probes
-
హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు!
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై పెరిగిన దాడులపై జరిగిన విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు. దేవాలయాలపై దాడుల ఘటనలు హిందూ అమెరికన్ల ఆవేదనకు కారణమవుతున్నాయని, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులపై విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దాడుల నేపథ్యంలో చాలామంది హిందువులు భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సి వస్తోందని వారు వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు. -
రూ.100 కోట్ల స్కాం: నలుగురు కాదు ఆరుగురు ఉద్యోగులపై టీసీఎస్ చర్యలు
ముంబై: కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలతో కుమ్మక్కై, వాటికి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించినందుకు గాను ఆరుగురు ఉద్యోగులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చర్యలు తీసుకుంది. నైతిక నియమావళిని పాటించలేదని విచారణలో తేలడంతో ఆరుగురు ఉద్యోగులను, అలాగే ఆరు సంస్థలను నిషేధించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపైనా సంస్థ విచారణ జరుపుతోందని ఆయన షేర్హోల్డర్లకు వెల్లడించారు. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) కొందరు ఉద్యోగుల తప్పుడు ప్రవర్తన గురించి ఇద్దరు ప్రజావేగుల నుంచి కంపెనీకి ఫిర్యాదులు రావడం, టీసీఎస్‌లో ఉద్యోగాలకు లంచాలు తీసుకుంటున్నారని.. తత్సంబంధ వ్యక్తులు ఈ రకంగా కనీసం రూ. 100 కోట్లు సంపాదించారని ఇటీవల మీడియాలో వార్తలు రావడం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, సంపన్న దేశాల్లో అనిశ్చితితో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, అయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్‌లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్‌లోని పలుచోట్ల సోదాలు చేసినట్లు పేర్కొంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సోదాలు నిర్వహించింది. రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఈడీ గుర్తించింది. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. పదేళ్లుగా భారీగా హవాలా లావాదేవీలు జరిపినట్లు తేలింది. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
Tamil Nadu: జయలలిత మరణించిన ఐదేళ్లకు.. కమిషన్ విచారణ పూర్తి
ఎడతెగని ఊహాగానాలు, నిత్యకృత్యంగా మారిన వాయిదాలు, విమర్శలు, నిట్టూర్పులు వెరసి ఐదేళ్ల తరువాత అమ్మ మరణంపై ఎట్టకేలకూ నివేదిక సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ కమిషన్ సమగ్ర వివరాలను సమర్పించింది. ఆ నివేదికలో ఏం ఉందోననే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. జయలలిత మృతి కేసులో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని గతంలోనే సీఎం స్టాలిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జె.జయలలిత మృతి కేసులో విచారణ ముగిసింది. వాయిదాల పర్వంతో ఐదేళ్ల పాటూ సాగిన విచారణలో వెలుగు చూసిన అంశాలతో ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదిక సిద్ధం చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి సమర్పించారు. 600 పేజీలతో ఈ నివేదిక రూపొందింది. నేపథ్యం ఇదీ.. 2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు. అపోలో రూపంలో.. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణలో తమ వైద్యులు తెలియజేస్తున్న అంశాలు, వివరాలు బయటకు రావడం, అవన్నీ కొత్త వాదనలకు దారి తీయడంతో అపోలో యాజమాన్యం కోర్టు తలుపు తట్టింది. తమను ప్రత్యేకంగా విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అపోలో యాజమాన్యం సవాలు చేసింది. ఈ పరిణామాలతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించాల్సి వచ్చింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగియడం, ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులు రంగంలోకి దిగడంతో మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో ఆర్ముగ స్వామి కమిషన్ వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకుంది. విచారణను వేగవంతం చేసింది. తొలి విచారణ నాటి నుంచి చివరి వరకు ఈ కమిషన్ పదవీ కాలాన్ని 14 సార్లు పొడిగించాల్సిన పరిస్థితి పాలకులకు ఏర్పడింది. ఈ కేసులో 159 మందిని విచారించారు. 8 మంది వద్ద లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ కేసులో తొలి విచారణ డాక్టర్ శరవణన్‌తో మొదలు కాగా, చివరగా అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో ముగించారు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! నివేదికలో మిస్టరీ... విచారణను ముగించిన ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికను శనివారం ఉదయం సీఎం ఎంకే స్టాలిన్‌కు సమర్పించింది. సచివాలయంలో ఈ నివేదికను స్వయంగా స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి అందజేశారు. 608 పేజీలతో నివేదికను సిద్ధం చేసినా, 600 పేజీలలో మరణం కేసు విచారణ సమగ్ర వివరాలను పొందుపరిచారు. తొలుత 550 పేజీల్లో వివరాలను ముగించేందుకు నిర్ణయించినా, ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాలతో అదనంగా మరో 50 పేజీలు చేర్చారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రెండు రకాల నివేదికను సమర్పించారు. ఇందులో జయలలితను పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించడం, అక్కడ అందించిన వైద్య చికిత్సల వివరాలను పేర్కొన్నారు. అపోలో వైద్యుల చికిత్స సరైన మార్గంలోనే జరిగినట్లుగా పొందు పరిచినట్లు భావిస్తున్నారు. అలాగే, అదనంగా మరో 200 పేజీల నివేదికలో ముఖ్యాంశాలను సీఎంకు సమర్పించారు. ప్రధాన నివేదికలోని కొన్ని కీలక వివరాలను ముఖ్యాంశాలుగా ఇందులో పేర్కొని ఉండటం గమనార్హం. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. అందులో ప్రత్యేక అంశంగా ఈ నివేదిక గురించి చర్చించి మిస్టరీని నిగ్గు తేల్చబోతున్నారు. ఆపై తదుపరి చర్యలకు సిద్ధం కాబోతున్నారు. కాగా జయలలిత మరణం వెనుక ఎవరైనా ఉండివుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శ్రేణులతో పాటూ రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది. శశికళ లిఖిత పూర్వకంగా.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ స్వయంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఈ కమిషన్‌కు వివరాలను సమర్పించారు. ఆమె తరపున న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ మాత్రం విచారణకు హాజరయ్యారు. అలాగే, చిన్నమ్మ వదిన ఇలవరసి మాత్రం స్వయంగా విచారణకు వచ్చారు. నివేదిక సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్ముగ స్వామి మాట్లాడుతూ, శశికళ నేరుగా విచారణకు రాలేదని, లఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు. పోయెస్ గార్డెన్ ఇంట్లో నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఎలాంటి అనుమానాలు లేవు అని పేర్కొంటూ, పోయెస్ గార్డెన్లో విచారణ జరపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విచారణలో ఎలాంటి జాప్యం జరగలేదని, తన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సాక్షాలు, ఆధారాలు, రికార్డులు అన్నీ సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేశానని తెలిపారు. అన్ని వివరాలను ఓ నివేదిక రూపంలో, ముఖ్యమైన అంశాలను మరో నివేదిక రూపంలో తెలియజేసినట్లు వివరించారు. ఎయిమ్స్ వైద్యుల సహకారం, రెండు ప్రభుత్వాల సహకారంతో (గత అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే) ఈ కేసు విచారణను ముగించినట్టు చెప్పారు. తన కమిషన్ విచారణకు అధికంగా నిధులు వెచ్చించినట్టు కొందరు పేర్కొనడం శోచనీయమన్నారు. ఇది వరకు ఎన్నో కమిషన్లు మరెన్నో అంశాలపై విచారణలు చేశాయని, అప్పుడు రాని నిధుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకోచ్చినట్లు? అని ఓ ప్రశ్నకు సమాధానంగా అభిప్రాయపడ్డారు. -
నంద్యాల రిపోర్టర్ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. -
Tata Motors: టాటా మోటార్స్‌కు సీసీఐ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అత్యధిక వాణిజ్య వాహనాల అమ్మకందారు టాటా మోటార్స్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డీలర్షిప్ ఒప్పందాలకు సంబంధించి అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఫిర్యాదులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 4న 45 పేజీల విచారణ పత్రాల టాటా మోటార్స్‌కు పంపింది.నిబంధనలకు విరుద్ధంగా తన డామినెంట్ పొజిషన్‌ను ఉపయోగించుకొని టాటామోటార్స్ వాణిజ్య వాహనాల డీలర్షిప్ ఒప్పందంలో అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తోందన్న ఫిర్యాదుదారులను సీసీఐ ప్రాథమికంగా విశ్వసిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా డైరెక్టర్ జనరల్‌ను దర్యాప్తు విభాగం ఆదేశించింది. టాటా మోటార్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రెండు ఫిర్యాదులు రావడంతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ సెక్షన్ 4 లోని నిబంధనలకు విరుద్ధంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల కోసం డీలర్ షిప్ ఒప్పందాలు చేసుకుంటుందన్న ఆరోపణలను ప్రాధమిక విచారణలో నిజమేనని సీసీఐ తేల్చింది ఈనేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సెక్షన్ 3 (4), కాంపటీషన్ చట్టంలోని సెక్షన్ 4లోని నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయనేది సీసీఐ వాదన. సీసీఐ ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆర్డర్ కాపీని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన చర్యల నిమిత్తం న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నామని చెప్పారు. చదవండి: పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే! కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
అలీబాబావి దొంగ లెక్కలా....?
చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా హోల్డింగ్ లిమిటెడ్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమవుతున్నాయి. ఫెడరల్ చట్టాలను అతిక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అలీబాబా షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. అలీబాబా అకౌంటింగ్ ప్రాక్టీస్ లపై అమెరికా రెగ్యులేటర్స్ విచారణ కొనసాగిస్తున్నాయి. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా తప్పుడు ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టిందనే ఆరోపణలతో పాటు, ఆలీబాబా ప్రవేశపెట్టిన "సింగల్ డే" ప్రమోషన్ స్కీమ్ పై వ్యతిరేక ఆరోపణలు ఆ కంపెనీపై వచ్చాయి. దీంతో సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(సెక్) ఈ కంపెనీపై ఈ ఏడాది మొదటి నుంచి విచారణ కొనసాగిస్తోంది. సెక్ ప్రధానంగా లాజిస్టిక్ సంస్థ కైనియో నెట్ వర్క్ పై ఎక్కువగా దృష్టిసారించింది. అలీబాబా గ్రూప్ లో ఈ సంస్థ 47శాతం వాటా కలిగిఉంది. సాధారణంగా కంపెనీలో జరిగిన లావాదేవీలకు అకౌంటింగ్ ప్రాక్టీస్ లు ఎలా ఉన్నాయి. "సింగల్ డే" అమ్మకాల వార్షిక డేటా ఎలా ఉందో అనే దానిపై సెక్ విచారణ సాగిస్తుందని ఆలీబాబా వార్షిక రిపోర్టు నివేదించింది. అమెరికాలో బ్లాక్ ప్రైడే, సైబర్ మండే షాపింగ్ ఈవెంట్స్ కంటే నవంబర్ 11 సింగల్ డే చేపట్టిన ప్రమోషన్ ఫలితాలు ఎలా ఎక్కువగా ఉన్నాయని కొంతమంది వ్యాపారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గతేడాది 1400 కోట్ల డాలర్ల లావాదేవీలను సింగిల్ డే ప్రమోషన్ పై కంపెనీ ఆర్జించింది. కాగా అయితే సెక్ అథారిటీల విచారణలకు తాము సహకరిస్తున్నామని అలీబాబా తెలిపింది. సెక్ విచారణలో తమ పారదర్శకత ఎలాగైనా బయటపడుతుందనే ఆశాభావం యక్తంచేస్తోంది. -
'ఖైదీ'రచనల ప్రకంపనలు..
రియల్ ఎస్టేట్ టు రాకెట్ సైన్స్.. సాక్సుల వాడకం నుంచి సాకర్ బెట్టింగ్స్ వరకు.. ఒక్కటేమిటి దేశంలో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అనేక విషయాలపై ప్రచురితమైన పుస్తకాలు రొమేనియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగని వాటిని రాసింది ఏ శాస్త్రవేత్తలో అనుకుంటే పొరపాటే.. పచ్చి మోసగాళ్లు, అవినీతిలో ఆరితేరి దోషులుగా తేలిన ప్రబుద్ధులు.. ప్రస్తుతం జైలులో ఉంటూ రాసిన పుస్తకాలవి. రచనల ద్వారా శిక్షా కాలాన్ని తగ్గించుకునే వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకున్న ఆ అక్షర ఖైదీల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ సోమవారం ప్రకటించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యురోపియన్ యూనియన్ లో ఒకటైన రొమేనియా గతంలో యూఎస్ఎస్ఆర్ లో అంతర్భాగంగా ఉండేది. నాటి కమ్యూనిస్టు పాలనలో రాజకీయ ఖైదీలకు జైలులో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉండేవి. ఖైదీలు తమ అభిరుచి మేరకు ఎంచుకున్న అంశంపై పుస్తకాలు రాసే వీలుండేది. అలా వారు రాసే ఒక్కో పుస్తకానికిగానూ 30 రోజుల శిక్షా కాలాన్ని తగ్గించేది ప్రభుత్వం. కాల క్రమంలో ఆ ప్రత్యేక సదుపాయాలు పొందేవారిలో బడా బాబులూ చేరిపోయారు. శ్రీమంతులుగా పుట్టి చిన్నచిన్న పనులు కూడా చేయడం చేతకానివాళ్లు కూడా పుస్తకాలు రాసి శిక్షా కాలాన్ని తగ్గించుకోవచ్చన్నమాట. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఖైదీలు రాస్తోన్న పుస్తకాల సంఖ్య వందల్లోకి చేరుకుంది. 2014లో ఖైదీలు రాసిన పుస్తకాల సంఖ్య 90కాగా, 2015లో అది 340కి పెరిగింది. ఇటీవలే ఒక ఖైదీ కేవలం ఏడు గంటల్లోనే 2012 పేజీల పుస్తకాన్ని రాసేయటం, మరో ఖైదీ 12 గంటల్లో 189 పేజీల పుస్తకాన్ని మిడికేయటం వివాదాస్పదంగా మారింది. ఖైదీలు రాసే పుస్తకాలు.. యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు పరిశీలించిన అంతరం జడ్జి అనుమతితో ప్రచురణకు వెళతాయి. కాగా, జైళ్లలో ఉంటూనే బయట తమ ప్రభావాన్ని చాటుకునే ఖైదీలతో ప్రొఫెసర్లు కుమ్మక్కయ్యారనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. నిజానికి ఆ పుస్తకాలేవీ పాఠకాదరణ పొందలేకపోయాయి. రాతలో విషయం లేకున్నా పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాస్తూ అక్రమ మార్గంలో శిక్షా కాలాన్ని తగ్గించుకోజూసిన ఖైదీల వ్యవహారంపై ప్రారంభమైన దర్యాప్తులు ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాలిమరి.