బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్‌సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment