోయాడు కాని చావలేదు, చచ్చేవరకూ కొట్టాలి" అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.👉 ఇటీవల జరిగిన ఎన్నికల్లో YSRCP 40శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్టవుతుంది. YSRCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు.👉 సభాకార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్షానికి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కాని, వివిధ అంశాల్లో సరైన చర్చలు జరిగే అవకాశం ఉండదు.👉అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోంది. భారత రాజ్యంగం ప్రకారం ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నాను. 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయినప్పటికీ పి.జనార్దన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు.ఈ అంశాలన్నీకూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ మీకు రాస్తున్నాను. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, "నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న" స్పీకర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. -
ఏపీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం, ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సభ్యులు అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒక్కరు. ఆయన ఏకగ్రీవంగా ఎన్ని కావడం సంతోషం. స్పీకర్ స్థానంలో అయ్యన్న తన పాత్ర పోషిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. -
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. వైఎస్ఆర్ సీపీ మద్దత్తుపై ఉత్కంఠ
-
ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు.ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం.అయ్యన్నపాత్రుడి కామెంట్స్.. చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను. -
ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేసులో పలువురు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు అయ్యన్న వైపే అధిష్టానం మొగ్గుచూపించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే వెళ్లే అవకాశాలున్నాయి. జనసేన నుంచి నెల్లిమర్ల(విజయనగరం) శాసనసభ సభ్యురాలు మాధవి లోకం పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్‌విప్‌గా ధూళిపాళ నరేంద్రకు అవకాశం దక్కవచ్చని టాక్. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. -
స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు?
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్ నాయకుడు అవడంతోపాటు గతంలో పలుసార్లు మంత్రిగా పని చేసిన అయ్యన్నకు మంత్రివర్గంలో కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే సీఎం చంద్రబాబు ఆయనకు పదవి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సమయంలో స్పీకర్ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు? ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉండడంతో ఒకటి, రెండు గవర్నర్ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. టీడీపీలో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను గవర్నర్ పదవుల కోసం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల రామకృష్ణుడు శుక్రవారం చంద్రబాబును కలవగా ఈ విషయం చెప్పి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవి ఆశించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను శాసన సభలో చీఫ్ విప్ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నీటి పారుదల శాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో చర్చించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, ఆ తర్వాత మంత్రివర్గ , అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ.5 లక్షలు! శుక్రవారం సచివాలయంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన చంద్రబాబు ఆమె కుమార్తె ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రతి నెలా రూ.10 వేల పింఛను ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. -
అసెంబ్లీ స్పీకర్ ఎవరు..?
-
TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ‘ఈసీ’కి ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి మంగళవారం(ఏప్రిల్23) ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు చేసిన అనతంరం బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సీఈవో వికాస్‌రాజ్‌కు అందించాం. ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు దొరలే.. -
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు!
గుజరాత్లో మరో రాజకీయ గందరగోళం నెలకొంది. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి బీజేపీకి ప్రచారం సాగిస్తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, శంకర్ చౌదరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి తన ఫిర్యాదులో ఎన్నికల నియమావళి ప్రకారం రాజ్యాంగ పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీకీ ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. బనస్కాంత లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రేఖా చౌదరికి మద్దతుగా శంకర్ చౌదరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దోషి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లను కూడా విడుదల చేశారు. పార్లమెంటరీ సంప్రదాయం, ప్రొసీజర్ పార్ట్-1లోని అధ్యాయం-9లోని సూత్రాలను చౌదరి ఉల్లంఘించారని, 2024 పార్లమెంటు ఎన్నికలకు ఆయన ప్రచారం చేయకుండా తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని మనీష్ దోషి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ యగ్నేష్ దవే స్పందిస్తూ ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్ మాత్రమేనని అన్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశలో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కడియంకు బీఆర్ఎస్ చెక్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియంపై అనర్హతవేటు వేసేందుకు సిద్ధమైన్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు శనివారం మధ్యాహ్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది. అయితే.. కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేరని సమాచారం. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే యత్నం చేయగా.. ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కడియంపైన కాకుండా.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఇద్దరిపైన లేకుంటే ఇద్దరిలో ఒకరిపైనే బీఆర్ఎస్ ఫిర్యాదుకు సిద్ధమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరి మీద అయినా.. ఆలస్యం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరనుందని సమాచారం. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ స్వీకరిస్తే గనుక.. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయా? అనే ఆసక్తి నెలకొంది. మరోపక్క శనివారం ఉదయం అనుచర గణంతో సమావేశమైన కడియం, ఆయన కూతురు కావ్యలు పార్టీ మారబోతున్నట్లు నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అందుకే తాము తప్పనిసరి స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. కావ్య తాను వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నానని.. తనను గెలిపించాలంటూ వ్యాఖ్యానించారు. -
నాడు టీవీ యాంకర్.. నేడు అసెంబ్లీ స్పీకర్!
Mizoram First Woman Speaker : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటి సారిగా ఓ మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు. మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్దుహోమా పేర్కొన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. మిజోరాం మొదటి మహిళా స్పీకర్ బారిల్ వన్నెహసాంగి మార్చి 7న మిజోరాం మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుండి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
గుంటూరు, సాక్షి: ఎన్నికల ముందర అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షితో స్పందించారు. నిష్పక్షపాతంగా తాను వ్యవహరించానని.. చట్ట ప్రకారమే నడుచుకున్నానని అన్నారాయన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ ముగించాం. విచారణ అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వాదనలు వినిపించేందుకు వాళ్లకు తగిన సమయం ఇచ్చాం. కానీ, వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టే విచారణ ముగించి అనర్హత వేటు వేశాం. ఈ విషయంలో నేను నిష్ఫక్షపాతంగా వ్యవహరించా. చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నా అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీలో చేరినవాళ్లపైనా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అనర్హత వేటు పడ్డవాళ్లు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. మాదీ(అసెంబ్లీని ఉద్దేశించి..) కోర్టు లాంటిదే. ఇక వారిష్టం’’ అని స్పీకర్ తమ్మినేని అన్నారు. -
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్!
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొనడం గమనార్హం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలకు ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో 19వ తేదీన మధ్యాహ్నాం విచారణ ఉంటుందని.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని నోటీసుల్లో అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ లకు సైతం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరయ్యే విషయమై వీళ్లంతా నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. -
RS Elections: వేడెక్కిన ఏపీ రాజకీయం
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం.. పెద్దల సభకు జరగబోయే ఎన్నికలు. తద్వారా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యే అవకాశం. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠా నెలకొంది. సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుంది. కారణం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఉన్న ఒక్క సీటు కూడా దూరం కానుంది. ఇక ఎమ్మెల్యే సంఖ్యా బలంతో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది వైఎస్సార్సీపీ. ఈ తీవ్ర ఆందోళనల నడుమే దుష్ట రాజకీయానికి తెర లేపినట్లు స్పష్టమవుతోంది. ఎందుకు.. ఏప్రిల్ 2తో వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం ముగియనుంది. సంఖ్యాబలాన్ని బట్టి ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం కానున్నాయి. తద్వారా రాజ్యసభలో ఉనికే లేకుండాపోనుంది టీడీపీ. అదే జరిగితే.. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి కానుంది. ఇదీ చదవండి: రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల వ్యూహ-ప్రతివ్యూహాలు రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యే ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న 3 స్థానాలకు షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో అప్రమత్తమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ గెలుచుకుంటామని వైఎస్సార్సీపీ ధీమాతో ఉండగా.. ఒక్క సీటుకు పోటీ పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ప్రస్తుతం స్పీకర్ ముందు నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. గంటా రాజీనామా ఆమోదం ద్వారా టీడీపీ కి ఒక సీటు తగ్గింది. మళ్లీ అదే బాటలో బాబు.. తెలుగుదేశం అనగానే గుర్తొచ్చేది పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో ఓటుకు కోట్లు అయినా.. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల డబ్బు వ్యవహారం అయినా.. ఫిరాయింపులకు టీడీపీ బ్రాండ్‌గా మారింది. మరోసారి అదే అస్త్రంపై నమ్మకం పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. బలం లేకున్నా... పోటీకి అభ్యర్థిని పెట్టడం.. ఆ పార్టీకి వస్తోన్న అనవాయితీ. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక స్థానానికి వర్లరామయ్య, కోనేరు సురేష్ పేరు పరిశీలిస్తున్నట్టు టీడీపీ లీకులిస్తోంది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల ద్వారా నెలపాటు స్పీకర్‌ను గడువు కోరడం వెనుక చంద్రబాబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
Bihar: బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం
పట్నా: బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు గుడ్‌బై చెప్పిన సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి బిహార్ సీఎంగా అవతరించారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుసటి రోజే ప్రతిపక్షాలపై చర్యలను ప్రారంభించింది ఎన్డీయే సర్కార్. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తన పదవి నుంచి తొలగించాలంటూ అసెంబ్లీ సెక్రటరికీ బీజేపీ, ఆర్డేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. బీజేపీ నేతలు నంద కిషోర్ యాదవ్, తార్కిషోర్ ప్రసాద్(మాజీ డిప్యూటీ సీఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, జేడీయూకు చెందిన వినయ్ కుమార్ చౌదరి, రత్నేష్ సదా, ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ హమాఘట్ బంధన్ సంకీర్ణం నుంచి తప్పుకొని మరోసారి బీజేపీ సార్ధంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 72 ఏళ్ల నితీష్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ నుంచి ఇద్దరు (సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల నిష్క్రమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రసాద్‌కుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు స్పీకర్‌ను గౌరవ పూర్వకంగా తోడ్కొని వెళ్లి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మంచి సాంప్రదాయానికి అందరి మద్దతు: సీఎం స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారన్నారు. ప్రసాద్‌కుమార్ తన సొంత జిల్లా నేత అని గుర్తు చేశారు. వికారాబాద్ అభివృద్ధిలో ప్రసాద్కుమార్ది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఆయనకు బాగా తెలుసన్నారు. ఆయనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో వారందరి బాధ్యత తానే తీసుకున్నారన్నారు. ఈ అసెంబ్లీ కూడా ఒక కుటుంబమేనని, ఆ కుటుంబంలో మనమంతా సభ్యులమని పేర్కొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షం అందరూ కుటుంబ సభ్యులేనన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని, సభలో అందరి హక్కులను కాపాడగలరని, ఆదర్శవంతమైన అసెంబ్లీగా దీన్ని తీర్చిదిద్దుతారనే పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు ప్రసాద్‌కుమార్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ మద్దతుకు కేసీఆర్ ఆదేశం: కేటీఆర్ స్పీకర్ ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డిలాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నానన్నారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రసాద్‌కుమార్ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికయ్యారంటూ అభినందనలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు ఇదే శాసనసభలో చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పా ర్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్‌కుమార్ ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పిల్లలకు తండ్రి లాంటి పాత్ర ఆయన సభలో పోషించాలని ఆకాక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. బీజేపీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి సైతం దూరంగా ఉన్న వారు గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్, పవార్ రామారావు పాటిల్, టి.రాజాసింగ్ వీరిలో ఉన్నారు. పార్టీల బలాలను బట్టి సమయం: స్పీకర్ తనను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రసాద్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఏకగీవ్రంగా ఎన్నుకున్నందుకు అన్ని పా ర్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 57 మంది కొత్త సభ్యులు ఉన్నారంటూ..పా ర్టీల బలాలను బట్టి సమయం కేటాయిస్తానని చెప్పారు. స్పీకర్ స్థానం ఉన్నతమైనదే కాదు సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. అంతకుముందు సభ మొదలైన వెంటనే గతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని వారి చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిలో ఉన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
-
అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బుధవారం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన స్పీకర్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు వివిధ పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని వెళతారు. ఆపై నూతన స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికారపక్షం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ప్రసాద్‌కుమార్ నామినేషన్ పత్రాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అయితే స్పీకర్ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. గడ్డం ప్రసాద్‌కుమార్ పేరును కాంగ్రెస్ ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో కలిసి బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. కాంగ్రెస్ నుంచి అందిన వినతి మేరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రసాద్‌కుమార్ నామినేషన్ పత్రాలపై కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్యలు సంతకాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనపనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తదితరులు జట్టుగా అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు ప్రసాద్ కుమార్ తరపున నామినేషన్ పత్రాలు అందజేశారు. తెలంగాణ తొలి శాసనసభలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్‌గా పనిచేయగా, రెండో శాసనసభలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రస్తుత మూడో శాసనసభలో దళిత సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
-
తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, దాని మిత్ర పక్షం మజ్లిస్ సైతం స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని ప్రకటించింది. గడువు ముగియడంతో ఆయన స్పీకర్ కావడం ఖాయమైంది. శాసనసభ స్పీకర్ ఎన్నిక నామినేషన్ల కోసం ఇవాళే ఆఖరి రోజుకాగా.. ఒకే ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ప్రొటెం స్పీకర్ రేపు(గురువారం డిసెంబర్ 14)న శాసన సభలో స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. -
తెలంగాణ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్
-
పోచారం రికార్డు బ్రేక్ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్‌ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్‌గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్‌గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
ఆ సభాపతి గురి.. ఆరోసారి!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఐదేళ్లకు మించి ఏ పార్టీకి అధికారం ఇవ్వని రాజస్థాన్ ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేక కాంగ్రెస్‌కి మరోసారి అధికారం ఇచ్చి కొత్త సంప్రదాయానికి తెరతీస్తారా శనివారం జరగనున్న ఎన్నికల్లో తేలనుంది. ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సీపీ జోషి ఎమ్మెల్యేగా ఆరోసారి గెలుపుపై గురి పెట్టారు. అత్యంత సీనియర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన సీపీ జోషికి కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1998-2003లో రాజస్థాన్ మంత్రివర్గంలో పనిచేశారు. 2009లో భిల్వారా నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ క్యాబినెట్లో రైల్వే మంత్రిగా, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కూడా కొద్దికాలం పనిచేశారు. స్పీకర్‌గా గుర్తింపు 2020లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా సీపీ జోషి వ్యవహరించిన పాత్ర చర్చనీయాంశమైంది. తిరుగుబాటుదారులపై అనర్హత నోటీసులు కూడా జారీ చేయడమే కాకుండా దీనిపై సుప్రీంకోర్టును సైతం ఆయన ఆశ్రయించారు. విద్యావేత్త కూడా.. సీపీ జోషి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడే కాకుండా విద్యావేత్త కూడా. అర్హత కలిగిన న్యాయవాది అయిన ఆయన ఉదయపూర్‌లోని కళాశాలలలో సైకాలజీ బోధించేవారు. 1973లో మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం రాజకీయాలలో ఆయన తొలి అడుగు. ఎమ్మెల్యేగా ఐదుసార్లు సీపీ జోషి 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నాథ్‌ద్వారా నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2003-2005 మధ్య రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. నాథ్‌ద్వారా ఎన్నికల్లో ప్రముఖ మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు, బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్‌తోనూ ఆయన తలపడ్డారు. ఒకే ఒక్క ఓటుతో.. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సీపీ జోషి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై కేవలం ఒకే ఒక ఓటు తేడాతో సీటును కోల్పోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రచార కమిటీకి సారథ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీ జోషి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
మా ఆదేశాలే అపహాస్యమా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం. ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు తలంటిపోశారు. ‘‘గత జూన్ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్‌కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్‌లైన్‌ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్‌ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది! మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు. -
మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష!
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. వాళ్లందరి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత నెలలో రాజీనామాలు చేసినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్ ఈ రాజీనామాలపై ఏదో ఒకటి తేల్చాలని, ఆమోదిస్తున్నారో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజస్థాన్ ప్రతిపక్షనేత గులాబ్ చంద్ కటారియా కూడా రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరత నెలకొందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజీనామా చేసిన మంత్రులకు ఇంకా ఆ హోదా ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సంక్షోభం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్‌ను కొత్త ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గహ్లోత్ వర్గంలోని 91 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశాన్ని బహిష్కరించి మరీ వేరుగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపైనే ఇప్పుడు బీజేపీ నేతలు స్పీకర్‌ను కలిశారు. ప్రస్తుతం గహ్లోత్ సర్కార్ మైనారిటీలో పడిందని, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్ -
అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారెంట్!
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభా స్పీకర్, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 9 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారిలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, కేబినెట్ మంత్రులు గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, లల్జిత్ సింగ్ భుల్లార్ సహా పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరిహద్దు జిల్లాలైన అమృత్సర్, తరన్ తరన్‌లో కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా 2020, ఆగస్టులో నిరసనలు చేపట్టారు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రస్తుత స్పీకర్, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ఆదేశించింది న్యాయస్థానం. అయితే, వారు హాజరుకాకపోటంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మరోవైపు.. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఎక్సైజ్, టాక్సేషన్ శాఖ మంత్రి హర్పల్ సింగ్ చీమా. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈఎన్ఏ రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ -
బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా
పాట్నా: బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన.. చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు. ఇదీ చదవండి: బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్ -
అవిశ్వాసం పెట్టినా.. రాజీనామా చెయ్యను
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై జోరుగా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ సర్కార్‌కు బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఝలక్ ఇచ్చారు. మొదటి నుంచి నితీశ్‌కు కొరకరాని కొయ్యగా తయారైన విజయ్.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా మహాఘట్బంధన్ కూటమి నుంచి 55 ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నేనొక పక్షపాతినని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నానని అందులో వాళ్లు ఆరోపించారు. అవన్నీ ఉత్తవే. అలాంటి ఆరోపణల నేపథ్యంతో రాజీనామా చేయాల్సి వస్తే.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే అంశమే. అందుకే నేను రాజీనామా చేయదల్చుకోలేదు అని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. బీజేపీ నేత అయిన విజయ్ కుమార్ సిన్హా వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జేడీయూతో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవి. సభాముఖంగా నితీశ్‌ను ఎన్నోసార్లు మందలించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి నితీశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. సాధారణంగా.. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో స్పీకర్ పదవి నుంచి సదరు వ్యక్తి వైదొలగాల్సి ఉంటుంది. కానీ, మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడుస్తున్నా విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ వ్యవహారాల నిబంధనల్లో రూల్ నెంబర్ 110 ప్రకారం సిన్హా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆగస్టు 10వ తేదీనే 55 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు అందించింది కూటమి ప్రభుత్వం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై గప్‌చుప్‌గా ఉంటోంది. మరోవైపు ఆయన స్వచ్ఛందంగా వైదొలిగితే బాగుంటుందని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న(ఇవాళ) నుంచి రెండు రోజులపాటు బీహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే బలనిరూపణతో పాటు స్పీకర్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ సిన్హా గనుక ఈ సమావేశాలకు గైర్హాజరు అయితే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి(జేడీయూ) సభా వ్యవహారాలను చూసుకుంటారు. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది -
మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్
మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్నాథ్ శిండే సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే ఆదివారం, సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజైన ఆదివారం.. స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్ సాల్వీ పోటీపడ్డారు. ఈ పోటీలో రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు. దీంతో మాజీ సీఎం ఉద్ధవ్ వర్గానికి షాక్ తగిలింది. ఇదిలా ఉండగా, సోమవారం మహా అసెంబ్లీలో కొత్త సీఎం ఏక్నాథ్ శిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. వీరంతా శిండేకు మద్దతుగా నిలుస్తారా.. లేక కొందరైనా ఉద్దవ్ థాక్రేవైపు వెళ్తారా అనేది ఓటింగ్‌లో తేలనుంది. BJP's Rahul Narwekar elected as Maha Assembly Speaker Read @ANI Story | https://t.co/piiMIgmNcU#RahulNarwekar #Maharashtra #MaharashtraAssemblySpeaker #EknathShinde pic.twitter.com/4EqTlJ1idE — ANI Digital (@ani_digital) July 3, 2022 -
టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు: స్పీకర్ తమ్మినేని
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద మానవతావాది అని స్పీకర్ కొనియాడారు. కేబినెట్లో అణగారిన వర్గాలకు సీఎం జగన్ గొప్ప అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీసీలకు దామాషా పద్దతిన పెద్ద ఎత్తున రాజాధికారం ఇచ్చారని తెలిపారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్దిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్నారని తెలిపారు. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని అన్నారు. కేబినెట్లో అందరికీ సమాన న్యాయం జరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. -
Ritu Khanduri: ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా శాసనసభకు స్పీకర్‌గా
ఉత్తరాఖండ్ శాసనసభకు రీతూ ఖండూరీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఆ రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా స్పీకర్‌గా ఆమె చారిత్రక గుర్తింపు పొందనున్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ కుమార్తె అయిన రీతూ తొలిసారిగా 2017లో యమ్కేశ్వర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అప్పటికీ ఆమెకు ఉన్న గుర్తింపు ‘బీసీ ఖండూరీ కుమార్తె’ ‘బీజేపి మహిళా మోర్చా అధ్యక్షురాలు’. మరోవైపు చూస్తే...శైలేంద్రసింగ్ రావత్, విజయ బర్త్వల్ లాంటి దిగ్గజాలు. సిట్టింగ్ ఎంఎల్ఏ. విజయకు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపికి చెందిన బలమైన నాయకుడు శైలేంద్రసింగ్ రావత్ పార్టీ మారీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఈ ఇద్దరికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. మరోవైపు... ‘రీతూ నాన్ లోకల్’ అనే ప్రచారం. ఒక మాదిరి చిన్నపట్టణాలతో పాటు 230 గ్రామాల హృదయాలను గెలుచుకోవడం అంత తేలికైన విషయం కాదు. తన తండ్రి పేరు మాత్రమే విజయానికి బాట కాదనే విషయం తెలుసు. ఎన్నో ప్రతికూలతలను తట్టుకొని రీతూ ఖండూరీ యమ్కేశ్వర్ నుంచి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో... పార్టీ అధిష్ఠానం ఆమెను యమ్కేశ్వర్ నియోజక వర్గం నుంచి కాకుండా కొద్వార్ నుంచి పోటీ చేయించింది. ‘ఈసారి రీతూ ఓటమి నుంచి తప్పించుకోలేరు’ అనే మాట బలంగా వినిపించింది. పదిలమైన నియోజకవర్గం యమ్కేశ్వర్ నుంచి కాకుండా కొద్వార్ నుంచి పోటీ చేయడం రీతూకు కూడా ఇష్టం లేదు. అలా అని పెద్దల నిర్ణయాన్ని ధిక్కరించలేదు. తాను గెలిస్తే నియోజకవర్గానికి చేయబోయే అభివృద్ధి పనులే తన ఎన్నికల ప్రణాళిక అయింది. అభివృద్ధి నినాదంతో రీతూ గెలిచారు. ఈసారి విశేషం ఏమిటంటే ‘ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి’గా రీతూ పేరు గట్టిగా వినిపించింది. ఇక ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే అన్నంతగా ప్రచారం అయింది. ఏ సమీకరణలు ఆమె ముఖ్యమంత్రి కావడానికి అడ్డుపడ్డాయోగానీ, ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా శాసనసభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు. తనకు గర్వాల్‌లో ఒక ఎన్జీవోను నడిపిన అనుభం ఉంది. టీచర్‌గా నోయిడాలోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా తన తొలి ప్రాధాన్యం మహిళా ప్రజాప్రతినిధులకు మరింత సౌకర్యవంతంగా శాసనసభను నిర్వహించడమే అంటున్నారు రీతూ ఖండూరీ భూషణ్. -
రవి కుమార్ నుంచి వివరణ తీసుకున్నాం: కాకాణి
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్‌పై విచారణ జరిపినట్లు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని కూన రవి కూమార్‌కు సూచించామని తెలిపారు. అయితే ఆయన అప్పుడు రాలేదని చెప్పారు. కున రవికుమార్ ఈరోజు(గురువారం) వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారని తెలిపారు. కునరవికుమార్ చేసిన ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకున్నామని కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. దానిపై ఆయన నుంచి వివరణ కూడా తీసుకున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నామని, రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఉన్న పిటిషన్లు పరిష్కరిస్తున్నామని తెలిపారు. -
తెలంగాణ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
-
హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో శాసన సభకు చేరుకున్న సస్పెండెడ్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీలోకి అనుమతివ్వలేదు. సభ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు జేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాగా శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండానే సస్పెండ్ చేయడం వారి హక్కులను హరించడమేనని హైకోర్టు సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే . తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడంపై.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. ఈ సెషన్ మొత్తం సభకు హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయానికి సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమావేశాలకు అనుమతించాల్సిందిగా కోరాలని సూచించింది. కార్యదర్శి వీరిని మంగళవారం సభకు ముందే స్పీకర్ దగ్గరికి తీసుకెళ్లాలని, వారి అభ్యర్థనను స్పీకర్ విని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. -
స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు
-
అనుచిత ప్రవర్తన.. స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. స్పీకర్ పోడియం వద్ద దారుణంగా ప్రవర్తించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పట్ల టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరిస్తూ.. పేపర్లు చించివేసి ఆయనపై విసిరారు. సభ ప్రారంభం నుంచి కూడా టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. చదవండి: AP: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ అసెంబ్లీలో స్పీకర్ పట్ల టీడీపీ అనుచితంగా ప్రవర్తించిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాద్ధాంతం చేశారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు టీడీపీ ఆటంకం కలిగించిందన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమన్నా... స్పీకర్‌పై టీడీపీ సభ్యులు కాగితాలు విసిరారన్నారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తను ఖండిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై డిప్యూటీ సీఎం వెళ్లి పరిశీలన చేశారన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై బాధిత కుటుంబం ఎక్కడా ఆందోళన చేయలేదని పేర్కొన్నారు. సభలో వాస్తవాలను స్పష్టంగా ప్రకటన చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. -
నన్ను బెదిరించారు.. అన్నీ ఆన్ రికార్డ్ : స్పీకర్ తమ్మినేని
-
మరోసారి కోవిడ్ బారినపడ్డ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి కరోనా వైరస్ సోకింది. శనివారం స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు, ఎప్పటివరకు అంటే.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. -
బీజేపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మృతి.. ప్రధాని సంతాపం
డెహ్రాడూన్: బీజేపీ సీనియర్ నాయకుడు హర్బన్స్ కపూర్ (75) ఆదివారం కన్నుమూశారు. డెహ్రాడూన్ నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2007 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. కపూర్ మృతిపట్ల ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మితభాషిగా పేరున్న కపూర్ ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించేవాడని సీఎం పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత ఎదిగినా ఆయన నిరాడంబరంగా బతికారని గుర్తు చేసుకున్నారు. కపూర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోది సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సేవతో కపూర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. Saddened by the passing away of our senior Party colleague from Uttarakhand Shri Harbans Kapoor Ji. A veteran legislator and administrator, he will be remembered for his contributions to public service and social welfare. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) December 13, 2021 (చదవండి: ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు హెల్ప్‌లైన్) -
రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్.. పునఃభిక్ష పెట్టింది వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘నాకు ఆనాడు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు. మళ్లీ రాజకీయంగా పునఃభిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి..’ అని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు తానే రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు శాసనసభలో శుక్రవారం వ్యాఖ్యానించారు. దీనిపై శుక్రవారం సభను వాయిదా వేసేముందు స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు. నేను టీడీపీలో చేరేనాటికి చంద్రబాబు ఆ పార్టీలో లేరు. కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్టీ రామారావు పిలిచి నన్ను పార్టీలోకి ఆహ్వానించి ప్రజాప్రతినిధిని చేశారు. ఆ తరువాత చంద్రబాబు టీడీపీలో చేరారు. ఆయనకు కూడా ఎన్టీ రామారావే రాజకీయ భిక్ష పెట్టారు’ అని చెప్పారు. ఆ తరువాత వివిధ అంశాలపై విభేదించి తాను టీడీపీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. తాను వరుసగా ఎన్నికల్లో ఓడిపోయి 15 ఏళ్లు రాజకీయంగా వెనుకబడి ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను పిలిపించి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో ఆయన సూచనల మేరకు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరానన్నారు. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి స్పీకర్‌గా అత్యున్నత స్థానానికి చేరుకున్నానన్నారు. కాబట్టి తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. సభాపతి స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు కాబట్టే వాస్తవాలపై సభలోనే వివరణ ఇస్తున్నానని స్పీకర్ చెప్పారు. -
సీబీఐ, ఈడీపై పశ్చిమ బెంగాల్ స్పీకర్ ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్టంలోని శాసన సభ్యులపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ బీమన్ బాంద్యోపాధ్యాయ మీరు నా అనుమతి లేకుండా ఎలా చార్జిషీట్ దాఖలు చేశారంటూ సీబీఐ, ఈడీ అధికారులను ప్రశ్నించారు. (చదవడండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..) ఈ క్రమంలో బాంద్యోపాధ్యాయ సెప్టెంబర్ 22న సీనియర్ సీబీఐ, ఈడీ అధికారులను అసెంబ్లీకి హాజరు కావాలంటూ...సమన్లు జారీ చేశానని తెలిపారు. ఈ మేరకు ముందస్తుగా సమాచారం గానీ , అనుమతి గానీ లేకుండా ఎందుకు చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అధికార తృణమాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోంజీ స్కాం, నారద స్టింగ్ ఆపరేషన్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిపై దర్యాప్తు సంస్థలు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.(చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి) -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు
ఢిల్లీ: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారంటూ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో బీసీ కోటాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. స్పీకర్‌ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాధవ్ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. అనంతరం ఆయన క్యాబిన్లోకి వెళ్లి స్పీకర్‌ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. -
12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు
ముంబై: ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓబీసీ కోటాపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. స్పీకర్‌ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీ కోటాపై చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాధవ్ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. అనంతరం ఆయన క్యాబిన్లోకి వెళ్లి స్పీకర్‌ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాక.. సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘మా ఎమ్మెల్యేలపై చేస్తున్నవన్ని అసత్య ఆరోపణలు. స్పీకర్‌ని దూషించడం, దాడి చేయడం అనేది అధికార పార్టీ అల్లిన కట్టుకథ. ఓబీసీల కోసం మేం మరికొంత మంది ఎమ్మెల్యేలను కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. స్పీకర్ కూడా మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అన్నారు. ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్ జాధవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ.. దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్, సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ఎదురుగానే జరిగింది. కొందరు నాయకులు నా మీద చేయి చేసుకున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాను. దీనిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్‌ని కోరాను’’ అని తెలిపారు. -
కర్ణాటక మాజీ స్పీకర్ కృష్ణ కన్నుమూత
సాక్షి, మైసూరు: కర్ణాటక విధానసభ మాజీ స్పీకర్ కేఆర్‌పేట కృష్ణ(80) శుక్రవారం కన్నుమూశారు. మైసూరులోని కువెంపునగరలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. 2006–2008 మధ్యకాలంలో ఆయన స్పీకర్‌గా పనిచేశారు. మూడు సార్లు కేఆర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1988లో ఎస్ఆర్ బొమ్మాయ్ మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ, 1996లో మండ్య ఎంపీగా పనిచేశారు. కరోనాతో కేంద్ర మాజీ మంత్రి.. కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటకకు చెందిన రైతు నేత బాబాగౌడ పాటిల్(78) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనాకు గురైన ఈయన బెళగావిలోని ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బెళగావి తాలూకా చిక్కబాగేవాడి గ్రామానికి చెందిన బాబాగౌడ...జేడీఎస్ తరఫున బాగల్కోటె జిల్లా నవలగుంది ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారు. బీజేపీలో చేరి 1998లో బెళగావి నుంచి ఎంపీగా గెలిచి వాజ్‌పేయి సర్కార్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు. చదవండి: దేశంలో కొత్తగా 2,57,299 కరోనా కేసులు -
సీఎం స్టాలిన్ నిర్ణయం: టీచర్ నుంచి తమిళనాడు స్పీకర్‌గా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అప్పావు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్షనేత ఎడపాడి పళనిస్వామి తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ పిచ్చాండి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించగా అప్పావు స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్ పదవికి పిచ్చాండి (తాత్కాలిక స్పీకర్) నామినేషన్లు వేశారు. మలిరోజు అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. కార్యదర్శి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక చేపట్టారు. అప్పావు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రొటెం స్పీకర్ పిచ్చాండి అధికారికంగా ప్రకటించారు. సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అప్పావుని చేయి పట్టుకుని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ఆ తరువాత స్పీకర్ అప్పావు అందరికీ కృతజ్ఞతలు తెలిపి డిప్యూటీ స్పీకర్‌గా పిచ్చాండి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీకి అప్పావు 20వ స్పీకర్. చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్: చేజారనున్న ‘పెద్దరికం’ చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ -
ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన బీజేపీ ఎంపీలు
కోల్‌కతా: ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు బీజేపీ పార్లమెంట్ సభ్యులు.. ఎమ్మెల్యేలుగా రాజీనామా చేశారు. రాణాఘాట్ నుంచి ఎంపీగా కొనసాగుతున్న లోక్‌సభ ఎంపీ జగన్నాథ్ సర్కార్, కూచ్ బెహార్ స్థానం నుంచి ఎంపీ అయిన నిసిత్ ప్రామాణిక్‌లు తమ రాజీనామా లేఖలను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకి సమర్పించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా లేఖలు ఇచ్చినట్లు ప్రామాణిక్ చెప్పారు. జగన్నాథ్, ప్రామాణిక్‌లతోపాటు మరికొందరు ఎంపీలను బీజేపీ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దించింది. బబూల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్ గుప్తాలు ఎన్నికల్లో పోటీచేసినా ఓడిపోయారు. ‘2016లో మూడు సీట్లు గెల్చిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో 77 చోట్ల విజయం సాధించింది. ఈసారి కొందరు ఎంపీలను బీజేపీ పోటీలో నిలిపింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న మా పార్టీ లక్ష్యం నెరవేరలేదు’ అని జగన్నాథ్ సర్కార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసినంత మాత్రాన బెంగాల్లో బీజేపీ వ్యవస్థీకృతంగా బలహీనపడిందని అనుకోకూడదని ఆయన అన్నారు. (చదవండి: ఆవిష్కరణ: కరోనాను చంపే మాస్క్ అభివృద్ధి) -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్) ఉంటుంది. బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం ► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు. ► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది. అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా ► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు. ► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. 15 బిల్లులు.. 20 అంశాలు ► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి. ► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్మెంట్ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది. చర్చకు రానున్న అంశాలు ► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ. ► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు, ► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. ► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు. -
బిహార్ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి విజయ్ సిన్హా
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో విజయ్ సిన్హాకు 126 ఓట్లు రాగా మహా కూటమి తరపున పోటీ చేసిన అవద్ బిహార్ చౌదరికి 114 ఓట్లు దక్కాయి. కాగా బిహార్‌లో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న స్పీకర్ పదవికి ఎన్డీయే కూటమి తరపున విజయ్ కుమార్ సిన్హా, మహా కూటమి తరపున అవద్ బిహారీ చౌదరి పోటీలో నిలిచారు. వీరిద్దరూ మంగళవారం పట్నా నుంచి అసెంబ్లీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో భారీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: బిహార్‌లో లాలూ ఆడియో టేపుల కలకలం అసెంబ్లీలోకి ఎమ్మెల్సీలు రావడంతో స్పీకర్ ఎన్నికల్లో వాయిస్ ఓట్లను ఆర్జేడీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్, అశోక్ చౌదరి సభలో ఉండటాన్ని తప్పుబడుతూ.. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నిక సమయంలో నియమాలను పాటించాలని చెబుతూ.. రూల్‌బుక్‌ను ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంజీకి అందించారు. దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్.. ‘అసెంబ్లీ పక్షనేతగా సీఎం సభలో ఉండటం తప్పేం కాదు. అది చట్టబద్దమైనది. ఇతర సభ నుంచి వచ్చిన వారు స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయడంలేదు. అసెంబ్లీలో వారు ఉండటంలో ఎలాంటి సమస్య లేదు" అని ఆయన అన్నారు. అదే విధంగా గతంలో లాలూ యాదవ్ లోక్‌సభ సభ్యుడిగా.. రబ్రీదేవి సీఎంగా ఉన్నప్పుడు వారు కూడా ప్రొసిడింగ్స్‌కు హాజరయ్యారని తేజస్వీ యాదవ్ తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. అప్పుడు రహస్య ఓటింగ్ లేదని గుర్తు చేశారు. అనంతరం స్పీకర్‌గా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హాను సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు కలిసి స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. ఇక ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించడంతో వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 243 అసెంబ్లీ స్థానాల్లో 126 ఎన్డీయే దక్కించుకోగా ఇందులో బీజేపీ 74, జనతాదళ్(యు) 43 మరో ఎనిమిది సీట్లను ఎన్డీయే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ 75 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిహార్ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్ -
అనర్హతపై కోర్టు జోక్యమా?
న్యూఢిల్లీ: స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎప్పుడూ ఊహించలేనిదని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పేర్కొన్నారు. ఇది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఈనెల 24వరకు తనను నిరోధిస్తూ రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో(చట్టసభ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి) న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్ అధికారాలను తగ్గించి వేయడమే అవుతుందన్నారు. స్పీకర్ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జూలై 23న విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో దీన్ని చేర్చింది. ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. స్పీకర్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు రాజస్తాన్ శాసన సభ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తన వాదన, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. జోషి పిటిషన్‌పై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, తమ వాదన సైతం వినాలని సచిన్ పైలట్ కోరుతున్నారు. తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పు బీజేపీలో చేరాలంటూ తనకు రూ.కోట్లు ఎర చూపారని సంచలన ఆరోపణలు చేసిన రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మాలింగకు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం తన అడ్వొకేట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మాలింగ అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ప్రసార మాధ్యమాల సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఒక రూపాయి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో సచిన్ పైలట్ నివాసంలోనే తనను ప్రలోభాలకు గురి చేశారని గిరిరాజ్‌సింగ్ మాలింగ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 7 నెలలుగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మాలింగ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ క్యాంపులో ఉన్నారు. సచిన్ పైలట్ నుంచి తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసు రాలేదని, దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని మాలింగ చెప్పారు. మోదీకి గహ్లోత్ లేఖ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం గహ్లోత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. ‘ఇదంతా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, కొందరు మమ్మిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకోవడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనుచిత ఘటనలే చోటుచేసుకున్నాయని అశోక్ గహ్లోత్ గుర్తుచేశారు. గహ్లోత్ సోదరుడి నివాసాలపై ఈడీ దాడులు 2007–09 నాటి ఎరువుల కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు, విత్తనాలు, ఎరువుల సంస్థ ‘అనుపమ్ కృషి’ వ్యవస్థాపకుడు అగ్రసేన్ గహ్లోత్ నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బధవారం దాడులు నిర్వహించింది. అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జోద్పూర్ జిల్లాలోని మాందోర్ ప్రాంతంలో ఉన్న అగ్రసేన్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్ల రక్షణ మధ్య ఈ సోదాలు జరిగాయి. అగ్రసేన్తో సంబంధాలున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ నివాసం, ఇద్దరు రాజస్తాన్ కాంగ్రెస్ నాయకులు, మరో వ్యాపార సంస్థపైనా ఈడీ దాడులు జరిగాయి. రాజస్తాన్‌లో 6 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లో 2, గుజరాత్లో 4, ఢిల్లీలో ఒక ప్రాంతంలో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాజస్తాన్‌లో 2007– 09లో మారియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ)ను రైతులపై రాయితీపై సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, రూ.60 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఫిర్యాదు మేరకు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద(పీఎంఎల్ఏ) కేసు నమోదైంది. దాడులతో బెదిరించలేరు: సూర్జేవాలా మోదీ దేశంలో దాడుల రాజ్యం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం మండిపడ్డారు. ఈ దాడులకు తమ పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలు బీజేపీలో పన్నిన ఉచ్చులో చిక్కుకోలేదని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి నివాసంపై దాడులు ప్రారంభించారని ఆరోపించారు. -
శాసనసభ నిర్ణయమే అంతిమం: స్పీకర్
సాక్షి, రాజమండ్రి: టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూలే విగ్రహానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ మార్గాని భరత్ రామ్ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు బీసీ నేతలకు పార్లమెంట్ పదవులు ఇచ్చి గౌరవించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ తీరును ఆయన ఎండగట్టారు. మండలిలో నిర్ణయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, శాసనసభ నిర్ణయమే అంతిమం అని తెలిపారు. (వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: తమ్మినేని) ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని స్పీకర్ ధ్వజమెత్తారు. అంతిమ నిర్ణయాలు ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో ఏర్పాటైన శాసనసభలోనే జరుగుతాయని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. (అందుకే వర్ల రామయ్యను బరిలోకి..) -
స్పీకర్ నిర్ణయమే కీలకం
రరాజకీయ సంక్షోభ సమయాన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. ప్రస్తుత స్పీకర్ ఎన్పీ ప్రజాపతిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. చట్ట ప్రకారం శాసనసభ్యులు తమ రాజీనామా పత్రాలను సభాపతికి పంపించాల్సి ఉంటుంది. అయితే రాజీనామా పత్రాలు స్పీకర్‌కి సమర్పించినంత మాత్రాన సరిపోదు. వాటిని స్పీకర్ ఆమోదించినప్పుడే ఆ రాజీనామాలను అధికారికంగా గుర్తిస్తారు. ►రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ఒక శాసనసభ్యుడు ఎలా రాజీనామా చేయొచ్చు అనే విషయాన్ని చర్చిస్తుంది. ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ని ఉద్దేశించి రాయాల్సి ఉంటుంది. దాన్ని కేవలం స్పీకరే మాత్రమే ఆమోదించాల్సి ఉంటుంది. (గవర్నర్ కాదు). ►శాసనసభ్యులు సమర్పించిన రాజీనామాలు ఎవరి ఒత్తిడి వల్ల చేసినవి కావనీ, అవి వారి వారి ఇష్టపూర్వకంగా చేసినవేననీ స్పీకర్ భావించాలి. స్పీకర్‌కి విశ్వాసం కలగకపోతే దానిపైన స్వతంత్రంగా విచారణ జరిపే అధికారాన్ని కూడా ఈ ఆర్టికల్ స్పీకర్‌కి ఇచ్చింది. ►ఒకవేళ రాజీనామా స్వతంత్రంగా చేసింది కాదనీ, ఎవరి ఒత్తిడితోనైనా చేసిన రాజీనామా అని స్పీకర్ నమ్మినట్టయితే రాజీనామాని ఆమోదించకుండా ఉండే అవకాశం కూడా సభాపతికి ఉంటుంది. ►శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడం కూడా స్పీకర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమ్మతించింది. ►స్పీకర్ ఆమోదముద్ర వేయకుండానే ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరిపోతే వారు పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలోకి వస్తారు. -
మైక్ ఇవ్వండి.. రూం కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు తమకు మైక్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. ఆదివారం సభ వాయిదా పడిన అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై సద్విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను సీఎం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ సభ్యులు కూర్చుని మాట్లాడుకునేందుకు కనీసం గది కూడా లేదని, వెంటనే తమకు ప్రత్యేక రూం కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. -
‘పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదు’
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. 10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై కసరత్తు జరుగుతున్నట్టు తెలిపారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లాలంటే రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే అనర్హత తప్పదని ఆయన స్పష్టం చేశారు. ‘సభా నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారు. ఎవరు పార్టీ ఫిరాయించిన అనర్హత వేటు వేయమన్నారు’ అని తెలిపారు. డిసెంబర్ 17 నుంచి 21వరకు డెహ్రాడూన్‌లో స్పీకర్లు సదస్సు జరగనుందని తెలిపారు. చట్టసభల కార్యకలాపాలను డిజిటల్ రూపంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. పేపర్ లెస్ గవర్నెన్స్‌ను తీసుకురావాలనే ఉద్దేశం ఉందని, చట్టసభల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు త్వరితగతిన సమాధానాలు పంపేందుకు ఈ విధానం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పీకర్ వెల్లడించారు. -
ప్రతిపక్ష నేతపై నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు: స్పీకర్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడి విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖలో శుక్రవారం బాలల సంరక్షణ పరిరక్షణ వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం సభలో చర్చకు సిద్ధమైనప్పుడు ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తే.. ఇది సరికాదని ప్రతిపక్ష నాయకుడికి చెప్పానే తప్ప విమర్శించలేదన్నారు. రానున్న శీతాకాల సమావేశాల్లో సభలో ఓ ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరిస్తే తాను స్వాగతిస్తానన్నారు. అపార అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు స్పీకర్‌తో ఎలా మెలగాలో తెలుసుకుని.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలని కోరారు. ఫిరాయింపులకు పాల్పడితే ఏ పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. -
స్పీకర్ తమ్మినేనిపై టీడీపీ దుర్భాషలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ వ్యక్తిగత దూషణలకు దిగింది. మాటల్లో చెప్పలేని.. రాయలేని భాషలో ఆయనను దారుణంగా తూలనాడుతూ టీడీపీ అధికారిక ఈ–పేపర్లో కథనం ప్రచురించింది. అందులో స్పీకర్‌ను ‘దున్నపోతు, ఆంబోతు’ అంటూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. శాసనసభ స్పీకర్‌కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణ పదాలతో దూషణలకు పాల్పడింది. ‘దున్నపోతులా సాంబార్ తాగొచ్చి అసెంబ్లీలో నిద్రపోతాడు.. జనం ముందు బయటకు వచ్చి ఆంబోతులా రంకెలేస్తుంటాడు.. నీది కూడా ఒక బ్రతుకేనా’ అంటూ నీచత్వానికి ఒడిగట్టింది. -
సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న స్పీకర్
సాక్షి, విశాఖపట్నం : సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ దంపతులు అనంతరం స్వామివారి నిత్య అన్నదాన పథకం కోసం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. తమ్మినేని మాట్లాడుతూ... సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం జగన్ నేతృత్వంలో స్పీకర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అన్యాక్రాంతమైన దేవుడు భూములను పరిరక్షిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాదిలోగా ఇళ్ల స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. -
14 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్ 14న శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 14న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేస్తారు. తిరిగి సోమవారం 16న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు వారం రోజులపాటు కొనసాగి సెప్టెంబర్ 21న ముగిసే అవకాశం ఉంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందడం ఆలస్యమయ్యే పక్షంలో మరో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఉగాండా పర్యటనకు స్పీకర్ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఉగాండా రాజధాని కంపాలాలో జరిగే కామన్వెల్త్ దేశాల 64వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెళ్లనున్నారు. 53 కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్లు పాల్గొనే ఈ సదస్సు సెప్టెంబర్ 21 నుంచి 29 వరకు జరగనుంది. సదస్సులో భాగంగా 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్పీకర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారైనా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ఇంకా కొలిక్కిరావడం లేదు. సెప్టెంబర్ 23వ తేదీలోగా అసెంబ్లీ సమావేశాలు పూర్తికాని పక్షంలో స్పీకర్ ఉగాండా పర్యటన రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. -
కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో విశ్వేశ్వర్‌ను నూతన సభాపతిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో సహా బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంకోలా నుంచి రాజకీయ ప్రస్థానం 1961 జులై 10న జన్మించిన కాగేరి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 నుంచి ఉత్తర కన్నడ జిల్లా అంకోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాగేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పునర్విభజన కారణంతో 2008లో సిర్సి–సిద్ధాపుర నియోజకవర్గం నుంచి తొలిసారిగా, ఆ తరువాత 2013, 2018లో అక్కడి నుంచే ఎన్నికయ్యారు. 2008లో యడియూరప్ప మంత్రిమండలిలో ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన కాగేరి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గతంలో స్పీకర్‌గా పనిచేసిన కే.జీ.బోపయ్యను సోమవారం వరకు అనుకున్నారు. అయితే హఠాత్తుగా మంగళవారం ఉదయం బోపయ్యకు బదులుగా కాగేరిని ఎంపిక చేశారు. పార్టీ అధినేత అమిత్ షా సూచనల ప్రకారమే ఈ మార్పు జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
కర్ణాటక స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే కాగేరి
-
మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డోంకుపర్ రాయ్(64) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హర్యాణాలోని మేదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయన్ని సోమవారం మేఘాలయాకు తరలించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. డోంకుపర్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కీలకమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. దీంతో ఆయన 2018లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డోంకుపర్ రాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘మేఘాలయ స్పీకర్‌గా, మాజీ ముఖ్యమంత్రిగా డోంకుపర్ రాయ్ విశేషమైన సేవలు అందించారు. అదేవిధంగా మేఘాలయ అభివృద్ధికి కృషి చేశారు. చాలా మందికి సాయం అందించి వారి జీవితాలను మార్చారు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలుపుతున్నాన’ని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా డోంకుపర్ అకాల మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాము ఒక మంచి నాయకున్ని, మెంటర్ని కోల్పోయామని తెలిపారు. ఆయన ఎంతో మందికి అంకితభావంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
లబ్ధిదారులతో స్పీకర్ వీడియో కాల్
బాన్సువాడ టౌన్: ఆసరా పింఛన్ లబ్ధిదారులతో బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాల్ మాట్లాడారు. పింఛన్లు రూ.2016 ఇవ్వడం సంతోషంగా ఉందని, పిల్లలపై ఆధారపడకుండా పింఛన్లు ఇచ్చి ఇంటికి కేసీఆర్, మీరు(పోచారం శ్రీనివాస్‌రెడ్డి)లు పెద్ద కొడుకులయ్యారని లబ్ధిదారులు పేర్కొనడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తనకు చెప్పవచ్చునని, తమ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పీఏ భగవాన్‌రెడ్డి అందుబాటులో ఉంటారని స్పీకర్ చెప్పారు. -
స్పీకర్‌ను కలిసిన రెబెల్ ఎమ్మెల్యేలు
బెంగళూర్ : కర్ణాటక విధానసౌధ వద్ద హైడ్రామా నెలకొంది. రాజీనామా చేసిన పదిమంది కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం స్పీకర్ సురేష్ కుమార్‌ను కలుసుకున్నారు. స్పీకర్‌కు రాజీనామాలపై వారు వివరణ ఇచ్చారు. ముంబై హోటల్లో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూర్ చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అసంతృప్త ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా అనేది వారిని కలిసి స్వయంగా చర్చించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. స్పీకర్ అప్పీల్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలవాలని, అర్ధరాత్రిలోగా రాజీనామాలపై స్పీకర్ తన నిర్ణయం వెల్లడించాలని అంతకుముందు సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.స్పీకర్ తమ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొంటూ ముంబై హోటల్లో బసచేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. -
సభా సమయం వృథా చేయొద్దు
సాక్షి, అమరావతి : చట్ట సభల సమయం చాలా విలువైందని దాన్ని వృథా చేయరాదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఆయన బుధవారం శాసనసభ కమిటీ హాలు–1లో జరిగిన ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. ఏటా శాసనసభ కార్యకలాపాల కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆ ప్రకారం సభ జరిగే ప్రతి గంటకు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. శాసనసభ్యులు క్రమశిక్షణ, సరైన అవగాహన, సంసిద్ధతతో వచ్చినప్పుడే చట్ట సభ సజావుగా జరుగుతుందని, అప్పుడే చర్చలు అర్థవంతంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు ఏ సమస్యను ప్రస్తావించాలన్నా దానికొక నిబంధన ఉంటుందని దాని ప్రకారం వస్తే మాట్లాడే అవకాశం దొరుకుతుందన్నారు. సభలో ఎమ్మెల్యేలు ప్రవర్తించే తీరు, వారి హుందాతనమే మళ్లీ వారిని ప్రజలు ఎంపిక చేసుకునేలా చేస్తుందని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన సభకూ, ఇకపై జరుగబోయే సభా కార్యక్రమాలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండాలని, ప్రజలు ఈ విషయం తెలుసుకునేలా చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నారు. శాసనసభ జరిగే తీరును బట్టే ప్రభుత్వ ప్రతిష్ట, సీఎం ప్రతిష్ట ఇనుమడిస్తుందని చెప్పారు. సభలోకి వచ్చేటప్పుడు పూర్తి వాస్తవాలతో రావాలని, అవాస్తవాలు వద్దని ఆయన హితవు పలికారు. ఎమ్మెల్యేలు మంచి వక్తలుగా రాణించాలని కూడా ఆయన సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, కరుణాకర్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, అప్పలరాజు వంటి వారు మంచి వక్తలని, వారు సభలో బాగా మాట్లాడారని సీతారామ్ కితాబు నిచ్చారు. ఆయా అంశాలపై మాట్లాడే వారిని ఎంపిక చేసి తాము ముఖ్యమంత్రికి నివేదిక కూడా ఇస్తామని స్పీకర్ అన్నారు. శాసనసమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. సమాజంలో 70 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యలను మానవతా దృక్పథంతో చట్టసభల్లో ప్రస్తావించాలన్నారు. ఏ సామాజిక వర్గం నుంచైతే ఎన్నికయ్యారో.. వారి సమస్యలను సభలో ప్రతిబింబింప జేయాలన్నారు. ప్రజా ధనం పొదుపు చేస్తున్నాం: మంత్రి బుగ్గన ప్రజా ధనాన్ని ఎంత మాత్రం దుబారా చేయకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, ఆయన భావాలకు అనుగుణంగానే తాము పునశ్చరణ తరగతులను గతంలో మాదిరిగా 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో కాకుండా శాసనసభ కమిటీ హాలులో సాదాసీదాగా నిర్వహిస్తున్నామని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఎంత ఆడంబరంగా శిక్షణా కార్యక్రమాన్ని నడిపించామన్నది ప్రధానం కాదని, ఏ మేరకు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు విషయ అవగాహన కలిగించామన్నదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రతి రూపాయిని పొదుపుగా ఖర్చు చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. శాసనసభలో మాట్లాడేది వేరు, బహిరంగ సభల్లో మాట్లాడే తీరు వేరు అనేది లెజిస్లేటర్లు తప్పకుండా గ్రహించాలని చెప్పారు. మీ నాన్నకు కృతజ్ఞతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే రాష్ట్రంలో శాసనమండలి ఏర్పడిందని, ఆయన వల్లే తామంతా ఇవాళ శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ రామసూర్యారావు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్సార్‌కు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. కాగా, శిక్షణా తరగతులకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. మండలి చైర్మన్ హోదాలో ఎంఏ షరీఫ్, బీజేపీ, జనసేన, పీడీఎఫ్ లెజిస్లేటర్లు పాల్గొన్నారు. -
శాసనసభ స్పీకర్ హోదాలో తొలిసారి విశాఖకు తమ్మినేని
సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ)/మద్దిలపాలెం(విశాఖ తూర్పు): శాసన సభలో ప్రజల సమస్యలు వినిపించేందుకే తొలి ప్రాధాన్యమిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యులందరినీ సమన్వయపరుస్తూ ప్రాధాన్యతను అనుసరించి అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా విశాఖ వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో రావడంతో ఎయిర్పోర్ట్ జనసంద్రంగా మారింది. ఆయన్ను గజమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువతో సత్కరించారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఉత్తరాంధ్ర బొబ్బిలి అంటూ నినాదాలు చేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అనుచరులు గజమాలతో సత్కరించి, వెండి కిరీటం బహూకరించారు. తననకు కలిసేందుకు వచ్చిన వారికి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, సీపాన రాము, కూటికుప్పల సూర్యారావు, కేకే రాజు, సనపల చంద్రమౌళి, పేడాడ కృష్ణారావు, భగాతి విజయ్, సింగుపురం మోహనరావు, సనపల చిన్నబాబు, తిప్పల నాగిరెడ్డి అనురులు దొడ్డి రమణ, తుంపాల తాతారావు, అప్పల రెడ్డి, మంత్రి మంజుల, శాంతి తదితరులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షిర్డీసాయి మందిరంలో స్పీకర్ దంపతుల పూజలు ఈస్ట్‌పాయింట్ కాలనీలోని షిర్డీ సాయి మందిరంలో స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, షిర్డీసాయి మందిరం ప్రతినిధులు అబ్బు, మణిలతోపాటు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వంశీకృష్ణ స్పీకర్‌కు శాలువకప్పి సత్కరించారు. స్పీకర్ దంపతులకు మందిరం ప్రతిని«ధి అబ్బు షిర్డీసాయి ప్రతిమను బహూకరించారు. అనంతరం మందిరంలోనే స్పీకర్ దంపతులు ప్రసాదం స్వీకరించారు. ఈస్ట్ పాయింట్ షిర్డీ సాయిమందిరంలో స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతుల పూజలు వినతులు తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులు స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. బాలల హక్కులను కాపాడేలా చట్టాలను పక్కాగా అమలు చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాషŠట్ర అధ్యక్షుడు గొండు సీతారాం కోరారు. కృతజ్ఞతలు చాలీచాలని తమ వేతనాన్ని 18వేలకు పెంచి, సీఎం జగన్మోహన్రెడ్డి తమ బతుకుల్లో వెలుగులు నింపారని పారిశుద్ధ్య కార్మికులు స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని స్పీకర్ వారికి సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు జి.రవిరెడ్డి, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వెంపడి శ్రీనివాస్‌రెడ్డి, బయిన సునీల్, సనపల త్రినా«థ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అసెంబ్లీ ట్రెండ్ సెట్టర్ కావాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ దేశానికే ఒక ట్రెండ్ సెట్టర్ కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ శాసనసభలో గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసి, సత్సంప్రదాయాలు, ఉన్నత విలువలను నెలకొల్పుదామని పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. నిద్రాణమై ఉన్న వ్యవస్థలను మేల్కొల్పాలని, వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పోతే ప్రజాస్వామ్యం ఉనికే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికపై ధన్యవాదాలు తెలిపే చర్చ ముగిసిన అనంతరం సభలో తమ్మినేని సీతారాం మాట్లాడారు. శాసనసభ నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడూ రాకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తూనే ఉంటారు. మన ఉచ్ఛ్వాశ, నిశ్వాసాల్ని, అడుగుల్ని గమనిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా వింటారు. కానీ, అంతిమంగా వారు చేయాలనుకున్నదే చేస్తారు. నైతిక విలువలను కాపాడుకుంటూ అవినీతి రహిత పాలన అందించేందుకు, సంక్షేమ రాష్ట్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సహకారం అందించేలా సభ్యులంతా కృషి చేయాలి. స్పీకర్ పదవి ఒక సవాల్. సభానాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను స్పీకర్ పదవికి ప్రతిపాదించి, ఈ సవాల్‌ను అధిగమిస్తారని చెప్పారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి న్యాయ, కార్యనిర్వాహక, శాసనసభ, మీడియా.. ఈ నాలుగు వ్యవస్థలు ఒకదాన్ని ఒకటి అతిక్రమిస్తే సామాజిక ఘర్షణ తలెత్తుతుంది. ఈ ఘర్షణ ఎక్కడికి దారి తీస్తుందో కూడా చెప్పలేం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేని శాసన వ్యవస్థ అవసరమా? శాసనసభకు రాజ్యాంగ నిబంధనలున్నాయి. వీటిని గౌరవించాలి. ఆరు సార్లుగా శాసనభలో అధికార, ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నాను. మంత్రిగా పని చేశా. ఈ సభే నాకు అనుభవాన్నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ అన్నింటా ముందుకెళ్లాలి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోమని సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఫిరాయింపుల అంశంలో ఐదేళ్ల పాటు నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నా. సభా సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు రాష్ట్రంలో ఇప్పటికీ తాగునీరు లేని, విద్యుత్ సౌకర్యం లేని, సరైన రహదార్లు లేని గ్రామాలున్నాయి. సంక్షేమ రాష్ట్ర నిర్మాణం దిశగా అందరం నిబ్బరంగా అడుగులు ముందుకేద్దాం. ప్రతిపక్షంలో ఉన్న వారు తప్పు చేస్తే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. నిరక్షరాస్యత నిర్మూలన, వలసల నివారణపై సభలో అర్థంవంతమైన చర్చలు జరగాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మనిషి చంద్ర మండలంలోకి, జలాంతర్గాములతో సముద్ర గర్భంలో చొచ్చుకెళ్తున్న ఈ రోజుల్లో కూడా శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ రోగులను రక్షించుకోలేని పరిస్థితి ఉండడం బాధాకరం. శాసనసభ నిర్వహణకు రోజుకు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. సభా సమయాన్ని సభ్యులు దుర్వినియోగం చేయొద్దు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా సహకరించాలి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు త్వరలో నిపుణులతో శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి ఈ సభలో కొత్తగా ఎన్నికైన వారు 100 మందికి పైగా ఉన్నారు. ప్రతి సభ్యుడు సభ విలువలు కాపాడాలి. రాజ్యాంగ విలువలను గౌరవించాలి. శానససభలో స్పీకర్ స్థానాన్ని గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు, బీవీ సుబ్బారెడ్డి, మౌలాంకర్, పిడతల రంగారెడ్డి, వేమారెడ్డి, నారాయణరావు, కోన ప్రభాకరరావు, రాంచంద్రారెడ్డి తదితరులు అలంకరించి, విశిష్ట విలువలు నెలకొల్పారు. ఆ విలువలను కాపాడాలి. సీనియర్లు కొంత వెనక్కి తగ్గి, సభలో కొత్త సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి. అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి ఈ సమాజంలో చిట్టచివరి పేదవాడి కన్నీటిని తుడిచేదే నిజమైన ప్రభుత్వమని మహాత్మాగాంధీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగాలి. వ్యవస్థ ఎంత మంచిదైనా వ్యవస్థ అధిపతి అసమర్థుడై, అతడి ఆలోచనలు పతనానికి దారి తీసే పరిస్థితులుంటే ఆ వ్యవస్థ వల్ల ప్రయోజనం శూన్యమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. దేశంలో ఈ విషయంపై పెద్ద చర్చ జరగాలి. దేశంలోనే ఏపీ శాసనసభ రోల్ మోడల్‌గా నిలవాలి. పుచ్చలపల్లి సుందరయ్య, నర్రా రాఘవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, చెన్నమనేని నాగేశ్వరరావు తదితర శాసనసభ్యలు, బూర్గుల రామకృష్ణారావు, టంగుటూరి ప్రకాశంపంతులు, నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు తదితర ముఖ్యమంత్రులు ఆదర్శవంతమైన బాటలు వేశారు. ఆ బాటలో మనం నడవాలి. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిల నుంచి ఎంతో నేర్చుకోవాలి. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు నడుం కట్టిన ప్రభుత్వానికి మనమంతా సహకరించాలి. బలమైన ప్రతిపక్షం బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని సభా నాయకుడు నాతో చెప్పారు. కొత్త సభ్యులు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. ప్రజల సమస్యలను పరిష్కరించగలిగితే శాసనసభకు సార్థకత చేకూరుతుంది’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నికపై ధన్యవాదాలు తెలిపే చర్చలో మొత్తం 32 మంది సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. స్పీకర్ ప్రసంగం అనంతరం శానససభ శుక్రవారానికి వాయిదా పడింది. -
అలాంటి పరిస్థితి రాకూడదు: స్పీకర్ తమ్మినేని
సాక్షి, అమరావతి: స్పీకర్ పదవి తనకు సవాల్ అని, ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకుందుకు ధన్యవాదాలు సభ్యులందరికీ తెలిపారు. ప్రతి సభ్యుడు శాసనసభ విలువలు కాపాడాలని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని కోరారు. శానససభలో పెద్దలు గతంలో విశిష్ట విలువలు నెలకొల్పారని గుర్తుచేశారు. కొత్త సభ్యులు మాట్లాడేందుకు సీనియర్లు అవకాశం ఇవ్వాలని సూచించారు. వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకంపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు విశ్వాసం కల్పించాలని, అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్భోదించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. స్పీకర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. (చదవండి: స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని) -
విలువల్లేని రాజకీయాన్ని ఇదే సభలో చూశాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. స్పీకర్ స్థానంలో తమ్మినేని ఆసీనులైన తర్వాత మొదట సభా నాయకుడైన సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తొలి ప్రసంగించారు. ‘కొత్త స్పీకర్‌గారికి నా తరఫున, మా ప్రభుత్వం తరఫున, ఏపీ ప్రజలందరి తరఫున అభినందనలు’ తెలిపారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై.. సౌమ్యునిగా తమ్మినేని సీతారాం మంచి పేరు తెచ్చుకున్నారని, మీలాంటి వ్యక్తి స్పీకర్‌గా మంచి సంప్రదాయాలు పాటిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తారని నమ్ముతున్నామని పేర్కొన్నారు. మంచి స్పీకర్‌గా అనగానే లోక్‌సభ వరకు సోమ్‌నాథ్ ఛటర్జీ, జీవీ మూలంకర్ లాంటి పెదపెద్దవారి పేర్లు గుర్తుకువస్తాయని, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. బీవీ సుబ్బారెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, కోన ప్రభాకర్‌రావు.. కొందరు మహానుభావుల పేర్లు కూడా గుర్తుకువస్తాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘స్పీకర్ ఎంపిక ఆలోచన వచ్చినప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకువచ్చాయి. ఇదే శాసనసభలోనే విలువల్లేని రాజకీయాలు చూశాం. చట్టాలకు తూట్లు పొడుస్తూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశాం. ఇన్ని చూశాక స్పీకర్‌ను ఎన్నిక చేసేటప్పుడు నేను ఎలా ఉండాలనే మీమాంస కూడా నాలో కలిగింది. కానీ, నేను కూడా అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్నే పాటిస్తే మంచి ఎక్కడా బతకదు. రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితి ఉండదు. అందుకే శాసనసభ సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి తెలిసిన వ్యక్తిగా, న్యాయం చేసే వ్యక్తిగా.. అటువంటి అన్ని గుణాలు మీలో ఉన్నాయని సంపూర్ణంగా నమ్మాను. ప్రజాస్వామ్యం, చట్టసభల మీద మళ్లీ నమ్మకం పెంచేందుకు సీఎంగా నా సంపూర్ణ నిబద్ధత ఉండాలని, వ్యవస్థలోకి మార్పు తీసుకురావడానికి సీఎంగా ఓ మంచి మనస్సుతో సభాపతి పదవికి సీతారాంగారు సరైన వ్యక్తి అని మన్సస్ఫూర్తిగా నమ్మి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరాను’ అని వైఎస్ జగన్ వివరించారు. ప్రజలే అనర్హత వేటు వేస్తే.. ఇదే నిదర్శనం! ‘వైఎస్సార్సీపీ నుంచి 67 మంది గెలిస్తే.. ఏకంగా ఇదే శాసనసభలోనే 23మందిని పార్టీ మార్చి.. కండువాలు కప్పి.. అందులో నలుగురిని మంత్రులను చేశారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలోకి తొక్కారు. ప్రతిపక్ష బెంచ్‌ల్లో కూర్చోవాల్సిన సభ్యులను సభలోని ట్రెజరీ బెంచ్‌ల్లో కూచుబెట్టుకున్నారు. చివరకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు.. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అప్పటికప్పడు రాజ్యాంగ విరుద్ధంగా మార్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని, అప్పుడే మేం సభకు వస్తామని చెప్పినా.. కనీసం పట్టించుకోలేదు. శాసనసభ అంటే శాసనాలు చేసే సభ. కానీ, దానినేచట్టం, రాజ్యాంగంతో సంబంధం లేని సభగా మార్చేశారు. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో తాజా ఎన్నికల్లో చూశాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దేవుడి స్క్రిప్ట్ గొప్పది... ‘దేవుడు కూడా చాలా గొప్ప స్క్రిప్ట్ రాశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి అక్షరాల 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొన్నవారికి మూడు ఎంపీ సీట్లే వచ్చాయి. అది కూడా 23వ తారీఖున వచ్చాయి. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో చెప్పడానికి ఇది నిదర్శనం. బ్యూటీ ఆఫ్ డెమొక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈ చట్టసభలో మళ్లీ ఇవాళ చూస్తున్నాం. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా మళ్లీ మనం ఇవాళ ఏకమయ్యాం. అటు టెండర్ల వ్యవస్థలోగానీ, గ్రామస్థాయిలోగానీ, ప్రభుత్వ యంత్రాంగంలోగానీ అవినీతిని తొలగించి.. విలువలు, విశ్వసనీయతకు ఏపీని కేరాప్ అడ్రస్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే స్పీకర్‌గా సీతారాంను ఎన్నుకున్నాం. ఒక స్పీకర్, ఒక సభా నాయకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి గత శాసనసభ నిదర్శనమైతే.. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణ కట్టుకుంది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తామని ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో చెప్పాం. అందులో భాగంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ.. గతంలో ఎన్నడూలేని విధంగా మంత్రిమండలిలో దాదాపు 60శాతం పదవులు వారికే కేటాయించాం. ఐదుగురిని డిప్యూటీ సీఎంలు చేస్తే.. అందులో నలుగురు బడుగు బలహీనవర్గాల వారికి అవకాశం కల్పించాం. ఈ విషయంలో మరో ముందడుగు వేస్తూ.. తమ్మినేని సీతారాం సభాపతిగా ఎన్నుకొని.. అధికారంలోనూ, పరిపాలనలోనూ, శాసనసభలోనూ, మా కమిట్మెంట్ను, కట్టుబాటును నిరూపించకుంటున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అలాంటిది జరిగితే.. వెంటనే డిస్కాలిఫై చేయండి మీ ఆధ్వర్యంలో నడిచే ఈ శాసనసభ పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో దేశానికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నట్టు సీఎం సభాపతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ‘చంద్రబాబు నాయుడికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. అందులో ఐదుగురిని లాగేస్తే.. ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదు.. లాగేద్దామని కొందరు నాతో చెప్పారు. అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది. అటువంటిది ఎప్పుడైనా జరిగితే.. ఆ పార్టీలోంచి ఎవరినైనా మేం తీసుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలాంటిది పొరపాటున జరిగితే.. వెంటనే డిస్కాలిఫై చేయండి’ అంటూ సీఎం వైఎస్ జగన్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. -
స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన్న వెంకటఅప్పలనాయుడు గురువారం ఉదయం సభాపతి తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు తదితరులు తమ్మినేనిని అధ్యక్ష స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మూడుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది. ఒకే నామినేషన్.. స్పీకర్ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయిన సంగతి తెలిసిందే. బుధవారం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని నామినేషన్ ఒక్కటే దాఖలైంది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంట రాగా తమ్మినేని సీతారాం.. శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకి నామినేషన్ పత్రాలను అందజేశారు. తమ్మినేనికి మద్దతుగా సంతకాలు.. తమ్మినేనికి మద్దతుగా సంతకాలు చేసిన వారిలో డిప్యూటీ సీఎంలు కె.నారాయణస్వామి, షేక్ బేపారి అంజాద్ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, అనిల్‌కుమార్ యాదవ్, ఎం.శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పీడిక రాజన్నదొర, రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, మేడా మల్లికార్జునరెడ్డి, కె.శ్రీనివాసులు, జోగి రమేష్, కోలగట్ల వీరభద్రస్వామి, గొల్ల బాబూరావు, మద్దిశెట్టి వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ, ఎం.నవాజ్ బాష, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విడదల రజని, ఫాల్గుణ, అర్థర్, వసంత వెంకట కృష్ణప్రసాద్, పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. -
శ్రీకాకుళం టు స్పీకర్ ఛైర్!
-
స్పీకర్‌గా తమ్మినేని ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. స్పీకర్ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గురువారం ఆయన ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. 15వ శాసనసభ తొలిరోజు ఎమ్మెల్యేల పదవీ ప్రమాణస్వీకారం జరిగింది. ఇదే రోజున స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని నామినేషన్ ఒక్కటే దాఖలైంది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంట రాగా తమ్మినేని సీతారాం.. శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకి నామినేషన్ పత్రాలను అందజేశారు. తమ్మినేనికి మద్దతుగా సంతకాలు చేసిన వారిలో డిప్యూటీ సీఎంలు కె.నారాయణస్వామి, షేక్ బేపారి అంజాద్ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, అనిల్‌కుమార్ యాదవ్, ఎం.శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పీడిక రాజన్నదొర, రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, మేడా మల్లికార్జునరెడ్డి, కె.శ్రీనివాసులు, జోగి రమేష్, కోలగట్ల వీరభద్రస్వామి, గొల్ల బాబూరావు, మద్దిశెట్టి వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ, ఎం.నవాజ్ బాష, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విడదల రజని, ఫాల్గుణ, అర్థర్, వసంత వెంకట కృష్ణప్రసాద్, పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా తమ్మినేని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. -
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. శాసన సభ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేయాలని ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. కాగా స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేష్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు పలికారు. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. స్పీకర్‌గా తమ్మినేని రేపు అధికారికంగా భాధ్యతలు చేపట్టనున్నారు.కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి ఏర్పాటైన అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా 173మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది.