టాటా సన్స్కి వెళ్లారు, కోట్లు పోయాయ్! | From TCS to Tata Sons, N Chandrasekaran may lose crores in annual pay | Sakshi
Sakshi News home page

టాటా సన్స్కి వెళ్లారు, కోట్లు పోయాయ్!

Published Fri, Mar 31 2017 7:20 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

టాటా సన్స్కి వెళ్లారు, కోట్లు పోయాయ్! - Sakshi

టాటా సన్స్కి వెళ్లారు, కోట్లు పోయాయ్!

ముంబై : దేశంలోనే అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసు సీఈవో పదవి నుంచి ఏకంగా టాటా గ్రూప్లోనే అత్యంత కీలకమైన చైర్మన్ పదవి ఎన్ చంద్రశేఖరన్ ను వరించింది. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు ఉన్న 103 బిలియన్ డాలర్ల గ్రూప్ కు రథసారిథిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన వేతనం మాత్రం  ఒక్కసారిగా తగ్గిపోయింది. కనీసం సీఈవోగా ఉన్నప్పుడు ఇచ్చే వేతనాన్ని కూడా టాటా బోర్డు ఆఫర్ చేయడం లేదు. టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు రూ.14.4 కోట్ల వార్షిక వేతనం మాత్రమే ఇవ్వనున్నట్టు బోర్డు సభ్యులు నిర్ణయించారు. బేసిక్ వేతనం కింద రూ.4.8 కోట్లను అదనంగా 200 శాతం లేదా రూ.9.6 కోట్ల వేరియబుల్ కంపోనెంట్లను అందించనున్నట్టు బోర్డు ప్రకటించింది. అది కూడా కంపెనీ, ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వాటికి తోడు అదనంగా కంపెనీ నుంచి వచ్చే కమిషన్ కు ఆయన అర్హులని తెలిపింది.
 
కానీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవోగా ఉన్నప్పుడు చంద్రశేఖరన్ దానికంటే ఎక్కువ వేతనాన్నే ఆర్జించేవారు. 2016 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.25.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. అదనంగా రూ.10 కోట్లను కంపెనీ బోనస్ ల కింద ఆయనకి ఇచ్చింది. టీసీఎస్ సీఈవో నుంచి టాటా సన్స్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టాకా ఆయనకు వేతనం పెరగాల్సింది పోయి తగ్గినట్టు తెలిసింది. టాటా సన్స్ కు అంతకముందు చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి కూడా 2015లో కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఆ సమయంలో టీసీఎస్ సీఈవోగా ఉన్న చంద్రశేఖరన్ రూ.21.28 కోట్లు ఆర్జించారట. గతేడాది అక్టోబర్ లో అర్థాంతరంగా మిస్త్రీకి ఉద్వాసన పలికి, ఆ స్థానంలో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ను కూర్చోపెట్టిన సంగతి తెలిసిందే.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement