unfair
-
బడుగులకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. బడుగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికే 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వెలమ సామాజిక వర్గాన్ని కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచేయి చూపారు. టీడీపీ జాబితాలో ముస్లిం మైనార్టీ సీట్లు కేవలం మూడే కేటాయించారు. ఇప్పటివరకు 139 స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించగా, బీసీ-31, ముస్లిం మైనార్టీ-3, ఎస్సీ-26, ఎస్టీ-04, కాపు-09, కమ్మ 30, రెడ్డి-28, వైశ్య-02, క్షత్రియ-05, వెలమ-01 సీట్లు కేటాయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు సీఎం జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?
దేశంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిపై 2004లో తన తండ్రి ఢిల్లీ వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారని, తదనంతరం ఎదురైన పరిణామాలు ఇలా ఉన్నాయంటూ స్టోరీపిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు తన్మయ్ గోస్వామి ట్విట్టర్ మాధ్యమంలో పలు వివరాల తెలిపారు. తన తండ్రి విషయంలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ వైద్యపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకుగాను రూ. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తన తండ్రి అభ్యర్థించారన్నారు. ఇది జరిగి11 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని, 2015లో తన తండ్రి చనిపోయారన్నారు. అయితే వృద్ధురాలైన తన తల్లి ఈ కేసును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నదని, సుదీర్ఘ పోరాటం అనంతరం 19 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విజయం సాధించామని తెలిపారు. తొందరపాటుతో శస్త్రచికిత్స అసోంకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 19 సంవత్సరాల పాటు ప్రముఖ వైద్యసంస్థతో న్యాయపరంగా పోరాడి ఎలా గెలిచిందనే వివరాలను తన్మయ్ గోస్వామి తెలియజేశారు. తన తండ్రి 2004లో ఈపీఎస్ డయాగ్నస్టిక్ స్టడీ కోసం బాత్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈపీఎస్ అధ్యయనం అసాధారణంగా ఉంటే, రోగితో చర్చించిన తర్వాత ఆర్ఎఫ్ఏ చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఏ ప్రమాదకరం లేదా ప్రాణాంతకం కావడంతో దానిని వైద్యులు సిఫార్సు చేయరు. అయినప్పటికీ బాత్రా ఆసుపత్రి కార్డియాలజిస్టులు తన తండ్రితో లేదా మా కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఆర్ఎఫ్ఏ చేశారన్నారు. ఇది కూడా చదవండి: భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత! పేస్ మేకర్ సరిగా అమర్చకపోవడంతో.. అయితే ఈ చికిత్స కారణంగా తన తండ్రి ఆరోగ్యం విషమించిందని గోస్వామి తెలిపారు. దీంతో వైద్యులు తన తండ్రిని కాపాడేందుకు అతని ఛాతీలో పేస్ మేకర్ అమర్చాలని నిర్ణయించారు. దీంతో వైద్యులు తన తల్లికి ఫోన్ చేసి, వెంటనే ఢిల్లీకి రావాలని తెలియజేశారు. వారు చెప్పిన విధంగానే తన తల్లి ఢిల్లీ వెళ్లిందన్నారు. అక్కడి చికిత్స ముగిసిన కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారని, అయితే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోలేదన్నారు. తన తండ్రి ఛాతీ ప్రాంతం రోజురోజుకు ఉబ్బిపోవడాన్ని గమనించి, గౌహతిలో కార్డియాలజిస్ట్‌ని సంప్రదించామన్నారు. అప్పుడు ఆయన తన తండ్రిని పరీక్షించి, పేస్ మేకర్ సరిగా అమర్చలేదనే విషయాన్ని తెలిపారన్నారు. దీంతో తండ్రి ఛాతీలోని పేస్ మేకర్‌ను సరిచేయడానికి అతనికి అత్యవసరంగా అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. వైద్యుల సలహా మేరకు తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. అనంతరం ఆయన బలహీనంగా మారి, పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. అయినా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించేవారన్నారు. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌పై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశారన్నారు. తమ కుటుంబ న్యాయవాది ఈ కేసును చేపట్టారన్నారు. ఇది వినియోగదారుల న్యాయస్థానానికి సంబంధించిన ఉదంతం కనుక సత్వర న్యాయం జరుగుతుందని తామంతా భావించామన్నారు. చనిపోయే వరకూ న్యాయపోరాటం 2004 నుండి 2015 వరకు.. అంటే తన తండ్రి చనిపోయే వరకు కేసులోని ప్రతి విచారణ వాయిదాకు హాజరయ్యారన్నారు. కోల్‌కతా నుండి మా న్యాయవాది ఢిల్లీకి వచ్చేవారని, అతని ప్రయాణ, బస ఖర్చులను తామే భరించామని గోస్వామి తెలిపారు. ఈ విధంగా 19 సంవత్సరాల పాటు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయన్నారు. ఈ కేసు కోసం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందన్నారు. కేసు విచారణ సమయంలో పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు. వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. తన తండ్రి చనిపోయే వరకూ అంటే 11 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారన్నారు. తన తండ్రి చనిపోయాక, బాత్రా హాస్పిటల్ కాస్త ఊపిరి పీల్చుకుందేమో.. కానీ మా తల్లి మాత్రం ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో తాను ఈ ఉదంతంలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడం మొదలుపెట్టానని గోస్వామి తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! కేసు జాప్యం వెనుక సవాలక్ష కారణాలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం వెనుక పలు కారణాలున్నాయని గోస్వామి తెలిపారు. ఇది మెడికల్ కేసు కావడంతో వాదనకు న్యాయమూర్తులు సరిపోలేదు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ పలుకుబడి కూడా కేసు జాప్యానికి కారణంగా మారింది. దీనికితోడు ఉద్దేశపూర్వక జాప్యాలు, కోర్టు నుండి సాక్ష్యాలను ఉపసంహరించుకోవడం లాంటివి ఎదురయ్యాయన్నారు. అయితే తమ న్యాయవాది వినతి మేరకు కేసు విచారణలో స్వతంత్ర వైద్య బోర్డు అవసరమని కోర్టు కోరింది. మెడికల్ బోర్డు విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. In 2004, my dad filed a case of medical negligence against one of India's most powerful hospitals viz. Batra Hospital, Delhi and Padmashree awardee cardiologist Dr Upendra Kaul. Case was filed in the state consumer court, Delhi & my dad asked for a compensation of Rs. 80 lakh.… — Tonmoy Goswami (@protonycle) August 3, 2023 ఆధారాలను చూపలేకపోయిన ఆసుపత్రి వర్గాలు అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు తన తండ్రి ఆర్ఎఫ్ఏ చికిత్స విషయంలో తమ సమ్మతి తీసుకున్నట్లు పేర్కొంటూ బెంచ్‌ను గందరగోళపరిచేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సాక్ష్యం అడిగినప్పుడు, వారు తరచూ ఈపీఎస్ సమ్మతి పత్రాన్ని సాకుగా చూపిస్తూ వచ్చారు. దీంతో కేసు ఆలస్యం అవుతూ వచ్చిందేగానీ, ముందుకు కదలలేదు. పైగా పీఎస్ సమ్మతి పత్రాన్ని తమకు ఇచ్చేశామని వారు కోర్టులో బుకాయించేవారని గోస్వామి తెలిపారు. ఎంతకాలం గడిచినా బాత్రా ఆసుపత్రి వర్గాలు ఆర్ఎఫ్ఏ పత్రాలను కోర్టుకు సమర్పించ లేకపోయాయి. ఎట్టకేలకు 2018లో తాము ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌లో కేసును గెలిచామన్నారు. కేసు దాఖలు చేసిన తేదీ నుండి 7% సాధారణ వడ్డీతో రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం బాత్రా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించింది. అయితే తన తండ్రి కోరిన విధంగా రూ. 80 లక్షల పరిహారంతో పోల్చితే ఇది ఏమీ కానప్పటికీ, తాము ఈ కేసులో గెలిచినందుకు ఎంతో సంతోషించామన్నారు. కథ మళ్లీ మొదటికి.. అయితే అప్పటితో కథ ఆగిపోలేదని బాత్రా ఆసుపత్రి వర్గాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్‌లో అప్పీలు చేశామని గోస్వామి తెలిపారు. దీంతో కేసు మొదటికి వచ్చింది. అయితే మరో 14 ఏళ్లు పట్టినా ఈ పోరాటం కొనసాగిస్తానని తల్లికి మాట ఇచ్చానని గోస్వామి తెలిపారు. అయితే మా న్యాయవాది నెగ్వివ్ అహ్మద్ ఈ కేసు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, విచారణలో ఎక్కువ వాయిదాలు పడకుండా కేసు త్వరగా ముందుకు కొనసాగేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 2023లో ఈ కేసులో తాము మరోమారు గెలిచామని గోస్వామి తెలిపారు. అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు వారి పరపతి నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తాము భావించామన్నారు. అయితే 19 ఏళ్లలో తాము రెండుసార్లు విజయం సాధించిన నేపధ్యంలో బాత్రా ఆసుత్రి వర్గాల సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయలేదని గోస్వామి తెలిపారు. భవిష్యత్ న్యాయ పోరాటాలకు స్ఫూర్తి ఎట్టకేలకు ఈ కేసు ముగిసినందుకు మా కుటుంబం సంతోషించింది. అయితే ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సాధ్యం కాదని తాను అర్థం చేసుకున్నానని గోస్వామి అన్నారు. తాము సాగించిన న్యాయపోరాటం భవిష్యత్తులో మరింతమంది రోగులకు న్యాయం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. బాధితులు ఎవరైనా ఇటువంటి న్యాయపోరాటం చేసేటప్పుడు వారు గోస్వామి కుటుంబాన్ని గుర్తుంచుకుంటారన్నారు. నష్టపరిహారం సొమ్ముతో మంచి పని మాకు కోర్టు నుంచి అందిన పరిహారం మొత్తాన్ని మా అమ్మ ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుందన్నారు. మొదట్లో తాను బాత్రా ఆసుపత్రిపై కోపంగా ఉండేవాడనిని, ఈ ఆసుపత్రిలో మీ సొంతపూచీ కత్తుతో చేరాలని ఆసుపత్రి ముందు బోర్డు పెట్టాలని అనుకునే వాడినని అన్నారు. అయితే అటువంటి సందర్భంలో తన తల్లి తనను శాంతపరిచేదని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
ఇది అన్యాయం.. బాధాకరం: కేటీఆర్
హైదరాబాద్: లోక్ససభ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. 2026 తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు.. జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటల్ని, విధానాలను దక్షిణాది రాష్ట్రాలు నమ్మాయి. ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేశాయి. అలాంటిది ఇవాళ డీలిమిటేషన్ వల్ల తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు (MP Seats) పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలు.. తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారాయన. 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి (GDP) నిధులు అందిస్తున్నాయని, జాతీయ ఆర్థికాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని అభిప్రాయపడ్డారాయన. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. This is indeed a travesty and a tragedy of it does come true. Southern states of India have been best performers on all fronts post independence Leaders and people of all Southern states need to raise their voices collectively cutting across political affiliations against this… https://t.co/ohE9GD8hDD — KTR (@KTRBRS) May 29, 2023 ఇదీ చదవండి: కేసీఆర్ కోవర్టులు అంతటా ఉన్నారు! -
గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..
టెక్ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ మార్కెట్లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గూగుల్ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డకుంది. వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది. న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ఆ ఒప్పందానికి సంబంధించిన ఈమెయిల్‌లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్‌లైన్‌లోనే చర్చించాలని కూడా కోరిందని ఎఫ్‌టీసీ తెలిపింది. ఎఫ్‌టీసీ గణాంకాల ప్రకారం.. 2016లో ఖర్చు చేసిన మొత్తంలో స్థానిక యాప్ మార్కెట్లో దాదాపు 80 నుంచి 85 శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ 2018లో 90 నుంచి 95 శాతానికి విస్తరించగలిగింది. మరోవైపు ఈ కాలంలో వన్ స్టోర్ 15 - 20 శాతం నుంచి 5 - 10 శాతానికి మాత్రమే పడిపోయిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. కాగా కొరియన్ ఎఫ్‌టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది. -
తప్పుడు ప్రకటనలిస్తే...ఎడ్టెక్ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు. ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్‌గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్‌హ్యాట్ జూనియర్, సన్‌స్టోన్ తదితరాలున్నాయి. -
భారత్‌లో అమెజాన్ వ్యవహారం.. ‘జెఫ్ బెజోస్ పచ్చి అబద్ధాలకోరు’!
Reuters Allegations On Amazon's Business Practices: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు మొట్టికాయలు గట్టిగానే పడ్డాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడుతుందన్న ఆరోపణలపై ఐదుగురు చట్టసభ్యుల యూఎస్ హౌజ్ జ్యుడీషియరీ కమిటీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆదివారం కంపెనీని హెచ్చరిస్తూ ఘాటుగా ఓ లేఖను రాసింది సదరు కమిటీ. అమెజాన్ అనైతిక వ్యాపారధోరణిపై రాయిటర్స్ తాజా సంచలన కథనం మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో కంపెనీలో పని చేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తులు, చివరికి వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా అంతా పార్లమెంట్(అమెరికా కాంగ్రెస్)ను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసి ఉంటారని, అబ్దదాలు సైతం చెప్పారంటూ యూఎస్ హౌజ్ జ్యుడీషియరీ కమిటీ తన లేఖలో పేర్కొంది. అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరపిస్తామని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీని ఉద్దేశిస్తూ ఓ లేఖలో ప్యానెల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే విషయంలో అమెజాన్ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ రాయిటర్స్ ఒక ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. గత బుధవారం ఆ కథనం ప్రచురితం కాగా.. ఈ సంచలన కథనం ఆధారంగా స్పందించిన దర్యాప్తు కమిటీ అమెజాన్‌ను పరోక్ష హెచ్చరికగా లేఖను రాసింది. స్థానిక ఉత్పత్తులను కాపీ కొట్టి ప్రొడక్టులు తయారుచేసుకోవడంతో పాటు, భారత్‌లాంటి దేశాల్లో అమెజాన్ ఇండియా యాప్ ద్వారా స్థానిక ఉత్పత్తులను తొక్కిపడేస్తూ, తమ ప్రొడక్టులను.. తమ అనుకూల ఉత్పత్తులనే ఎక్కువగా ప్రమోట్ చేస్తోందంటూ అమెజాన్‌పై రాయిటర్స్ తన కథనంలో ఆరోపించింది. మరోవైపు భారత్‌లోనూ ఈ కథనం ఆధారంగా అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్ ఉత్పత్తుల వ్యాపారాన్ని దెబ్బతీస్తోందంటూ అమెజాన్‌పై పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు లక్షల మంది సంప్రదాయ వ్యాపారుల తరపున బృందం.. అమెజాన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి లేఖను సైతం రాసింది. ఇదిలా ఉంటే గతంలోనూ అమెజాన్‌పై ఇదే తరహా ఆరోపణలు రాగా.. ఈ ఐదుగురు సభ్యుల హౌజ్ జ్యుడీషియరీ కమిటీ 2019 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆరోపణలు రావడంతో అప్పుడు సీఈవోగా ఉన్న జెఫ్ బెజోస్ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించింది ప్యానెల్. అయితే తాము ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం లేదంటూ ఆ టైంలో అంతా వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు రావడంతో క్రిమినల్ దర్యాప్తు తప్పదని హెచ్చరించింది విచారణ కమిటీ. అయితే తామెప్పుడూ కమిటీని తప్పుడు దోవ పట్టించలేదని, మీడియా కథనాలే తప్పుల తడకగా ఉన్నాయని వివరించామని ఓ ప్రతినిధి వెల్లడించారు. చదవండి: బెజోస్‌కు ఆ ఆనందం లేకుండా చేసిన ఎలన్ మస్క్ -
‘ఆనంద్‌ను మోసం చేసి గెలిచాను.. నన్ను క్షమించండి’
ముంబై: ఆ ఆటగాడు చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చెస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఆటగాడిపై ఓ వ్యాపారవేత్త గెలచాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజమే. అయితే దానికి వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో జెరోదా కంపెనీ కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఆడిన చెస్ గేమ్‌లో విశ్వనాథ్ ఆనంద్‌ను ఓడించాడు. ఈ విజయం చాలా మందిని షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కాగా కోవిడ్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్, పలువురు సెలబ్రిటీలతో చెస్ గేమ్స్ ఆడారు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా నిఖిల్ కామత్ తన విజయంపై స్పందిస్తూ.. ఈ విజయం వెనుక అసలు కారణాన్ని బట్ట బయలు చేశాడు. అతను తన ట్విటర్లో.. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్‌ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్‌పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నేను ఆనంద్‌పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించాలని’ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV — Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021 చదవండి: గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. -
Tata Motors: టాటా మోటార్స్‌కు సీసీఐ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అత్యధిక వాణిజ్య వాహనాల అమ్మకందారు టాటా మోటార్స్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డీలర్షిప్ ఒప్పందాలకు సంబంధించి అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఫిర్యాదులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 4న 45 పేజీల విచారణ పత్రాల టాటా మోటార్స్‌కు పంపింది.నిబంధనలకు విరుద్ధంగా తన డామినెంట్ పొజిషన్‌ను ఉపయోగించుకొని టాటామోటార్స్ వాణిజ్య వాహనాల డీలర్షిప్ ఒప్పందంలో అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తోందన్న ఫిర్యాదుదారులను సీసీఐ ప్రాథమికంగా విశ్వసిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా డైరెక్టర్ జనరల్‌ను దర్యాప్తు విభాగం ఆదేశించింది. టాటా మోటార్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రెండు ఫిర్యాదులు రావడంతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ సెక్షన్ 4 లోని నిబంధనలకు విరుద్ధంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల కోసం డీలర్ షిప్ ఒప్పందాలు చేసుకుంటుందన్న ఆరోపణలను ప్రాధమిక విచారణలో నిజమేనని సీసీఐ తేల్చింది ఈనేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సెక్షన్ 3 (4), కాంపటీషన్ చట్టంలోని సెక్షన్ 4లోని నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయనేది సీసీఐ వాదన. సీసీఐ ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆర్డర్ కాపీని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన చర్యల నిమిత్తం న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నామని చెప్పారు. చదవండి: పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే! కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
బ్రిజేష్‌కుమార్ తీర్పు.. ఆంధ్రాకు అన్యాయం
- సీఎం పట్టించుకోకపోవడం విడ్డూరం - శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య ద్వారకానగర్ (విశాఖ): కృష్ణానదీ జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సీఎం చంద్రబాబు పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నదీజలాల అన్యాయంపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని, కృష్ణాజలాల పంపకంలో ఆంధ్రాకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే రాయలసీమ నీటి ఎద్దడితో అలమటిస్తూంటే, కృష్ణాలోని 35 టీఎంసీల నీటిని మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతోందని, కృష్ణా డెల్టా కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నీళ్ల పంచాయితీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ జలాలను నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచేలా చూడాలని రామచంద్రయ్య కోరారు. చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమేనని, ప్రధానమైన పోలవరం వదిలేసి, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టులు చేపట్టడం కాసుల ఆకాంక్షేనని ఆరోపించారు. చంద్రబాబు అనుకూల మీడియా ఎంత ప్రచార ఆర్భాటాలు చేపట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన రూ. 60 వేల కోట్ల అప్పుకు వడ్డీ ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిపై పదేళ్ల వరకు ఆంధ్రాకు హక్కు ఉన్నా సచివాలయాన్ని తెలంగాణాకు అప్పగిస్తామని సీఎం చెబుతున్నారని, ఇష్టానుసారం అప్పగించడానికి అదేమీ హెరిటేజ్ ఆస్తి కాదని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన
నిజామాబాద్‌నాగారం: జీఎస్టీ చట్టం ప్రకారం ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో ఉద్యోగులకు, రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ డిప్యూటీ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఎస్టీ చట్టం అమలైతే వస్తు సేవలపై పన్ను అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోతుందని డిప్యూటీ కమిషనర్ లావణ్య తెలిపారు. ఈ విషయంలో సేవలపై పన్ను వసూలు చేసే అనుభవం రాష్ట్రాలకు లేదంటూనే వ్యాట్ సంబంధిత పన్నులను కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని యత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వస్తు సేవల పన్నులో రాష్ట్ర ప్రభుత్వలకు కూడా సమాన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్లు లక్ష్మయ్య, నిజామాబాద్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి శంకర్, ప్రతినిధులు గంగాధర్, గంగాధర్, చిస్తేశ్వర్, నాయనర్, బాలరాజు, హమీద్ అహ్మద్, భారతి, జయంత్‌నాథ్, ఆదిత్యకుమార్, విజయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కుట్రతోనే జనగామకు అన్యాయం
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దద్దమ్మలు∙ పట్టణాలను వదిలి గ్రామాలను జిల్లా చేస్తారా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి రఘునాథపల్లి : జనగామ జిల్లా కోసం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కుట్రతో అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కోసం చేపట్టిన 8వ రోజు దీక్ష శిబిరాన్ని గురువారం నాయకులతో కలిసి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ జిల్లా కోసం ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌పై జిల్లా ఏర్పాటుకు ఒత్తి డి తెచ్చి ప్రజల పక్షాన ఉండాలన్నారు. శాస్త్రీయంగా భౌగోళికంగా జిల్లా కేంద్రం అయ్యేం దుకు అన్ని హంగులు జనగామకు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి విజయరామరావు మాట్లాడుతూ కొత్త జిల్లాల పునర్విభజన ఏకపక్షంగా అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ ఆధ్వర్యం లో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహిం చారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, డీసీసీబీ వై స్ చైర్మన్ పుల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నా గేష్, జేఏసీ గౌరవ అధ్యక్షుడు కైలాసం, జే ఏసీ నాయకులు యాదవరెడ్డి, జోగారెడ్డి, హ ర్యానాయక్, రవి, బాలస్వామి, చిన్న నగేష్, లిం గాజీ, రమేష్, జయరాములు, చందన, మూ డ్ధర్మ, అశోక్, శ్రీను, నర్సింహ పాల్గొన్నారు. -
‘మహా’ ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి వరంగల్ : గోదావరిపై నిర్మించనున్న బ్యారేజ్‌ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పం దం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యా యం జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1954నుంచి గోదావరి జలాల వివాదం ప్రారంభం కాగా అప్పటి సీఎం వెంగళరావు, మ హారాష్ట్ర సీఎం ఎస్బీ.చవాన్ మధ్య జరిగిన చర్చ ల్లో భాగంగా రాష్ట్రంలో లెండి, లోయన్ పెన్‌గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుని టెక్నికల్ కమిటీని నియమించారని తెలిపా రు. అయితే, పలుకారణాలతో నిర్మాణాలు ఆల స్యమయ్యాయన్నారు. 2012లో ఇరు రాష్ట్రాల సీఎంలు కిరణ్‌కుమార్‌రెడ్డి, పృథ్వీరాజ్‌చవాన్ సమావేశమై 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మిం చాలని అంగీకారం కుదుర్చుకున్నారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టుల రీడిజైన్ పేరు తో 148మీటర్లకు కేసీఆర్ ఒప్పుకోవడం వల్ల తె లంగాణకు తీదని అన్యాయం జరగనుందన్నారు. కాగా, ఒ ప్పందంపై సీఎం కేసీఆర్ వైఖ రిని నిరసిస్తూ ఈనెల 29న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పుల్లోకి నెట్టారు.. తెలంగాణ ఏర్పాటు సమయం లో రూ.8వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా కేసీఆర్ అప్పుల ఊబిలోకి లాగారని టీడీపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సీతక్క విమర్శించారు. పార్టీ ప్ర ధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ తన పాలనపై ప్రజలు ఆలోచన చేయకుండా ఉండేం దుకు సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. 30న బంద్‌కు మద్దతు చారిత్రక వరంగల్‌ను రెండు జిల్లాలుగా చేసేం దు కు ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాను రద్దు చేసుకోవాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఈనెల 30 న చేపట్టిన బంద్‌కు టీడీపీ మద్దతు ప్రకటిస్తోందని జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు శనివారం జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అలాగే, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 31న కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గట్టు ప్రసాద్, పుల్లూరు అశోక్‌కుమార్, మార్గం సారంగం, రహీం, సంతోష్, సాంబయ్య, విజయ్ పాల్గొన్నారు. -
అన్యాయంగా పింఛన్లు తీసేశారు
కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన బాధితులు కర్నూలు(అగ్రికల్చర్): తాము అన్ని రకాలుగా పింఛన్లకు అర్హులమైనా అన్యాయంగా జాబితా నుంచి పేర్లు తొలగించారని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.05 లక్షల మందికి పింఛన్లు కట్ కావడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం పింఛన్లు కోల్పోయిన వారు తమ గోడును కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను బయటకు తీసుకువచ్చారు. ప్రజాదర్బార్ ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి పింఛన్ బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రజాదర్బార్ బంద్ కావడం, సుదూర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చినా వారి గోడును పట్టించుకునేవారు లేకపోవడంతో ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌లో పింఛన్లను పెంచినట్లే పెంచి అడ్డుగోలుగా కోత కోశారు. ఆధార్ లేదని, ఆధార్ ఉన్నా తప్పులున్నాయని, రేషన్ కార్డు లేదని, పింఛన్‌కు తగిన వయస్సు లేదని, భూమి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందని, ఇలా పలు కారణాలతో 1.05 లక్షల పైగా పింఛన్లను తొలగించారు. దీంతో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.