ముంబై: కొన్ని రిక్రూట్‌మెంట్ సంస్థలతో కుమ్మక్కై, వాటికి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించినందుకు గాను ఆరుగురు ఉద్యోగులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చర్యలు తీసుకుంది. నైతిక నియమావళిని పాటించలేదని విచారణలో తేలడంతో ఆరుగురు ఉద్యోగులను, అలాగే ఆరు సంస్థలను నిషేధించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపైనా సంస్థ విచారణ జరుపుతోందని ఆయన షేర్‌హోల్డర్లకు వెల్లడించారు. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్)
కొందరు ఉద్యోగుల తప్పుడు ప్రవర్తన గురించి ఇద్దరు ప్రజావేగుల నుంచి కంపెనీకి ఫిర్యాదులు రావడం, టీసీఎస్‌లో ఉద్యోగాలకు లంచాలు తీసుకుంటున్నారని.. తత్సంబంధ వ్యక్తులు ఈ రకంగా కనీసం రూ. 100 కోట్లు సంపాదించారని ఇటీవల మీడియాలో వార్తలు రావడం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, సంపన్న దేశాల్లో అనిశ్చితితో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, అయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?)
Comments
Please login to add a commentAdd a comment