సాక్షి,ముంబై: దేశీయ అత్యధిక వాణిజ్య వాహనాల అమ్మకందారు టాటా మోటార్స్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డీలర్‌షిప్ ఒప్పందాలకు సంబంధించి అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఫిర్యాదులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 4న 45 పేజీల విచారణ పత్రాల టాటా మోటార్స్‌కు పంపింది.నిబంధనలకు విరుద్ధంగా తన డామినెంట్ పొజిషన్‌ను ఉపయోగించుకొని టాటామోటార్స్ వాణిజ్య వాహనాల డీలర్షిప్ ఒప్పందంలో అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తోందన్న ఫిర్యాదుదారులను సీసీఐ ప్రాథమికంగా విశ్వసిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా డైరెక్టర్ జనరల్‌ను దర్యాప్తు విభాగం ఆదేశించింది.
టాటా మోటార్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రెండు ఫిర్యాదులు రావడంతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ సెక్షన్ 4 లోని నిబంధనలకు విరుద్ధంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల కోసం డీలర్ షిప్ ఒప్పందాలు చేసుకుంటుందన్న ఆరోపణలను ప్రాధమిక విచారణలో నిజమేనని సీసీఐ తేల్చింది ఈనేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సెక్షన్ 3 (4), కాంపటీషన్ చట్టంలోని సెక్షన్ 4లోని నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయనేది సీసీఐ వాదన. సీసీఐ ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఆర్డర్ కాపీని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన చర్యల నిమిత్తం న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నామని చెప్పారు.
చదవండి: పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు
Comments
Please login to add a commentAdd a comment